పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. మూడు లాంతర్లు – 7 గురించి rama bharadwaj అభిప్రాయం:

    10/17/2011 2:27 am

    “the concept of boredom ” అన్నది ఒక పశ్చిమ జీవన శైలి నుంచి కనుక్కున్న చదువుకున్న ఆధునిక కాలపు వారి దృస్టి . దీన్ని సర్వకాల సర్వావస్థతలకీ అన్వయించలేము. అలాగే ఈ నిర్వచనం అన్ని మానసిక అవసరాలకీఅన్ని తరగతుల మనుష్యులకీ సమానంగా అనువర్తించగలిగేది కాదు. మరి అలాంటప్పుడు దాన్ని ఆధారంగా చేసుకునే సిధ్ధాంతాలో వ్యాఖ్యానాలో ఏమి బలాన్ని కలిగి ఉంటాయీ??

    ” boredom” అన్న పదానికి సరి అయిన సమానమైన అర్ధాన్నిచ్చే ఒక్క పదం కూడా తెలుగున లేదూ అంటేనే అటువంటి అనుభవం సమాజంలో లేదు అనీనీ అందుకు అనుగుణంగానే దాన్ని వ్యక్తం చెసే భాష కూడా ఏర్పడలేదనీని అర్ధం ! దానికి సమానమైన అన్నది అటుంచి అసలు దానికి కనీసమ్ దగ్గర గా ఉండే పదం సైతమ్ మనకి లెదు. విసుగు.. ఉబుసుపోక. .తోచక ..ఇటువంటి వేవీ ఇంగ్లేషు లోని “బోర్ ” కి సమానార్ధకాలు కావు.

    తిక్కన గారు మహాభారతాన్ని కడముట్ట అనువదించింది తెలుగున పదమూడవ శతాబ్దంలో.. ” boredom” వలన అని అనగలమా?? ఆ నిర్వచనంలోనే తిరకాసు ఉంది.

    ఒక్క మనిషే సృజన చేసేదీ మళ్ళీ దానికి తాను పాఠకుడు/ పాఠకురాలూ అయ్యేదీ నిజమే అయినా ..సృజన పూర్తి అయిన క్షణాన పాఠక పాత్ర మొదలవుతుంది. గనక తాను తన రచనకి మొదటి పాఠకుడు/ పాఠకురాలు అవడమ్ ఒక్కటే జరిగేది గానీ ఒకే పాత్ర మాత్రమ్ కొనసాగే వీలులేదు. ఈ సంగతి సృజనకారులందరికీ అనుభవేకవేద్యమే!! అలాగే “ఉవాచలూ, మెచ్చుకోళ్ళూ” లేదా విమర్శలూ వీటిలోని నిజానిజాలూ కూడా చాలా స్పస్టంగా సృజన చేసేవారికి తప్పక తెలుస్తాయి. సామాజికమైన అనేక కారణాల వలన వారు అయావాటిని స్వీకరించడమ్ చేయవచ్చు గాక. కానీ ఆ మాటలలోని ఆంతర్యమే తెలియనంత “అమాయకంగా” .. సృజనకి లోనైన వారు ఉంటారని అనుకోవడం కూడా ఒక భ్రమ!!

    కనక ప్రసాద్ భావనలు అల్లుకున్న వ్యక్తులు త్రిపుర.. బిపిన్.. నారాయణ రావులు. ఆయన వ్యాసాల వలన పాఠకులకి అర్ధమయ్యే విషయమ్ ఇది. అయితే వాస్తవ ప్రపంచమూ అలాగే సృజనాత్మకమైన ప్రపంచానుభవమూ వీరిని మించినవి.

    రమ.

  2. రావు బాలసరస్వతీదేవి గురించి తెలుగు జాబిలి అభిప్రాయం:

    10/17/2011 2:02 am

    
శ్రీ రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు ఇంతకు ముందు కూడా చదివాను. అవి ఎక్కువగా వైఙ్ఞానిక,చారిత్రక అంశాలతో కూడినవి. రావు బాలసరస్వతీడేవి గారి గురించి ఆయన రాసిన అన్ని అంశాలతో ఏకీభవిస్తున్నాను. ఏ కాలంలోనైనా కళాకారుల పరిస్థితి ఆయా కాలాల్లో వారిని ఆదరించే, ఆదరించని సమాజపు సంస్కారమ్మీదే ఆధారపడి ఉంటుందని అర్థమవుతోంది. ఇప్పటి పరిస్థితి వేరు. కనీసం ఆ మహానుభావురాలి అంతరంగాన్ని రికార్డ్ చేయడానికైనా రోహిణీప్రసాద్ గారిలాంటి కొందరు ప్రయత్నించడం కొంత ఊరట కలిగించే విషయం. మా అభినందనలు.

  3. మూడు లాంతర్లు – 7 గురించి lyla yerneni అభిప్రాయం:

    10/16/2011 2:33 pm

    కింద పడిపోడం అని, లైలా గారు.
    జారిపోయి…

    ఐతే, ఆ పేరా నాకు సరిగా అర్థమవటల్లేదు. వేరే మాటల్లో చెపుతారా. మీకు వీలున్నప్పుడే.
    Thanks.
    8వ వ్యాసం వచ్చే నెలా? ఇంకా ముందే ప్రచురిస్తారా? సింపుల్ బోర్ డమ్ నించి రిలీఫ్ కోసం కాదు. To do even better. To get to the glorious status of “Forgetting of being.”

    లైలా

  4. మూడు లాంతర్లు – 7 గురించి కనక ప్రసాద్ అభిప్రాయం:

    10/16/2011 5:33 am

    కింద పడిపోడం అని, లైలా గారు.
    జారిపోయి…

  5. మూడు లాంతర్లు – 7 గురించి lyla yerneni అభిప్రాయం:

    10/14/2011 12:13 am

    “బోర్‌డమ్ నుండి, అస్తిత్వపు అర్ధరాహిత్యం నుండి విముక్తిని, లేకుంటే కనీసం ఉపశమనాన్ని ఇవ్వగలిగిన సృజన, అదే బోర్‌డమ్ బారినపడి పతనం కావటం సినిమా వంటి మాధ్యమాల్లోన, సారస్వతంలోనూ సర్వ సాధారణంగా కనిపిస్తుంది.”

    పతనం కావటం అంటే ఏమిటి? కనక ప్రసాద్!

    లైలా

  6. ఈమాట సెప్టెంబర్ 2011 సంచికకు స్వాగతం! గురించి Halley అభిప్రాయం:

    10/12/2011 2:03 am

    అసలెవరికీ ముందుమాట? ఎవరికి ఈ స్వాగతం? పత్రిక ఎన్నో సంచికో చెపితే చాలు. ఈ పేజీ తెల్లగా వదిలేసినా, పాఠకులు ఎడమ పక్కకి వెళ్ళి సంచిక ఎంచుకుంటారు. కుడిపక్క స్పష్టంగా రచనలు కనిపిస్తున్నాయి. రచయితల పేర్లు అక్కడే ఉన్నయి కూడాను.
    +1

  7. నివాసం గురించి RamachandraRao అభిప్రాయం:

    10/11/2011 10:38 am

    వర్ణన, పోలిక ఫరవా లేదనిపించాయి.

  8. మన సంస్థలు – మన సంస్కృతి గురించి Hari Charana Prasad అభిప్రాయం:

    10/10/2011 9:20 pm

    ఎవరక్కడ? నా రివోల్వెర్ ఎక్కడ?

  9. ప్రేమ కవితలు గురించి Muthanna అభిప్రాయం:

    10/08/2011 8:22 am

    5-6 వదిలీ మిగతవన్ని చాలా బాగున్నాయి. శృంగారానికి ముద్దులు, పెదవులు పదప్రయోగాల కన్నా ఆ అర్థం వచ్చేలా చేచెబితే సూపర్బ!

  10. నివాసం గురించి sree rama murthy అభిప్రాయం:

    10/07/2011 9:37 am

    కవిత చాలా హృద్యంగా ఉంది. మనిషి తన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎంత నిర్లక్ష్యం చేస్తాడో,ఎంత
    అనాగరికంగా వ్యవహరిస్తాడో సున్నితంగా చెప్పారు.
    ఆశీర్వాదాలు.