పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/02/2009 8:41 pm

    కొన్ని వాక్యాలు ఆలోచనల్ని గాలనం చేస్తాయి. జీవితాన్ని వెంటాడతాయి. ఒక వాక్యం కోసం ఓ జీవితకాలం ఎదురుచూస్తే తప్పేమిటీ అని భూషణ్ గారు ఒకసారి ప్రశ్నించారు. కవి ఎంతో కొంత కష్టపడి వ్రాస్తున్నప్పుడు చదువరి దానిని అర్ధం చేసుకోవటానికి శ్రమిస్తే తప్పేమిటి అని అలోక్ గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ వ్రాసిన ఉరితీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం అన్న వాక్యం నేను మొదటిసారిగా చదివి ఇరవైఏళ్లు అవుతున్నా ఇంకా అది తడితడిగానే తగుల్తూంటుంది.

    అఫ్సర్ గారు వ్రాసిన ఈ కవితలో ఒక జీవితం ఉంది. ఒక అనుభవం ఉంది. హృదయాన్ని కుదిపేసిన ఒక ఉప్పెన ఉంది. మరణం భౌతికమైనదే కాకపోవచ్చుగా.

    ఇంకా

    వెర్రిపాటలు పాడుకొంటూ చీకటిని దాటివేయగల తెంపరితనమూ
    చిరునవ్వులు మధ్యలో తెగిపోవటాలు ఇంకా అనుభవంలోకి రాని పసితనం ఉంది.
    చిన్న చీకట్లు పెద్దమరణాలు ఎలా అవుతాయో తెలీనితనం ఉంది.
    ఉలిక్కిపడి నిద్రలోంచి చీకట్లోకి తెగిపడ్డం ఈ కల్లోల జీవనం మనకిచ్చే “బహుమానం”.
    బహుసా తడికలిగినవారికే అది అనుభవమౌతుందేమో.

    బొల్లోజు బాబా

  2. రాగమాలిక గురించి ramabharadwaj అభిప్రాయం:

    07/02/2009 10:42 am

    బ్రహ్మానందంగారూ!! మీరు అన్నమయ్య దేసిసూళాది రాగమాలిక..తాళమాలిక లో ఉన్న దానిని గమనించిట్టులేదు. చాలా అపురూపమైన సూళాది అది..”వలెవలెనని వలచితినట” అన్నది..చూడండి.
    రమ.

  3. ఫాదర్స్ డే గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    07/02/2009 10:20 am

    నమస్కారం
    కదిలించింది. మానవసంబంధాలు సైతం వేగవంతమైన జీవిత పరుగుపందెంలో ఎన్ని పోకడలు పోతుందో కూడా గమనించే తీరిక, స్థైర్యం లేని సమయంలో, సమాజంలో, ఇది ఆలోచింపజేసింది.

    మీరు క్షమిస్తే, చిన్న మార్పుతో,
    “భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు, పిల్లలు
    ఆ భగవంతుని వరశాపం” అనిపిస్తుంది.
    ========
    విధేయుడు
    -Srinivas

  4. పట్టుకో పట్టుకో గురించి hrk అభిప్రాయం:

    07/02/2009 7:20 am

    గాలా బాగుంది కవిత, పోగొట్టుకున్న బాల్యంలో కొంచెం తెచ్చి ఇచ్చినట్టుగా, హాయిగా.
    -హెచ్చార్కె.

  5. పట్టుకో పట్టుకో గురించి Subbarao Nanduri అభిప్రాయం:

    07/02/2009 7:20 am

    కానీ నేను వాటిని పట్తుకొనేందుకు
    ప్రయత్నమే చెయ్యలేదు,
    అందకుండా ఆకాశానికి ఎగిరిపోతున్న ధరలనీ,
    ఆగకుండా పాతాళానికి జారిపోతున్న ఆశలనూ,
    నిరాశల ఊబిలో కూరుకుపోతున్న ఆశయాలనూ,
    అవసరాల అగ్నిలో ఆవిరయిపోతున్న విలువలనూ,
    పట్టుకోలేని నాకు,
    వీటిని పట్టుకొనే శక్తి ఎక్కడిది?

  6. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri అభిప్రాయం:

    07/02/2009 6:59 am

    అఫ్సర్ గారికి,
    అభినందనలు. మీ కవితలో పదప్రయోగం, భావగాఢత బాగుంది. కానీ తర్కం ఏదీ? మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వ్రాశారు. ఎవరితో? మీ నాన్నతోనా? పాఠకుడితోనా? మీలో మీరే మాట్లాడుకుటున్నారా? నేను ఆధునిక కవిత్వం చదవను. ఇప్పటి ట్రెండ్ ఇదేనేమో నాకు తెలియదు. విప్పి చెబితే వచనం. కప్పి చెపితే కవిత్వం ఇంతేనా తేడా?
    శ్రీశ్రీ, దేవులపల్లి, కుందుర్తి, తిలక్ , నండూరి, వీళ్ళందరి కవితలూ సూటిగా, తర్కబద్దంగానే ఉంటాయి కదా? తర్కం లేకుండా కేవలం పదాల పోహళింపుతో, భావగాఢతతో కవిత బతకదేమో? ఇప్పటి కవితలు పాఠకుల హృదయాల్లో నిలబడటం లేదేమో? ఇదంతా మీరూ మిగతా కవులూ ఆలోచించాల్సిన విషయం. నేను కవిని కాను కనుక నాకు అన్నీ సందేహాలేగానీ వాటిని పరిష్కరించగల సామర్ద్యం లేదు.
    మరోసారి అభినందనలతో,
    నండూరి వెంకట సుబ్బారావు.

  7. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Pasunoori Ravinder అభిప్రాయం:

    07/02/2009 5:34 am

    “చీకటి వంతెన
    దిగులు పొలాలు
    ఖాళీ ఆకాశాలు”
    వెనక్కి తిరిగి చూసుకునే గడియలే నిజంగా బతికిన క్షణాలు
    అక్షరాల్లో బ్రతుకును చూపించడం అందరి వల్ల కాదు.
    అందుకేనేమో కవిత్వానికి, కన్నీళ్ళకి దగ్గరి సంబంధం ఉందనిపిస్తది.
    ఓ మంచి కవితను చదివే అవకాశాన్ని కల్పించిన అఫ్సర్ గారికి అభినందనలు

  8. నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి రానారె అభిప్రాయం:

    07/02/2009 5:18 am

    ఈ శీర్షిక నిరంతరం నిరంతరాయంగా కొనసాగిస్తున్నందుకు ఈమాటవారికీ బృందావనరావుగారికీ కృతజ్ఞతలు.

    ‘నిగమశర్మ అక్క’ గుఱించి నాకు మొదటగా పరిచయం చేసినవారు పరుచూరి శ్రీనివాస్‌గారు – కూడలి కబుర్లలో. ఆ పాత్రౌచితిని గుఱించిన ఒక వ్యాసానికి లంకె ఇచ్చారు. అందులో పద్యాల్లేవు. అంతా వచనమే.

    మన్నించాలి, ఈ పద్య పరిచయంలో చిన్న టైపాటు దొర్లినట్టుంది. “నెలపొడుపు కోసం సముద్రంలో నేనూ మీ బావా ఎదురుచూస్తున్నామని చెప్పడం ఎంతో అందంగా వుంది.” అని వుంది. సముద్రునివలె అని వుండాలనుకుంటాను.

    అలాగే చక్షూరాజీవ యుగమ్ము వాఁచె అనే నుడిని రామకృష్ణుడు పద్యంలో పలికించడాన్ని కూడా ప్రస్తావించివుంటే సంతోషించేవాడిని.

    [టైపో సరిదిద్దాము. కృతజ్ఞతలు – సం.]

  9. ఫాదర్స్ డే గురించి రాఘవ అభిప్రాయం:

    07/02/2009 2:23 am

    కన్నీళ్లు తెప్పించారండీ. ముఖ్యంగా ఈ పంక్తులైతే మఱీనూ…

    భార్యలను, భర్తలను ఎంపిక చేసికోవచ్చు, కాని తల్లిదండ్రులు ఆ భగవంతుని వరశాపం.

  10. ఈ కానుకనివ్వలేను గురించి రవిచంద్ర అభిప్రాయం:

    07/01/2009 10:59 pm

    అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

    చివరికి హార్దికం మీద ఆర్థికమే ఎక్కువగా నెగ్గుతుంది.

    అక్కడక్కడా ఇలాంటి వాక్యాలు హృదయాన్ని తాకాయి. సమకాలీనమైన సంఘటనలను కథారూపంలో మలిచిన రచయితకు అభినందనలు.