పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:43 am

    నేను పాత చందమామలు చదవడం మొదలుపెట్టాక వాటిల్లో ఉండే సినిమా అడ్వర్టైజ్మెట్లు చూడ్డం, పోస్టర్లు గమనించడం ఆ మధ్య కాలంలో నాకో వ్యసనమై పోయింది. కానీ, ఇలా పోస్టర్ల అధ్యయనం కూడా చేయవచ్చన్నమాట ఇప్పుడే తెలుసుకున్నాను. మీ వ్యాసానికి, అందులో అందించిన రిఫరెన్సులకీ ధన్యవాదాలు.

  2. మూడు వందల రామాయణాలు గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:37 am

    ఇందులో అంత వివాదాస్పదం కావాల్సిన విషయం ఏముందో అర్థం కాలేదు వ్యాసం మొత్తం చదివాక.

    మీ అనువాదం చాలా సరళంగా ఉంది.

    అన్నట్లు, ఆరుద్ర రాసిన పుస్తకం చదివితే వీళ్ళంతా ఏమంటారో మరి!! 🙂

  3. ఒక (అ)నాగరిక ఆనందం గురించి Sowmya అభిప్రాయం:

    11/02/2011 4:09 am

    బాగుందండీ!

  4. దృశ్య సంస్కృతి: సినిమా పోస్టర్లు గురించి DBR అభిప్రాయం:

    11/02/2011 12:18 am

    శభాశ్! అరుదైన విషయాన్ని గురించి విలువైన సమాచారాన్ని సాధికారంగా, విశ్వసనీయంగా, ఉపయుక్త గ్రంథసూచితో సహా ఇచ్చారు. చాలా బావుంది. ఈ వ్యాసం ఈమాట స్థాయికి తగినట్లుగా– కాదు స్థాయిని పెంచేదిగా ఉంది. అభినందనలు, కృతజ్ఞతలు. ఇటువంటి వ్యాసాలు మరిన్ని ప్రచురించాలని కోరుకుంటాను.

    కానీ, పరుచూరి శ్రీనివాస్ గారు కూడా “పరిణితి” అని రాస్తే బుర్ర గోక్కుని నిఘంటువు వెతకవలసి వచ్చింది. “పరిణితి” కాదండీ, “పరిణతి” (“పరిణామము” లా అన్నమాట) “పరిణితి” అన్నమాట ఈ మధ్య ఇంటర్నెట్టులో, చివరికి తెలుగు వార్తా పత్రికల్లో కూడా కనిపిస్తోంది.

    ఈమాట స్థాయిని పెంచేది అని ఎందుకు అనడం అంటే ఈ సంచికలో సంగీతం మీద ఉన్న ఒక వ్యాసం చాంతాడంత పొడుగ్గా ఉన్నా, విశ్వసనీయమైన సమాచారం ఏదీ లేకుండా పుక్కిట పురాణంలా ఉందిలెండి. ఆ వ్యాసానికి రాశి (పొడుగు) మాత్రమే, వాసి (సాధికారమైన authentic సమాచారం) లేదు. భుజాలు తడుముకోవడానికి ఈమాత్రం హింటు చాలనుకుంటాను.

    – DBR
    02/11/11

    [ఆ పొరపాటు అచ్చుతప్పులు దిద్దిన సంపాడక్‌ది. తప్పు సరిదిద్దుకున్నాం – సం.]

  5. పహాడీ రాగం అందాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    11/01/2011 11:55 pm

    రామ్‌గారూ,
    మీ అంచనా నిజమే. గాలికి కులమేదీ పహాడీ రాగమే. అలా standard style ఎత్తుగడ ఉన్న పహాడీ పాటలను గుర్తించడం సులువు. నిజానికి కొన్ని శాస్త్రీయరాగాలతో పోలిస్తే పహాడీకున్న range తక్కువే.
    శ్రీనివాస్ గారు ఉదహరించిన పాత పాటలను నేను వినలేదు. వాటిలో పహాడీ రాగంమీద ఏవైనా ఉన్నాయేమో.
    1937లో చనిపోయిన కరీమ్‌ఖాన్, 1950లో చనిపోయిన ఫయ్యాజ్‌ఖాన్ తదితరులు పహాడీ పాడగా ఇచ్చిన రికార్డులేవీ ఉన్నట్టులేవు. దీనానాథ్ మంగేశ్కర్ (1900-42) పాడినది ఒకటుంది. పహాడీకి జనాదరణ కలిగించినది నిస్సందేహంగా బడేగులామలీయే.

  6. ఒక (అ)నాగరిక ఆనందం గురించి HARANATH అభిప్రాయం:

    11/01/2011 11:20 pm

    చాలా బాగుంది. . .

  7. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి వేమూరి అభిప్రాయం:

    11/01/2011 10:31 pm

    అద్భుతం. తిక్కన గొప్ప కవి అని నాకు తెలుసు. కాని, ఎందుకు అంత గొప్ప కవి అయాడో ఇప్పుడు తెలిసింది.

  8. ఒక (అ)నాగరిక ఆనందం గురించి Apparao.Velidi అభిప్రాయం:

    11/01/2011 9:34 pm

    Excellent and no more words

  9. ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    11/01/2011 8:45 pm

    While there are several other gems in this book, my personal favorite is “Elurellali!”. Stylistically, Chaso may be the one of the few writers that managed to pare the story down to essentials without losing essence. I would not call him a minimalist, but he is certainly modernist in his writing.

    On an unrelated note, western educated readers caught on to the wave of minimalism since 1940’s. The trend started with Hemingway — (Recall how Fidgerald’s style — elaborate, ornate, beautiful, sumptuous and then see austere, severe, sparse, cut-glass style Hemingway). By the time of 60’s, it has become an entrenched style, popularized by the likes of Tobias Wolff, Raymond Carver etc. A generation thus grew up learning the essential writing in that tradition, naturally has the same impact on their children and us immigrants.

    Contrast this situation with AP: The old books, which stretched the story with elaborate descriptions, begat similar style in the beginning of the century. Saakshi like essays, while appealing to us, are exercise in excessive rhetoric. A satire thus became a main stream. Viswanatha is as guilty, taking detours into needless cul-de-sacs in stories, rescuing the prose just in time with clumsy segue’s. The best of them, even Raa Vi Saa is guilty of the same. In fact, I contend that he never wrote prose — he only wrote poetry. His long shadow on the literature meant endless imitations of the style with baroque style degrading the story.

    Of course, Koku is a lot better. While his style is clean and clear, he never resisted a chance to editorialize. Thankfully his editorials are short, and to the point. Looking back, I recall never being annoyed at his short sermons. (Even now, his story of immigrant laborour to Marathi mills is one of my favorite ones).

    Of all the people, Chaso stands out as a capable story teller with mastery of craft. It was not uniform, as I recall. Still, whatever few he gave us in that tradition are worth discussing, dissecting and used as educational tools.

    Humbly yours,
    Ramarao Kanneganti

  10. ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి మోహన అభిప్రాయం:

    11/01/2011 8:23 pm

    ఇది చాల మంచి కథ. అందులో సందేహము లేదు. నేను 50వ దశకములో మదరాసులో చదివేటప్పుడు పరిస్థితులు ఇలాగే ఉండేవి. డిస్‌కంటిన్యూడ్ అనకుండా పేరు కొట్టేసారు (అటండన్స్ రిజిస్టర్ నుండి) అనేవాళ్లు. ఆ కాలములో SSLC (11వ తరగతి) కి ఫీస్ ఎనిమిది రూపాయలు. అప్పటి కాలములో సామాన్యుల యిళ్లల్లో నెల రాబడి సుమారు వంద రూపాయలు మాత్రమే. ప్రతి సంవత్సరము మారుతుండే ఆంగ్లము, తెలుగులాటి పుస్తకాలు తప్ప మిగిలినవి పాత పుస్తకాలే కొనవలసి వచ్చేది. కాగితము కొనుక్కొని నోటుబుక్కులు కుట్టుకోవాల్సి వచ్చేది. ఇళ్లల్లో కూడ లాంతరు దీపాలే, విద్యుచ్ఛక్తి ఉండేది కాదు. నేను మొట్టమొదట ఇంటిలో విద్యుద్దీపము వెలిగించింది తిరుపతిలో BSc చదివేటప్పుడే! కానీ ఉపాధ్యాయులు చక్కగా పాఠాలు చెప్పేవాళ్లు. వేదం వేంకటకృష్ణశర్మ, కాలకంధరం సంజీవరాయశర్మ, కోట సత్య రంగయ్యశాస్త్రి వంటి కవులు, పండితులు తెలుగు బోధించేవారు. వారు వెలిగించిన మణిదీపము ఇంకా వెలుగుతూనే ఉంది. విధేయుడు – మోహన