పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. చంద్రికాపరిణయంలోని యమకాలంకారాలు గురించి డా. నల్లపనేని విజయలక్ష్మి అభిప్రాయం:

    07/13/2024 9:16 am

    సమగ్రమైన వివరణతో సందేహ నివృత్తి చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు సర్!

  2. స్త్రీ పర్వంలో గాంధారి గురించి Dinitha Rani అభిప్రాయం:

    07/13/2024 8:53 am

    పైన చాలా మంది ఉత్తమ పురుషులు మాత గాంధారిపై అనవసరంగా ఏడుస్తున్నారు ఎందుకో?? ఇక్కడ కూడా బాధ చూడకుండా ఆడ, మగ భేదం చూస్తున్న మహాపురుషులకి వందనం. అసలు ఆవిడ చేసిన నేరం ఏముంది? బిడ్డని మోసి కంటే ఆ నరకం, బాధా తెలుస్తాయి, పుత్ర శోకం ఎంతటి నరకమో తెలుసు కనుకే శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిడ శాపాన్ని స్వీకరించాడు, ఇక పైన ఎవరో మహితాత్ముడు ముందే దుర్యోధనుడిని అదుపులో పెట్టవచ్చు కదా అని సెలవిస్తున్నారు. 🤣

    విషయం ఏంటంటే తప్పులు అందరూ చేస్తారు, కృష్ణుడే కానీ తలుచుకుంటే యుద్ధం జరగకుండా ఆపి ఉండేవాడు, ఆయన భగవానుడు కనుక, కానీ ఆయన యుద్ధమే చేయించాడు అని ఆవిడ ఒక స్త్రీ మూర్తిగా సెలవిచ్చింది, ఒక కుటుంబానికి యజమాని లేకుంటే ఆ ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒంటరి వాళ్ళే కదా? వృద్దాప్యంలో పిల్లలు మరణించారు అన్న వార్త ఏ తల్లితండ్రులకి మాత్రం గొప్ప వార్త అవుతుంది? అదే స్త్రీ పర్వం, భర్తా పిల్లలు అండ లేని స్త్రీ పడే రోదన అది, గాంధారి మాత జరిగిన నష్టానికి ప్రతీక. తెలుసుకోండి.

  3. మరల రామాయణంబదేల… గురించి V R Veluri అభిప్రాయం:

    07/12/2024 8:03 pm

    శాయి గారూ:

    ‘నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు,’ అని మీరు రాశారు. నేను ఆంధ్రభారతిలో చూశాను. నైఘంటికులకి సాధారణ ప్రజలు మాట్లాడుకునే భాష రాదని నా అభిప్రాయం. వాళ్ళందరూ వ్యుత్పత్తి ఆధారంగా నామకరణం చేస్తారనుకుంటాను.

    అయినా, నేను మీకు చెప్పటం ఏమిటి!

    అయితే, కొల్లేరు అంతర్వేదికి నిఘంటువులు తెలియవు. అతను మాకు చెప్పటం: పరగ పిట్టలు అని. పైగా ఈ కొల్లేరు పిట్టలు గడ్డి పరగలు ఏరుకోని తినటం మేము ఎప్పుడూ చూడలేదు. నీటి నాచు, పురుగులూ తినటం చూశాం.

    ఇంతెందుకూ, మీరంటే నాకు గౌరవం; అంతర్వేదంటే ప్రేమా!

    ఈ పిట్టలని చంపడం ఆంధ్ర ప్రభుత్వం ఏనాడో నిషేధించారు కాబట్టి, నేను మీజట్టులోకి వచ్చేస్తా. ఇక ముందు ఈ పిట్టల గొడవ రాస్తే నైఘంటికుల భాషలోనే రాస్తాను. బండి ర మాత్రం రాయను.

    ధన్యవాదాలు.

    వేలూరి వేంకటేశ్వర రావు.

  4. మరల రామాయణంబదేల… గురించి V R Veluri అభిప్రాయం:

    07/12/2024 7:33 pm

    అయ్యా శర్మగారూ: మీరు చదువుకున్నప్పుడు చిన్ననాటి పాఠశాలల్లో జంతువులు, పక్షులు బొమ్మలున్న పోస్టర్లు వుండివుండాలి. మీరు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎలిమెంటరీ బళ్ళకి వెళ్ళిన వాళ్ళు. మాకు ఆ అదృష్టం లేదు. అందుచేత, బకము అంటే బాతు అని బూతు రాశాను. అందుకుతోడు వార్థక్యం. క్షమార్హుణ్ణి.

    మీరు ముమ్మాటికీ రైట్.

    రుచులగురించి మీతో సంభాషణ కూడా తప్పే. నే రాసిన రుచి మీకు తెలిసే అవకాశం లేదు. ఒక్క విషయం మీతో మనవి చేసుకోవాలి: అన్ని పక్షి జాతులూ అంతరించటల్లేదు. Edible birds are in plenty. They are purposefully cultivated and grown in plenty.

    అయితే కాకులు, రకరకాల కాకులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, అంతర్జాలంలో కూడా!

    నమస్తే
    వేలూరి వేంకటేశ్వర రావు

  5. వ్యభిచారం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    07/12/2024 4:25 pm

    బయటి ఒకటీ రెండు నిత్యం చదివే పత్రికల్లో సైతం ఈ సమస్య ఊసు కథారూపంగా కనపడలేదు.

    ఇది 2017 లో ఈమాట లోనే నేను రాసినది నోట్ల రద్దుమీద
    https://eemaata.com/em/issues/201701/9749.html.

  6. ఆలిస్ మన్రో గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    07/11/2024 9:41 pm

    వేలూరి గారు,

    You must have also found that neither biography covered Munro’s daughter Andrea Skinner’s story.

    KHR

  7. ఆలిస్ మన్రో గురించి V R Veluri అభిప్రాయం:

    07/11/2024 6:31 pm

    Dear Sri Kodavalla Hanumantha Rao:

    I just found out that there are two more biographies of Alice of Alice Munro.
    1. Alice Munro: Writing Her Lives: A Biography ny Robert Thacker.
    2. Lives of Mothers and Daughters: Growing up with Alice Munro by Sheila Munro.

    I wish I had known about them earlier.

    Best wishes,

    V R Veluri

  8. ఆలిస్ మన్రో గురించి V R Veluri అభిప్రాయం:

    07/11/2024 6:15 pm

    రంగరావు గారూ: I love your quote that I requoted below

    ‘A writer sees words as they ought to be whereas a reader sees words as they are. That’s why readers can detect errors spontaneously; writers cannot.’

    At both places, it is church. At one place it is the church in English and at the other place it is the Telugu church. Am I vindicated?

    Just kidding! You are right. I should have written at both the places the same spelling.

    Best wishes.
    V R Veluri

  9. మరల రామాయణంబదేల… గురించి VSTSayee అభిప్రాయం:

    07/08/2024 10:11 am

    బండి ‘ర’ రాయటంచిన్నప్పుడే మానేసా.

    ‘క్రావడి’కూడా మానేసినట్లున్నారు.

    మరల యేలయన్న …
    నైఘంటికులు ‘పరగపిట్ట’ కాదు ‘పరిగపిట్ట’ అంటున్నారు.

  10. మరల రామాయణంబదేల… గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    07/08/2024 9:39 am

    తెలుగులో బకము అంటే బాతు అని చిన్నప్పుడు చదువుకున్నాం.

    నేను మాత్రం కొంగ అని చదువుకున్నట్టే గుర్తు. అయినా వేలూరి గారు, ఒక పక్షిని చూడగానే దాన్ని ఎలా తినడం, రుచీ తప్ప మరోటి ఏదీ గుర్తు రాలేదా మీకు? అందులోనూ ఈ రోజుల్లో పక్షిజాతులు అంతరించిపోతున్నాయి తస్మాత్ జాగ్రత్త అంటున్నారు కూడా! భూషణ్ గారిచ్చిన లింకులో పక్షి భలే అందంగా ఉంది అనుకున్నాను మీరు ‘రుచి’ గురించి ప్రస్తావించేదాకా! మొదటి సమాధానంలో జమిందారు గారు పెట్టిన పక్షి భోజనం, రెండో కామెంట్లోనూ మరోసారి రుచి! ఈ లెక్కన మీరు రామాయణం చదివినట్టే.