పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పొంతన గురించి దాసరి అమరేంద్ర అభిప్రాయం:

    04/04/2024 4:13 am

    “అవును అదే”, అన్నాను అదేదో హక్కయినట్టు.

    ఎక్కడా పదును తగ్గకుండా చకచకా నడిచింది. బావుంది కథ.

  2. గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి NS Murty అభిప్రాయం:

    04/04/2024 12:21 am

    శ్రీనివాస్‌గారూ,

    “ఆర్యభటీయం, గోళాధ్యాయంలో, 9-10 శ్లోకాల్లో… పడవలో ముందుకి ప్రయాణిస్తున్న వ్యక్తికి ఒడ్డున ఉన్న వస్తువులు, అవి నిలకడగా ఉన్నప్పటికీ ఎలాగైతే వెనక్కి వెళుతున్నట్టు కనిపిస్తాయో, నక్షత్రాలూ. గ్రహాలూ కూడా ‘లంక’కి (ఆ రోజుల్లో ఆ ప్రదేశాన్ని భూమధ్యరేఖ-సున్నా డిగ్రీల రేఖాంశమూ ఖండించుకునే బిందువు వద్ద ఉన్నట్టుగా భావించేవారు) పడమరగా నడుస్తున్నట్టు కనిపిస్తాయి” అని అన్నాడు. భూమి నిశ్చలంగా ఉంటుందని అప్పటి వరకూ ఉన్న విశ్వాసాలకి వ్యతిరేకంగా, భూమి తన ఇరుసుమీద తిరుగుతుందని చెప్పడం వరకు విప్లవాత్మకమే. అందుకనే అతను వరాహమిహిరుడు, భాస్కరాచార్య-I వంటి వారి విమర్శలకు గురయ్యాడు. కేరళలోని సంగమగ్రామానికి చెందిన మాధవ (1340- 1425) గురుకులానికి చెందిన వారు ఆర్యభట-I అనుయాయులే గనుక అతని మౌలిక భావనని, పరిశీలన, పరిశోధనల ద్వారా ముందుకి తీసుకువెళ్ళి ఉంటారు అని అనుకోవచ్చు. ఆర్యభట-I సూర్య-కేంద్రక వ్యవస్థని ప్రతిపాదించేడనడం వాస్తవం కాకపోవచ్చు. నాలుగు శతాబ్దాలు పైగా కొనసాగిన ఈ గురుపరంపరలో, నీలకంఠసోమయాజి (14 జూన్ 1444 – 1544) కూడా, సూర్య, చంద్రులు భూమి చుట్టూ తిరుగుతుంటే, తక్కిన గ్రహాలు మాత్రం సూర్యుని చుట్టూ తిరుగుతాయని భూ-కేంద్రక వ్యవస్థకీ, సూర్య-కేంద్రక వ్యవస్థకీ మధ్యేమార్గంలో ఉన్న ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అది పూర్తిగా సూర్య-కేంద్రక వ్యవస్థ కాదు. టైకో బ్రాహి కూడా సరిగ్గా ఇదే ప్రతిపాదన చేశాడు. ఆయనకి భూ-కేంద్రక వ్యవస్థపై మక్కువకి మతపరమైన విశ్వాసం ఒక కారణం అయితే, అతని దగ్గర అప్పటి ప్రమాణాలకి సున్నితమైన పరికరాలున్నప్పటికీ stellar parallaxని కనుక్కోలేకపోవడం రెండవ కారణం.

    అభివాదములతో,
    NS మూర్తి.

  3. త్యాగయ్యగారి నాదసుధారసం గురించి Anon అభిప్రాయం:

    04/03/2024 11:28 am

    అద్భుతంగా ఉంది.

  4. యురీకా గురించి Sreenivas Bandaa అభిప్రాయం:

    04/03/2024 5:34 am

    ఏది దేనికి ప్రతీక? సూచకం? కథలో సూత్రం ఏమిటి? పేర్లు ఆధారంగా కథలో మీరు చెప్పదలచుకొన్నదాన్ని అంచనా వేయాలా? మూడుసార్లు చదివిన తర్వాత కూడా ఈ ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. లేక, ఈ ప్రశ్నలకు తావే లేదా?

    వెరసి, రససిద్ధి జరగలేదని చెప్పడానికి సాహసిస్తున్నాను శ్రీసుధగారూ!

  5. త్యాగయ్యగారి నాదసుధారసం గురించి Prasuna Balantrapu అభిప్రాయం:

    04/02/2024 7:01 am

    ఈ వ్యాసం తిరిగి ప్రచురించినందుకు మీకు ధన్యవాదాలు. రాళ్ళపల్లివారు తమ అభిప్రాయాలు ఏ మాత్రము అనుమానం, సందిగ్ధత లేకుండా త్యాగరాజ సంగీతం, సాహిత్యం  – రెండిటిని సమీక్షించారు. ప్రస్తుత కాలంలో ఇది మళ్ళీ చదవవలసిన వ్యాసం.  

  6. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి Satyanarayana yeedibilli అభిప్రాయం:

    04/02/2024 2:55 am

    అద్భుతమైన, అమోఘమైన శ్యామ్‌గారి రచన. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఆయన అనుభవించి మెదడు పొరల్లో జ్ఞాపకాలను మనకందించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన అపారమైన జ్ఞాపకశక్తికి అభినందనలు. ఆయన మరిన్ని రచనలు చేయాలని అభ్యర్థిస్తున్నాము.

    డా. సత్యనారాయణ యీదిబిల్లి, హైదరాబాద్.

  7. గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి Srinivas V అభిప్రాయం:

    04/02/2024 1:15 am

    చాలా నెమ్మదిగా చదివి జీర్ణించుకోవాల్సిన వ్యాసం. ధన్యవాదాలు.

    ఒక ప్రశ్న – “అతను టైకో బ్రాహి (Tycho Brahi) ప్రతిపాదించిన సూర్యకేంద్రక వ్యవస్థ (heliocentric system) ప్రతిపాదించినట్టు తెలుస్తోంది.” – సూర్యకేంద్రకసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆర్యభట అని విన్నాను. కానీ మీ వ్యాసంలో ఈ ప్రస్తావన చూసినప్పుడు అది మీకలకంఠసోమయాజి ప్రతిపాదనా అని అనుమానం కలిగింది.

  8. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి కరణం సంపత్ కుమార్ అభిప్రాయం:

    04/02/2024 12:54 am

    మెడికో శ్యామ్ రచనల లాగనే అతడి ఉపన్యాసం ఆద్యంతం ఆహ్లాదకరము. అతడి జ్ఞాపకశక్తి అమోఘం. నేనూ చిన్నప్పుడు డిటెక్టివ్ నవలలు చదివాను, కానీ శ్యామ్ లాగా గుర్తు పెట్టుకొనలేదు. ఇప్పుడు వాటిని విశ్లేషణ చేయడం నాకైతే వీలు లేదు.

  9. యురీకా గురించి Ramanajeevi అభిప్రాయం:

    04/01/2024 9:15 pm

    ఓహ్. అద్భుతం!

  10. రెండు ప్రయాణాలు గురించి P Ganeswara Rao అభిప్రాయం:

    04/01/2024 11:46 am

    This writer is my childhood friend and classmate. His journey to excellence in the field of intricate design as well as mesmerizing poetry started from a very rural hill town in the eastern ghats. I personally knew his simplicity and righteousness in life despite having the best mind in the technological world. His writings always push one’s mind to think beyond their imagination and also make me jealous that how anyone can think the way the writer thinks. May be its God’s blessing. He known to me as Mani, and the name has real meaning too.