పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16458

  1. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి అవినేని భాస్కర్ అభిప్రాయం:

    06/02/2020 3:11 am

    ఆలోచింపజేసే వ్యాసం.

    ఇందులోని అంశాలు చాలా మందికి ఉపయోగపడతాయి.

  2. పుస్తక పరిచయాలు గురించి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి అభిప్రాయం:

    06/02/2020 2:33 am

    ముకుంద రామారావు గారు తనదైన రీతిలో ఇదివరకు నోబెల్ కవిత్వాన్నీ, ఇతర ప్రపంచ కవుల కవిత్వ విపులతనూ పరిచయం చేసినట్టుగానే ఇప్పుడు ఈ ‘ అదే నేల ‘ గ్రంథంలో తెలుగేతర భారతీయ భాషల్లోని కవిత్వ మాధుర్యాన్ని చాలా లోతుగా పరిచయం చేశారు. ఇంత విస్తృతంగా ఒకే ఒక్క మనిషి ఎట్లా చేశాడబ్బా అని ఆశ్చర్యం కలిగించే రీతిలో ఈ పుస్తకం విస్తరించింది. ఇంతవరకు ఎవరూ ఇంత వైశాల్యంతో కవిత్వ విశ్లేషణను చేసింది లేదు. ఇటువంటి రచన చేయడానికి ఎంతో మగ్నతతో కూడిన తపస్సమాన దీక్ష కావాలె. అటువంటి లీనతతో రామారావు ఈ ఘన కార్యాన్ని సాఫల్యపర్చారు. ఈ సందర్భంగా నాకు మంచి మిత్రుడైన రామారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

  3. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి విన్నకోట నరసింహారావు అభిప్రాయం:

    06/01/2020 10:57 pm

    సోషల్ మీడియా వ్యసనం నుండి బయటపడాలనే ఇంద్రాణి గారి గట్టి సంకల్పం, సాధించాలనే పట్టుదల, సాధించిన తీరు నిజంగా మెచ్చుకోదగినవి.

  4. పుస్తక పరిచయాలు గురించి గుండె బోయిన శ్రీనివాస్ అభిప్రాయం:

    06/01/2020 10:50 pm

    బాగుంది సా‌ర్

  5. పుస్తక పరిచయాలు గురించి Dr. Veldandi Sridhar అభిప్రాయం:

    06/01/2020 10:46 pm

    ఒక గొప్ప పుస్తకానికి అంతే గొప్ప పరిచయం బావుంది. ఉటంకించిన కవితలను బట్టే తెలుస్తుంది ఇది సాధారణ పాఠకులకే కాదు కవులకు కూడా పాఠ్య గ్రంథమని ఇలాంటి గొప్ప పుస్తకాన్ని అందించిన ముకుంద రామారావుగారికి, పత్రిక సంపాదకులకు అభినందనలు…

  6. గడినుడి – 44 గురించి నీలిమ గజ్జెల అభిప్రాయం:

    06/01/2020 2:30 pm

    17 అడ్డం ఐదక్షరాలుండాలేమో… ఆధారాలలో రెండే సూచించారు.

    [అవును. నిజమే. దోషానికి మన్నించండి. సరిచేసినాము. — సం. ]

  7. పుస్తక పరిచయాలు గురించి వంజవాక సతీష్ రెడ్డి అభిప్రాయం:

    06/01/2020 1:31 pm

    అద్భుతమైన పరిశీలన,పరిశోధన వుంటే తప్ప ఇటువంటి పుస్తకాలు వెలువరించడం సాధ్యం కాదు. విభిన్నమైన అంశాలపై ముకుంద రామారావు గారు రచనలు చేస్తూ ఉన్నతమైన చేర్పులను తెలుగు సాహిత్యానికి సమకూరుస్తున్నందుకు అభినందించకుండా ఎలా వుండగలము. వయస్సులో నాకన్నా పెద్దవారు కావున క్షమాపణలు తో…

  8. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    06/01/2020 12:58 pm

    ఈర్ష్యాసూయల బురదగా, గోముఖ వ్యాఘ్రాల బజారుగా, మనో వికారాలకు యవనికగా ఉన్న మాయా మయసభ వ్యామోహం నించి ( సోషల్‌ మీడియా కీకారణ్యంలో నించి, ప్రసార మాధ్యమాల వెల్లువనించి ) తప్పించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేసి…

    1) మొబైల్ ఫోనులో సందేశాలు చదవడం అనే దురలవాటును బలవంతంగా తెంచివేసి
    2) సోషల్ మీడియాతో అనుబంధాన్ని తాత్కాలికంగా ఉత్తరించి
    3) అనవసర సమాచార మార్గాలూ శాశ్వతంగా మూసివేసి

    ఆధ్యాత్మిక చింతనకి, ప్రాచీన వాఙ్మయం గ్రంథ పఠనానికి, సాంకేతిక విద్యల సాధనకు… ఏకాగ్రత కుదిరింది, శాంతి కలిగింది అన్న కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి గారికి హార్ధిక అభినందనలు.

    అయినా…. దైనందిన జీవితంలో కొంత సమయం వీటికీ కేటాయించగలరు… కొన్ని పత్రికలు చదవటం ( The New York Times, The Washington Post, The Wall Street Journal, The Guardian, the Times of India, The Hindu Newspaper )… కొంత తెలుగు సాహిత్యయానం చెయ్యడం ( కొడవటిగంటి కుటుంబరావు, చాసో, రావిశాస్త్రి, విలక్షణ కధకుడు త్రిపుర; శ్రీశ్రీ, తిలక్… తెలుగు కవిత్వాన్ని శాసించిన దిగంబర ఉద్యమ కవుల్లో ఒకరైన మహాస్వప్న …)

  9. పుస్తక పరిచయాలు గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    06/01/2020 12:33 pm

    వివిధమైన తీగల్లో ప్రవహించే విద్యుత్తు ఒక్కటే..ముకుందరామారావు గారు ఆ విద్యుత్తుని అదే నేలలో “అర్త్” చేశారు.

  10. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    06/01/2020 7:55 am

    విజయ్ గారు: “అంజలిదే మానవోత్తమా పాట(4) చిత్తరంజన్ గారువపాడినది వేసారు. మోహన్‌రాజు గారు కూడా పాడారు.”

    మీ నాన్నగారు పాడిన పాట రికార్డింగు కూడా నా దగ్గరున్నది కానీ, పై వ్యాసం/నివాళి రాసి పంపిన సమయంలో అది నాకందుబాటులో లేదు. అందువల్ల, పైన చెప్పినట్లు టి.వి.రావుగారి దగ్గర చిత్తరంజన్ వెర్షన్ తీసుకుని వాడుకున్నాను.

    “ఎన్నిసారులు అన్నదొ… మోహన్‌రాజు గారు పాడినది”.

    అవును! సాధారణంగా నేను MP3 ఫైలు పేరులోనే పాటయొక్క అన్ని వివరాలు రాసే ప్రయత్నం చేస్తాను. తరువాత ఈమాట సంపాదకులు ఓపిగ్గా దాని నుండి వివరాలు మరల వ్యాసంలో విడిగా తీసి ఇస్తారు. ఒక్కొక్కసారి నేను హడావిడిలో పూర్తి సమాచారం ఇవ్వని సందర్భాలున్నాయి. ఇక్కడ అలాంటి తప్పు నా వైపునుండి జరిగింది.