పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16461

  1. ఒకానొక ఊట కోసం గురించి A. Syamasundar అభిప్రాయం:

    05/01/2020 6:20 am

    హృదయాలను కదిలించి ఆలోచనలను రేకెత్తించే కవిత!

  2. ఒకానొక ఊట కోసం గురించి Ravi Teja అభిప్రాయం:

    05/01/2020 6:20 am

    చాలా బాగా వర్ణించారు, ఊపిరొక అపనమ్మకం ఏ క్షణంలోనైనా మట్టిలో తలదాచుకుంటుంది. ఈ మాట చాలా అద్భుతంగా ఉంది.

  3. ఒకానొక ఊట కోసం గురించి Vadra Ravi అభిప్రాయం:

    05/01/2020 6:18 am

    చాలా చక్కగా రాశారు. అర్థవంతమైన పద ప్రయోగం.

  4. Tara and the Teacher గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    04/30/2020 2:27 pm

    లైలా గారు
    ఈ రోజు మంచి సుదినం – రెండుమూడు మంచి వార్తలు వచ్చాయి. మీ వాఖ్య చూసాక వళ్ళు గాలిలో తేలిపోతోంది. నేను కోంతకాలం బాంబే లో పనిచేసాను. అందువల్ల అక్కడి జీవితాలు చాలామటుకు తెలుసు. అసలు వర్షం కుంభవృష్టి అంటే ఎలా ఉంటుంది అనేదానికి బాంబేలో తప్ప ఇంకెక్కడా అర్ధం చెప్పడం కష్టం అని నా అభిప్రాయం. అలా వచ్చినదే తుఫాను కధ. అయ్యో మీకు తెలియనిదేముంది? ఆ కధ కొంచెం కత్తెరించారు. చివర్లో నేను రాసినది. ఒకాయన వేరేగా మెయిల్ లో చెప్పారు కూడా ముగింపు నచ్చలేదని. బాంబేలో అమ్మాయిల దగ్గిర మిగతా దేశపు అమ్మాయిలు బాగా నేర్చుకోవల్సింది ఉంది అని నా అభిప్రాయం. నాకు తెల్సిన వాళ్లలో ఈ అమ్మాయిలే బాగా చదువుకుని పైకొచ్చిన వాళ్ళు. అది కూడా చొప్పించాను కధలో. సంతోషం మరోసారి. టాలస్టాయి కృష్ణుడు నా కథలో కనిపించారంటే సంతోషమే కాదుటండీ?

    చెప్పక చెప్పక రిచర్డ్ కింబిల్ గురించే అన్నారా? ఈ సినిమా విడుదలైన రోజుల్లో ఫోర్డ్ అంటే ఎవరో తెలియదు. చూసాక వాడి వీర ఫేన్ అయ్యాను. తర్వాత ఎవరో ఈ కేసెట్ కొని పట్టుకొచ్చారు రూముకి. అప్పట్లో కేసెట్లే ఉండేవి. ఇంక ఎవరికీ ఇవ్వకుండా దాన్ని దాదాపు నలభై యాభై సార్లు చూసినట్టున్నాను. నా రూమ్మేట్లు, ఊరు ఊరంతా చెప్పుకున్నారు నేను అలా రంధిగా చూడ్డం. ఆ కెసెట్ నా మొహం మీద పారేసి అందరూ బయటకి వెళ్ళినా నేను అదే పొద్దున్న నుంచి సాయంత్రం వరకూ అలా చూస్తూనే ఉండేవాణ్ణి. ఇప్పటికీ మొదట్లో వేసే అక్షరాలు – డైరక్షన్ ఆర్నాల్డ్ కోపెల్సన్, స్టారింగ్ – హారిసన్ ఫోర్డ్ అనేవి గుర్తున్నాయి. ఉత్తరోత్తరా ఎవరో చెప్పారు అది $100 మిలియన్లు వసూలు చేసిందని. ఏం సినిమా అండీ? ఫోర్డ్ గారి పెదాల మీద కనీకపడని నవ్వు ఏ హీరో చూపించగలడు?

    నేను పంపే కథలు ఈ మధ్యన పడడం లేదు – అనేకానేక కారణాలు లెండి. నా కధల వల్ల ఈమాట స్థాయి దిగజారిందని ఒకానొకరు ఉవాచ. పోనీయండి, కాళిదాసులా రాయడం ఎలా కుదురుతుంది నాకొచ్చిన పదో క్లాసు తెలుగుతో? అలా రాయాలంటే ఉజ్జైన్ పోయి అమ్మవారికోసం – కనిపించి నా నాలికమీద బీజాక్షరాలురాస్తావా, తల నరుక్కోమంటావా – అని బిగదీసుకుని కూర్చోవాలి. చావరా నాయనా, అదే సులభం అంటుందేమో నాలాంటివాణ్ణి చూసి. ఎందుకొచ్చిన గొడవ. 🙂

    కృష్ణుడు మీ హీరో అన్నారు కనక ముళ్ళపూడి వారి “కానుక” అనే కధ చదివే ఉంటారు. లేకపోతే ఓ సారి చూడండి. నా ఉద్దేశ్యం ప్రకారం అటువంటి కధ జీవితంలో ఏ కధకుడైనా ఒకే ఒకసారి రాయగలడు.

  5. నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి B v jagadeeswara rao అభిప్రాయం:

    04/30/2020 11:36 am

    మీ వివరణ అమోఘం.

  6. నాకు నచ్చిన పద్యం: అభినవ పోతన అభివ్యక్తి సొగసు గురించి B v jagadeeswara rao అభిప్రాయం:

    04/30/2020 9:33 am

    మీ వర్ణన తీరు చాలా బాగుంది. మాలాంటి అభిమానులకు ఎంతో సౌలభ్యముగా వుంది. ఇటువంటి వర్ణనలు ఇంకా వుంటే తెలియజేయ గలరు. ఆష్టవిధ నాయికల వర్ణన కూడా లభియింప జేస్తే ధన్యులం.

  7. Tara and the Teacher గురించి Lyla Yerneni అభిప్రాయం:

    04/28/2020 7:58 pm

    “రమణులు తన జీవితకాలంలో ఎన్నడూ ఎవరికీ విభూది ఇచ్చిన దాఖలాలు లేవు. వచ్చినవాళ్లకేసి ఒక్కచూపు చూసేవారు(ట). ఆ చూపుకి వళ్ళు తప్పిపోయి, తలలో గర్వం పాదాల్లోకి ఒక్క క్షణంలో వచ్చి ఆయన శిష్యులైనవారున్నారు (ఉదాః చలం అనబడే ఒకానొక ప్రబుధ్ధుడు)…”

    శర్మగారు!

    “నెమలి పింఛము వాడు, నీలమేఘకాంతివాడు
    రమణుడాతడు మొక్కేను రమ్మనరమ్మ!”

    అతడొక్కడే రమణుడు! కృష్ణుడుండగా మరొకరికి అగ్రపూజా! మహాభారతం చదివిన వారలము కాదా!

    “చెందమ్మి కన్నులవాడు, చేతి పిల్లగ్రోవి వాడు
    ఇందువచ్చె కంటిరా? ఏమిదే యమ్మా!”

    S. జానకి ఈ పాట ఎంత బాగా పాడింది! ఈ పాట మాధుర్యం అన్నమాచార్యుని పదాల లోంచి వచ్చింది. అలా ఎవరు రాయగలరు!
    ఐనా, ఆ పాట నాయకుడు కృష్ణుడు కాకుంటే అంత విరహము, అంత మోహము ఉండేనా!
    జన హృదయం దోచిన కృష్ణుడి వేషం కట్టక పోతే, N.T. రామారావు తెలుగునాట ఛీఫ్ మినిస్టర్ అయ్యేనా!

    “మందల పశువుల వాడు
    మకరాంతముల వాడు
    ఎందునున్నాడు చెప్పరే! ఏల దాచేరమ్మ!”

    ఈ పాట నాలో ఎప్పుడూ సుళ్లు తిరుగుతుంటుంది. ఇందులో మోహమురళి, మంద్ర తంత్రుల వీణమీటులు మరోలోకాలవి. పాటలోని మాటలు వరసలు అప్పడప్పడు గుర్తు రాపోతేనేం ఎటు మార్చి పేర్చుకున్నా, అందమే అందం.

    “చెచ్చెరకోనేటివాడు శ్రీ వేంకటేశ్వరుడు
    వచ్చి నన్ను కూడినాడు వాడు ఓ యమ్మా!”

    నాకు శృంగారం ఒక్కటే రసం. ఏ శకం లోనూ, ఏ వయసులోనూ, ఏ రోజునైనా, ఏదో ఒక్క కణం లోనైనా, ఒక క్షణమాత్రమైనా, శృంగారం లేక -జీవితం సహ్యం కాదు.
    నేను తెలుగు వనితనే! కృష్ణుడి పై పాటలు తెలుగువారి DNA లో భాగం ఐ పోయాయి. అదేమంత కష్టమైన తెలుగా! ఒక చక్కని పాట రాయటానికి ఎంతపాటి తెలుగు రావాలి!

    “గోపాలకృష్ణుడు నల్లన
    గోకులములో పాలు తెల్లన
    కాళిందిలో నీళ్లు చల్లన!
    పాట పాడవె నా మనసు ఝల్లన!”

    రావు బాలసరస్వతి ఏమీ పటాటోపం లేకుండా పాడే ఆ తెలుగు పాట, ఎందుకు రంజింప చేస్తుంది! ఎందు వలన! అగ్రస్థానంలో గోపాలకృష్ణుడున్నాడు! అందువలన!

    “ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా, కృష్ణా!
    శంఖమేల, చక్రమేల, సారబ్జము లేలరా
    అస్ర్తశస్త్రజాలమెల్ల యమునబారవైచి రార!

    ఈ నెల ఈ మేగజీన్ లో వినిపించిన లలిత సంగీతం లో అన్నిటికన్నా బాగున్నది పైనున్న కృష్ణ గీతమేగా!
    ఆ పాటలో శాంతకుమారి చివరి మాటలు అంత స్పష్టంగా వినరావటం లేదు! ‘గురు చింత’ అనేనా గేయరచయిత రాసింది?

    “పక్షపాతమేలా! నీ పక్షమేది గోపాలా!
    ‘మురళి’ కన్న ‘రాస’ కన్న “గురుచింత” ఏలా!”

    విన్నారుగా!

    Edith Hamilton -Mythology చదువుకుంటే, Roman, Greek First tier Gods, Second tier Gods తెలుస్తారు.
    పోతన భాగవతంలో, హిందూ దేవతల వంశాలు, ఉపవంశాలు, శాఖలు, తెలియచెప్పాడు.
    హిందూ మిథాలజీలో కృష్ణుడు అగ్రశ్రేణిలో ఉన్నాడు. నాకు మిథలాజికల్, ఫిక్షనల్ హీరోలే హీరోలు. వారి మీదే నాకు గురి. నీకు తెలిసిన డాక్టర్లలో ఎవరు నీ హీరో అంటే – Dr. Richard Kimble అంటాను. అతను ఎవరంటే, ఛికాగో కుక్ కౌంటీ హాస్పిటల్లో సర్జన్! ఎక్కడ అంటే “Fugitive” సినిమాలో. ఆ డాక్టర్ ధీరోదాత్తుడైన నాయకుడు.

    శర్మగారూ! చలం సాహిత్యం అంతా నా వద్ద ఉంది. అతడు తెలివైన రచయిత. కాని నాకు ఇష్ట రచయిత కాడు. అయిష్ట రచయిత కూడా కాడు.
    నిన్నంటే నిన్న Edith Wharton రాసిన కథలు రెండు చదివాను. 1. The afterword. 2. Xingu. తెలివైన రచయిత్రి. రెండూ బాగా రాసింది. ఎక్కడి కక్కడే ఐపోయింది, ఓరినీ! భలే రాసిందే అనుకుంటే, పక్క పేజీలో మళ్లీ కథ సాగించింది. మళ్లీ అదే తంతు. ముగించింది లెండి ఆమె కిష్టమైనప్పుడు.

    చలం, ఈడిత్ ల సంగతెందుకు? మీరు కథకులేగా శర్మగారూ! ఎందుకు ఫస్ట్ తారీఖుకే రాయటం. ఉద్యోగాలలో బిజీగా ఉన్నందువల్ల రాయలేని రచయితలు ఇప్పుడు కొన్నాళ్లుగా రోజు కొకటి రాసి ఉండాలిసిందే!
    మీరు రాసిన కథలలో “తుఫాను” అన్న కథ నాకు బాగా నచ్చింది. ఆసాంతం బాగా రాసారు. అందులో ambience బాగా వచ్చింది. కథ స్పిరిట్ టాల్స్టాయ్. సెట్టింగ్ ముంబయ్! కథలో ఇద్దరు చక్కని spirited కథానాయికలున్నారు. కథలు కొన్నిసార్లు అవే రాసుకుపోతుంటాయి. జయదేవుడి అష్టపది లో ఆఖరు పంక్తి కుదరక రచయిత లేచిపోతే, కృష్ణుడొచ్చి పూర్తి చేసినట్టు మళ్లీ వచ్చి చూసుకున్నప్పుడు చక్కని ముగింపు రాసి ఉంటుంది. బాగా ముగింపు ఇచ్చారు తుఫాను కథకు! It is a positive Leo Tolstoy! Beautiful!

    మీ కథ ఒకటి ‘ఈ మాట’ మరుసటి సంచికలో ఉంటుందని ఎదురుచూస్తాను.

    -Lyla

  8. గ్రీకు పురాణ గాథలు 4 గురించి RAO VEMURI అభిప్రాయం:

    04/26/2020 11:34 pm

    మీ అభిప్రాయం సరి అయినదే! నిజానికి గ్రీకు పురాణాలలో వచ్చే పేర్లని విడదీసి పరిశీలిస్తే వాటి అర్థాలు ఆయా శాల్తీల శీలాలతో సరిపోల్చవచ్చు – చాలమట్టుకి. ఈ విధంగా లోతుగా పరిశీలించి చూస్తే గ్రీసు దేశపు పురాణాలకీ, మన పురాణాలకీ చాలా “పోలికలు” కనిపిస్తాయి. గ్రీకు పురాణ గాథల కంటె హిందూ పురాణ గాథలు కొంచెం ఎక్కువ mature గా కనిపిస్తాయి కనుక మన కథలు వారి కథల తరువాత కాలంలో రాసినవేమో అని అనుమానం వేస్తూ ఉంటుంది. ఇదంతా తవ్వుకుంటూ పోతే వివాదాస్పదమైన ఉద్గ్రంథం అవుతుంది. నేను ఇప్పటికే 15/16 అధ్యాయాలు రాసేను. ఈమాట సంపాదకవర్గం కొంచెం కొంచెంగా వేస్తున్నారు కనుక అసలు రంగంలోకి దిగేసరికి మరొక రెండు నెలలు పట్టవచ్చు. మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు.

  9. గ్రీకు పురాణ గాథలు 4 గురించి విద్యార్థి అభిప్రాయం:

    04/26/2020 7:49 pm

    గ్రీకు దేవతల గురించి మీరు వ్రాయటం చాలా బాగుంది. ద్యౌస్ ప్రస్తావన ఇంకొంచెం వివరించగలరు.

    గ్రీకు దేవతలకు వైదిక దేవతలకు పేర్లలోనూ, ఆధిపత్యాలలోనూ ఉన్న సాపేక్షత, తత్వములోకూడా ఉన్నదేమో ఆలోచించవలసిన విషయము. ఉదాహరణకు, ఇంద్రుడు ఇంద్రియ నిగ్రహణకు కూడా అధిపతి అయితే, మరి Zeus కూడా ఇంద్రియ నిగ్రహణకు సంబంధించన విషయమా?

    గ్రీకు దేవతల పేర్లకి, సంస్కృత అర్థాలకి చాలా పోలిక ఉండటం అందరూ గమనించినదే. ఉదాహరణకు, Chronos. ఇక్కడ గ్రీకు భాషకు సంబంధించిన “os” suffix తీసివేస్తే, Chron మిగులుతుంది. అనగా కాలము లేక సంస్కృత “కాల”. ఇక్కడ రెండు మాటలూ “క”తో ఉత్పత్తి అయ్యిన శబ్దాలు. కాలము అందరినీ మింగేస్తుంది కదా. మరి అందుకే, క్రోనోస్ తన సంతానాన్ని మింగేసాడు అని చెప్పబడుతున్నదేమో! యుద్ధము ఏ కాలములోనూ జరగకుండా ఉండలేదు. అందుకే, దాన్ని మింగుదామనుకున్నా Athena పొడుచుకువచ్చినదేమో! గ్రీకు తత్వము కూడా కొంత మనము ప్రయత్నించ వలసిన విషయమయ్యి ఉండవచ్చు.

  10. నాకు నచ్చిన పద్యం: ప్రవరుని హిమాలయ దర్శనం గురించి Lyla Yerneni అభిప్రాయం:

    04/24/2020 3:50 pm

    There you go Kiddo! You made my day!
    Sometime back I saw another Telugu video, where another sweetie is imitating and taunting a cuckoo, and it is responding. That was such fun!
    A birthday girl in response to greetings sent to her, sent back photos of beautiful Tulip beds from central park.
    Where I am, the white magnolia is in bloom.
    Earth is going on with its business as usual. Spring is here. Life is Good! Thank you God! – Lyla