నా రచన మాతృత్వానికి మరో ముడి మీద అభిప్రాయము వ్రాసిన అందరికి కృతజ్ఞతలు.ముఖ్యముగా ఈ కథని ప్రపంచానికి విప్పి చెప్పిన గౌరి కి thanks.ఇన్నేళ్ళ తర్వాత నా కథ మళ్ళీ పుట్టింది.
ఈ కథ నాకూ తెలిసినదే! కథనంలో చమత్కారవంతమైన తేడాలున్నైగానీ. నిజంగానే ఎవరి రామాయణాలు వాళ్ళవి! ఏ హనుమంతుడికా హనుమంతుడు!
అయినా వాళ్ళెవరికో ఇలాంటికథని నిషేధించేయాల్సిన అవసరం ఏమొచ్చిందో.. మరి మీరన్నట్లు తమ రామాయణంలోని పాత్రలు కొత్తపనులు చేయటం సమజసం కాదని ఎవరి రామాయణానికైనా అనిపించిందేమో..?
గొప్ప పోస్టు సార్! నిజంగా బాగుంది.
ఇన్నాళ్లకి కళాపూర్ణొదయమ్ ఇక్కడ చదవగలిగాను , దీనిని ఇక్కడ అందించినందుకు కృతజ్ఞతలు ….! కధలో కధ, కధలో కధ ఎన్ని ఉన్నాయండి దీనిలో, ఇటువంటి కధ ఈ మధ్య కాలంలో ఎక్కడ చదవలేదు …. ఎన్నో మేలికలున్నాయి…. బాగుంది , మంచి జానపద చిత్రంగా తియచ్చేమో…! ఈమాట సైటు నిజంగా తెలుగు కధలు, సాహిత్యం , పుస్తకాలు చదివే వారందరికీ ఒక వరం …! గూగుల్ “సాహిత్యం” గుంపులో ఈ కధ గురించి చదివి తెలుసుకొని, ఒకే ధాటిలో చదివేసాను …. ఎంత ఆసక్తిగా / రక్తిగా ఉంది కాబట్టే అలా చదవగలిగాను…. లేకపోతే మధ్యలో కాసేపయినా విశ్రాంతి తీసుకోకుండా నేను చదవను / చదవలేను కూడా ..!
ఏది ఏమైనా ఒక మంచి కధ… ఇలాంటివి మరిన్నిటి గురించి తెలియచేయవలసిందిగా మనవి…!
మీరు Glorius ఇలాగనీసరికి ఈ పేరావే కాకుండ దీని ముందు పేరాలు వెనక పేరాలూ అన్నీ వెతికేను లైలా గారు. I find them rather vainglorious is all…! అదే పతకఁవైతే అమ్ముకు బతకనా?! అన్నాట్ట వెనకటికి. ఈ రాతల్లోన గ్లోరీ ఏం వెతుకుతాము లైలా గారు…? #May be you’re looking in the wrong place…#
రాజకీయాలూ సినిమాలూ సాంస్కృతిక తిరోగమన రధానికి గుఱ్ఱాలా అనిపిస్తోంది. పాట అంటే సినిమాపాటే, నాయకుడంటే రాజకీయ నాయకుడే ననే పరిస్థితి నడుస్తోంది. పూర్వం ఫామిలీ డాక్టర్లు అనే మాట ఒకటుండేది. కొ్త్తగా ఫామిలీ గురువులు కూడా తయారయ్యారు. సభలు జరుగుతూనే ఉంటాయి, వచ్చిన జనం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉంటారు. అంతా మొక్కుబడి వ్యవహారం. సరదాగా కాలక్షేపం చేయాలనే కాక సాంస్కృతికమైన కార్యక్రమాలకోసం గాదు – అసలవి కూడా యేవొ మొక్కుబడి వ్యవహారాలైపోయాయి గదా. అన్ని భాషలవాళ్ళు యిలాగే ఉన్నారా, మన తెలుగు వారే ప్రత్యేకమా అన్నది నాకు తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం. తెలుగు వాళ్ళకి తమ భాషా సంస్కృతులను తాము గౌరవించుకోవటం మీద శ్రధ్ధ లేదు. ముందు కలుగుతుందన్న ఆశ లేదు. తమలో తాము కలహించుకోవటంలో మన వాళ్ళకున్న పట్టుదల భూమ్మీద మరెవరికీ ఉండదు గాక ఉండదు. ఇద్దరు తెలుగు వాళ్ళుంటే మూడు పార్టీలుగా ఉంటారు. అదీ మన ప్రత్యేకత.
కథ బాగుంది. మంచైనా చెడైనా మనసులో మాట మనసులోనో యెన్నాళ్ళు యేకారణం వల్ల దాచినా, చివరికి దానిని ఆప్తహృదయంతో పంచుకోకుండా వెళ్ళిపోవటం కష్టం. అదే జరిగింది. చాలా సహజంగా ఉంది. ఒక సంఘటనలో తమ ప్రవర్తన తప్పా ఒప్పా అన్నది యెవరికి వారికి మనస్సాక్షికి తెలుస్తుంది. అయితే సానుకూలంగా ప్రతిస్పందించే పరిపక్వత గల హృదయంకోసం చిచ్చొడి గట్టుకున్నట్లు బహుకాలం వేచి ఉండవలసి వస్తుంది. ఒక్కొకసారి అటువంటి అవుకాశం జీవితకాలంలో రాకపోవచ్చును కూడా. అదృష్టవశాత్తు అన్నపూర్ణకు ఆమె తమ్మడు అనే వ్యక్తిని చివరి రోజుల్లో భగవంతుడు చూపించాడు. ఆ ఆత్మకు అదే గొప్ప వరం. ఏక్సిడెంట్ కాదని , తన వలనే తండ్రి మరణించాడని తనను తాను దోషిలా అన్నపూర్ణ భావించుకో నవుసరంలేదు. చిన్నతనంలో తల్లిని రక్షించుకునేందుకు తండ్రైనా గాయపరచింది. చనిపోవచ్చన్న అవగాహన కలుగక పోవచ్చును చిన్నతనం కారణంగా. ఆత్మన్యూనతా భావంతో విచక్షణ తరచు కోల్పోయే తండ్రికి జరిగన సంఘటనలో పిల్ల తప్పు యేమీ లేదని తప్పక అనిపించి ఉండవచ్చును తన చివరి క్షణాలలో. శ్రీరాం జీవితంలో యీ నిజం గొప్ప కుదుపు. కాని అతడు పరిణతి చెందిని వ్యక్తి. శుభం.
మన దీపావళి కథ గురించి v.ramakrishna అభిప్రాయం:
10/24/2011 6:36 am
మీరు రాసిన దీపావళి కథ బాగుంది. కాసేపు నవ్వుకున్నాము. Conclusion బాగుంది.
నాకు నచ్చిన పద్యం: హనుమంతుని నీతిబోధ గురించి ananth అభిప్రాయం:
10/22/2011 8:55 pm
చక్కటి వివరణ.
మీ ఆసక్తి మాలాంటివారికి వరం.
మీకు శుభం కలుగు గాక.
అనంత దీపావళి శుభాకాంక్షలతో
మాతృత్వానికి మరో ముడి: కథ నచ్చిన కారణం గురించి vijayalakshmi అభిప్రాయం:
10/22/2011 1:05 am
నా రచన మాతృత్వానికి మరో ముడి మీద అభిప్రాయము వ్రాసిన అందరికి కృతజ్ఞతలు.ముఖ్యముగా ఈ కథని ప్రపంచానికి విప్పి చెప్పిన గౌరి కి thanks.ఇన్నేళ్ళ తర్వాత నా కథ మళ్ళీ పుట్టింది.
నా రామాయణం గురించి నారాయణ అభిప్రాయం:
10/21/2011 9:40 pm
మరో అద్భుతం!
ఈ కథ నాకూ తెలిసినదే! కథనంలో చమత్కారవంతమైన తేడాలున్నైగానీ. నిజంగానే ఎవరి రామాయణాలు వాళ్ళవి! ఏ హనుమంతుడికా హనుమంతుడు!
అయినా వాళ్ళెవరికో ఇలాంటికథని నిషేధించేయాల్సిన అవసరం ఏమొచ్చిందో.. మరి మీరన్నట్లు తమ రామాయణంలోని పాత్రలు కొత్తపనులు చేయటం సమజసం కాదని ఎవరి రామాయణానికైనా అనిపించిందేమో..?
గొప్ప పోస్టు సార్! నిజంగా బాగుంది.
-నారాయణ
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి chavakiran అభిప్రాయం:
10/18/2011 10:01 am
బూదరాజు గారి పుస్తకాలు కొన్ని ఇప్పుడు ఈపుస్తకం రూపంలో కినిగె లబిస్తున్నాయి. ఈ లింకు చూడగలరు.
కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:
10/18/2011 7:18 am
ఇన్నాళ్లకి కళాపూర్ణొదయమ్ ఇక్కడ చదవగలిగాను , దీనిని ఇక్కడ అందించినందుకు కృతజ్ఞతలు ….! కధలో కధ, కధలో కధ ఎన్ని ఉన్నాయండి దీనిలో, ఇటువంటి కధ ఈ మధ్య కాలంలో ఎక్కడ చదవలేదు …. ఎన్నో మేలికలున్నాయి…. బాగుంది , మంచి జానపద చిత్రంగా తియచ్చేమో…! ఈమాట సైటు నిజంగా తెలుగు కధలు, సాహిత్యం , పుస్తకాలు చదివే వారందరికీ ఒక వరం …! గూగుల్ “సాహిత్యం” గుంపులో ఈ కధ గురించి చదివి తెలుసుకొని, ఒకే ధాటిలో చదివేసాను …. ఎంత ఆసక్తిగా / రక్తిగా ఉంది కాబట్టే అలా చదవగలిగాను…. లేకపోతే మధ్యలో కాసేపయినా విశ్రాంతి తీసుకోకుండా నేను చదవను / చదవలేను కూడా ..!
ఏది ఏమైనా ఒక మంచి కధ… ఇలాంటివి మరిన్నిటి గురించి తెలియచేయవలసిందిగా మనవి…!
మూడు లాంతర్లు – 7 గురించి కనక ప్రసాద్ అభిప్రాయం:
10/18/2011 6:40 am
మీరు Glorius ఇలాగనీసరికి ఈ పేరావే కాకుండ దీని ముందు పేరాలు వెనక పేరాలూ అన్నీ వెతికేను లైలా గారు. I find them rather vainglorious is all…! అదే పతకఁవైతే అమ్ముకు బతకనా?! అన్నాట్ట వెనకటికి. ఈ రాతల్లోన గ్లోరీ ఏం వెతుకుతాము లైలా గారు…? #May be you’re looking in the wrong place…#
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి ravi అభిప్రాయం:
10/17/2011 12:44 pm
చాలా బాగుందండి. నవ్వు ఆపుకొలెకపోయాను.
మన సంస్థలు – మన సంస్కృతి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/17/2011 5:19 am
రాజకీయాలూ సినిమాలూ సాంస్కృతిక తిరోగమన రధానికి గుఱ్ఱాలా అనిపిస్తోంది. పాట అంటే సినిమాపాటే, నాయకుడంటే రాజకీయ నాయకుడే ననే పరిస్థితి నడుస్తోంది. పూర్వం ఫామిలీ డాక్టర్లు అనే మాట ఒకటుండేది. కొ్త్తగా ఫామిలీ గురువులు కూడా తయారయ్యారు. సభలు జరుగుతూనే ఉంటాయి, వచ్చిన జనం కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉంటారు. అంతా మొక్కుబడి వ్యవహారం. సరదాగా కాలక్షేపం చేయాలనే కాక సాంస్కృతికమైన కార్యక్రమాలకోసం గాదు – అసలవి కూడా యేవొ మొక్కుబడి వ్యవహారాలైపోయాయి గదా. అన్ని భాషలవాళ్ళు యిలాగే ఉన్నారా, మన తెలుగు వారే ప్రత్యేకమా అన్నది నాకు తెలియదు. ఒకటి మాత్రం స్పష్టం. తెలుగు వాళ్ళకి తమ భాషా సంస్కృతులను తాము గౌరవించుకోవటం మీద శ్రధ్ధ లేదు. ముందు కలుగుతుందన్న ఆశ లేదు. తమలో తాము కలహించుకోవటంలో మన వాళ్ళకున్న పట్టుదల భూమ్మీద మరెవరికీ ఉండదు గాక ఉండదు. ఇద్దరు తెలుగు వాళ్ళుంటే మూడు పార్టీలుగా ఉంటారు. అదీ మన ప్రత్యేకత.
అపరాధి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
10/17/2011 3:58 am