పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16489

  1. ఈ కానుకనివ్వలేను గురించి Kumara Swamy అభిప్రాయం:

    07/03/2009 8:56 pm

    ఈ కథలో feelings బావున్నాయి. కాని సంఘటన ఏది? మనసును గాయపెట్టే అనుభవం ఉంటే సరిపోతుందా. కథకి ఫార్ములా / ట్విస్ట్ / సర్కిల్ – పరిపూర్ణం కావించబడిన సంఘటన ముఖ్యం. ఈ సంవత్సరం అరుణ గారు రాసిన నాలుగు కథలూ చదివాను. చాలామంది అనుభవజ్ఞులైన మూసకొట్టుడు కథకులకంటే ఆమె బాగా రాస్తున్నారు. ఈ ఒక్క లోపాన్ని అధిగమిచగలిగితే ఆమె నుంచి మరిన్నిమంచికథలను ఆశించవచ్చునేమో.
    Anyway best of luck to Aruna.

    కుమారస్వామి

  2. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి Subbarao Nanduri అభిప్రాయం:

    07/03/2009 6:46 am

    వాక్యం రసాత్మకం కావ్యం అని నాకు తెలుసు. నిజంగానే అలాంటి వాక్యాల కోసం జీవితకాలం ఎదురుచూడాల్సిరావడం, ఒక నూక గింజకోసం బుట్టెడు ఊకను తినాల్సిరావడం ఇబ్బంది కాదూ?
    కవి కష్టపడి కవిత్వం వ్రాయడం ఎందుకు? సరే కవులకూ , రచయితలకూ కూడా “ప్రసవ వేదన” ఉంటుందని ఒప్పుకుందాం. కానీ అంతవేదనా తన భావాలు పాఠకుడి హృదయానికి హత్తుకొనేలా చెప్పడానికే గానీ పాఠకుడి మేథస్సుకు ప్రహేళికలివ్వడానికి కాదు గదా? మనం కవిత్వం చదవాలంటే దానికి తగ్గ మానసిక నేపథ్యాన్ని సిద్ధం చేసుకొని ఉండాలా? ఇవన్నీ కవులకే ప్రయోజనం కలిగించే ప్రశ్నలు. వీటికి సహేతుకమైన సమాధానం వెతకగలితే కవిత్వం పూర్వవైభవము సంతరించుకుంటుంది. అలా కానప్పుడూ చివరకు నానీలే బదుకుతాయి. అసలు ఆ రకంగా చూస్తే సామెతలకన్నా మంచి కవితా వాక్యాలు దొరకవేమో.

    [ఈ అభిప్రాయంపై వచ్చిన సాటి పాఠకుల అభిప్రాయాలు చర్చావేదికలోకి మార్చాము – సం.]

  3. కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/03/2009 6:27 am

    ఈ వ్యాసంద్వారా కవిత్వాన్ని బహిరంగ, అంతరంగ కవిత్వాలు అని రెండు రకాలుగా విభజించవచ్చని తెలుసుకొన్నాను.
    కవిత్వంలోని టోన్ సన్నగా, బిగ్గరగా ఎలా ఉంటుందో చక్కటి ఉదాహరణనిచ్చారు.
    ధన్యవాదములు.
    బొల్లోజుబాబా

  4. కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి గురించి yasasvi అభిప్రాయం:

    07/03/2009 6:21 am

    కవిత్వంలో”తర్కం” వెతికే పాఠకుడున్నందుకు ఆశ్చర్యపడ్డాను. కవిత్వం గురించి తెలియదని ఒప్పుకున్నారు గనక కానీలెమ్మనుకున్నాను.
    యశస్వి.

  5. గోవిందా! గోవిందా! గురించి Sree అభిప్రాయం:

    07/03/2009 5:50 am

    “ఆ పెట్టెలో డబ్బు ఈ అబ్బాయికి ఇచ్చినా సద్వినియోగమై ఉండేది కదా!”

    స్వామివారి దర్శనం కోసం వెచ్చించే వేల రూపాయలు ఏ అనాథ ఆశ్రమానికో, ఓల్డేజ్ హోమ్‌లకో చందా ఇస్తామని – ప్రతి ఏడాది వాయిదాలు వేసే భక్త జనం నాకూ పరిచయమే..

    మీ కథ చాలా బాగుంది…

  6. పడమట సంధ్యారాగం గురించి Venkat అభిప్రాయం:

    07/03/2009 2:17 am

    ఏమి చెప్పాలనుకున్నారో అసలు అర్థం కాలేదు.

  7. ఈ కానుకనివ్వలేను గురించి Venkat అభిప్రాయం:

    07/03/2009 2:12 am

    కథ చాలా బాగుంది. ముఖ్యంగా శాండిల్య పాత్ర. సహాయం చేసిన తరువాత అతనిలో కలిగే సంఘర్షణ బాగా చెప్పారు.

  8. నాకు నచ్చిన పద్యం: నిగమశర్మ అక్క పలకరింపు గురించి రవి అభిప్రాయం:

    07/03/2009 12:47 am

    నిగమ శర్మ అక్క గారి గురించి (20 యేళ్ళకు ముందు) నా 8 వ తరగతి తెలుగు వాచకంలో చదువుకున్నాను.

    ఆమె రాకకు, ఉపదేశానికి నేపథ్యం చాలా చక్కగా చెప్పారు. అయితే చివరికి ఇలాంటి పాత్రను “అక్కఱకు రాని ముక్కెఱకునై” యేడ్చే దానిగా రామకృష్ణయ్య ఎందుకు తీర్చిదిద్దాడో, అలా చెప్పడం వెనుక ఔచిత్యానౌచిత్యాలేవిటో కూడా మీ వంటి సహృదయుల ద్వారా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.

  9. ఈ కానుకనివ్వలేను గురించి vinay అభిప్రాయం:

    07/02/2009 11:07 pm

    i agree with ravi chandra……………..excellent quotes

    especially

    అమ్మల దగ్గర్నుంచి అమెరికాకు దిగుమతయ్యేది ఆవకాయే కాదు, అద్భుతమైన ప్రశాంతత, అంతకుమించిన ధైర్యమూనూ.

    top

  10. పట్టుకో పట్టుకో గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:

    07/02/2009 8:46 pm

    చాలా బాగున్నది.
    చక్కటి పద చిత్రాలు. అల్లిక.