పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. పరిపాకం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/03/2020 12:13 pm

    నమస్కారం దేశికాచార్యులు గారు
    మీ వ్యాఖ్యతో మునగ చెట్టు ఎక్కించేసారు. అక్కడ్నుంచి కిందపడి కాళ్ళూ చేతులూ విరక్కొట్టుకునేలోపలే మీరడిగినవి చెప్పేద్దాం అని ఈ ప్రయత్నం.

    బుధ్ధుడి జీవితంలో అనాథపిండకుడి సంగతి అనేక చోట్ల కనిపించింది. అయితే ఆయన ఇంట్లో ఉన్న దేవత గురించి చందమామలోనో మరోచోటో చదివాను. అయితే అక్కడ కథ వేరుగా ఉంది. మూడో అంతస్తులో ఉన్నది క్షుద్రదేవతే అని రాసారు. ఆవిడకి కావాల్సివచ్చినప్పుడు మానవరూపం ధరించి బయటకొచ్చి అనాధపిండకుడి భవనరక్షకులతోనూ, కొడుకుతోనూ బుద్దుడి గురించి, తమ ఇంటికి రానివ్వవద్దనీ చెప్తూ ఉండేది. చివరకి ఎవరూ విననపుడు అనాధపిండకుడి దగ్గిరకే వెళితే తాను భగవానుణ్ణి వదులుకోననీ ఆవిడని బయటకి పొమ్మన్నాడనీ రాశారు. అనాధపిండకుడికి డబ్బులు పోవడానికీ, ఈవిడకీ ఏదో సంబంధం ఉంది. కసి తీర్చుకోవడానికి అలా చేసి ఉండొచ్చు. నాకు ఇలా క్షుద్రదేవత బుద్ధుడికి కనిపించడం అనేది సాధ్యమని అనిపించక కొంచెం మార్చాను. దీనికి అనేక కారణాలు. అప్పట్లోనూ, ఇప్పటికీ ఇటువంటి దేవతారాధనలు చేసేవాళ్ళున్నారు. వాళ్లని ఎవరూ బలవంతంగా మార్చ(లే)రు. వాళ్ళకి వాళ్ళు తెలుసుకుని బుద్ధుడిలాంటివాళ్ల దగ్గిరకి వస్తే ఏదో చేయగలరు. అయితే ఈవిడే క్షుద్రదేవత అనిపించడానికి నిఘంటువుతో కుస్తీపట్టి కలాపిని అనే పేరు సంపాదించాను. అలాగే నేను చదివిన కధలో దేవత ఇంట్లోంచి బయటకి వచ్చాక ఎక్కడా దిక్కులేక తిరుగుతూ గ్రామదేవత గుడిలోకి వచ్చి ఆవిణ్ణే అడుగుతుంది – ‘ఇలా అయింది నా జీవితం ఏం చేయమంటావు?’ అని. గ్రామదేవత ఈ క్షుద్రదేవతని చివాట్లు పెడుతుంది మంచి చోటు వదులుకుని బయటకి వచ్చేలా చేసుకున్నందుకు. ఆ తర్వాత గ్రామదేవత సలహా ప్రకారం అనాధపిండకుడికి మళ్ళీ ధనం దొరికేలా చేసి క్షమాపణ అడగమని చెప్తే అలా మళ్ళీ వెనక్కి వెళ్ళాక ‘నేనేపాటివాణ్ణి, నువ్వు చెప్పుకునేవన్నీ భగవానుడి ముందు చెప్పుకో’ అంటాడాయన. ఈ వాక్యం ఒక్కటీ చదివేసరికి నాకు కన్నీళ్ళు ఆగలేదు – అంతటి శరణాగతి సంపాదించడం మామూలు విషయం కాదు కదా, అందులోనూ కోట్లకి పడగలెత్తిన వర్తకుడికి. ఈ కధలో నాకు అసాధ్యం అనిపించినవి మరి కొన్ని. సిద్ధార్ధుడు బుద్ధత్వం సంపాదించడానికి ముందు మరుడు అనేకానేక అడ్డంకులు కల్పించాడనీ అవన్నీ అధిగమించాక బుద్ధుడయ్యాడని కధ. ఒకసారి మరుడంతటి వాడిని జయించాక బుద్ధత్వం సంపాదించినవాడికి క్షుద్రదేవతలు కనిపించే అవకాశం లేదు; దీనిక్కారణం బ్రహ్మవిద్ బ్రహ్మైవభవతి అనే ఉపనిషద్వాక్యం ఉండనే ఉంది. అందువల్లే ఈ దేవతని తీసేసి క్షుద్ర దేవతా ఉపాసన చేసే కలాపినిగా మార్చాను. బుధ్ధుడు ఎక్కడికి వెళ్ళినా తన చుట్టూ యాభై మైళ్ళ దూరంలో ఉండే అందరూ ఆయన శిష్యులైపోయేవారు అంటారు శివానంద సరస్వతి. అయితే తధాగతుడు మాత్రం ఎప్పుడూ కూడా ‘నా శిష్యరికం చేయండి వచ్చి తరించండి’ అని చెప్పినట్టూ లేదు. ‘వచ్చి నేను చెప్పేది వినండి అందులో సత్యం ఉంటే స్వీకరించండి, లేదా విసిరికొట్టండి’ అని మాత్రమే అనేవాడుట. అందువల్ల క్షుద్రదేవతలని ఆరాధించేవాళ్లని బలవంతంగా ఎప్పుడూ మార్చలేదు. వాళ్ళు మనసు మారి వస్తే తప్పకుండా సంఘంలో జేర్చుకునేవాడు అంటారు. అందుకే కలాపిని ని తన దగ్గిరకి వచ్చేదాకా పట్టించుకోనేలేదు. అదీకాక కధలో క్షుద్రదేవత మనిషిగా కనిపించడం, మాయమైపోవడం అవీ రాస్తే కథ మరీ అల్లాయిద్దీన్ అద్భుతదీపం లాగా తయారవడం నాకు నచ్చలేదు. దీనికి కారణం పైన చెప్పినదే – బ్రహ్మజ్ఞానం కలిగినవారికి క్షుద్రదేవత కనిపించడం అనేది జరగని పని. ఆ కింద స్థాయిలో ఉన్న వాటినన్నింటినీ జయించాకే బ్రహ్మ జ్ఞానం కలిగేది కదా. అయితే ఈ కలాపిని అనాధపిండకుడి ఇంట్లో వాళ్లకి బుద్దుణ్ణి రానివ్వవద్దని చెప్పడం అవీ కూడా కధలో విపులంగా రాసాను కానీ అది సంపాదకులు కత్తిరించారు.

    రెండు విహారాలు బుధ్ధుడు తన చేతిమీదుగా తీసుకున్నాడనేవి కూడా చారిత్రాత్మక సత్యాలని నేను చదివాను. ఒకటి అనాధపిండకుడు కట్టించినదైతే రెండోది విశాల కట్టించినది. ఈ రెండు విహారాలు మాత్రమే బుధ్ధుడు తన చేతిలోకి వాళ్లు పోసే నీళ్ళు తీసుకుని దానం తీసుకున్నట్టూ స్వీకరించాడని అంటారు. దీనిక్కూడా కారణం ఈశిష్యులిద్దరూ మహోన్నతులైనవారు కనక. ఇంకో విషయం – ఒకప్పుడు బ్రహ్మాండంగా ఓ వెలుగు వెలిగిన శ్రావస్తి కూడా చివరకి పతనమౌతుంది అని ఒకసారి ఆనందుడితో అంటాడు బుధ్ధుడు. ఆయన చెప్పినట్టే అంటురోగాలు వ్యాధులూ వచ్చి శ్రావస్తి పీనుగుల గుట్టలా తయారౌతుంది. ఊళ్ళో శవాలకి దహనం చేసేవాళ్ళు కూడా ఉండక అవన్నీ కుళ్ళి పరిస్థితి మరింత దారుణంగా అవుతుంటే జనం రాజు దగ్గిరకి వెళ్ళి ఏదో చేయమంటే ‘ఈ దశలో బుధ్ధుడు మాత్రమే మనకి సాయం చేయగలడు, వెళ్ళి పిలవండి’ అంటాడుట. ఆయనని పిలిచినప్పుడు వెంఠనే బయల్దేరి వచ్చి తన భిక్షాపాత్రలో నీటిని మొత్తం శ్రావస్తిలో జల్లమని ఆనందుడితో చెప్తాడు. వెంఠనే రోగాలన్నీ తగ్గు ముఖం పడతాయి. ఆ తర్వాత జీవకుడు ఇచ్చిన మందులన్నీ శ్రావస్తిలో పంచాక కొంతకాలానికి మళ్ళీ మామూలుగా అవుతుంది జీవితం. ఈ నీళ్ళు జల్లడం అనేది అక్కడ్నుంచి ఎత్తుకొచ్చి ఈ కధలో కలాపినికి కలిపాను. ఇవన్నీ కుదురుకున్నాక అంతర్జాలం మీద పడి చూసాను మరికొన్ని విషయాలు అనాధపిండకుడి గురించి.

    అందువల్ల ఈ కధ 80 శాతం చారిత్రాత్మకం, 20 శాతం నా ఊహ/కల్పితం.

    మీరు పేరు అనాధపిండకుడు అనే బదులు “అనాధపిండికుడు” అన్నారు. అదే అయి ఉండవచ్చుకూడా. ఈ పేరు గురించి నేను చూసాను కానీ అంత క్షుణ్ణంగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ కధలో మనుషుల ప్రవృత్తిని బుధ్ధుడు ఎలా మార్చగలడో అనేది సరిగ్గా వచ్చిందా లేదా అనే నేను చూసుకున్నాను. అంచేత నేను రాసిన పేరు తప్పు అయితే ఆ తప్పు నాదే. ఆనందుడంటే నాకొక ప్రత్యేక అభిమానం – ఆయన బుధ్ధుడి దగ్గిర జేరే ముందు పెట్టిన మూడు ఆంక్షలకి. అవి కూడా చెప్పనివ్వండి 1) తాను బుధ్ధుడు ఎక్కడైనా ప్రసంగించినప్పుడు అది వినలేకపోతే తన ఒక్కడి కోసం బుధ్ధుడు ఆ ప్రసంగం మొత్తం మళ్ళీ చేయాలి 2) బుద్ధుడు ఎక్కడికైనా వెళ్ళి అతిధ్యం స్వీకరించాల్సి వస్తే దానికి ఆనందుడు వెళ్లవల్సిరాకూడదు 3) బుధ్ధుడు విడిచిన బట్టలు కానీ భోజనం కానీ తనని ధరించమనరాదు/తినమనరాదు. వీటివల్ల ఆనందుడి మనఃస్థత్వం తెలుస్తుంది – తాను బుధ్ధత్వం స్వంతంగా సంపాదించుకుంటాడు తప్ప బుధ్ధుడు ఉచితంగా ఇచ్చేవి ఆనందుడికి అక్కర్లేదు. ఇవన్నీ ఒప్పుకున్నాకే ఆనందుడు బుధ్ధుడి దగ్గిర జేరతాడు. జీవితంలో ఎన్నడూ కూడా ఆనందుణ్ణి రెండోసారి పిలవాల్సిన అవసరం రాలేదుట బుద్ధుడికి. అందువల్ల ప్రతీ బుధ్ధుడి కథలోనూ ఏదో విధంగా ఆనందుడి పేరు చొప్పిస్తూ ఉంటా. మరి బుద్ధుడంటే ఎటువంటి భావం అంటే – ఆయనొక ఉదుంబర పుష్పం వంటివాడు అంటారు జాతక కధల్లో. అనేకానేక కల్పాలకి కానీ అది పుష్పించదుట. బుధ్ధుడు మన కల్పంలో పుట్టి పుష్పించడం వల్ల మనం ఉన్నది భద్ర కల్పం అయిందంటారు.

    మీరు రాసినవి ఇంతకు ముందు చూడలేదు త్వరలో వీలుబట్టి తప్పక చదువుతాను. అనేక ధన్యవాదములు.

  2. కెహర్వా! గురించి Srinivas Banda అభిప్రాయం:

    05/03/2020 10:43 am

    ధన్యవాదాలండి. మీ సూచనని శిరసావహిస్తాను. ‘కెహర్వా’ అనేది తబ్లా మీద వాయించే ఒక తాళం అని మీకూ తెలిసే ఉంటుంది. దాన్ని గురుతుల్యలు ఒకాయన వాయిస్తుంటే చాలా ఇష్టంగా వినేవాళ్లం. ఈమధ్య ఒక గాయకుడి పాటని విన్న తర్వాత, మళ్లీ అప్పటి తాదాత్మ్యతని రుచి చూసేను. ఈ పంక్తులు రాసుకున్నాను.. ఆ పేరు పెట్టటమే ఉచితమనిపించింది..

  3. ఉద్యోగపర్వము – రాయబారాలు గురించి సూర్యుడు అభిప్రాయం:

    05/03/2020 8:39 am

    చాల బాగుంది.

  4. ఒకానొక ఊట కోసం గురించి కోడూరు శ్రీ వేంకటేశ్వర స్వామి. అభిప్రాయం:

    05/02/2020 10:59 pm

    వేదాంతాన్నీ, వైరాగ్యాన్నీ జీవన సత్యాన్ని చాలా బాగా చెప్పారు. అభినందనలు.

  5. సాక్ష్యం గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/02/2020 9:08 pm

    నమస్కారము sharma గారికి: I don’t know how to express my feelings towards this story. Excellent SIR. Actually I am trying to put comment in this box from several days but not possible for me. I am not able to text here Today its possible for me.

    Thanks to the editors: I am not reading any weeklies or monthlies from nearly 15 yrs because i don’t like the content. But yours ee maata is has super content.

  6. పరిపాకం గురించి desikachary అభిప్రాయం:

    05/02/2020 1:37 pm

    శర్మగారూ,
    అభినందనలు. మీకథ బాగున్నది. పిలకా గణపతిశాస్త్రిగారు సంతరించిన అనురూపకథనములను దలపించినది. ఈకథకు బీజప్రాయమైన ఉదంతవర్ణన ఎక్కడనైన బౌద్ధగాథలలో ఉన్నదా, లేక ఇది కల్పితమా? అనాథపిండికుడు, జేతవనము, శ్రావస్తి – ఇవన్నీ చారిత్రకసత్యములే. ఈమూడును నాకు పరిచతములే. వీని నాధారముగా చేసికొని నేను ఈమాటలోనే ‘మహామంగళప్రవచనము’, ‘సిరిపాలుడు’ అను రెండు పద్యఖండికలను పూర్వం ప్రచురించినాను. ఇందులో మొదటి ఖండిక బౌద్ధులకు నిత్యపఠనీయమైన మహామంగళసూక్తిని, జేతవనమును, బుద్ధుని ఆధారముగా చేసికొని వ్రాసినది. రెండవది జేతవనము, అందులో నివసించుచున్న బుద్ధుని ఆదారముగా చేసికొని వ్రాసిన కల్పితగాథ. మీకు వీలు, ఓపిక ఉన్న వానిని చూడవచ్చును. – దేశికాచార్యుడు

  7. పరిపాకం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    05/02/2020 1:06 pm

    రఘునాధాచారి గారు
    సంతోషం మీకు నేను రాసినవి నచ్చినందుకు. ఇలా పబ్లిగ్గా ఈమెయిల్ అవీ ఇవ్వడం కుదరదు కానీ మరోదారి వెతకాలండి. ఏం చేద్దాం? ర-కారం అనే కధ దగ్గిర మీరు పెట్టిన వ్యాఖ్య కూడా చూసాను. నేనింతకాలం ఎక్కడున్నానంటారా? హ హ ఇక్కడే ఉన్నా – ప్రపంచంలో ఒకానొక మారు మూల ఊరిలో. కౌముది, ఈమాట, సుజనరంజని, మధురవాణి, సారంగ, సిరిమల్లే అనే పత్రికల్లో సంపాదకులని ఏడిపించుకు తింటూ ఆయా పత్రికల్లో కనిపిస్తూనే ఉన్నా అప్పుడప్పుడూ. 🙂

  8. మౌనవిపంచి గురించి Kishore Karnam అభిప్రాయం:

    05/02/2020 12:26 pm

    అధ్బుతమైన కవిత భావవ్యక్తీకరణ.

  9. ర-కారం గురించి Raghunadhachari.P అభిప్రాయం:

    05/02/2020 10:07 am

    Iam reading your stories from the beginning sir, నమస్కారము
    Excellent writings all.
    I don’t know where were you all these days SIR

  10. ఒకానొక ఊట కోసం గురించి Spoorthy అభిప్రాయం:

    05/02/2020 9:58 am

    చాలా బాగుంది జానీ గారు. చాలా డీప్ మీనింగ్ ఉంది మీ కవితలో.