పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి Satyanarayana అభిప్రాయం:

    09/29/2011 11:37 am

    ధన్యవాదములు.
    చాలా బాగున్నది.
    సత్యనారాయణ

  2. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి raghu అభిప్రాయం:

    09/28/2011 3:47 pm

    Why do most of the stories begin with ” Kitiki lo nunchi bayataku choosanu, mabbulu kummayi, varsham…..”?

  3. రావణుడి తలలు గురించి raghu అభిప్రాయం:

    09/28/2011 3:10 pm

    How come the events were so smooth sailing for a girl who thinks negatively and misuses friends. ? No karma in play? The story is not completely thought through.

  4. శ్రీపాదరాయలు గురించి ksrao అభిప్రాయం:

    09/28/2011 12:07 pm

    I really enjoyed the write up. Hope to receive more from you.

  5. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    09/28/2011 10:40 am

    రాజేష్ గార్కి,

    శర్మ గార్కి,

    ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఙుడిని.

    ఆదిత్య భగవాన్ ధూళిపాళ గార్కి,

    ధన్యవాదాలు. సుబ్బయ్య గారి సంగతి చెప్పలేను కానీ నేను వచ్చేస్తాను. 🙂

  6. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి Aditya Bhagavan Dhulipala అభిప్రాయం:

    09/27/2011 7:31 am

    కధ చాలా బావుంది మాస్టారు.
    పాపం సుబ్బయ్య గారిని కొన్నాళ్ళు మా ఉరు వచ్చేయమనండి. వీలైతే మీరు కూడా రండి.
    జ.శాస్త్రి ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  7. శ్రీపాదరాయలు గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    09/27/2011 3:56 am

    మోహన రావు గారూ,

    మీ వ్యాసం చాలా బావుంది. కొత్త విషయాలు తెలిసాయి.

    నాకో చిన్న సందేహం. మీరు మోహన రాగం ప్రస్తావన తెస్తూ, “ఎందుకంటే మోహనలాటి రాగాలు అన్నమాచార్యుల రాగిరేకులలో లేవు. బహుశా అవి వేరే పేరులతో ఆ కాలములో పిలువబడుతూ ఉండేవేమో?” అని రాసారు. మోహన రాగం అప్పట్లో వాడుకలో ఉండేదనే నా నమ్మకం. అదే పేరుతో పిలవబడేది కూడా!

    అన్నమయ్యా, పురందరదాసూ సమకాలీకులే కదా? పురందరదాసు “కండు కండు” అన్న కీర్తన మోహన రాగంలోనే వుంది. ఇదే కాకుండా వేరే కీర్తనలు కూడా మోహనంలో వున్నాయి. అన్నమయ్య కీర్తనల్లో మోహన రాగం లేనంత మాత్రాన అప్పట్లో లేదని చెప్పలేం. వాస్తవానికి అన్నమయ్య కీర్తనల్లో పేర్కొనబడిన కొన్ని రాగాలు ఇప్పుడు లేనే లేవు. మోహన రాగం హరికాంభోజి జన్యం. దీన్నే ఆ రోజుల్లో హరికాంబోది అని కూడా పిలిచేవారు. ఈ హరికాంబోది జన్యంలో ఉన్న తెలుగు కాంబోది, కొండ కాంబోది, మలయకాంబోది రాగాల్లో అన్నమయ్యకొన్ని కీర్తనలు కట్టాడు. ఈ కాంబోది జన్యాలకి ఆరోహణా, అవరోహణా ఏవిటన్నది ఇప్పడు తెలీవు. అసలీ రాగాలు వేరే రాగాలుగా రూపాంతరం చెందాయో తెలీదు. ఇంకాస్త లోతుగా వెతకితే వివరాలు దొరుకుతాయి. అమెరికాలో ఉండడం వల్ల కొన్ని దొరకవు. సంగీత రత్నాకరంలో కూడా మోహన రాగ ప్రస్తావన ఉన్నట్లు గుర్తు. మరోసారి వెతికి చెబుతాను.

    మరోటి. కన్నడ కీర్తనల క్రింద తెలుగు సేతలు మీవా? చాలా బావున్నాయి.

    -బ్రహ్మానందం.

  8. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:

    09/26/2011 11:29 pm

    ” రెండు” అన్నది మూల ద్రావిడం ఎరంటు నించి వచ్చినా లేక కన్నడ ఎరండు నించి వచ్చినా అక్కడ జరిగింది వర్ణవ్యత్యయం. అలాంటి పరిణామం తెలుగులో ఏయే ధ్వనిరూపాలని తీసుకుని వచ్చింది అన్నది ఆసక్తిని కల్గించే విషయమే! అయితే ఎందుకనో తెలుగులో భాషా శాస్త్రం మీదా… వ్యాకరణం మీదా పనిచేసిన వాళ్ళు సంఖ్యలో తక్కువ. అవి కొంచెం dry subjects గనక. పైగా వాటిని జనరంజకంగా చెప్పాలన్న తపన కూడా ఆ పని చేసిన వాళ్ళలో కనిపించదు. ఒక్క తిరుమల రామచంద్ర గారే ఇందుకు మినహాయింపు. ఇంక తెలుగులో భాషా శాస్త్రంలో వచ్చిన పరిశోధనల తిరుతెన్నుల గురించి నాకు పెద్దగా తెలీదు. నేను భాషాశాస్ర్త విద్యార్ధిని గాను. అటుతిప్పీ ఇటుతిప్పీ ఒక్క భద్రిరాజు గారి పేరే ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఆయన రచనలు ఆ శాస్ర్తం లో ఆసక్తి ఉన్న వారికీ.. ఆ శాస్త్రంలో పనిచేసే వారికీ ఎక్కువ పనికొస్తాయి గానీ మామూలుగా చదవాలని అనుకునే వారి కోసం కావు.

    మనం చెప్పే విషయాలు ఎప్పుడూ ఒక స్థాయి ఉన్న పాఠకులకి అయినా ఒక కుతూహలాన్ని కలిగిస్తూ చేరగలిగేలా ఉండాలి. బహుశా ఇంకా విద్యార్ధిగానే ఉన్నానని చెబుతున్న కొలిచాల సురేష్ రచయిత గా ఎప్పుడన్నా మారితే ఈ విషయాలని తప్పక గుర్తుపెట్టుకోగలరని ఆశిస్తాను.

    రమ.

  9. శ్రీపాదరాయలు గురించి మోహన అభిప్రాయం:

    09/26/2011 8:22 pm

    దమయంతి గారు, మీలాటివారు ఒక్కరు స్పందించినా, ఈ వ్యాసంకోసం నేను చేసిన బహు దీర్ఘ శ్రమ ఫలించిందనే అనుకొంటాను. మీకు లైలాగారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. విధేయుడు – మోహన

  10. పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    09/26/2011 2:46 pm

    రమ గారు: మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. భాషాశాస్త్ర విషయంలో ఇంకా నేను విద్యార్థినే.

    మోహన గారు: మీరు చెప్పింది నిజమే. కన్నడములో ప-కారము తొమ్మిదవ శతాబ్దము తరువాత ఎన్నోశతాబ్దాలు చలామణిలో ఉండింది. అదీకాక, కావ్యభాషలో ప్రాచీన రూపాల వాడకం కొన్ని శతాబ్దాల వరకూ కొనసాగించడం అన్ని భాషలలోనూ కనిపిస్తుంది. As noted in the book titled A Grammar Of The Oldest Kanarese Inscriptions(1941) by Narasimha in its very first chapter: Up till the end of the 9th century p- is preserved. In the 10th century, forms with -h-in place of -p- begin to appear in all parts of the of Kanarese area (pg 1-2).

    10-11వ శతాబ్దాలలో ప్రజల భాషలో చాలా ప- కారాలు హ- కారాలుగా మారిపోయాయని ఆయన చెబుతూ 14వ శతాబ్దం వరకు ఇది సంపూర్ణ ధ్వనిపరిణామంగా స్థిరపడిందని చెప్పారు.