పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. ఏకాంతద్వీపం గురించి Sitha Challa అభిప్రాయం:

    02/01/2020 5:04 pm

    Most sorrowful moments are portrayed very delicately. For anyone who watched a loved one helplessly, this can bring those memories back. Thanks to the writer. It’s a painful but powerful poetry.

  2. సుగ్రీవ విజయము: రజని యక్షగానం గురించి దేశికాచారి అభిప్రాయం:

    02/01/2020 3:33 pm

    శ్రీశ్రీనివాసుగారికి – ఈయక్షగానమును ఇట్లు పాఠకుల కందజేసినందులకు మీకు కృతజ్ఞతలు. విని ఆనందించినాను. ఇటాలియను ఆపెరాలను తెలుగులో ఆధునికయక్షగానాలుగా , అంటే సూత్రధారుడు లేకుండా, వచనం దాదాపుగా లేకుండా,పద్యమాత్రాఛందోబద్ధమైన సంభాషణాత్మకమైన కావ్యాలుగా, పునర్నిర్మిస్తున్న నాకు ఇది వినే అవకాశం కలిగించిన మీకును, ఈమాట సంపాకులకును ధన్యవాదములు.

  3. ఏ విలువలకీ శప్తభూమి? గురించి దేశరాజు అభిప్రాయం:

    02/01/2020 1:48 pm

    కొన్ని ప్రశ్నలు ఆలోచించాల్సినవే. అయితే చరిత్రకీ ఆశయాలకీ తేడా ఉంటుందని మీరు గుర్తించలేదేమో అనిపిస్తోంది.

  4. ఆత్మావై పుత్రనామాసి గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/27/2020 9:20 am

    బాబా గారు
    మీరు కామెంట్ పెట్టేటప్పుడు అక్కడే ఉన్నమొదటి కామెంట్ చూసారా? ఇంతటి మార్మికం లేని, విషయ ప్రకటన లా ఉండే అధ్వాన్నపు కవిత మీకు కళ్ళమ్మట నీళ్ళు తెప్పించింది అంటే సంతోషమే. ధన్యవాదాలు

  5. భారం గురించి ns murty అభిప్రాయం:

    01/27/2020 5:51 am

    కథ, అనువాదమూ రెండూ చాలా బాగున్నాయి. హృదయపూర్వక అభినందనలు భాస్కర్ గారూ.

  6. ఆత్మావై పుత్రనామాసి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    01/25/2020 2:32 pm

    ఆత్మావై పుత్రనామాసి.” అనే వాక్యార్ధం కోసం గూగిల్ చేస్తే ఇక్కడకు వచ్చాను.

    చాలా గొప్ప పద్యం. కళ్ళనీళ్ళు తిరిగాయి. చాలా జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. థాంక్యూ సర్.

  7. చిత్రలేఖ గురించి somayajula sai prasad అభిప్రాయం:

    01/21/2020 4:28 pm

    సంపాదకులకు అభ్యర్ధన,

    దేశికాచార్యుల వారి చిత్రలేఖ అను రచన శీర్షిక మాత్రమే ఉన్నది. రచన కనిపించడం లేదు. దయచేసి రచన అంతర్జాలములో ఉంచగలరు.

    ధన్యవాదములు,
    సాయి

    [ఇప్పుడే సరిదిద్దినాము. దోషాన్ని చూపినందుకు కృతజ్ఞతలు. — సం. ]

  8. గాయకులుగా సంగీత దర్శకులు గురించి Venkateshwar Rao eturi అభిప్రాయం:

    01/19/2020 7:49 am

    Dear Sir,

    I am 60 yrs now.
    My Dad used to sing the below two songs, when I was a kid, and used to tell me these were sung by Sri Gopalam garu.

    1) Thirupathi Venkata Ramanaiah, ninu pilichina palukavu Emaiah, Pilachi pilachi Ne Alasipoithini Mora vini kaavaga raavaiah

    2) Darishanamosagumura, Thirumala thirupathi Giri venkatapathi

    Kindly advise if you know about these and where to get ( buy ) them if available.

    Sorry for typing in English.

    Kind Regards,
    Venkateshwar Rao E

  9. ర-కారం గురించి శర్మ. దంతుర్తి అభిప్రాయం:

    01/17/2020 8:52 am

    ధన్యవాదాలు సుందరం గారు. ఈమాట కథల పేజీలో పైన నా పేరు మీద నొక్కితే మిగతా కథలన్నీ బయటకొస్తాయి. మీకు పురాణ గాథలు నచ్చితే వీలున్నప్పుడు సత్యదర్శనం, వెడలెను కోదండపాణి, సాక్ష్యం అనేవి, మిగతావి చూడండి.

  10. ర-కారం గురించి సుందరం శొంఠి అభిప్రాయం:

    01/16/2020 6:31 am

    శ్రీ ఆర్.శర్మ. దంతుర్తి గారూ,
    మీ అద్భుత వర్ణనతో మాయ చేసి మమ్మల్ని కూడా మారీచుడిగా మార్చి మళ్ళి రామాయణ కాలంలోకి తీసుకెళ్ళి మోహన రూపుడైన ఆ శ్రీరాముడి ముందుంచారు.
    ధన్యవాదాలు
    సుందరం శొంఠి