పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. జీవనసంధ్య గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    11/17/2018 11:45 am

    కవులు రాసే కథల్తో నాకు చాలానే ఇబ్బంది. కవిత్వం వాళ్ళని ఓ పట్టాన వదిలి పెట్టదు. ఆ ఇబ్బంది పక్కనబెట్టి చదివాను. చాలా బాగా రాశారు.
    అందరూ మెచ్చుకోళ్ళు మాత్రమే కురిపిస్తే ఎలా? దిష్టి చుక్కలాగా రెండు విమర్శలు పెడతాను.
    మధ్యమ పురుష (ద్వితీయ పురుష కాదు, ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నా, కోకపోయినా ఇంగ్లీషు మనల్ని ఎంత ఆవహించి ఉందో!) నిర్వహించడం కష్టం. దీన్ని ఇంకెవరో కూడా ప్రస్తావించారు. ఎలాగూ కథ చెప్పే స్వరం సర్వజ్నాని స్వరం కాబట్టి ప్రథమ పురుష కథనం ఇంకాస్త రాణించేదేమో?
    దానికి తోడు వచన కవిత్వం లాంటి వాక్య నిర్మాణం ఒకటి. “..వేరేపక్కకి తిరుగుతావు.” సాధారణ భూతకాలం కాకుండా ఇలాంటి వర్తమాన సూచక క్రియా రూపంతో సాధించిన అదనపు ప్రయోజనం ఏదన్నా ఉందా? కొన్ని చోట్ల భూతకాల రూపం తొంగి చూస్తూనే ఉంది.

    ఒకే సంచికలో రెండు మధ్యమ పురుష కథలు – తమాషాగా అనిపించింది.

    మొత్తానికి కలాన్ని కదిలించారు. ఈ అక్షరాల్తో పాఠకుల్నీ కదిలించారు. అభినందనలు.

  2. బురద గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    11/17/2018 11:24 am

    బాగుంది చంద్రా.
    మధ్యమ పురుష కథనం కత్తి మీద సాములాంటిది. ఈ కథనం సంఘటనలతో పేరుకున్న కథ కాకపోవడం కొంత సులభతరం చేసిందేమో. దీన్ని ఆత్మ పరిశీలన కథనం అనొచ్చునేమో.

  3. TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ గురించి A S Murthy అభిప్రాయం:

    11/16/2018 4:35 pm

    బహుమతులు మరీ నాశిగా ఉన్నయి, ఒక్క కమెంట్ కూడా లేదు చూసేరా, కుడి పక్కన ఒక సున్నా చేర్చాలి

  4. నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:23 pm

    Interesting topic – మీ అసలు ప్రయాణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

  5. మాగ్నెట్ గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:20 pm

    నచ్చేసింది మానసా!

  6. అందం గురించి Lalitha TS అభిప్రాయం:

    11/15/2018 7:18 pm

    “చేసిన పాపం చెప్పేసుకుంటే పోతుంది” అన్న ఒక hidden agenda తో రాసిన కథల్లా అనిపిస్తాయి మీవి.

  7. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/14/2018 8:41 pm

    శ్రీ అశ్వఘోష విరచితమ్ బుద్ధచరితమ్ (అర్థ తాత్పర్యములతో) – భాస్కర్ హనుమత్ కొంపెల్ల గారి పుస్తకం అజో విభో కందాళం ఫౌండేషన్ వారి క్రింది లింకు వద్ద లభ్యం :

    https://www.avkf.org/AVKF/publicat/show_details.php?book=19177

  8. అడ్డగాడిద గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    11/14/2018 1:36 am

    ప్రియమైన శ్రీ ఆకెళ్ల మూర్తి గారూ,

    కడుపునిండా తినగలిగి, తిన్నది అరిగించుకుంటూ, ఆరోగ్యవంతంగా ఉన్న భోజన ప్రియులను చూసి వారికి “దంత సిరి” ఉంది అని అంటారు కదా.

    మరి అలాగే దంత వేదాంతం అంటే తిండికి యావలేక పోవటమా ?

    ” గాడిదలకు తిండి యావ ఉండదు, దొరికినది తిని బతుకుతాయి. వానా గాలీ ఎండా చలీ ఏవీ పట్టించుకోవు. ఎవరేనా తిట్టినా కొట్టినా నోరుమూసుకు భరిస్తాయ్ ” లాంటి ఉవాచలు అన్వయించుకుంటే దంత వేదాంతం గురించి కొంత అర్ధమైనట్లుగా అనిపించటం లేదా!

  9. అడ్డగాడిద గురించి మూర్తి ఆకెళ్ళ అభిప్రాయం:

    11/13/2018 11:47 am

    దంత వేదాంతం అంటే ?

  10. బురద గురించి venkat అభిప్రాయం:

    11/13/2018 6:00 am

    చాలా బాగుంది. నగ్నంగా నిలబెట్టేసారు. చదువుతుంటే, నా గురించేమో అనిపించింది.