పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి TELugu Society of America అభిప్రాయం:

    11/04/2025 2:26 pm

    తెల్సా (TELugu Society of America) 2022 లో జరిపిన కథల పోటీలో రెండవ బహుమతి పొందిన
    గేణమ్మ కథ ఆన్‌లైన్‌లో చదవండి

  2. పుష్పవిలాపం – రాగాలతో సల్లాపం గురించి పెవు పుట్టా అభిప్రాయం:

    11/04/2025 7:46 am

    ఉత్పలమాల
    గాలిని గౌరవింతుము సుగంధము పూసి సమాశ్రయించు భృం
    గాలకు విందు చేసెదము కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నే
    త్రాలకు హాయి గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థబుద్ధితో
    తాళుము త్రుంచబోవకుము తల్లికి బిడ్డకు వేరుచేతువే

  3. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి పద్మజ అభిప్రాయం:

    11/04/2025 12:32 am

    సమీక్ష బాగుంది. కథలో ఉండవలసిన మూడు ముఖ్యమైన భాగాల గురించి బాగా రాశారు. ఈ సమీక్ష చదివాక ‘గేణమ్మ’ కథ చదవాలని అనిపించింది.

  4. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి సురేష్ అభిప్రాయం:

    11/03/2025 12:26 pm

    సద్విమర్శ మంచిదే. ఊరకే పొగడితే నష్టమే. అభివృద్ధి ఆగిపోతుంది. ఈ సమీక్షలో చెప్పిన వాటిని రాబోయే కథలలో సరిచేసుకుంటాను

  5. అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 3 గురించి Seshagiri Nimmagadda అభిప్రాయం:

    11/03/2025 7:36 am

    థాంక్యూ, రమేశ్ గారు.🙏

  6. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి Desaraju అభిప్రాయం:

    11/03/2025 3:49 am

    మంచి కథల మీద మంచి సమీక్ష. కథల లోతుకు వెళ్లి, సారాన్ని వెలికి తీసి ముని సురేష్ పిళ్లే అంతరంగాన్ని రవి సమర్థవంతంగా ఆవిష్కరించారు.

  7. కథల గారడీ తెలిసిన ముని సురేష్ పిళ్లె గురించి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి అభిప్రాయం:

    11/02/2025 10:32 pm

    కథలో ఎత్తుగడ అంటే కథ ప్రారంభం. ఇది కథకు ఒక ‘సింహద్వారం’ లాంటిది, కథకు ఆకర్షణను జోడించి, పాఠకుడిని ఆకట్టుకునేలా చేసే ప్రారంభ వాక్యాలు లేదా పేరాగ్రాఫ్‌లు. మంచి ఎత్తుగడ కథకు అందాన్నిస్తుంది మరియు పాఠకుడికి కథ పట్ల చదవాలనే ఆసక్తిని రేకెత్తిస్తుంది. అది విషయ సమాచారాన్ని అందించే వ్యాసంగా ఉండరాదని నా అభిప్రాయం. ముగింపును పాఠకుణ్ణి ఆలోచించే విధంగా ఉండటం మంచి సంప్రదాయం. ఈ ముచ్చట్లన్నీ మీ సమీక్షలో చెప్పారు. బాగుంది. చివరలో లోపాల విషయంలో మోతాదు ఎక్కువగా ఉన్నట్లనిపించింది. వారికి ఉన్న మంచి పేరుపై అపార్థాలు వచ్చే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం మాత్రమే.

  8. కేతన ఆంధ్రభాషాభూషణము: ఒక పర్యాలోకనం – 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    11/02/2025 12:10 pm

    ఆసక్తికరమైన వ్యాసం.

    ఈ క్రింది పేరా కొంచెం అయోమయాన్ని కలిగిస్తున్నది.

    “కానీ అరుదుగా హనుమంతుడు. గుణవాన్ లో గుణ+వాన్ అని మతిమాన్ లో మతి+మాన్. వాన్, మాన్లను ప్రత్యయాలుగా గుర్తించి అవి వంతుడు, మంతుడుగా తెలుగులోకి మారుతాయని పై ఉదాహరణలు చెబుతున్నా, హనుమంతుడులో ‘హనుమ’లోని ‘మ’కారం పేరుకి చెందిందే తప్ప ప్రత్యయానికి (ఉపసర్గకు) చెందింది కాదని కేతన చెప్పిన ‘అరుదుగ’ అనే దాని అర్థం. హనుమా! అని అంటాంకానీ ‘హను’ అనం కదా! కానీ ‘మతి’ అంటాం కానీ ‘మతిమ’ అనం కదా? ఈ భేదాన్ని కేతన చక్కగా గుర్తించి వివరించారు. అందువల్ల సంస్కృతంలోని ద్వితీయా విభక్తి రూపంఅయిన హనుమాన్ నుండి తెలుగులో హనుమంతుడనే తత్సమం ఏర్పడిందని పండితులు చెప్తారు.”

    హనుమాన్ – హను శబ్దానికి మతుప్ ప్రత్యయం జోడించడం చేత ఏర్పడింది కదా. అలాంటప్పుడు ‘మానునకును మంతుఁడును…’ అనే సూత్రం హనుమంతుడికి కూడా వర్తిస్తుంది కదా. అది “అరుదు”/అపవాదం ఎందుకు అవుతుంది? హనుమాన్ కి ద్వితీయావిభక్తి ఏకవచనరూపం ‘హనుమంతం’ నుంచి తత్సమాన్ని సాధించాల్సిన అవసరం ఉండదు కదా?

  9. నవంబర్ 2025 గురించి Akkiraju Bhattiprolu అభిప్రాయం:

    11/02/2025 8:40 am

    “… మనకు ఆ ‘సామూహిక సంస్కారం’ ఇంకా అలవడలేదు” … అలా అన్నారా? ఎవరది 😀

  10. లోయ అంచుల్లో… గురించి Shaheen అభిప్రాయం:

    11/02/2025 8:31 am

    చాలా మంది రాతల్లో స్త్రీ కి స్వేచ్ఛ ఇస్తున్నట్టుగా రాస్తారు… సామాజిక మాధ్యమాల్లో కూడా ఎన్నో విషయాలు చెప్తారు తీరా వ్యక్తిగతంగా మాత్రం పురుషాధిక్యత చూపిస్తారు

    అలాంటి ఒక రచన,రచయిత అంతరంగం ఇలా నిలదీస్తే వాళ్ళు ఆచరణ మొదలెడతారు

    చక్కని భావ వ్యక్తీకరణ 👏👏👏👏