పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. తిరస్కృత గురించి Raghavendra అభిప్రాయం:

    02/16/2020 11:26 am

    చాలా బావుందండీ..! చాలా మంది మనోస్థితికి మీ కవిత అద్ధం పడుతోంది

  2. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Sirimadhav అభిప్రాయం:

    02/16/2020 12:12 am

    నమస్కారం సర్!

    1) మల్లెనమ్మ మల్లెనే
    2) ఏల పాడేనింక యమున కల్యాణి

    అన్న పాత పాటలు దయచేసి సమకూర్చగలరు.

    మా గురువుగారికి నా నమాస్సుమాంజలులు.

    నేను విశ్వనాథం మాస్టర్ గారి వద్ద చిన్నప్పుడు నేర్చుకున్నాను.

  3. పికాసో కుడ్యచిత్రం గ్వెర్నికా గురించి… గురించి sarath chandra అభిప్రాయం:

    02/14/2020 5:26 am

    Due to time constraints, I hadn’t read this completely but yours writing skills and the analysis is simply beautiful. Thank you so much!

  4. ఏ విలువలకీ శప్తభూమి? గురించి బాపారావు K. అభిప్రాయం:

    02/11/2020 2:51 am

    అమరేంద్రగారి వ్యాసం నా బుధ్ధికి సరిగా అర్థం కాకపోయి ఉండాలి. ఎందుకంటే, నాకన్నీ అనుమానాలే పుడుతున్నాయి.

    ఒక కథలో పాత్రల సంభాషణలకి వెలిగా, ప్రథమ పురుషలో (omniscient voice) ఉన్న fictional గద్యాన్ని పాఠకులు చదువుకుని, ఆ పై తమ స్వంత ఇంగితాన్ని పక్కకి పెట్టేసి, ఆ గద్యపు భావాలకి అమాంతం దాసులైపోతారని వారి అభిప్రాయమా? అయిపోయి, ఉన్న పాళంగా సహగమనాలూ, అవయవాలు నరికేసుకోడాలూ, కొక్కేలకి వేళ్ళాడ్డాలూ, లాంటివి చేసేస్తారా? అలాంటివి చెయ్యకూడదని అమరేంద్రగారికి తెలిసినట్టు సగటు పాఠకులకి తెలియదా? (అసలు అంత మందబుధ్ధులైన పాఠకులకి ఇంత నిడివిగలా, సంక్లిష్టమైనా నవల చదివి బుర్రకి ఎక్కిచ్చుకునే సత్తా ఉంటుందా?)

    కవి, అనగా రచయిత, నిరంకుశుడు, అని ఏనాడో, ఎక్కడో విన్నట్టనిపిస్తోంది. అది తప్పేనా? రాయదలిచిన వాళ్ళు సాహితీ విలువలే కాకుండా ఇతర unspoken, unwritten, and somehow-enforced rulesకి తల వొగ్గాల్సి ఉంటుందని అనుకోవాలా?

  5. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    02/10/2020 7:48 pm

    అక్కిరాజు ఉమాకాన్తమ్ గారి విమర్శని నా దృష్టికి తెచ్చిన మిత్రులు శ్రీ యదుకులభూషణ్ గారికి నా కృతజ్ఞతలు. ఎవరికైనా చదవాలని ఉంటే, నైషధతత్త్వ జిజ్ఞాస — అక్కిరాజు ఉమాకాన్తమ్ (ఆర్కైవ్.కామ్) చూడండి.

  6. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/10/2020 2:06 pm

    Thank you!

    గ్రంథము, గ్రంథి -మాటలు Sanskrit, Telugu dictionaries లో అన్నిరకాలుగా వెదికి వాటిని Prefix, suffixలుగా కలిగి ఉన్న చాలా మాటలు, అర్థాలు తెలుసుకున్నాను.
    ఐనాగాని, గ్రంథగ్రంథి, గ్రంథగ్రంథులు అన్న usage ఆంథ్రభారతి నిఘంటువులలో నాకు దొరకలేదు.

    నెట్ లో ఒకరి బ్లాగ్ లో గ్రంథగ్రంథులు = వ్యాసఘట్టములు అని ఉంది. నిన్న చూసినప్పుడు, అది ఎవరి బ్లాగ్ అన్నది, నేను నోట్ చేసుకోలేదు. I am sorry! ఇవ్వాళ search లో ఆ బ్లాగ్ రావట్లేదు.

    ఐతే “వ్యాసఘట్టములు” అని అంతకు ముందు ఆంథ్రభారతిలో చదివిన గుర్తున్నందున అక్కడకి వెడితే ఈ కింది వృత్తాంతముంది.

    (వ్యాసఘట్టము a puzzle or intricacy in the Mahābhārata.
    వ్యాసుఁడు సంస్కృత భారతమును చెప్పునపుడు విఘ్నేశ్వరుఁడు వ్రాయుటకు ఒప్పుకొనియెను అనియు, అట్లు చేయునపుడు విఘ్నేశ్వరుఁడు గంటము నిలుపక వ్రాయునట్లు వ్యాసుఁడు చెప్పునట్లును, వ్యాసుఁడు చెప్పెడు దానిని అన్వయించుకొని విఘ్నేశ్వరుఁడు వ్రాయునట్లును సంకేతము చేసికొనిరి అనియు, విఘ్నేశ్వరుఁడు నిదానించి వ్రాయఁగలందులకు వ్యాసుఁడు నడుమ నడుమ ఒక్కొక్క శ్లోకమును అర్థము సులభముగా అవగాహనము కాకుండునట్లు చెప్పుచు పోయెను అనియు, అట్టి శ్లోకము చెప్పఁబడినచోటు వ్యాసఘట్టము అనియు అందురు.)

    ఇంకా;
    ఈ రోజు గూగుల్ సర్చ్ లో – ‘ఈనాడు అంతర్యామి’ లో మార్చ్ 28, 2019, ‘భావసాంద్రత’ అని బొడ్డపాటి చంద్రశేఖర్ రాసిన సంపాదకీయం లో భారతం గురించిన అదే కథ ఇప్పటి తెలుగులో చెపుతూ, అందులో “….గ్రంథగ్రంథులు అంటే ఒక గ్రంథంలో ఉండే కఠినతరమైన అంశాలని అర్థం….”
    “గ్రంథగ్రంథులు లేదా చిక్కుముడులు అనేవి ఉన్నచోట మనసు పెట్టి చదవాలి….” అంటూ వివరణలు చూసాను.

    అందువల్ల, గ్రంథగ్రంథి, వ్యాసఘట్టం – ‘tough to grasp’, ‘tough to untangle’ ‘puzzling,’ కి synonymous గా వాడటానికి, I am so willing. Can’t wait to use them. I love words.
    ఐనాగాని,

    ఈ వ్యాసంలో ఇచ్చిన మొదటి శ్లోకం గురించిన నా ఊహ/సందేహం – శ్లోకం చివరలో సజ్జన పాఠకులు రససముద్రంలో మునిగి తేలటాలు ఉందికదా, అందుకని ఇక్కడి గ్రంథగ్రంథులు knotted glands కాబోలేమో, అవి expert గారు వచ్చి, వాటి ducts open చేస్తే, అప్పుడు రసాలు రిలీజ్ అవుతాయి – అన్న మరో అర్థం కూడా ఉందా అని!
    (శ్రీహర్షుడు ఆదేశించినట్టే,) సంస్కృతం పండితులు, గురువులు ఒకరిద్దరు ఈ శ్లోకంలోని అన్నిమాటల అర్థాలు, అన్వయాలు చెపితే తెలుసుకోవాలని ఆశ.

    Thanks again, there could be more questions coming. Have a nice day!
    -Lyla

  7. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    02/09/2020 4:35 pm

    @Lyla Yerneni, Thanks.

    గ్రంథి అన్న పదానికి సంస్కృతం లో అర్థాలు ఇక్కడ ఇచ్చారు.
    http://www.andhrabharati.com/dictionary/sanskrit/index.php

    అంతకు మించిన అర్థాలు ఏవో , జీవశాస్త్రార్థం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు.

  8. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి తః తః అభిప్రాయం:

    02/09/2020 3:09 pm

    ధన్యవాదాలు భాస్కర్. స్వర్ణహంస రిఫరెన్స్ అప్పటికి చూడలేదు. (ఈమాట దగ్గరకు రాత్రి ఏ ఒంటి గంటకో రావటం పెద్దకారణం- తప్పులకైనా ఒప్పులకైనా)-తః తః

  9. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/08/2020 3:46 pm

    గ్రంథ గ్రంథులు = ?

    శ్రీహర్షుని ‘అవామే వామార్ధే’ అని మొదలయ్యే ఒక శ్లోకానికి కల మూడు రకాల అర్ధాలు ఇచ్చి, తనుగా ఇంకా శ్లోక రహస్యాలు శోధిస్తూ; ఈ వ్యాసం లో మొదటిగా ఇచ్చిన శ్లోకంలో ‘గ్రంథి’ అన్న మాటకు ముఖ్యార్ధం ముచ్చటించకపోటం, ‘చిక్కు ముడి’ అన్న ఒక్క అర్థంలో మాత్రమే ఆ మాటను శ్రీహర్షుడు వాడినట్టుగా ఆసాంతం ఈ వ్యాస రచయిత అనుకోటం ఆశ్చర్య పరిచింది.

    గురువు లేనందున, సంస్కృతమే తెలియదు నాకు. ఐతే, సంస్కృత కావ్యాలు చక్కగా చదువుకున్న, రసికులైన పంతుళ్లు, నాకు బెజవాడలో చెప్పిన తెలుగొచ్చు. అందుకేగా రచ్చబండ యాహూ లో ఇలాటి తెలుగు కవిత్వాలు చెప్పాను.

    నిన్న మొన్నటి దాక
    ఎన్నొ పున్నమి రాత్రులు
    పున్నాగల మీద జంట మిన్నాగుల వలే
    పెద్దకాలము మనము పెనగితిమి ప్రియతమా!
    నేడా చనువు చెలగాటములు లేవు
    నేడా తనువు తగలాటములు లేవు
    ఆ బులుపుల పున్నాగల గంధాలు
    భద్రముగ నుంచులే
    మెదడు మడుపుల సూక్ష్మగ్రంధాలు
    తలను వీడవుగాదా వాసనలు
    మనమిలను వీడువరకు!

    ఆ కవిత్వం చదివిన ఒక సభ్యులు జాబాలిమునిగారు, గ్రంథులు అనబోయి గ్రంథాలన్నారా? వైద్యులు లైలాగారు, అంటే ఆ తర్వాత కొంత డిస్కషన్ నడిచింది. యాహూ నిర్వాహకులు -గ్రూపులు మూసివేసినందున, కంటెంట్ తుడిసివేసినందువలన, ఇక ఆ లింకు ఇచ్చే గొడవ లేదు.

    పైది రచ్చబండ- యాహూ లో రాసినప్పటికి ఆంధ్రభారతి నిఘంటువుల తయారీ పూర్తికాలేదు. ఇప్పుడు ఆ నిఘంటువుల నుండి:

    గ్రంథి : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
    సంస్కృత విశేష్యము

    • 1. బుడిపి. గడ్డవలె పుట్టు రోగము.
    • 2. చెట్టు మొ.ని ముడి.
    • 3. కీలు.
    • 4. [జీవశాస్త్రము] శరీరమునకు అవసరమగు ఏదైన ఒక ద్రవమును తయారుచేసి ఉదాసర్జన చేయు (పైకి స్రవింపజేయు) జీవకణ సంహతి (Gland).

    అందులో నాలుగవది అతి ముఖ్యమైన అర్ధం. అన్ని రసాలకు కారణం ఆ గ్రంథులు.

    -Lyla
    Ps: సంస్కృత పండితులు ఈ వ్యాసంలోని మొదటి శ్లోకం గురించి విడమర్చి చెపుతారని ఆశిస్తాను.

  10. శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:

    02/07/2020 11:41 am

    @ తఃతః, ఈ వ్యాసం నచ్చినందుకు సంతోషం. నా కృతజ్ఞతలు. శ్రీ శేషేంద్ర శర్మగారిని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల వారి వద్దకు తీసుకువెళ్ళినది శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. ‘స్వర్ణహంస”లో ఈ వృత్తాంతమంతా వ్రాయబడింది.

    @KVSRR, ఈ వ్యాసం మీ అభిమానానికి పాత్రమైనందుకు ఆనందం. శ్రీనాథుణ్ణి తక్కువగా అంచనా వెయ్యలేము. మీరన్నట్టుగా, అతనికి తప్పకుండా “Benefit of doubt” ఇవ్వాలి.

    శ్రీహర్ష కావ్యంలోని అనౌచిత్యాల గురించి శ్రీ ఉమాకాంతం గారి వ్యాసం వివరించింది. విపరీత శృంగారం, సరస్వతిని విష్ణుపత్నిగా చెప్పడం మొదలైనవి ముఖ్యమైన అనౌచిత్యాలని ఆయన అభిప్రాయం.

    సరస్వతిని విష్ణుపత్నిగా చెప్పడం వంగవైష్ణవుల సాంప్రదాయంలో ఉంది (బ్రహ్మవైవర్త పురాణంలో ఉందని విన్నాను). వంగదేశంలో విద్యనభ్యసించిన శ్రీ ఉమాకాంతం గారికి ఈ విషయం తెలిసే ఉంటుంది. వాళ్ళు చెప్పే సరస్వతి, సరస్వతీనది అయి ఉంటుందని నా ఊహ. (గంగలాగే ఆ నది కూడా మరో పత్ని కావచ్చు). ఇక శృంగార విషయమై, అదంతా వామాచారవివరమా అన్నది కూడా నా సంశయం. ఈ రెండింటినీ పండితులు పరిశోధించాలి.

    కావ్యం చదివిన తర్వాత అనౌచిత్యాలున్నాయని ఒప్పుకోలేనంత అభిమానాన్ని మనలో సృష్టించగల మహాకవి శ్రీహర్షుడు.

    ఈ వ్యాసం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు, శ్రీనాథుడి గురించి కూడా వ్రాయమని సూచననిచ్చిన మీకు నా బహుకృతజ్ఞతలు.