పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. పరిపాకం గురించి Raghu అభిప్రాయం:

    05/02/2020 8:24 am

    ఈమాట సంపాదకులకు నమస్కారం.

    దయచేసి ఈమాటను పత్రికగా (hard copy) ప్రచురించగలరు. ఎంతో వైభవం సంపాదించవలసిన ఘనమైన పత్రిక ఈమాట.

  2. పరిపాకం గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/02/2020 8:11 am

    నమస్కారం శర్మగారికి

    బుద్ధ భగవానుని గురించి చదువుతూ చెప్పలేని మైమరపు కలిగింది.

    మీ కథలు అన్నీ చదివాను. చాల కాలం నుంచి మీ కాంటాక్ట్ వివరాల గురించి చూస్తున్నాను.

    దయచేసి మీ కాంటాక్ట్ వివరాలు ఇవ్వగలరు.

  3. పరిపాకం గురించి Raghu అభిప్రాయం:

    05/02/2020 7:58 am

    Nice
    బాగుంది.

  4. గడినుడి – 43 గురించి రవిచంద్ర అభిప్రాయం:

    05/02/2020 2:34 am

    23 నిలువు ఆధారంలో నాలుగు అక్షరాలు అని ఉండాలి. మూడు అని పొరబాటుగా పడిందేమో?
    [సరిచేసినాము. ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు — సం.]

  5. రాగలహరి: సింధుభైరవి గురించి DESHAVENI SHANKAR అభిప్రాయం:

    05/01/2020 7:48 pm

    గురువుగారు శతసహస్ర ప్రణామాలు. రాగాల గురించి మీరు రాసిన ఈ వ్యాసాలు/విశ్లేషణ ఎంతో
    ఉపయోగకరంగా ఉన్నాయి

  6. మారిపోయిన చెన్నపట్నం: 1750-1796 గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    05/01/2020 4:41 pm

    దీని తరువాత చెన్నపట్నం ప్రాంతంలో కఱవు వ్యాపించినది. నల్లవారి బస్తీలోని వీధులన్నీ శవాలతో నిండినవి. అన్నము లేక కృశించిన దురదృష్టవంతులు రాజధాని నగరంలో కాస్త అన్నం దొరుకుతుందనే ఆశతో వచ్చి చచ్చిపోతున్నారని అతడు వ్రాశాడు. —- పుర్రెల కరువు (1791-92) గురించి వ్రాస్తున్నారా ఇక్కడ?

    పాలపర్తి ఇంద్రాణి.

  7. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/01/2020 12:18 pm

    ఒక చిన్న ధర్మ సందేహం. కష్టపడి ఆలోచించి పొందిగ్గా మొత్తం తెలుగులో కవిత రాసిన వారు – విషాదానందం, స్వరతరంగం, విశ్వాంతరాళం, వక్షాంతరాళం అనులోమాలాపనం, తాళముద్ర – అనే పదాలు అల్లగల కవి అయ్యుండీ, ఆ కవితకి పేరు – ఒకే ఒక పదం – తెలుగులో ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎంతకాలం ఈ దరిద్రం మన తెలుగుకి?

  8. ఒకానొక ఊట కోసం గురించి Palagummi Padmavijay అభిప్రాయం:

    05/01/2020 11:24 am

    గుండెలో ఏదో తెలియని బాధ కలిగింది. కవితలో భావవ్యక్తీకరణ అద్భుతంగా ఉన్నది.

  9. ఓడిపోయిన యోధుడు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2020 10:26 am

    ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయి… ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరవళ్లు తొక్కిన ఓ ప్రవాహం లో… ఉన్మత్తుడిని చేస్తూ చుట్టుకున్న ఓ సౌగంధం లో… కాలిపోతున్న… కరిగిపోతున్న ఓ కలలో కొట్టుకుపోయేలా చేసిన తమిళ సాహితీ యోధుడు అప్పాదురై ముత్తులింగం అన్నకు… అద్భుతంగా కాక మరోలా అనుసృజన చెయ్యటం మర్చిపోయిన అన్నమాచార్య సంకీర్తనల అభిమాని అవినేని భాస్కర్ కి హృదయపూర్వక నమస్సుమాంజలి అని అనలేని… అలసిసొలసి సొక్కి సుషుప్తి స్థితిలోని ఓ నేలక్లాసు ప్రేక్షకుడి దీన నివేదన.

  10. సాయం ఛాయ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    05/01/2020 9:53 am

    సాయం సంధ్యలో ఉన్న మావయ్య మీన ఆన… వారు ప్రస్థావించిన ఒన్స్‌ మోరులతో హోరెత్తిన పద్యాలు, జనం విజిళ్లతో జోరెత్తిన పాటలు గురించి కూడా చెప్పు పాలపర్తి ఇంద్రాణి తల్లీ.

    గతం పునాదుల మీదే భవిష్యత్తు భవనాలు వెలుస్తాయని … సంస్కృతాంధ్ర అంగ్ల భాషా సాహిత్యాలు అధ్యయనం చేసి ఆధునిక సమసమాజాన్ని ఆవాహనం చేసిన మహాకవి శ్రీశ్రీని తలుచుకుని కూడా చెప్పు వర్ధమాన తరం కవయిత్రి తల్లీ.

    జండాపై కపి రాజు ముందు సిత వాజి శ్రేణినిం గూర్చి నే
    దండంబున్ గొని దోలు స్యందనము మీదన్ నారి సారించుచున్
    గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం జెండుచున్నప్పుడొ
    క్కండున్ నీ మొర నాలకింపడు కురు క్ష్మానాథ సంధింపగాన్ !!

    ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
    కలము,నిప్పులలోనఁగఱగిఁపోయె !
    యిచ్చోట;నే భూము లేలు రాజన్యుని
    యధికారముద్రిక లంతరించె!
    యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూ
    సలసౌరు,గంగలోఁగలిసిపోయె!
    యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న
    చిత్రలేఖకుని కుంచియ,నశించె!

    ‘కళ్లెత్తితేసాలు, కనకాబిసేకాలు ఎంకివంటి పిల్ల లేదోయ్‌ లేదోయ్‌’

    యెనక జన్మములోన యెవరిమోనంటీ
    సిగ్గొచ్చి నవ్వింది సిలకనా యెంకి
    ముందు మనకే జల్మముందోలె యంటి
    తెలతెల్లబోయింది పిల్లనా యెంకి
    యెన్నాళ్ళొ మనకోలె యీ సుకములంటి
    కంట నీరెట్టింది జంట నా యెంకి