పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఇక్కడ ఏం పని? గురించి స్వాతి అభిప్రాయం:

    12/05/2023 12:44 pm

    ఒక్కటే ప్రశ్న ఆమె ఉనికిని ప్రశ్నించింది అక్కడా… ఇక్కడా కూడా. మంచి కథ.

  2. రాముడికి సీత ఏమవుతుంది? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    12/05/2023 11:57 am

    భట్టికావ్యం అన్న పేరు మీద ప్రసిద్ధమైన భట్టి రాసిన రావణ వధ, భవభూతి ఉత్తర రామచరిత్ర, దిజ్నౌగుడి కందమాల మొదలైనవన్నీ రామకథలే.

    కందమాల కాదు – కుందమాల (మల్లెపూల దండ)

    అచ్చు తప్పుని సవరించండి.

    –సాయి బ్రహ్మానందం గొర్తి
    [ సరిచేసినాము. దోషాన్ని చూపినందుకు ధన్యవాదాలు. – సం. ]

  3. మనమెరుగని మధ్య అమెరికా – 8 గురించి Ramesh అభిప్రాయం:

    12/05/2023 11:34 am

    “ముఖ్యంగా ఈ పదునెనిమిది రోజులూ నన్ను మరికాస్తంత మెరుగైన మనిషిగా మలచలేదూ?!”

    It is a beautiful statement. Yes visiting new places, interacting with new people make human more tolerant, humane, broadminded. wish you a many more happy journeys to you.

  4. పాత తెలుగు సాహిత్యం ఎందుకు చదవాలి? గురించి Prasad Rekapalli అభిప్రాయం:

    12/05/2023 4:21 am

    One of the principal reasons for most people keeping off old Telugu literature — prose as well as poetry — is the lack of good Telugu-Telugu, Telugu-English dictionaries, and easily intelligible books on Telugu grammar and ‘Chandassu’. In contrast, one can get, without any difficulty, a vast range of dictionaries, thesauruses, books on grammar, idiom, and usage in respect of English.

    Do we have exhaustive dictionaries comparable to the legendary Oxford English Dictionary in Telugu? ‘Suryaraayaandhra Nighantuvu’, the only one voluminous, if not exhaustive, Telugu Dictionary I have ever come across has been long out of print, and there seems to be no plan to reprint it. (Someone told me once that it is not all that great a dictionary. Perhaps it is not; I do not know. But there seems to have been no attempt to create a better Telugu-Telugu dictionary, either.) Even the other well-known shorter dictionaries need a thorough revision to cater to those of us whose knowledge of Telugu is deplorably shallow.

    Similar is the position about books on Telugu grammar and ‘Chandassu’.

    Once that hurdle is sorted out, more people would show interest in reading old Telugu literature.

    A lack of readable and objective commentaries, not coloured by the prejudices and biases of various sorts on the part of the commentators, on the old works (poetry, in particular) is yet another problem.

    Of course, there are other problems like the awful standards relating to teaching any language in schools and colleges, the many distractions that people have today in the form of mobile phones, television and movies, etc. These too need ample attention for concerted remedial action.

    It is high time we woke up to preserve our language and literature: the death of a language and its literature kills an entire gamut of traditions and the civilization associated with the traditions.

    — Prasad Rekapalli.

    P.S.: I apologize for writing this in English. I just do not have the necessary tools for typing in Telugu on my laptop; I have not had any plan to write here in the first place and so I am unprepared!

  5. ఇక్కడ ఏం పని? గురించి Raveendra అభిప్రాయం:

    12/05/2023 1:54 am

    చాలా బాగుంది. సమాజంలో జరిగేది ఇదే. నే చూసిన ఓ రెండు కుటుంబాలలో ఇలానే జరిగింది. అన్ని విషయాలు పరిజ్ఞానం వున్న గంగరాజు అనసూయ పేరు మీద ఆ ఇల్లు రాకపోవటం… మరచి పోవటమా లేక కావాలనా?

  6. కొత్త చిగురు గురించి వేణు మరీదు అభిప్రాయం:

    12/05/2023 1:07 am

    మూలము దెబ్బతినకుండా ఎంత బాగా అనువాదం చేశారు అమ్మా. So much appreciated.

  7. గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి శామల అభిప్రాయం:

    12/04/2023 10:45 pm

    ఈరోజు ఉదయం నలుగురు సహృదయులు—ఒక చిత్రకారుడు, ఒక కవి, ఒక వ్యాఖ్యాత, ఒక పరోపకారి మా ఇంటికి బాపుని తీసుకువచ్చి ఆయన్ని పరిచయం చేశారు.

    వారు వెళ్లిపోయి నాలుగు గంటలయినా నాకళ్ళు ఇంకా చెమరుస్తూనే ఉన్నాయి.

  8. కొత్త చిగురు గురించి NS Murty అభిప్రాయం:

    12/04/2023 12:43 am

    సుజాతగారూ,
    కథ, కథనం ఎంత బాగున్నాయో, మీ అనువాదం అంత సరళంగా, సాఫీగా సాగిపోయింది. ఎందుకో మా నాన్నగారు గుర్తొచ్చారు. బంగారం కొట్లో గుమస్తాగా ఉంటూ ఆయన కూడా ఇలాటి లెక్కలే కడుతుండేవారు.

    హృదయపూర్వక అభినందనలు.

  9. రాముడికి సీత ఏమవుతుంది? గురించి Sivakumar Tadikonda అభిప్రాయం:

    12/03/2023 8:25 pm

    ఆసక్తికరంగా ఉన్నది. ఈ పుస్తకం శీర్షిక ఎప్పుడో విన్నా గానీ చదవడానికి అవకాశం దొరకడం మాత్రం ఇదే మొదటిసారి. ప్రచురిస్తున్నందుకు ధన్యవాదాలు!

  10. ఈమాట రామాయణం గురించి Manjula అభిప్రాయం:

    12/03/2023 3:33 pm

    నేను సాధారణంగా దేనితోనూ 100% ఏకీభవించను. ఇది ఒక exception! Kudos to you!!!