పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి pandu kollarapu అభిప్రాయం:

    09/02/2011 9:35 am

    బాగుందండీ సరదాగా నవ్వడానికి.

  2. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి రాణి. అభిప్రాయం:

    09/02/2011 8:17 am

    కొన్ని కథలు స్థల కాలాలను మించి విస్తరిస్తాయి. వాటికవే సార్వత్రిక సత్యాలుగా అవతరిస్తాయి. అలా శాశ్వతత్వాన్ని సంతరించుకున్న గొప్ప కథని పూర్తిగా చదవలేకపోయినందుకు చాలా వెలితిగా అనిపిస్తోంది.

  3. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Sowmya అభిప్రాయం:

    09/02/2011 5:58 am

    🙂 బాగుందండీ సరదాగా చదువుకోవడానికి.

  4. మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి మోహన అభిప్రాయం:

    09/01/2011 10:01 pm

    ఒక రచయితకు అసిస్టంటు అంటే, ఆ వ్యక్తి పని ఏమి అనే కుతూహలము నాకు కలుగుతూ ఉంది. అంటే ఘోస్ట్ రైతటింగ్ చేస్తారా? ఈ అసిస్టంటులు వ్రాసినదాన్ని రచయిత అక్కడా యిక్కడా మార్పు చేసి తనదంటాడా? పాటలు వ్రాసేవాళ్లకు కూడా ఇలా సహాయకులు ఉంటారు, వాళ్ల పేరులను టైటిల్సులో చూస్తుంటాము. పూర్వకాలములో గొప్ప చిత్రకారులకు ఇలా అసిస్టంటులు ఉండేవారట. వాళ్లు నేపథ్యాన్ని చిత్రీకరిస్తే ముఖ్య చిత్రకారుడు పాత్రలను చిత్రీకరించేవాడట. నా ఈ ప్రశ్నలో ఏదైనా తప్పుంటే క్షమించమని ముందరే మనవి చేస్తున్నాను.. విధేయుడు – మోహన

  5. నివాసం గురించి రవి వీరేల్లి అభిప్రాయం:

    09/01/2011 9:10 pm

    చాలా బావుంది. ఇల్లలుకుతున్న కందిరీగ మరీ నచ్చింది.

  6. తానా 2011 ప్రసంగాలు: నవల-నాటకం-సినిమా గురించి Sivakumar అభిప్రాయం:

    09/01/2011 9:00 pm

    ఆకెళ్ళ గారి ప్రసంగానికి మారుతీరావుగారి జవాబు చాలా గొప్పగా వున్నది.

  7. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/01/2011 2:07 pm

    మోహన గారు,

    మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.

    1. నన్నెచోడుఁడు ప్రాసకై సున్నగా వాడాడా, లేక, అతడు నివసిస్తున్న ప్రాంతంలో ఇంకా మూండు అన్న ఉచ్చారణ ఉండేదా అన్న విషయంపై కచ్చితమైన అభిప్రాయం చెప్పడానికి సరైన ఆధారాలు లేవని నా నమ్మకం. దీర్ఘముపైని అనుస్వరం/అనునాసికం లోపించి అంతకు పూర్వం ఉన్న అచ్చు nasalized కావడం తెలుగులో 7-11 శతాబ్దాల మధ్య జరిగిన పరిణామం. నన్నెచోడుఁడు ఇతర పద్యాల్లో మూండు (మూండ్డు) అనే వాడాడా లేక మూఁడు (మూండు) అని వాడాడా అన్న విషయం పరిశీలించాలి.

    2. మిశ్రసమాసాల్లో పూర్వపదము తెలుగై, ఉత్తర పదము సంస్కృతమైతే అది దుష్టసమాసం కాదని నేనింతవరకు ఎప్పుడూ వినలేదు. కేతన గానీ, అప్పకవి గానీ వీటిగురించి రాసారేమో నాకు తెలియదు. పడుచాహారం, గొప్పావేశం (గొప్ప+ఆవేశం), మున్నేత్రుడు (=ముక్కంటి) ఇవన్నీ దుష్టసమాసాలు కావా? మరైతే, ముందు తెలుగు పదం వచ్చి తరువాత సంస్కృత పదం వస్తే, వాటిని కలపడానికి తెలుగు సంధి సూత్రాలు ఉపయోగించాలా, లేక సంస్కృత సంధులా? పచ్చ+అంబరం (పచ్చబట్ట)ను తెలుగు అకార సంధిని వాడి పచ్చంబరం అనాలా? లేదా సంస్కృత సవర్ణదీర్ఘ సంధి ఉపయోగించి పచ్చాంబరం అనాలా? ‘పాలాభిషేకం’, ‘పడుచాహారం’ అన్న సమాసాల్ని సీనీకవులు వాడితే అవి దుష్టసమాసాలని విమర్శించిన వారున్నారు కదా!

  8. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:

    09/01/2011 1:05 pm

    వ్యాసం బాగుంది, కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఒక రెండు విషయాలు –

    1) నన్నెచోడుని పద్యము – పోడి, మూడు అనే పదాలలో డి కి ముందు, డు కు ముందు అరసున్న ఉన్నది. తెలుగులో సామాన్యముగా హ్రస్వాక్షరమునకు తరవాతున్న అరసున్నను నిండుసున్నగా వాడవచ్చును. ఉదా. తెలుఁగు – తెలుంగు, అనఁగా, అనంగా, ఇత్యాదులు. కాని దీర్ఘముపైని అరసున్నను నిండు సున్నగా వాడరు. కాని నేటికీ తమిళనాడులో ఇలాటి ప్రయోగాలు సామాన్యము. ఉదా. కూంతురు, రోంకలి, వాండు, ఇత్యాదులు. నన్నయ ప్రాససాంకర్యము చేయలేదు. అంటే అరసున్న ఉన్న పదాలను లేని పదాలను ప్రాసలో వాడలేదు. కాని తమిళ సంపర్కము ఉన్న నన్నెచోడుడు దీర్ఘముపైని అరసున్నను ప్రాసకై సున్నగా వాడాడు. అందువల్ల పోఁడి పోండి, మూఁడు మూండు ఐనది.

    2) మిశ్రసమాసాలలో తెలుగు పదము ముందు, సంస్కృతపదము తరువాత వస్తే అది దుష్టసమాసము కాదు. సంస్కృతపదము ముందుండి తెలుగు పదము తరువాత వస్తే అది దుష్ట సమాసము. ముజ్జగములు సరియైనది, కాని మహాతల్లి సరియైంది కాదు. కాని ఇతర ద్రావిడ భాషలలో ఇలాటివి ఉన్నాయి.

    విధేయుడు – మోహన

  9. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి Rohiniprasad అభిప్రాయం:

    09/01/2011 12:14 pm

    ఈ వ్యాసం రాయలన్న నా ఉద్దేశాన్ని అక్షరాలా ‘నవమాసాలూ’ నేను మొయ్యవలసివచ్చింది. కొత్తగా హైదరాబాద్‌లో స్థిరపడవలసిరావడం, మా కుటుంబంలో తలెత్తిన అనుకోని సమస్యల కారణంగా చాలా జాప్యం జరిగిపోయింది.
    ఆలోచిస్తూ ఉంటే కొత్త విషయాలు అప్పుడప్పుడూ స్ఫురిస్తాయి. ఉదాహరణకు హిందీ సినిమా పాటల్లో బెంగాలీ (అలాగే మరాఠీ, పంజాబీ తదితర) సంగీతదర్శకుల పాత్ర గురించి రాయాలనిపిస్తుంది. హాసంలో ఒకప్పుడు రాజాగారు ఎవరికీ తెలియని కొన్ని వివరాలను బైటపెడుతూ రాసేవారు. నేను చెయ్యగలిగినదల్లా వినడానికి ఆ పాటలు మనకు ఎలా అనిపిస్తాయో కాస్త సైంటిఫిక్‌గా వివరించడమే.

  10. కిరానా సంప్రదాయపు భీమబలుడు గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    09/01/2011 9:49 am

    భీంసేన్ జోషీ పై వ్యాసం చాలా బాగుంది. ఆయన కచేరీ విన్నంత హాయిగా ఉంది. అతి ప్రతిభావంతులైన కళాకారులు ఎంత వినయంగా ఉంటారో భీంసేన్‌లో కనపడేది.

    ఆయన కచేరీలలో ఎక్కడా ప్రేక్షకుల కోసం పాడుతున్నట్టు అనిపించేది కాదు. భారతీయ శాస్త్రీయసంగీతంలో ఒక మహా మేధావిని మనం కోల్పోయాం. జస్‌రాజ్ గురించి భీంసేన్ వ్యాఖ్య చాలా సబబైనది. దాదాపు ఒక సంవత్సరం క్రితం జస్‌రాజ్ ఆష్టిన్ వచ్చినపుడు ఆయన కచేరీ వింటూ గాలిలో తేలిపోతున్న అనుభవం వచ్చింది.

    తెలుగులో హిందూస్తానీ సంగీతం గురించి, కళాకారుల గురించి ఇంత విపులంగా రోహిణీప్రసాద్ గారు మాత్రమే రాయగలరు అనిపిస్తుంది. సంగీతంలో ఉత్తమ అభిరుచులని తెలుగువారికి పరిచయం చేస్తున్నందుకి ప్రసాద్ గారికి అభినందనలు.

    ఎనిమిది నెలలు జర్మనీలో ఉండి పని పూర్తి చేసుకొని మొన్ననే అమెరికా తిరిగి వచ్చాను. ఇప్పుడు నివాసం – ఆల్బనీ, న్యూయార్క్. వీలుచుసుకొని ఈమాటకి ఏమైనా రాయాలి!

    విష్ణుభొట్ల లక్ష్మన్న