One should not forget that English has become “sine qua non” long time back. May be, since the end of the WWII.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత దేశాలు అభివృద్ధి చెందడానికి ఆంగ్ల భాష అనివార్య ఆవశ్యకత (sine qua non) అయ్యిందా? నేను కాదనే వాదిస్తాను. అందుకు ఉదాహరణగా, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలలో మెజారిటీ ప్రజలకు ఆంగ్లభాషలో తగినంత ప్రవేశం లేకపోయినా, ఆ దేశాలు సాధించిన ఆర్థికపరమైన అద్భుతాలను చూడమంటాను! టయోటా (Toyota) సామ్‌సంగ్ (Samsung) వంటి కంపెనీలు తమ ఉత్పత్తులను విదేశాలకు అమ్మడానికి కేవలం తమ సేల్స్ టీమ్‌లకు, దౌత్యవేత్తలకు మాత్రమే ఆంగ్లం నేర్పించారు. మిగిలిన వారంత మాతృభాషలోనే తమ విద్యాభాసం చేసి ఈ కంపెనీలలో కీలకమైన పదవులను చేపట్టి వాటిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్ళగలిగారు. ఆయా దేశాల్లో యంత్రాలకు కావల్సిన డిజైనులు, గైడ్లు అన్నీ జపనీస్, కొరియన్ వంటి మాతృభాషలలోనే ఉంటాయి. కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకే కాకుండా, ఎలక్ట్రానిక్స్ పరికరాలు డిజైన్ చేసి, ఉత్పత్తి చేసే ఇంజనీర్లకు, ఇతర ఉన్నత ఉద్యోగులకు కూడా అత్యంత ఉన్నత స్థాయి ప్రమాణాలను పరికరాలను సృష్టించడానికి, ప్రపంచ మార్కెట్టులను శాసించడానికి తమ మాతృభాష సరిపోయింది. అయితే, ఇంకా ప్రపంచస్థాయిలో విజ్ఞానరంగంలో రీసర్చ్ చేసే కొంతమంది మాత్రం తరువాతి రోజుల్లో కష్టపడి ఆంగ్లం నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కృత్రిమమేధ సహాయంతో వారు ఆంగ్లంలో ప్రావీణ్యం లేకుండానే తాజా విజ్ఞాన పరిశోధన పత్రాలను వారి మాతృభాషలోనే చదువుకోగలరు.
ఏది ఏమైనా, తెలుగువారికి ఆంగ్లం నేర్చుకోవద్దని ఎవ్వరూ చెప్పడం లేదు. పరభాషాజ్ఞానాన్ని సంపాదించినా, తెలుగుభాషను పూర్తిగా విస్మరించరాదనేదే ఇక్కడి వాదం, నినాదం.
Love of language, our mother tongue, viz TELUGU should not blind us. One should not forget that English has become “sine qua non” long time back. May be, since the end of the WWII. My two cents.
V R Veluri
మీ వ్యాసానికి 🙏🌹🌷
తెలుగు కవుల భావనా పరిధి భాషా పటిమ
ఎప్పుడూ నివ్వెర పరుస్తాయి
తెనాలి రామకృష్ణ కవి అన్న గారు
తలవంక నొకవంక నెలవంక వీక్షించి
తెల్లనబ్జంబు గుక్కిళ్ళు మింగ అంటూ మొదలెట్టిన
సుదక్షిణా పరిణయం లోని అంశుమంతుని శివ సాక్షాత్కారం
వేల్పు గిడిబిళ్ళు మొరయ క్రొవ్విరులు విరియ
ఏ ఒక్క పాదమూ ఊపిరాడనీయని కవి బలిమికి
సాక్షాత్కారం 🙏
ఎమెస్కో వారితో నాకు జరిగిన అనుభవం చెబుతాను. “నా అమెరికా అనుభవాలు” పుస్తకం ప్రచురించినప్పుడు నాకు “రాయల్టీ” లాంటిది ఏదీ ఇవ్వలేదు కానీ, నేను బయలుదేరి తిరిగి అమెరికా వచ్చేస్తూన్న తరుణంలో 100 ప్రతులు నా హొటేలు గదికి పట్టుకొచ్చి అందజేసేరు! అదే నా “రాయల్టీ” అన్నారు. మిగిలిన 900 ప్రతులు వారు అమ్ముకున్నారనే అనుకుంటున్నాను. అప్పటికప్పుడు 100 ప్రతులని నేను ఎలా మోసుకు రాగలను? కనిపించినవారందరికి హరేకృష్ణా వారు పంచిపెట్టినట్లు పంచిపెట్టేను – విమానాశ్రయంలో కూడా!
” కథ నేపథ్యంలో హిజాబ్ విషయంలో దేశంలో మతం పేరుతో మైనారిటీలపై హిందుత్వవాదులు చేస్తున్న అరాచకాలను చూపించారు. హిజాబ్ వేసుకోవాలా? వద్దా అనేది ముస్లింలకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, దానిపై ఇతర మతస్తులు అభ్యంతరపెట్టడం మైనారిటీల హక్కులను తిరస్కరించడమే అవుతుందని కథలో పేర్కొన్నారు.”
ఈ దేశమ్‌లో ఏ వాదమైనా హిందువులమీద పడి ఏడవకపోతే దానికి పరిపూర్ణత సిద్ధించదు. సన్మానాలు సత్కారాలు లభించవు.
ఇది మొత్తం ఈ ఏడాది అంతట్లో ఈమాట పత్రికలో నేను చదివిన అత్యుత్తమ వ్యాఖ్య. మొహమాటం లేకుండా అనేకానేక మేకులు వేసిన అరిగిపోయిన చెప్పు తీసి వాటిల్లో వొక వాడి మేకు మొహం మీద దిగబడేటట్టు కొట్టినట్టు చెప్పారు. బ్రేవో!
డిసెంబర్ 2025 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
12/03/2025 8:08 pm

డిసెంబర్ 2025 గురించి Venkateswara Rao Veluri అభిప్రాయం:
12/03/2025 5:29 pm
Dear Editors:
Love of language, our mother tongue, viz TELUGU should not blind us. One should not forget that English has become “sine qua non” long time back. May be, since the end of the WWII. My two cents.
V R Veluri
పెరట్లో ఆవు గురించి సుబ్రహ్మణ్యం కల్లూరి అభిప్రాయం:
12/02/2025 9:02 pm
Ingenious
ఆంధ్ర సాహిత్య దిగ్దర్శనం గురించి Sireesha అభిప్రాయం:
12/02/2025 12:29 am
మీ వ్యాసానికి 🙏🌹🌷
తెలుగు కవుల భావనా పరిధి భాషా పటిమ
ఎప్పుడూ నివ్వెర పరుస్తాయి
తెనాలి రామకృష్ణ కవి అన్న గారు
తలవంక నొకవంక నెలవంక వీక్షించి
తెల్లనబ్జంబు గుక్కిళ్ళు మింగ అంటూ మొదలెట్టిన
సుదక్షిణా పరిణయం లోని అంశుమంతుని శివ సాక్షాత్కారం
వేల్పు గిడిబిళ్ళు మొరయ క్రొవ్విరులు విరియ
ఏ ఒక్క పాదమూ ఊపిరాడనీయని కవి బలిమికి
సాక్షాత్కారం 🙏
అన్నపూర్ణ సర్క్యూట్ ట్రెక్ – 5 గురించి Ramesh అభిప్రాయం:
12/01/2025 9:08 pm
అద్భుతం,అద్భుతం, చాలా బాగుంది మీ యాత్రానుభవం. దేవుడు మీకు చక్కని ఆయు:రారోగ్యాలు ఇవ్వుగాక.
కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు గురించి Mr. Rao Vemuri అభిప్రాయం:
12/01/2025 2:52 pm
ఇంత విపులంగా రాస్తూన్న ఉద్గ్రంధానికి “చిప్పు కథ” అని పేరు నప్పలేదు.
పుస్తక పరిచయం: మధుమేహం, సమగ్ర విశ్లేషణ గురించి Mr. Rao Vemuri అభిప్రాయం:
12/01/2025 2:40 pm
ఎమెస్కో వారితో నాకు జరిగిన అనుభవం చెబుతాను. “నా అమెరికా అనుభవాలు” పుస్తకం ప్రచురించినప్పుడు నాకు “రాయల్టీ” లాంటిది ఏదీ ఇవ్వలేదు కానీ, నేను బయలుదేరి తిరిగి అమెరికా వచ్చేస్తూన్న తరుణంలో 100 ప్రతులు నా హొటేలు గదికి పట్టుకొచ్చి అందజేసేరు! అదే నా “రాయల్టీ” అన్నారు. మిగిలిన 900 ప్రతులు వారు అమ్ముకున్నారనే అనుకుంటున్నాను. అప్పటికప్పుడు 100 ప్రతులని నేను ఎలా మోసుకు రాగలను? కనిపించినవారందరికి హరేకృష్ణా వారు పంచిపెట్టినట్లు పంచిపెట్టేను – విమానాశ్రయంలో కూడా!
కృష్ణశాస్త్రి వచన (సం)గీతాలు గురించి తః తః అభిప్రాయం:
12/01/2025 2:36 pm
కృష్ణశాస్త్రి గారి మరొక పార్శ్వం వారి సినిమాల మాటలు –
బి ఎన్ మల్లీశ్వరి లో పాటల్లో కనపడతాడు . మాటల్లో పాత్రల్లో దాక్కుంటాడు.
తః తః
స్త్రీవాద కథల సంపుటి: విభజిత గురించి kavya అభిప్రాయం:
11/24/2025 7:00 pm
” కథ నేపథ్యంలో హిజాబ్ విషయంలో దేశంలో మతం పేరుతో మైనారిటీలపై హిందుత్వవాదులు చేస్తున్న అరాచకాలను చూపించారు. హిజాబ్ వేసుకోవాలా? వద్దా అనేది ముస్లింలకు సంబంధించిన వ్యక్తిగత విషయమని, దానిపై ఇతర మతస్తులు అభ్యంతరపెట్టడం మైనారిటీల హక్కులను తిరస్కరించడమే అవుతుందని కథలో పేర్కొన్నారు.”
ఈ దేశమ్‌లో ఏ వాదమైనా హిందువులమీద పడి ఏడవకపోతే దానికి పరిపూర్ణత సిద్ధించదు. సన్మానాలు సత్కారాలు లభించవు.
సెప్టెంబర్ 2025 బైరాగి ప్రత్యేక సంచిక గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
11/23/2025 12:14 pm