మీకు మాత్రమే కాదు అంఅదరికీ నచ్చే కథే యిది. హృదయాన్ని పిండించే మంచి కథ. కథకోసం కొన్ని coincidences ఉన్నాయి. అవి కథ కనుక సమర్థించుకోవచ్చు, కాని నిజంగా అలా అవుతుందో లేదో తెలియదు. కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ, భారతదేశంలో మాత్రమే కాదు, అన్ని దేశాలలో బిడ్డలను వదలడము సామాన్యమే. దీనికీ సంస్కృతికీ పెద్ద లంకె లేదు. వదలినవాళ్లందరూ ఈ కథలోని నాయికలా బాధపడరు కూడా. ఇలాటి సంఘటనతో సింధుభైరవిలాటి చలనచిత్రాలను కూడ తీసారు. విధేయుడు – మోహన
కథ అని చెప్పలేను, మాంచి స్కెచ్! ‘బుద్ధిమంతుడు’ సినిమాలో ఏం ఉందో, ఆమెకి సరిగా ఇప్పటికీ తెలియదు.
చాలా బుద్ధిమంతురాలు నిసి 🙂 మరి శ్యామల్ ఎవరు? ఈ గోపాల్‌తో పెళ్లి కాదా? 1960ల అప్పర్‌క్రస్ట్ నిజంగా అప్పర్ క్రస్టే! ఎందుకంటే లోయర్‌క్రస్ట్ వాళ్లకి ఎలక్ట్రిక్ దీపాలు కూడా ఉండేవి కావు ఆకాలంలో! విధేయుడు – మోహన
నేను ఒకమారుకంటె చదివిన వ్యాసాలలో ఇది ఒకటి. మానవుని ఆశావాదము, భవిష్యత్తుపైన భరోసా, మానసిక దృఢశక్తి ఈ వ్యాసములో ప్రతిబింబితమై ఉన్నది. బాస్నియా దేశములో సరయేవో నగరములో ప్రతిరోజు యుద్ధము, బాంబులు, జగడాలు జరిగే సమయములో పూలకుండీని పెంచుతూ అది ఎప్పుడు వికసిస్తుందో అని తహతహలాడే వ్యక్తినిగురించి చదివిన ఆనాటి వార్త నా మెదడులో ఉన్నట్లుండి తళుక్కుమనింది ఈ వ్యాసము చదివిన తరువాత. వేలూరిగారికి జోహారులు. విధేయుడు – మోహన
ఎవరి గోల వారిది అన్న పద్ధతిలో ఈ వ్యాసంలో పేర్కొన్న ఒక గీతాన్ని భీమ్‌సేన్ జోషీ సింధుభైరవి రాగంలో పాడగా నేను చాలాసార్లు విన్నాను. అది కంగళిద్యాతకొ కావేరి రంగన నోడద
ఒకప్పుడు కన్నడ, తెలుగు సాహిత్యాలకు ఉండిన దగ్గర సంబంధాల గురించి మోహనగారు సామాన్యపాఠకులకు పరిచయం చేసే వ్యాసాలు రాస్తే బావుంటుంది.
పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి vamSi అభిప్రాయం:
09/03/2011 6:30 pm
చాలా బాగుంది. నాకెంతో ఇష్టమైన జంఘాల శాస్త్రిని గుర్తు చేస్తూ మీరు రాసినతీరు గిలిగింతలు పెట్టింది. మళ్ళీ సాక్షి పుస్తకాలు చదువుకోవాలనిపిస్తోంది.
మాతృత్వానికి మరో ముడి గురించి మోహన అభిప్రాయం:
09/03/2011 2:52 pm
మీకు మాత్రమే కాదు అంఅదరికీ నచ్చే కథే యిది. హృదయాన్ని పిండించే మంచి కథ. కథకోసం కొన్ని coincidences ఉన్నాయి. అవి కథ కనుక సమర్థించుకోవచ్చు, కాని నిజంగా అలా అవుతుందో లేదో తెలియదు. కారణాలు ఏవైనా ఉండవచ్చు కానీ, భారతదేశంలో మాత్రమే కాదు, అన్ని దేశాలలో బిడ్డలను వదలడము సామాన్యమే. దీనికీ సంస్కృతికీ పెద్ద లంకె లేదు. వదలినవాళ్లందరూ ఈ కథలోని నాయికలా బాధపడరు కూడా. ఇలాటి సంఘటనతో సింధుభైరవిలాటి చలనచిత్రాలను కూడ తీసారు. విధేయుడు – మోహన
కోనసీమ కథలు: సత్తెవతి గురించి మోహన అభిప్రాయం:
09/03/2011 2:39 pm
ముగింపు కొద్దిగా ఊహించగలిగినా మంచి కథ. విధేయుడు – మోహన
అప్పర్ క్రస్ట్ గురించి మోహన అభిప్రాయం:
09/03/2011 2:33 pm
కథ అని చెప్పలేను, మాంచి స్కెచ్!
‘బుద్ధిమంతుడు’ సినిమాలో ఏం ఉందో, ఆమెకి సరిగా ఇప్పటికీ తెలియదు.
చాలా బుద్ధిమంతురాలు నిసి 🙂 మరి శ్యామల్ ఎవరు? ఈ గోపాల్‌తో పెళ్లి కాదా? 1960ల అప్పర్‌క్రస్ట్ నిజంగా అప్పర్ క్రస్టే! ఎందుకంటే లోయర్‌క్రస్ట్ వాళ్లకి ఎలక్ట్రిక్ దీపాలు కూడా ఉండేవి కావు ఆకాలంలో! విధేయుడు – మోహన
జపనీస్ పైన్ చెట్టు గురించి మోహన అభిప్రాయం:
09/03/2011 9:30 am
నేను ఒకమారుకంటె చదివిన వ్యాసాలలో ఇది ఒకటి. మానవుని ఆశావాదము, భవిష్యత్తుపైన భరోసా, మానసిక దృఢశక్తి ఈ వ్యాసములో ప్రతిబింబితమై ఉన్నది. బాస్నియా దేశములో సరయేవో నగరములో ప్రతిరోజు యుద్ధము, బాంబులు, జగడాలు జరిగే సమయములో పూలకుండీని పెంచుతూ అది ఎప్పుడు వికసిస్తుందో అని తహతహలాడే వ్యక్తినిగురించి చదివిన ఆనాటి వార్త నా మెదడులో ఉన్నట్లుండి తళుక్కుమనింది ఈ వ్యాసము చదివిన తరువాత. వేలూరిగారికి జోహారులు. విధేయుడు – మోహన
శ్రీపాదరాయలు గురించి Rohiniprasad అభిప్రాయం:
09/02/2011 11:59 pm
ఎవరి గోల వారిది అన్న పద్ధతిలో ఈ వ్యాసంలో పేర్కొన్న ఒక గీతాన్ని భీమ్‌సేన్ జోషీ సింధుభైరవి రాగంలో పాడగా నేను చాలాసార్లు విన్నాను. అది కంగళిద్యాతకొ కావేరి రంగన నోడద
ఒకప్పుడు కన్నడ, తెలుగు సాహిత్యాలకు ఉండిన దగ్గర సంబంధాల గురించి మోహనగారు సామాన్యపాఠకులకు పరిచయం చేసే వ్యాసాలు రాస్తే బావుంటుంది.
కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి srinivasarao v అభిప్రాయం:
09/02/2011 11:44 pm
ఎన్నొ విషయాలు తెలిసుకొన్నాను. ఆసక్తిగా ఉన్నాయి. ఇలా తరచుగా వ్రాయ గలరు.
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి Gowri Kirubanandan అభిప్రాయం:
09/02/2011 10:42 pm
“మాతృత్వానికి మరో ముడి” అన్న పదం మీద క్లిక్ చేస్తే కథ ఉంటుంది.
—
Gowri Kirubanandan
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/02/2011 1:32 pm
పాదారంభములో మూఁడు పదమున్న మరొక పద్యము నాకు కనబడలేదు. కాని, లోఁగు పదాన్ని లోఁగు, లోంగు గాను ఉపయోగించిన ఒక పద్యము దొరికింది. అంటే కావలసినప్పుడు, అర్ధానుస్వారము, లేకపోతే పూర్ణానుస్వారమును ఉపయోగించాడు నన్నిచోడుడు. అంటే ఆ పదాలను రెండు విధాలుగా ఉచ్చరించాడు. ఆ పద్యాలు –
లోఁగుఁ దరమైన పొదరుల
నాఁగిన శకునంబ తలఁచు నడుగడుగునకున్
డాఁగఁ గెల నరయుఁ బ్రాణము
లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్ – కు.స. – 5.13
(ప్రాససాంకర్యము చేయలేదు ఇక్కడ)
(దట్టమైన పొదలలో అణగిఉంటాడు, దుశ్శకునాలనుగురించి తలబోస్తాడు, దాగుకోడానికి పక్కల చూస్తాడు, ప్రాణాము విడువడానికి మనసొప్పక మన్మథుడు భయపడుతాడు)
వీంగు నపారసత్త్వగుణా విస్ఫురణం బరమేశ్వరోరు వా-
మాంగమునందు మున్నుదయమై నియమస్థితిఁ గొల్చి తద్దయున్
లోంగొని పేర్మితో నఖిలలోకములుం దగఁ గాచుచున్న వే-
దాంగు ననంతు విష్ణుఁ గమలాధిపు సంసుతిఁ దేల్తు సమ్మతిన్ – 1.4
ఇందులో వీఁగు, లోఁగొని అనేవి సామాన్య ప్రయోగాలు. వాటికి బదులు వీంగు, లోంగొని అని ప్రాసకై ఉపయోగిస్తాడు చోడుడు.
(విజృంభించిన గొప్ప సత్త్వ్వగుణశక్తితో ఈశ్వరుని పెద్దదగు ఎడమవైపు శరీరములో ఉద్భవించి నిష్ఠతో సేవించి శివుని అనుగ్రహముతో సకల లోకములను లొంగదీసికొని ప్రేమతో రక్షించు అనంతరూపుడైన లక్ష్మీపతి విష్ణువును నా స్తోత్రముతో సంతోషింపజేస్తాను)
వాఁడు, వీఁడు కు బదులు వాండు, వీండు అని ఉపయోగించిన ఒక పద్యము –
వీండేమి సేయుఁ బంచిన
వాండుండంగ నిక్కమునకు వధ్యుఁడుగా నా
ఖండలుఁడు గాక, యేసిన
వాండుండఁగ నేమిసేయు వరశర మనిలోన్ – 10.155
(నిజముగా పంపినవాడు ఉండగా వీడేమి చేయును? ఇతడిని పంపిన ఇంద్రుడిని చంపాలి. ప్రయోగించినవాడు ఉండగా బాణము ఏమి చేస్తుంది యుద్ధములో?)
ఇప్పుడు కూడ తమిళనాడులో ఆడవాళ్లను ఆండవాళ్లు అని అంటారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనేది ఆండవాళ్ల మాటలకు అర్ధాలే వేరులే అవుతుంది 🙂
విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/02/2011 12:54 pm
పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణమునుండి –
సాంస్కృతికాచ్ఛికమిశ్రభేదంబుచే సమాసంబు త్రివిధంబు – సమాస 2.
సాంస్కృతికంబు సిద్ధంబని సాధ్యంబని ద్వివిధంబు. కేవల సంస్కృతంబుల సమాసంబు సిద్ధంబు నాఁబడు రాజాజ్ఞ-తటాకోదకంబు-లక్ష్మీవల్లభుఁడు. సంస్కృతసమంబుల సమాసంబు సాధ్యంబునాఁబడు. రాజునాజ్ఞ-తటాకంబునుదకము-లక్ష్మీవల్లభుఁడు. తక్కిన తెనుఁగుల సమాసంబాచ్ఛికం బనంబడు. ఱేనియానతి-చెఱువునీరు-సిరిచెలువుఁడు. ఉభయంబులు గూడినది మిశ్రంబనంబడు. రాజుముదల-చెఱువునుదకము-సిరివల్లభుఁడు.
మూలఘటిక కేతనకవి ఆంద్రభాషాభూషణమునుండి –
దినకరకొడుకునకును సరి
యనిమిషమొదవునకు సాటి యని యిబ్భంగిన్
దెనిఁగింప సంస్కృతములు
దెనుఁగులు సంధించిరేనిఁ దెగడుదు రార్యుల్ (132)
తెనుగుపదంబులపైఁ బెం-
పొనరఁగ సంస్కృతముచెల్లు నొక్కొకచోటన్
మును సుకవీంద్రులు గృతులన్
బనిగొని రచియించినట్టి పరిపాటిమెయిన్ (133)
వాఁడిమయూఖము లనఁగా
వేఁడిపయోధార లనఁగా వింజామర నా
మూఁడస్త్రంబు లనఁగా
బోఁడిమిఁ గఱకంఠనామము బోలి తగున్ (134)
(ఇక్కడ అరసున్న ప్రాసనే అన్నిచోట్ల నుపయోగించాడు కేతన)
నీ సంస్కృతంబుతోడ స-
మాసించును నీవినూత్నమణినూపురశ-
బ్దాసక్తచిత్తహంస
త్రాసకరాంబుదము నాగఁ దఱుచై యునికిన్ (135)
ఆకామిని యక్కామిని
యీకొడుకు కిక్కొడుకు నాఁగ నీయూ రియ్యూ
రేకార్యం బెక్కార్యం
బాకథ యక్కథ యనఁగ నుదాహరణంబుల్ (137)
మీరు వ్రాసిన సమాసాలు ఇలా ఉండవలెననుకొంటాను – పడుచు యాహారము, గొప్ప యావేశము, మూడు నేత్రములవాఁడు, పచ్చ యంబరము లేక పచ్చని యంబరము, పాల యభిషేకము.
విధేయుడు – మోహన