పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. విషాద నగరం గురించి అనిసెట్టి శ్రీధర్ అభిప్రాయం:

    09/18/2021 10:43 am

    నా కథ “విషాద నగరం” పై తమ అభిప్రాయాలు తెలియజేసిన వారికి, లైక్ చేసినవారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  2. అస్తిత్వపు ఆనవాళ్ళు గురించి S A RAHMAN అభిప్రాయం:

    09/18/2021 6:27 am

    సహజ సరళమైన భావంతో చక్కని కథ అందిచిన రచయిత్రి గారికి థన్యవాదాలు.
    es.e.rahamaan.

  3. బండిసున్నా గురించి S A RAHMAN అభిప్రాయం:

    09/18/2021 6:14 am

    సున్నితమైన భావంతో కవిత చాల చక్కగా ఉంది.

  4. విషాద నగరం గురించి A.Rajasekhar అభిప్రాయం:

    09/18/2021 6:12 am

    Population explosion, land scarcity & political leaders selfish goals are put in just a single sentence,i.e., power of writer’s pen!!

  5. విషాద నగరం గురించి Deepthi Y అభిప్రాయం:

    09/17/2021 8:53 pm

    This is heart wrenching. The writer nailed the bitter truth with a short narration.

  6. D/o విజ్జి గురించి Sudha అభిప్రాయం:

    09/17/2021 11:29 am

    Thank you Siddhique garu for your valueble inputs

  7. ఊహల ఊట 4 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    09/16/2021 8:41 am

    ఊహల ఊట 4
    ఆవకాయ ఊట, మాగాయి ఊట, నిమ్మకాయ ఊట విన్నాం. చూసాం. వీటిని ఎండలో పెట్టేటప్పుడు బాల్య చాపల్యం వల్ల రెండు చుక్కలు నాలుక మీద వేసుకుంటే
    అబ్బా! కళ్లు వాటంతటవే మూతబడి, రుచి అందింది
    మరి మీ ఊహల ఊట కూడా అలాగే రుచి అందింది.
    గోడ గుఱ్ఱం ఎన్ని కబుర్లు చెబుతోందో
    నానా నవ్వులు పసితనపు భాష్యం బాగుంది
    ఏ భాగానికి ఆ భాగమే కొత్త కొత్తగా ఉంది.
    అర సున్నాలు ఉపయోగిస్తూ మాట్లాడే భాషలోనే రచనలు చేయడంలో తులసిగారే తులసిగారు
    మీ ఊహల ఊట ఇలా సాగుతూనే ఉండాలని, ఆ ఊటని ఇంకా ఇంకా జుర్రుతూనే ఉండాలని ఉంది.
    అందరిని బాల్యంలోకి తీసుకువెళుతున్న తులసిగారికి
    ధన్యవాదములు.

  8. ఊహల ఊట 4 గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ అభిప్రాయం:

    09/15/2021 5:04 am

    అంబరాన్నంతా సంబరంగా తన కనుపాపలో బందీ చేసిన చిన్నారి తులసి ఏకంగా హరివిల్లునే గూడుగుర్రంలా మార్చేసి స్వారీ చేస్తూ జారుడు బండ విన్యాసాలను చేసేద్దామనుకొంది. మరి తనకి వినువీధి కూడా హద్దు కానే కాదు కదా! అలా అలిసి సొలిసి అపుడే ఇంటికి తిరిగి వచ్చిన నాన్న ఒడిలో వాలిపోయి, విశ్రాంతి తీసుకోకుండా, తన పొది నిండా ఉన్న అమ్ముల పన్నాలను తీసి ఎక్కు పెడుతూనే ఉంది… నాన్నకు తగ్గ చిన్నారి పిల్ల! బాగుంది బాగుంది ఈ తులసీ వన విహారం!

  9. ఊహల ఊట 3 గురించి ఉప్పలూరి ఆత్రేయ శర్మ అభిప్రాయం:

    09/15/2021 4:26 am

    దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ళక్రితం ఆదివారం ఆదివారం నూనెతో మర్దనచేయించుకొని సువాసనల సున్నిపిండి, కుంకుడు కాయల రసంతో అమ్మ-బామ్మ-తాతమ్మ అనే ముగురమ్మల యొక్క గారాలను ముద్దులను అందుకొంటూ తలంటుని పోయించుకొన్న వన్నె తగ్గని, ఏమాత్రం వసి వాడని మధుర స్మృతులను వీడలేని తులసి గారు ఆ పసిడి యుగానికి ప్రతినిధి, వారసురాలు.

    “అమ్మ కడుపు చల్లగా” అనే చిన్నారి ఆడపిల్లలదైన తలంటు పాట దీవనను తన అలుగుల బూంగమూతి మాటల గారడీతో తన తమ్ముడికి కూడా అందజేయించి, వాడితో సమానంగా తాను కూడ క్రాప్ ఎందుకు చేయించుకోకూడదు, పెద్దయింతర్వాత ఉద్యోగం ఎందుకు చేయకూడదు అని నిర్మొహమాటంగా గుచ్చి గుచ్చి అడిగేసిన గడుగ్గాయి తులసి. మర్రి ఊడళ్ళాంటి మూడు జడలున్న తులసికే కుదిరింది అలా మారాం చెయడం.

    ఆదివారాలని రానివ్వనంది, సూర్యుణ్ణి ఆపేస్తానంది. ఇదంతా తన వీర వత్తు జడలోని వెంట్రుకలన్ని ఊహలను మదిలో నింపుకున్న తులసికే చెల్లింది… ఈ చాగంటి గడుసు పిల్ల ఊహల జల్లులూ, తెలుగు ఒంపు సొంపులూ… వహ్వా!

  10. విషాద నగరం గురించి గుంటుపల్లి రామేశ్వరం అభిప్రాయం:

    09/15/2021 1:09 am

    కలచివేసే కథనం. ముగింపు ఓహెన్రీ ని గుర్తుచేస్తుంది.