హ్హ హ్హ, సిగరెట్ల దగ్గు ప్రహసనం బాగుందండి. అంట్లు తోమడం వలన మరో మంచి ప్రయోజనం ఉందనీ, చేతులు బోలెడంత శానిటైజ్ అయిపోతాయనీ ఓ కార్టూన్ వచ్చింది, అంటే ప్రద్యుమ్నుడికి బాగానే ఉపకారం అయిందన్నమాట.
మీరు మీదైన శైలిలో హాస్యంగా వ్రాసినా చక్కటి సమకాలీన కథ చెప్పారండి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారూ.
ప్రియమైన శ్రీ కర్లపాలెం హనుమంతరావుగారు, నమస్కారములు.
చానాళ్లకి మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడగలిగాను. మీ రచనావ్యాసంగం ఎలా సాగుతోంది? హాస్యరసభరితంగా ఉండే మీ రచనలు మళ్లీ చదవాలని ఉంది.
ఇకపోతే ప్రస్తుత సంవాద విషయానికొస్తే “తన ప్రైవెసీ పోయిందని విచారించే సినీతార“ అంటూ మీరు ఇచ్చిన ఉదాహరణ నాకంతగా నచ్చలేదు సార్. సృజనశీలురైన కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, చిత్రకారులు, అభినయం చేసే వారందరూ ఓ తపోనిష్టతో వారి సృజనని ఆవిష్కరిస్తారని… తమను ప్రోత్సహించే కొద్దిపాటి పలుకులకే ఎంతో సంతోషించి మరింతగా ఎదగాలని ఆశిస్తారని అనుకుంటున్నా. మీకు తెలియని విషయం కాదిది.
సోషల్ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి తన మనసుకు కలుగుతున్న చెదురుబాటు నుంచి కుదురుబాటును మాత్రమే ఆశించారు కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి. ఆ మాధ్యమాలు పూర్తిగా అనర్థం, వ్యర్థం అనటం వారి ఉద్దేశ్యం కాదనుకుంటా. అవి రెండువైపులా పదునున్న కత్తులు… వసతులు కలిగిస్తాయి, ఊపిరాడకుండా చేస్తాయి అనే ఓ వాదో అపవాదో వాటిపై ఉంది కదా.
సవివరణగా సాయి బ్రహ్మానందం గొర్తి గారిచ్చిన స్పందన ఎంతో బావున్నా… అందులో కూడా కొన్ని సున్నితంగా లేవనిపించాయి. బహుశా కవయిత్రి ఇంద్రాణిగారితో వారికున్న చనువుకొద్దీ అలా రాసారేమో. ( అవునూ “రచయిత మహాశయా” అనేది పుంలింగ ప్రయోగం అనుకోవచ్చా? అలా అయితే మరి స్త్రీలింగ ప్రయోగంలో ఆ పదాలని ఎలా రాయాలో అని కుంచెం డౌటింగు).
విమర్శలను సరిగా అర్థంచేసుకుని “పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ఎంతో వినయం, వొందనం చూపిన ఇంద్రాణిగారు కవయిత్రిగా / రచయిత్రిగా మరింతగా ఎదగాలని దీవించమని విన్నపం సార్.
‘అదే నేల’ పుస్తక పరిచయం ఆసాంతం చదివాను. ముకుందరామారావుగారు ఆర్భాటం లేని ముక్కుసూటి రచయిత. ఆయన ప్రతీ రచనా పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. అదేనేలలో మచ్చుకు చూపిన వివిధ భాషల జానపద పాటల సాహిత్య మూలాలు జనపదాలే అని ఎంత అద్భుతమైన రీతిలో వ్రాశారు! మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
సినిమాల్లో చేరి గుర్తింపు సంపాదించుకోవాలన్న మోజుతో శ్రమించి ఆ కల సాధించిన తరువాత ప్రైవెసీ పోయిందని విచారించిన విధంబుగా ఉందీ కథ. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సాంకేతిక అభివృద్ధి అందించే లాభాలను మాత్రమే సులభంగా సాధించుకునే మాధ్యమం సామాజిక మాధ్యమం. నా వరకు నేను కలలోనైనా కలుస్తానని ఊహించని పెద్దలతో పరిచయలాభం పొందాను. జై.. సామాజిక మాధ్యమాలూ!
లాక్‍డౌన్‍లో ప్రద్యుమ్నుడు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:
06/08/2020 1:06 am
హ్హ హ్హ, సిగరెట్ల దగ్గు ప్రహసనం బాగుందండి. అంట్లు తోమడం వలన మరో మంచి ప్రయోజనం ఉందనీ, చేతులు బోలెడంత శానిటైజ్ అయిపోతాయనీ ఓ కార్టూన్ వచ్చింది, అంటే ప్రద్యుమ్నుడికి బాగానే ఉపకారం అయిందన్నమాట.
మీరు మీదైన శైలిలో హాస్యంగా వ్రాసినా చక్కటి సమకాలీన కథ చెప్పారండి, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారూ.
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
06/06/2020 12:43 am
ప్రియమైన శ్రీ కర్లపాలెం హనుమంతరావుగారు, నమస్కారములు.
చానాళ్లకి మిమ్మల్ని ఇలా ఇక్కడ చూడగలిగాను. మీ రచనావ్యాసంగం ఎలా సాగుతోంది? హాస్యరసభరితంగా ఉండే మీ రచనలు మళ్లీ చదవాలని ఉంది.
ఇకపోతే ప్రస్తుత సంవాద విషయానికొస్తే “తన ప్రైవెసీ పోయిందని విచారించే సినీతార“ అంటూ మీరు ఇచ్చిన ఉదాహరణ నాకంతగా నచ్చలేదు సార్. సృజనశీలురైన కవులు, కళాకారులు, గాయకులు, రచయితలు, చిత్రకారులు, అభినయం చేసే వారందరూ ఓ తపోనిష్టతో వారి సృజనని ఆవిష్కరిస్తారని… తమను ప్రోత్సహించే కొద్దిపాటి పలుకులకే ఎంతో సంతోషించి మరింతగా ఎదగాలని ఆశిస్తారని అనుకుంటున్నా. మీకు తెలియని విషయం కాదిది.
సోషల్ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి తన మనసుకు కలుగుతున్న చెదురుబాటు నుంచి కుదురుబాటును మాత్రమే ఆశించారు కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి. ఆ మాధ్యమాలు పూర్తిగా అనర్థం, వ్యర్థం అనటం వారి ఉద్దేశ్యం కాదనుకుంటా. అవి రెండువైపులా పదునున్న కత్తులు… వసతులు కలిగిస్తాయి, ఊపిరాడకుండా చేస్తాయి అనే ఓ వాదో అపవాదో వాటిపై ఉంది కదా.
సవివరణగా సాయి బ్రహ్మానందం గొర్తి గారిచ్చిన స్పందన ఎంతో బావున్నా… అందులో కూడా కొన్ని సున్నితంగా లేవనిపించాయి. బహుశా కవయిత్రి ఇంద్రాణిగారితో వారికున్న చనువుకొద్దీ అలా రాసారేమో. ( అవునూ “రచయిత మహాశయా” అనేది పుంలింగ ప్రయోగం అనుకోవచ్చా? అలా అయితే మరి స్త్రీలింగ ప్రయోగంలో ఆ పదాలని ఎలా రాయాలో అని కుంచెం డౌటింగు).
విమర్శలను సరిగా అర్థంచేసుకుని “పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు” అంటూ ఎంతో వినయం, వొందనం చూపిన ఇంద్రాణిగారు కవయిత్రిగా / రచయిత్రిగా మరింతగా ఎదగాలని దీవించమని విన్నపం సార్.
పుస్తక పరిచయాలు గురించి రాళ్ళపల్లి సుందర రావు ఖర్గపూర్. అభిప్రాయం:
06/05/2020 12:09 am
‘అదే నేల’ పుస్తక పరిచయం ఆసాంతం చదివాను. ముకుందరామారావుగారు ఆర్భాటం లేని ముక్కుసూటి రచయిత. ఆయన ప్రతీ రచనా పాఠకుడిని ఆలోచింపజేస్తుంది. అదేనేలలో మచ్చుకు చూపిన వివిధ భాషల జానపద పాటల సాహిత్య మూలాలు జనపదాలే అని ఎంత అద్భుతమైన రీతిలో వ్రాశారు! మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు గురించి Dr Bhagavan Reddy అభిప్రాయం:
06/04/2020 11:43 pm
చాల బాగ చెప్పారు
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కర్లపాలెం హనుమంతరావు అభిప్రాయం:
06/04/2020 8:44 pm
సినిమాల్లో చేరి గుర్తింపు సంపాదించుకోవాలన్న మోజుతో శ్రమించి ఆ కల సాధించిన తరువాత ప్రైవెసీ పోయిందని విచారించిన విధంబుగా ఉందీ కథ. సెల్ఫ్ కంట్రోల్ ఉంటే సాంకేతిక అభివృద్ధి అందించే లాభాలను మాత్రమే సులభంగా సాధించుకునే మాధ్యమం సామాజిక మాధ్యమం. నా వరకు నేను కలలోనైనా కలుస్తానని ఊహించని పెద్దలతో పరిచయలాభం పొందాను. జై.. సామాజిక మాధ్యమాలూ!
ముక్కోణాలు గురించి Indu అభిప్రాయం:
06/04/2020 7:55 pm
సంభాళించుకుంటోంది- తప్పనుకుంటాను.
సంబాళించుకుంటోంది అని ఉండాలి.
చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి Indrani Palaparthy అభిప్రాయం:
06/04/2020 2:05 pm
వ్యాసాన్ని ఆసాంతం చదివి ఆశీస్సులు అందజేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు.
పాలపర్తి ఇంద్రాణి.
భారతీయ మతసంస్కరణ – సంఘసంస్కరణ గురించి Indrani Palaparthy అభిప్రాయం:
06/04/2020 9:55 am
..దయానందుడుదయించెను.
…
బహుబలధారిణీం – నమామి తారిణీం
రిపుదలవారిణీం మాతరం
తుమి విద్యా తుమి ధర్మ – తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణాః శరీరే
…
ఎప్పటివలె హృదయాన్ని ఉత్తేజపరచిన వ్యాసం.
దిగవల్లి వారికి నమోవాకములు.
ఈ విలువైన వ్యాస పరంపరను అందిస్తున్న ఈమాటవారికి కృతజ్ఞతలు.
పాలపర్తి ఇంద్రాణి.
ముందుమాటే ఇది…! గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:
06/04/2020 4:14 am
మాటలు లేవు రేఖ గారూ….ఎంత హృద్యంగా రాస్తున్నారు…
మునిమాపు వేళకు గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:
06/04/2020 4:11 am
జీవితాన్ని అన్ని కోణాల్లో కాచివడబోసినట్టే….మీ మాటలు…. అభినందనలు రేఖ గారూ