పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    02/06/2020 8:21 pm

    ఇదీ పరిశోధన అంటే. మనసుపెట్టి చేసిన కృషి. మహానుభావుల భాష్యాలకి మెరుగులు దిద్దే మౌలికసాధన. బహుధా ప్రశంశనీయం. అద్భుతం.

    ఐతే శ్రీనాథుడికి ఇక్కడ ఉదహరించిన శ్లోకం లోని మంత్ర యంత్ర విశేషాలు తెలియవనటం సాహసమే. శ్రీహర్షుడిలా వాటిని తన పద్యంలో గర్భితాలు చెయ్యలేదని బహుశా ఒప్పుకోవచ్చు – ముందుముందు ఎవరైనా శ్రీనాథుడి పద్యంలో కూడ మంత్రమో యంత్రమో రెండూనో ఉన్నాయని చూపే అవకాశం వున్నా ఇప్పటికి ఏ మార్గమూ కనిపించటం లేదు కనక. శ్రీనాథుడికి తెలిసే కావాలని ఆ మంత్ర యంత్రాల్ని తన పాఠకులకి దూరంగా ఉంచాడని అనుకోవటానికి అవకాశం లేకపోలేదు. చింతామణి మంత్రాన్ని, ముఖ్యంగా యంత్రాన్ని ఎవరుబడితే వాళ్లకి దొరికేట్టు చెయ్యటం కూడ మూలం లోని ‘అనౌచిత్యాల్లో’ ఒకటిగా శ్రీనాథుడు భావించి వుండొచ్చు కూడ. మల్లినాథుడు వ్యాఖ్య రాయకముందు ఈ మంత్ర యంత్రాల రహస్యం ఎవరికీ తెలియదని భావించటం కన్నా తెలిసినా బయటపెట్టటానికి వెనకాడారని నమ్మటం తేలిక. (Occam’s razor కూడ అదే చెప్తుంది).

    కొంతకాలం క్రితం నైషథం లో అనౌచిత్యాల గురించి ఇక్కడ కొంత చర్చ జరిగింది. ఒకరు శ్రీహర్ష కావ్యంలో అనౌచిత్యాలే లేవని, లేని అనౌచిత్యాల గురించి ప్రస్తావించిన కారణంగా శృంగారనైషథం చివర్లో వున్న గద్యం శ్రీనాథుడు కాకుండా ఇంకెవరో అతికించారని ప్రతిపాదించారు. స్పష్టమైన ఉదాహరణలతో నైషథం లో అనౌచిత్యాలని చూపించిన ఈ వ్యాసం ఆ ప్రతిపాదనకి కూడ స్వస్తి పలుకుతుందని ఆశ.

  2. నవోదయతో నా రుణానుబంధం గురించి రోంగలి శ్రీనివాసరావు అభిప్రాయం:

    02/05/2020 4:53 am

    చాలా బాగుంది వ్యాసం. ఆయనకి నివాళి.

  3. నరకప్రవాసి గురించి RD అభిప్రాయం:

    02/05/2020 3:56 am

    “నాగరికతోయ్, నాగరికత! తెల్లవాడు రాక మునుపు చుమాష్ వాళ్ల చేతుల్లో కాలిఫోర్నియా, తెల్లవాడి చేతిలో బైబిలూ ఉంటే, వాడు దిగాక విడ్డూరంగా తెల్లోడి చేతిలో కాలిఫోర్నియా, చుమాషోడి చేతిలో బైబిలూ అయ్యాయి. అదీ మరి సువార్తంటే!

    ….. బాగా చెప్పారు / వ్రాశారు. అలా జరిగిన తరువాత 100 / 200 సంవత్సరాలకు “మార్పు సహజమే కదా?” అన్ని, అందరూ ఎల్లప్పటికీ ఓకే విధంగా ఉండలేవు కదా అనుకుంటాము.

    ఇంతకంటే వ్రాయను / వ్రాయదలచుకోలేదు.

  4. ఒక అచ్చమైన అన్వరీయం గురించి Amarendra అభిప్రాయం:

    02/03/2020 8:06 pm

    మనసు పెట్టి రాశారు, హృద్యంగా ఉంది. అభినందనలు భార్గవి గారూ.

  5. ఒక అచ్చమైన అన్వరీయం గురించి ఖాదర్ మొహియుద్దీన్ అభిప్రాయం:

    02/03/2020 4:51 am

    కాగజ్ పె రఖ్ దియా హయ్ కలీజా నికాల్ కే అని ఎవరో ఎవరి గురించో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. నేను కూడా డాక్టర్ గారిలా రాయగలిగితే….!

  6. ద్విజావంతి: రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ రేడియో ప్రసంగం గురించి srinivasa rao v,khammam అభిప్రాయం:

    02/02/2020 1:37 pm

    రా ళ్ళ ప ల్లి వారి గొంతు , విశ్లేషణ, వినిపించారు . ధన్యవాదాలు .

  7. ఏ విలువలకీ శప్తభూమి? గురించి Sailaja Kallakuri అభిప్రాయం:

    02/02/2020 2:17 am

    Your review is very exhaustive sir. And the way you entwined the interlinking stories is amazing.
    Yes, I too felt Pain
    Living Horror
    And over Dramatisation. But as you said the original incidents were too diverse and Physical that the episodes will stir us to fear, negation and Depression.
    These are Rare Books.
    Rare writers
    And yours is an amazing review.

  8. శ్రీమాన్ కొండ్రాజు బలాదూర్ చరిత్ర: వరాహపర్వం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/01/2020 11:18 pm

    మొత్తానికి దరిద్రం పట్టుకున్నట్టు, ఆ శని దేవత దివాన్ని పట్టుకున్నదన్నమాట! భలే చమత్కారం, వర్మ గారు! చి న

  9. ఏ విలువలకీ శప్తభూమి? గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/01/2020 9:35 pm

    వెలువడిన వెంటనే ఈ నవలని చదివాను. చదివించింది.

    ఎందుకని ఈ నవలని దళిత బహుజన నవల అంటున్నారో అర్ధం కాదు. ఒక historical fiction నవలగా ఎందుకని చదువుకోకూడదు?

    కొన్ని మార్పులు చేర్పులతో చక్కటి పీరియడ్ సినిమా చేసుకోవచ్చు ఈ నవలని.

  10. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి తః తః అభిప్రాయం:

    02/01/2020 5:37 pm

    చాలా ఆసక్తికరమైన వ్యాసం భాస్కర్. పాఠకులలో శ్రీ హర్ష కావ్యాన్ని శ్రద్ధగా చదవాలి అనే ఆలోచనను రేకెత్తించే రచన. శ్రీనాథుడు (కూడా) తెనిగించలెక పోయిన మూల గ్రంథులను తెనుగు చేయటానికి ప్రయత్నించిన శేషేంద్రను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వద్దకు శ్రీ శేషయ్య (నీలంరాజు) తీసుకు వెళ్ళినట్టు చాలా సంవత్సరాలక్రితం చదివినట్టుగా గుర్తుకు వస్తోంది.

    నమస్కారాలతో
    తః తః