పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. పరిపాకం గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/07/2020 7:29 am

    Dear sir, Good evening!

    Thanks for your reply. And thanks for nice detailed explanation given to the question asked by Desika charu garu.

    యుద్ధం జరగడానికి ముందు వందల ఏనుగులు వేసే మొదటి అడుగుకంటే, వేల గుర్రాలు తీసే మొదటి పరుగుకంటే జ్ఞానం కోసం మానవులు వేసే మొదటి అడుగు అమోఘమైనది.

    Excellent! I am attracted towards Buddha bhagavan by your writings. Need more information from you, so I am asking your contact.

    My mail id raghunathachari.pulukuri@gmail.com.

    I Will feel very happy if you text me sir.

  2. కెహర్వా! గురించి అం అః అభిప్రాయం:

    05/06/2020 6:51 pm

    అన్నా శర్మన్నా

    ఇంత పొడుగాల రాసి బా చెప్పిర్రు మీరు. నే కెహర్వా గూర్సి మాటాడ. ఎందుగాల్నంటే కెహర్వా వొంటి మాట ఈడ సర్పోయె గావట్టి.

    అయితెగాని అది గట్ల పక్కంబెట్టి జూస్తే మీర్మట్కు సంపాదకుల గూర్సి ఎప్పుడు జూసినా మంచి మాటల్ జెప్త ఉంటరు. గద్జూసి మిమ్మల్ని పెర్పంచకంల ఏ సంపాదకుడైన బాగ “లవ్వు”తారనుకుంటరు. గంటె కావులించుకుంటరన్నమాట.

    ఆకాడ్నే మల్ల ఆల్ల మూలకెల్లి ఆల్లు గట్ట సెయ్యబట్టి నా రాతల్ బాగుపడ్డై, కన్నీల్లొస్సినయ్, ఫేసుబుక్కు కర్వెపాకును తన్ని తగలెసిన అనుకుంట ఎన్కటి కాలంల పెరుమాల్ లెక్క సోచ బజాయిస్తుంటరు. మీకు తెల్వదని గాదుగాని సంపాదకులెవ్వలైన గాని ఏద్జూసినా సరే ఆల్ల నోటనుంచి వచ్చేట్ది, అనంగా మొదటి మాట ఏందంటె “ఇది బాగలె” అనె. అట్ల ఆల్లు ఆల్ల “ఇది” నిల్పుకుంటరు. ఆల్లు అట్ల సెయ్యవట్టి పెర్పంచకంల రచయితల్కు గుబేల్ పుట్తది. అది అందర్కి ఎర్కైన ఇసయమె. ఆల్లకి బాగు అనిపించెందాక ఆల్లు ఆ మాటను గాట్టిగ పట్కోని కూకుంటరు. ఆయింత అయినంక వచ్చె రాత ఎట్లుంటదొ మీకందర్కు యెర్కెనె గద.

    పోతె మీరు “డు” అనె పదం పుచ్చుకోని ఎన్ని పైదా బెట్టించొచ్చు అని అడ్గిరి. నే లెక్కెసిన, 3666 పదాలు పైదా అయితయ్…ఔ! తీన్ హజార్ పైననే అయితయ్! కావల్నంటె ఫ్రి డిక్షనరి డాట్ కాం లా సూస్కోండి. ఇంగ ఉంట

    అన్నా, శర్మన్నా, ఇంగ ఉంట!

    అం అః

  3. గడినుడి – 42 గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    05/06/2020 8:27 am

    ‘ళ్ళ’ కన్నా ‘ళ్ల’ యే సరైనది. ఎందుకంటే, ‘ల’ తో అంతమయ్యే కొన్ని పదాలలో, ఆఖరి అక్షరానికి ముందున్నది ‘ళ’ గా మారినప్పుడు, చివరి అక్షరమైన ‘ల’ పొల్లుగా మారుతుంది (అని నా అభిప్రాయం).

    ఉదాహరణలు: పెండ్లి = పెళ్లి; ఊరులు = ఊళ్లు; ముల్లులు / ముండ్లు / ముడులు = ముళ్లు, బీడులు = బీళ్లు, కాలులు = కాళ్లు, వెడలి = వెళ్లి, మరలి = మళ్లి

    వీటి వ్యాకరణాన్ని విజ్ఞులే వివరించాలి.

  4. మధ్య వ్యవధిలో నీడలు గురించి Paresh Doshi అభిప్రాయం:

    05/06/2020 2:06 am

    Wonderful story. First person narration came handy to demonstrate his arrogance. Tq

  5. నొట్టు స్వరాలు, కర్ణాటక సంగీతంలో పాశ్చాత్య బాణీలు గురించి tadepallisubrahmanyam అభిప్రాయం:

    05/05/2020 10:37 am

    Very happy to observe the efforts of the author to let every lover of South indian music know the nuances and the biography of the musical trio. A great effort indeed.

  6. కళాపూర్ణోదయం -2: మణికంధరుడి తపోభంగం గురించి M V RAMA RAO అభిప్రాయం:

    05/05/2020 2:44 am

    ఆద్యంతం అద్భుతం, భాష మీద అధికారం & భావం మీద మమకారం ప్రస్ఫుటంగా ఉనాయి . మీరు ఇలాగే జైత్ర యాత్ర చేస్తూ ఉండండి

  7. అసలేం చేశానని?! గురించి దార్ల వెంకటేశ్వరరావు అభిప్రాయం:

    05/04/2020 9:57 pm

    గిరిధరరావుగారూ, నమస్కారం
    ఎంత చక్కని భావుకత. పెర్సానిఫికేషన్ చేయడంలో కవి ప్రతిభావంతుడైతే తప్ప ఇలాంటి చక్కటి భావచిత్రాలు సాధ్యం కాదు. మొక్కను మహావృక్షంగా మలచడం, తర్వాత దాన్ని మనం అందుకోలేకపోవడం…ఆహా…ఎంత బాగుంది. ఇందులోని మొక్క మొక్కే అయితే కవిత్వమేముంది. అదే మనల్ని భావుకతవైపు నడిపిస్తుంది. ఎంతైనా వ్యాఖ్యానం రాయిస్తుంది.
    మరో సారి నమస్కరిస్తూ…దార్ల వెంకటేశ్వరరావు

  8. కెహర్వా! గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/04/2020 11:31 am

    ఈమధ్య ఒక గాయకుడి పాటని విన్న తర్వాత, మళ్లీ అప్పటి తాదాత్మ్యతని రుచి చూసేను. ఈ పంక్తులు రాసుకున్నాను.. ఆ పేరు పెట్టటమే ఉచితమనిపించింది.

    రెండు విషయాలండి.

    మొదటిది – వంగూరి వారు ప్రచురించిన పుస్తకంలోది – పారుపల్లి కోదండరామయ్య గారు రాసిన "తెలుగే గొప్ప భాష" – తెలుగులో ఒక క్రియా పదం నుంచి వందల కొద్దీ పదాలు పుట్టించవచ్చు. ఉదాహరణ – "చేయు" అనే పదం తీసుకుని నిఘంటువు చూడండి. అదే ఆంగ్లంలో Do అనే పదం నుంచి ఎన్ని పుట్టించవచ్చు? మీరు రాసిన తెలుగుబట్టి మీకు తెలుగులో మంచి పట్టు ఉంది. దానితో ఈ కవితకి మంచి పదం అల్లలేరా? ఆ తాళం ఎంత గొప్పదైనా మీరు రాసే కవితకి తెలుగు పేరు పెట్టలేరా?

    రెండోది – ఈనెల ఈమాటలోనే (మీరే గాబోలు వ్యాఖ్య కూడా పెట్టారు) సంపాదకులు మాధవ్ గారు ఒక వ్యాసం ప్రచురించారు "ఈమాట సంపాదకుల పధ్ధతి" అని. నేను పైన ఉదహరించిన మీ వాక్యాలు ఒకసారి ఈ వ్యాసానికి కలిపి చూసుకుంటే సరిగ్గా మీరు అనుకున్నదీ, సంపాదకులు చెప్పే విషయం తేటతెల్లం అవుతున్నాయి కదా?

    చాలాసార్లు ఇటువంటి సందర్భం నాకు కూడా తగిలింది. ఇప్పటికీ తగుల్తూనే ఉంది. సంపాదకులు చెప్తూ ఉంటారు – మీరు పంపిన కధ/కవిత మీరు అనుకున్న "పేద్ద గొప్పగా" ఏమీ లేదు అని. వాళ్ళు అనా అన్నాక మొదటగా కోపం, తర్వాత అసంతృప్తి, తర్వాత ఆలోచన, ఆ తర్వాత మొహమాటం లేకుండా చెప్పినందుకు, అలా చెప్పడం వల్ల నా రాతలు బాగుపడతాయనే ఆశ, సంతోషం వగైరాలు. ఫేసు బుక్కులో కొట్టే లైకులూ, ఏ పత్రికలో అయినా ఎవరైనా చెప్పే ఆహా, ఓహోలూ నాకు చారులో కరివేపాకులా వాసనకి తప్ప ఎందుకూ పనికిరావని తెలిసివచ్చేలా చేసాయి. అందువల్ల ఇటువంటి సునిశితంగా పరిశీలించి చెప్పే సంపాదకుల వల్లే నేను బాగుపడతానని తెలుసుకుని ఇప్పటికీ తిట్లు తింటూన్నా వాళ్లకే పంపుతూ ఉంటా. ఇది నా స్వంత అభిప్రాయం. ఈ వ్యాఖ్య చదివే ఇతరులూ, మీరూ కూడా అడగలేదు కనక మీరు స్వీకరించకపోయినా నేనేమీ అనుకోను.

    ఇంతకీ నా అసలు ఆలోచన ఏమిటంటే – మొత్తం అద్భుతమైన తెలుగులో రాసిన కవితకి పైన పెట్టిన పేరు – అదీ ఈమాట అనే తెలుగు పత్రికలో – పంటికింద ఇంగువముక్కలా తగిలింది. అది "మీకు మాత్రం" ఉచితమని అనిపిస్తే అది వేరే కథ.

  9. గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం గురించి lalitha n అభిప్రాయం:

    05/04/2020 10:20 am

    స్త్రీవాద కవితా సంకలనాలు ఉంటే పెట్టగలరా (నీలిమేఘాలు, గురిచేసిపాడేపాట కాకుండా).

  10. నటనకు గీటురాయి గురించి tadepalli subrahmanyam అభిప్రాయం:

    05/04/2020 8:13 am

    A marvelous introduction about Shah, one of the Bollywood greats. Thanks for your efforts. Your shadow appears while reading the book.