సురేష్ ! నా ఇంకో సూచన మీద మీరు స్పందించలేదు.అదేమంటే ఈ సంగతులని ఇతరులు కూడా మరింత స్పస్టంగా అర్ధం చేసుకోవాలీ అంటే మూల ద్రావిడం నించి విడివడిన మార్పు చెందిన ఇతర ద్రావిడ భాషల పదాలని ఒక పట్టిక లాగా ఇవ్వడం చేస్తే బాగుంటుందీ అన్నది. అలాగే మీకు చాలా విషయాలు ఉన్నట్టున్నాయి చెప్పాల్సినవి ద్రావిడ భాషల గురించి, అని నాకు అన్పిస్తోంది. కదా?? అందుకే నేను తిరుమల రామచంద్ర గారి ప్రస్తావన తెచ్చాను. భాషల మీద ఆసక్తిని కల్గించేలా వచ్చిన పుస్తకాలలో ఆయన రాసిన పుస్తకాలు చాలా ముఖ్యమైనవి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేసినవారు కనిపించడమ్ లేదు. మీరెందుకు చేయకూడదూ అని నేను చేస్తున్న సూచన. ఆలోచించండి.
నేను ప్రధానంగా సాహిత్యం మీద ఆసక్తి కలిగిన దానిని. భాషా వ్యవహారాల మీద నాకు చెప్పుకోదగిన ఆసక్తి లేదు. నాకు కల్పన మీద ఉన్న సరదా పదాల సమాహారంలోనూ అలాగే ఆయా పదాల వ్యుత్పత్తుల మీద కలగదు. మీకు కలుగుతుంది. అదే తేడా మరి:) అందువల్ల మీరు తప్పక ఒక పుస్తకాన్ని రాయండి.
మీరు సాధారణంగా క్లుప్తంగానూ స్పస్టం గానూ వాక్యాన్ని రాసేవారే. ఈసారి అలాంటి తికమక కలగడమ్ “.. ప్రమాదో ధీమతాం అపి” so please continue.
అవునండి. నా వాక్య నిర్మాణం నేననుకున్న అర్థం ఇవ్వడం లేదు. స్పష్టత కోసం “రమ భరద్వాజ్ గారు చెప్పినట్లుగా నూఁగు + ఆరు అని విరవడమే సబబు.” అని రాసి ఉండాల్సింది. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు.
వర్ణ వ్యత్యయం వల్ల “చయన్” “ఏను” గాను,”యెరడు” “రెండు” గానూ అలాగే ఏడు కూడా ఈ విధానం లోనే తెలుగున ప్రవేశించినవి. కన్నడం లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందినది. వాళ్ళ “హళ్ళి” మన ” పల్లి” అయినట్టు. ఇంకా ఇలా “హత్తి” మన “పది” అట్లా! తెలుగు, ముఖ్యంగా పాత తెలుగు, కన్నడం నించి తన రూపాల్ని గ్రహించింది.
ఇవి నన్ను బాగా ఇబ్బంది పెట్టే వాక్యాలు. పాత తెలుగు కన్నడం నుండి తన రూపాల్ని గ్రహించింది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మనం తెలుగు కన్నడం నుండి పుట్టింది. కన్నడ తమిళం నుండి పుట్టింది వంటి ఆలోచనలు మానుకోవాలి. తెలుగు, కన్నడం, తమిళం అన్నీ ఒకే మూల ద్రావిడ భాషకు పుట్టిన సోదర భాషలు.
కన్నడ లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందలేదు. మూల ద్రావిడ భాషలోని /ప/ వర్ణం ఇటీవలే (9వ శతాబ్దిలో) కన్నడలో /హ/ వర్ణం గా మారింది.
పులి > హులి
పళ్ళి > హళ్ళి
పంది > హంది
తెలుగు ‘రెండు’ కన్నడ ‘ఎరడు’ నుండి పుట్టలేదు (వర్ణ వ్యత్యయం వల్ల అన్న మాట కరక్టే). మూలద్రావిడ ధాతువు *ఇరంటు నుండి తెలుగు రెండు, కన్నడ ఎరండు పుట్టాయి. అయితే, ఒక్క ‘అయిదు’ అన్న పదం విషయంలో తెలుగు కన్నడనుండి అరువు తెచ్చుకున్న పదం అని చెప్పుకోవచ్చు. ఈ కింది పటం చూడండి:
(పెద్దది చేయడానికి క్లిక్ చేయండి)
మామూలుగా, మూల ధాతువులోని /య/ వర్ణం తెలుగు వంటి దక్షిణమధ్య భాషలలో ఏ- కారంగా కనిపిస్తే, తమిళ, కన్నడ వంటి దక్షిణ ద్రావిడ భాషలలో ఆ- కారంగా మార్పు చెందింది. కొన్ని ఉదాహరణలు:
యాఱు > ఏఱు (తెలుగు = stream)
> ఆఱు (తమిళ కన్నడ)
యాన > ఏనుఁగు (తెలుగు)
> ఆన/ఆనె/యానై (తమిళ కన్నడ)
అందుకే, ‘ఏను’ అన్న పదం తెలుగుకు జన్మతః సంక్రమించిన పదం అని, అకారంతో మొదలయ్యే ‘అయిదు’ పక్క భాషల నుండిఆతరువాతి కాలంలో అరువు తెచ్చుకున్న పదం అని వాదించి నిరూపించవచ్చు. కాదంటారా?
“రమా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా […] నూన్ +కారు అని విరవడం సరైనది కాదు” అన్న వాక్యానికి నేను అలా విరవమన్నాననే అర్ధం చప్పున స్పురిస్తుంది. దాని తరవాతి వాక్యం అయిన ‘నూఁగు+ఆరు= నూఁగారు” అన్న విరుపు నేను చెప్పింది అన్న భావం మీ వాక్యం వెంటనే ఇవ్వడం లేదు. తెలుగు వాక్యాలలో ఎత్తుకోలు మొత్తమ్ భావాన్ని మార్చే ప్రమాదం ఉంది మరి :).
ఏమండీ లైలా గారూ! ఇన్నాళ్ళూ ఈ “నూఁగారు” పాతకాలలోని కవులచేత పద్యాలు రాయించుకుంది. ఇవాళ మీ చేత రాయించుకుంది. మొత్తానికి ఇది అటు కవులక, ఇటు భాష లోని వారికీ బాగానే పని పెట్టింది.

మూలద్రావిడ భాషలనించి దేశి భాషా రూపాల వివరణ, పట్టిక ఇస్తే బాగుంటుందేమో? కనీసం ముఖ్యమైనవీ, నలుగురికీ పరిచయం ఉన్నవీను. తిరుమల రామచద్ర గారి “నుడి- నానుడి” ఇంకా “తెలుగు దాని పుట్టు పూర్వోత్తరాలు” వంటి పుస్తకాలు తెనుగు పాఠకుల మదిని దోచుకున్నవి. అలాంటి ప్రయత్నం మరొకటి చేసే వీలుంది కదా కొలిచాలా??
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
పెసరు, హెసరుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెసరు(ఱు) నుండి వచ్చినదే పెసలు, పెసర కూడ. అంటే ఒకే హెసరునుండి పేరు, పెసలు వచ్చాయి. కన్నడములోని ఉసిరు, ఉసురు నుండి వచ్చినదే తెలుగు ఉసుఱు(రు) కూడ. విధేయుడు – మోహన
“నుసుగు” అన్న పదం ఇప్పటికీ వ్యవహారం లో ఉంది అదే అర్ధం లో!! హమ్మయ్య !!
ఏం చేస్తాం! శంఖంలో పోస్తేనే కదా తీర్థం! కొలిచాల లో ఉత్సాహం చాలా కనిపిస్తుంది. జిజ్ఞాస కూడాను. ఓర్పు కొంచెం ఉండవలసిన విషయం.:) ముఖ్యంగా భాష మీద పనిచేసేటప్పుడు. తగినంత శ్రధ్ధ పెడితే, సమయం పెడితే, తెనుగు భాషా రంగానికి సురేష్ ఏ కోణం నించైనా చెప్పుకోగలిగిన పని చేయగలడు అన్నది నా ఆశ. నా ఆకాంక్షాను. అస్తు.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/26/2011 1:57 pm
కన్నడములో ప-కారము తొమ్మిదవ శతాబ్దము తరువాత ఎన్నోశతాబ్దాలు చలామణిలో ఉండింది. శ్రీపాదరాయల (15వ శతాబ్దము) పాటలో కూడ దీనిని చూడవచ్చును – కొంబు కొళల నూదుత్త నంబిసి పోదనె యవ్వా. విధేయుడు – మోహన
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/26/2011 12:03 pm
సురేష్ ! నా ఇంకో సూచన మీద మీరు స్పందించలేదు.అదేమంటే ఈ సంగతులని ఇతరులు కూడా మరింత స్పస్టంగా అర్ధం చేసుకోవాలీ అంటే మూల ద్రావిడం నించి విడివడిన మార్పు చెందిన ఇతర ద్రావిడ భాషల పదాలని ఒక పట్టిక లాగా ఇవ్వడం చేస్తే బాగుంటుందీ అన్నది. అలాగే మీకు చాలా విషయాలు ఉన్నట్టున్నాయి చెప్పాల్సినవి ద్రావిడ భాషల గురించి, అని నాకు అన్పిస్తోంది. కదా?? అందుకే నేను తిరుమల రామచంద్ర గారి ప్రస్తావన తెచ్చాను. భాషల మీద ఆసక్తిని కల్గించేలా వచ్చిన పుస్తకాలలో ఆయన రాసిన పుస్తకాలు చాలా ముఖ్యమైనవి. మళ్ళీ అలాంటి ప్రయత్నాలు చేసినవారు కనిపించడమ్ లేదు. మీరెందుకు చేయకూడదూ అని నేను చేస్తున్న సూచన. ఆలోచించండి.
నేను ప్రధానంగా సాహిత్యం మీద ఆసక్తి కలిగిన దానిని. భాషా వ్యవహారాల మీద నాకు చెప్పుకోదగిన ఆసక్తి లేదు. నాకు కల్పన మీద ఉన్న సరదా పదాల సమాహారంలోనూ అలాగే ఆయా పదాల వ్యుత్పత్తుల మీద కలగదు. మీకు కలుగుతుంది. అదే తేడా మరి:) అందువల్ల మీరు తప్పక ఒక పుస్తకాన్ని రాయండి.
మీరు సాధారణంగా క్లుప్తంగానూ స్పస్టం గానూ వాక్యాన్ని రాసేవారే. ఈసారి అలాంటి తికమక కలగడమ్ “.. ప్రమాదో ధీమతాం అపి” so please continue.
రమ.
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి sarma అభిప్రాయం:
09/25/2011 9:01 am
చాలా బాగుంది. ఈమధ్య చదివిన కధలలో మంచిది.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/25/2011 5:19 am
రమ గారు,
అవునండి. నా వాక్య నిర్మాణం నేననుకున్న అర్థం ఇవ్వడం లేదు. స్పష్టత కోసం “రమ భరద్వాజ్ గారు చెప్పినట్లుగా నూఁగు + ఆరు అని విరవడమే సబబు.” అని రాసి ఉండాల్సింది. ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు.
ఇవి నన్ను బాగా ఇబ్బంది పెట్టే వాక్యాలు. పాత తెలుగు కన్నడం నుండి తన రూపాల్ని గ్రహించింది అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మనం తెలుగు కన్నడం నుండి పుట్టింది. కన్నడ తమిళం నుండి పుట్టింది వంటి ఆలోచనలు మానుకోవాలి. తెలుగు, కన్నడం, తమిళం అన్నీ ఒకే మూల ద్రావిడ భాషకు పుట్టిన సోదర భాషలు.
కన్నడ లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందలేదు. మూల ద్రావిడ భాషలోని /ప/ వర్ణం ఇటీవలే (9వ శతాబ్దిలో) కన్నడలో /హ/ వర్ణం గా మారింది.
పులి > హులి
పళ్ళి > హళ్ళి
పంది > హంది
తెలుగు ‘రెండు’ కన్నడ ‘ఎరడు’ నుండి పుట్టలేదు (వర్ణ వ్యత్యయం వల్ల అన్న మాట కరక్టే). మూలద్రావిడ ధాతువు *ఇరంటు నుండి తెలుగు రెండు, కన్నడ ఎరండు పుట్టాయి. అయితే, ఒక్క ‘అయిదు’ అన్న పదం విషయంలో తెలుగు కన్నడనుండి అరువు తెచ్చుకున్న పదం అని చెప్పుకోవచ్చు. ఈ కింది పటం చూడండి:
(పెద్దది చేయడానికి క్లిక్ చేయండి)
మామూలుగా, మూల ధాతువులోని /య/ వర్ణం తెలుగు వంటి దక్షిణమధ్య భాషలలో ఏ- కారంగా కనిపిస్తే, తమిళ, కన్నడ వంటి దక్షిణ ద్రావిడ భాషలలో ఆ- కారంగా మార్పు చెందింది. కొన్ని ఉదాహరణలు:
యాఱు > ఏఱు (తెలుగు = stream)
> ఆఱు (తమిళ కన్నడ)
యాన > ఏనుఁగు (తెలుగు)
> ఆన/ఆనె/యానై (తమిళ కన్నడ)
అందుకే, ‘ఏను’ అన్న పదం తెలుగుకు జన్మతః సంక్రమించిన పదం అని, అకారంతో మొదలయ్యే ‘అయిదు’ పక్క భాషల నుండిఆతరువాతి కాలంలో అరువు తెచ్చుకున్న పదం అని వాదించి నిరూపించవచ్చు. కాదంటారా?
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/24/2011 1:18 am
“రమా భరద్వాజ్ గారు చెప్పినట్టుగా […] నూన్ +కారు అని విరవడం సరైనది కాదు” అన్న వాక్యానికి నేను అలా విరవమన్నాననే అర్ధం చప్పున స్పురిస్తుంది. దాని తరవాతి వాక్యం అయిన ‘నూఁగు+ఆరు= నూఁగారు” అన్న విరుపు నేను చెప్పింది అన్న భావం మీ వాక్యం వెంటనే ఇవ్వడం లేదు. తెలుగు వాక్యాలలో ఎత్తుకోలు మొత్తమ్ భావాన్ని మార్చే ప్రమాదం ఉంది మరి :).
ఏమండీ లైలా గారూ! ఇన్నాళ్ళూ ఈ “నూఁగారు” పాతకాలలోని కవులచేత పద్యాలు రాయించుకుంది. ఇవాళ మీ చేత రాయించుకుంది. మొత్తానికి ఇది అటు కవులక, ఇటు భాష లోని వారికీ బాగానే పని పెట్టింది.
వర్ణ వ్యత్యయం వల్ల “చయన్” “ఏను” గాను,”యెరడు” “రెండు” గానూ అలాగే ఏడు కూడా ఈ విధానం లోనే తెలుగున ప్రవేశించినవి. కన్నడం లోని “హ” తెలుగులో “ప” గా పరివర్తనం చెందినది. వాళ్ళ “హళ్ళి” మన ” పల్లి” అయినట్టు. ఇంకా ఇలా “హత్తి” మన “పది” అట్లా! తెలుగు, ముఖ్యంగా పాత తెలుగు, కన్నడం నించి తన రూపాల్ని గ్రహించింది.
మూలద్రావిడ భాషలనించి దేశి భాషా రూపాల వివరణ, పట్టిక ఇస్తే బాగుంటుందేమో? కనీసం ముఖ్యమైనవీ, నలుగురికీ పరిచయం ఉన్నవీను. తిరుమల రామచద్ర గారి “నుడి- నానుడి” ఇంకా “తెలుగు దాని పుట్టు పూర్వోత్తరాలు” వంటి పుస్తకాలు తెనుగు పాఠకుల మదిని దోచుకున్నవి. అలాంటి ప్రయత్నం మరొకటి చేసే వీలుంది కదా కొలిచాలా??
రమ.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:
09/23/2011 11:22 pm
పెసరు (=పేరు), పెసఱు (పెసలు = greengram) ఒకే ధాతువు నుండి రాలేదు. ఉత్తర ద్రావిడ భాషలైన బ్రాహియిలో పిన్, మాల్తోలో పిన్జె అంటే పేరు. మధ్య ద్రావిడ భాషలైన పర్జీ, గదబ, ఒల్లరీలో పిదిర్ అంటే పేరు అని అర్థం. తమిళంలో పెయర్, కన్నడలో పెసరు/హెసరు. ఇవన్నిటి ఆధారంగా పేరు *పిచర్/*పిసర్- నుండి వచ్చిందని నిరూపించడం సులభం.
పెసఱు (greengram) మాత్రం తమిళంలో పయఱు అని, కన్నడలో పెసఱు/హెసరు అని, నాయికీలో పెసళ్ అని అంటారు. దీనికి పచ/పచ్చ- = green అన్న ధాతువుకు ఏమైనా సంబంధం ఉండవచ్చునేమో కాని పేరుకు సంబంధించింది కాదు.
తెలుగులోని పెసఱు, ఉసిరు/ఉసురు మూలద్రావిడ మాతృకల నుండి కాకుండా కన్నడ నుండి వచ్చాయని మోహనరావు గారు అనడానికి ఆధారాలేమిటో నాకు బోధ పడటంలేదు. అచ్చుల మధ్య స- కార లోపం తెలుగులో సంపూర్ణమైన ధ్వని పరిణామం కాదు. ఒకే ధాతువుకు సంబంధించిన కొసరు, కోరు అన్న పదాలు కూడా తెలుగులో ఉన్నాయి.
సంఖ్యావాచకాల విషయంలో *చయ్‌న్ అన్న మూల ద్రావిడ ధాతువు తెలుగు శాసనాల కాలంలో ఏనుగా మాత్రమే కనిపించి, తరువాత ఆ రూపానికి ఏ మాత్రం సరిపోని అయిదు గా కనిపిస్తోంది కాబట్టి ఆ అయిదు తరువాతి రోజుల్లో కన్నడ నుండి అరువు తెచ్చుకున్నదిగా వివరించరించాల్సివస్తుంది.
తెలుగులో పెసఱు, ఉసురు,కొసరు మొదలైన పదాలు పుట్టుకతోనే తల్లి ద్రావిడభాష నుండి సంక్రంచిన పదాలుగా కాక, తరువాతి కాలంలో కన్నడ నుండి స్వీకరించిన పదాలుగా ప్రతిపాదించడానికి ఆధారాలు ఏవైనా ఉంటే వివరించగలరు.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి మోహన అభిప్రాయం:
09/23/2011 7:47 pm
పెసరు, హెసరుతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. హెసరు(ఱు) నుండి వచ్చినదే పెసలు, పెసర కూడ. అంటే ఒకే హెసరునుండి పేరు, పెసలు వచ్చాయి. కన్నడములోని ఉసిరు, ఉసురు నుండి వచ్చినదే తెలుగు ఉసుఱు(రు) కూడ. విధేయుడు – మోహన
ఇద్దరు దుర్మార్గులు గురించి Bhaskar Sharma అభిప్రాయం:
09/23/2011 5:18 pm
The story is simple and good.
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి lyla yerneni అభిప్రాయం:
09/23/2011 1:18 pm
నైస్! వెరీ నైస్!
సో:-) a verse:
సింగారి!
నీ బంగారు నూఁగారు
నేనంటి నా నానాడు
పొంగారె అంగాలు
పొదలె భోగాలు
ముందు ముందేముందొ
కద! యని నాకెంతొ కంగారు!
లైలా
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి rama bharadwaj అభిప్రాయం:
09/23/2011 12:47 pm