పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/23/2011 9:47 am

    నూఁగు అన్న పదం వ్యుత్పత్తి గురించి నేను ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారితో గత రెండు రోజులుగా జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా నేను నేర్చుకున్న విషయాలు:

    1. నూఁగు అన్న పదానికి నున్- [DEDR 3700] అన్న ధాతువుకు అంతగా సంబంధం లేదు. నున్- అన్న ధాతువు ద్వారా నూఁగు అన్న పదంలోని ప్రథమాచ్చు అయిన దీర్ఘ ఊ- కారాన్ని వివరించలేము.

    2. నూఁగు అన్న పదానికి తమిళంలోని నూంగు అన్న పదానికి సంబంధం లేదు.
    Tamil lexicon ఆధారంగా:
    நூங்கு¹ (నూఙ్కు¹) nūṅku, n. cf. ஊங்கு (ఊఙ్కు). 1. Greatness; பெருமை (పెరుమై). (అక. ని.) 2. Abundance, intenseness; மிகுதி (మికుతి). (W.)

    3. రమ భరద్వాజ్ గారు చెప్పినట్లుగాచెప్పినట్లుగానే నూఁగారు ను నూన్ + కారు అని విరవడం సరైనది కాదు. వెంట్రుకలకు సంబంధించి నూఁగు పదం తెలుగులో ఇప్పటికే ఉంది కాబట్టి నూఁగు + ఆరు అని విరవడమే సబబు.

    4. నూఁగు అన్న పదానికి *నుసి/*నుసు [DEDR 3779] అన్నది సరైన ధాతువు. తెలుగులో -న్‌గు అమహత్వాచకాలకు తగిలించే ప్రత్యయం (ఉదా: *నాలు > నాలుఁగు (four); ఎలు > ఎలుఁగు (bear); పీణ > పీనుఁగు (corpse)). స- కార లోపం వల్ల నుసుఁగు నూఁగు అయ్యింది. ఇట్టి స- కార’ లోపానికి ఇతర ఉదాహరణలు:

    *పిచర్ (name) > పెసర్ > హెసర్ (కన్నడ)
                                       > పెయర్ (తమిళ)
                                        > పేరు (తెలుగు)

    *ఉచిర్ (life/breath) > ఉసిర్ > ఉసిరు (కన్నడ)
                                       > ఉయిరు (తమిళ)
                                       > ఊర్చు/ఊర్పు/ఊరడిల్లు (తెలుగు)

    కాబట్టి నూఁగారు అన్న పదం నూఁగు + ఆరు నుండే నిష్పన్నమయ్యింది.

    నూఁగారు < నూఁగు + ఆరు నూఁగు < నుసిఁగు < *నుసి < *నుచి (small, minute). ఇక్కడ క్రియావాచకాలకు, విశేషణాలకు మాత్రమే వాడే "ఆరు" అన్న ప్రత్యయం నామవాచకమైన నూఁగారుకు వాడడం కొంత అరుదైన విశేషమనే చెప్పాలి. బహుశాః నూఁగారు ముందుగా క్రియాపదంగా గాని , విశేషణంగా గాని ఉండి తరువాత అదే పదం నామ్నీకరింపబడి ఉండవచ్చునని చెప్పవచ్చు. నాకు ఓపిగ్గా ఈ విషయాలు వివరించిన భద్రిరాజు గారికి, చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.

  2. రావు బాలసరస్వతీదేవి గురించి T.Raja gopal అభిప్రాయం:

    09/22/2011 12:11 pm

    I enjoy reading of music articles written by Sri Rohini prasad garu in his unique style, giving the audio and video links of the great
    musicians. I am more benifitted by listening to the music links presented by him. I expect more of such articles from Prasad garu
    Raja gopal

  3. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి రాణి. అభిప్రాయం:

    09/22/2011 6:54 am

    మహా ప్రస్థానం అప్పుడెప్పుడో చదివాను.
    అప్పుడే నా మనసులో రకరకాల చిత్రాలను చిత్రించుకున్నాను.

    ఇదేమిటీ ఈ బొమ్మలు
    నా ఊహలను దాటి విస్తరించాయి.?
    ఓ అదా సంగతి,
    బాపు కుంచె కదిలిందా
    కదిలిందా కదిలిందా
    స్వప్నాలని వదిలిందా ?
    వదిలిందా మదినిండా మెదిలిందా
    మరల మరల మోగిందా
    మరఫిరంగి రంగరించి
    రంగ రంగ వైభవమై…
    మదినిండా మరకల మొలకల కులుకుల కలకలం..!

  4. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి Chinni అభిప్రాయం:

    09/21/2011 12:34 am

    Too good that you are maintaining this site. Please add more old songs / poems from the great writers.

  5. మాతృత్వానికి మరో ముడి గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    09/20/2011 11:29 pm

    విజయ లక్ష్మి గారూ, కథలో ఏ పాత్రా నొచ్చుకోకుండా అ౦తా మన మంచికే అని చెప్పారు. అలాంటి తప్పు ఎక్కడైనా జరుగుతుందా లేదా అని కాదు. జరిగిన దానిని గురించి ఆలోచించక జరగవలసిన దానిని గురించి చూడమనడం, నీవు చేసిన పని వల్ల నాకు జరిగిన మంచి చూడు అనడంలో నాకు రచయిత సంస్కారం కనిపించింది. చాలా మంచి కథ.

  6. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Rajesh అభిప్రాయం:

    09/20/2011 9:56 am

    నవ్వించి నవ్వించి కళ్ళల్లో నీళ్ళు తెప్పించారు..
    చాలా బాగుంది.. 🙂 🙂

  7. శ్రీశ్రీ కవితకు బాపూ బొమ్మ గురించి k.v.rama krishna అభిప్రాయం:

    09/20/2011 9:42 am

    శ్రీశ్రీ రాతకి బాపూ గీత తెలుగువాడి అదృష్టం.

  8. కోనసీమ కథలు: సత్తెవతి గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    09/19/2011 6:18 pm

    బ్రహ్మానందం గారూ…కథ చాలా బావుందండీ. చల్లని సాయంత్రం మంచి కథ చదివిన అనుభూతి కలిగింది. కథ ముగి౦పు మానవతను ప్రతిబింబించేలా చాలా బావుంది.

  9. రావణుడి తలలు గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:

    09/19/2011 6:02 pm

    గిరి గారూ…కొత్త ప్రయత్నం చేసినట్లున్నారు. మీ కథలు ఎక్కువగా అమెరికా నేపద్యం లోనివే చదివాను.
    కథ బావుంది. కథ పేరు వైవిద్యంగా వుంది.

  10. శ్రీపాదరాయలు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    09/19/2011 12:03 am

    జడమైన గుండె కి ‘స్పర్శ’ మణిప్రభవం – సంకీర్తనం!
    **********

    గౌరవ నీయులైన శ్రీ మోహన గారికి !
    నమస్తే.

    హరి నామ సంకీర్తనములకు మూల పురుషు డైన శ్రీ పాద రాయలు గురించి మీరు వ్రాసిన వ్యాసాన్ని పొల్లు పోకుండా చదివివించిందీ.. అంటే అందుక్కారణం -. మీ రచనా విధానం! ఆ వాగ్గేయ కారుని భక్తి, తత్వజ్ఞాన పద సంపదాసమూహం, సమ్మోహనం!
    శ్రీ పాద రాయల బాల్యం, ..అతర్వాత సంఘటనలు ..అంతా కళ్ళ కట్టినట్టు ఒక కథలా చెప్పారు. కన్నడంలో రాసిన ఆ మహానుభావుని కృతులకు మీ తెలుగు అనువాదం రస రమ్యంగా వుంది. అక్షరాలు చక్కని సొగసు తేలాయి. మనసుని భక్తి భావంలో ముంచి తేల్చాయి. భగవంతుని పట్ల జడ మైన గుండె కి ఒక స్పృహని, స్ప ర్శ ని కలిగించే వైద్యం – వాగ్గేయ కారుల భక్తి పదం, పథం – హరి నామ సంకీర్తనం!

    హరిపాదోదక మీ కావేరి
    విరజానది స్నానముజేసి

    అని చదవంగానె, భక్తి నదిలో మునకేసినట్టుంటుంది. అక్షరాల అంచుల్లోంచి ఒక పవిత్రతా భావం జాలు వారుతూ… తీపితేనెవాన తుంపరలు చిమ్ముతున్నట్టు… అనిపిస్తుంది. ఎంత మధురంగా వుందీ భావం!

    కాలికి యందము హరియాత్రలె
    ఆలయపు టందము తులసి బృందావవనము
    చాల యందము చెవికి విష్ణు కథలు

    ఇక్కడ ప్రహ్లాదుడు కనిపిస్తాడు..చేతులు జోడించి హరిని సంకీర్తిస్తున్నట్టు! ‘మస్తకమున పర వస్తు’ అని అంటున్న ఈ వాగ్గేయ కారుని మాటలకు ప్రత్యేక విశ్లేషణ ఏదైనా వుండి వుండాలేమో ననిపిస్తుంది. అలాగే.. ‘మనసిజపితునికై..’ అంటున్నప్పుడు కూడా!

    దయకై తనుమనధనమ్ము లన్నిటి
    నీదు పదకమలములం దుంచితిని
    మఱిక నన్ను మాయ జేసెదవె
    సరకు నొసగితిని పిదప సుంక మేల నయ్యా..

    చదువుతూ వుంటేనే, కళ్ళు చెమ్మ గిల్లుతాయి. భగవంతుని పాదారవిందాలు దర్శనమౌతాయి. భక్తుని ఆవేదన, గళం లో ఆర్ద్రత అంతా కలసి ‘ సరుకు నొసగితిని కదా, మరి సుంకమేల నయ్యా!’ అని బేలగా అడుగుతున్నప్పుడు..ఆయన గొంతు జీర బోయి వుండెనేమో!…అన్న భావన నాకెంతో గొప్ప అనుభూతినిచ్చింది. భగవంతుణ్ని ప్రేమించి , తపించి, వెత చెందే హృదయం లోంచి పొంగే భక్తి రస భావ తరంగా లే.. వాగ్గేయ కారుల కీర్తనలు. అవి సజీవ నదులు. సంగీత స్వరాలను దారులు గా చేసుకుని, అమృత ధార లై ప్రవిహిస్తూ వుంటా యి ! అందుకే, ఎంత పానం చేసినా గానాన్ని, ఇంకా దాహం గానే వుంటుంది. కారణ జన్ములు. తపో ధనులు, భక్తి జ్ఞాన సంపన్నులు – వాగ్గేయ కారులు. సృష్టి కర్తకు, సంసార బంధులకు,బందీలకు మధ్య వారు సంధాతలు!

    కాకుంటే, ఎంత తపిస్తే దక్కేను సామాన్యులకు! ఈ కావేరినది తీరాన ఈ విఠలుని సందర్శనం !?

    మీ రచనలో మరి కొన్ని సరి కొత్త విషయాలను కూడా చదివి తెలుసుకోవచ్చు. ‘సావి రహే..’ పాటకి ముందు యమునా తీర.. శ్లోకాన్ని పాడాలని మీరొక నిజాన్ని తెలియ చేసారు. (కాని,సినిమా పాటలో ఈ సాంప్రదాయం అనుసరించినట్టు లేదు. కదూ!) అలాగే, ఉగా భోగము అంటె ఒక రాగా లాపన అని, ఐతె, అది అర్థవంతమైన పదాలతో కూడి వుంటుందనే కొత్త విషయం కూడా తెలుసు కోవచ్చు.

    ఇక వృత్త మాలిక, దండకము, భ్రమర గీతం, వేణు గీతము.. వీట్లకి తెలుగు అనువాదం చాలా బాగుంది.

    నిజమే! కన్నడం వచ్చిన వారికి శ్రీపాద రాయల వారు రాసిన కన్నడం సులభంగానె వుండొచ్చు! అయితే, ఆ భాష రాని మన వారికి మాత్రం, తెలుగు లో మీ అనువాదాలు రసరమ్యంగా వున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరిక్కడ పేర్కొన్న సంగీత సూచనలను అనుసరిస్తూ.. కీర్తనలను ఆలపించే అవకాశాన్ని ఈమాట పాఠకులకు కలగ జేసారు. స్వరార్చన చేసుకునే హరి గాన ప్రియులు – ఇదొక అదృష్టంగా భావిస్తారు.

    సొంపుచూపుల సొబగు సోగ కనులకు శరణు
    సంపంగి కుసుమంపు నాసికకు శరణు
    గుంపు రత్నపు కర్ణకుండలములకు శరణు
    ఇంపుటద్దమొ యను కపోలములకు శరణు

    ఇక్కడ నాకు అన్నమాచార్యుల కీర్తన లోని పదాలు చటుక్కున గుర్తుకొచ్చాయి

    కులికెడి మురిపెపు కుమ్మరిపు తన
    సళుపు చూపులకు చాంగు భళా
    పలుకుల సొలపుల పతితో కసిరెడి
    చలముల యలుకకు …” .

    ‘కర్ణాటక సంగీతానికి పటిష్ఠ మైన పునాది వేసిన వారు శ్రీపాదరాయలు’ అని అన్నారు. నేనూ కర్ణాటక సంగీతం వింటూ వుంటా అప్పుడప్పుడు.! మీరన్నట్టు వాగ్గేయకార త్రయం లా.. వీరి పేరు ఎక్కువ గా నేను విన లేక పోయా మరి!
    ఈ సాహిత్య వ్యాసాన్ని విపులీకరించి, విశదీకరించి రాయడంలో గల మీ కృషిని, శ్రధ్ధా సక్తులను మనఃస్ఫూర్తి గా ప్రశంసిస్తూ… కర్ణాటక సంగీత సాహిత్య పద పితామహుడైన శ్రీ పాద రాయల వారికి వందనములిడుతూ…

    గౌరవాభినందనలతో –
    ఆర్.దమయంతి.