పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. హాబూ నిప్పు గురించి మోహన అభిప్రాయం:

    05/02/2012 7:10 am

    తమ్మి రెడ్డిగారు, మంచి ఊహ, ఏనుగులాటి పెద్ద ఊహ. నాకు కొద్దిగా 2001 A space odyssey చిత్రము జ్ఞాపకము వచ్చినది. విధేయుడు – మోహన

  2. చందవరం, ప్రకాశం జిల్లా గురించి బొక్కా ప్రేమ్ కుమార్ అభిప్రాయం:

    05/02/2012 6:44 am

    పురుగును పొడుస్తుంది
    బిత్తర చూపుల కోడిపుంజు.

    కోడిపుంజు బిత్తర చూపులు కూడా క్యాచ్ చేసి కవిత రాయడం కేక.

    అత్తకు యముడు-అమ్మాయికి మొగుణ్ణి
    తీరుబడిగా నెమరువేస్తుంది ఆవు.

    రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?

    సాయంకాలం పూట
    నాసిరకం పుణుగులు పొంగణాలకి
    గలగల్లాడతాయి రూపాయలు

    ఏసీ హోటల్లో కూకోని..కయితలు రాసేవారికి నాసిరకం ఏమో కాని, తినేవాళ్ళు నాసిరకం తింటున్నాం అని అనుకోరు.

    ఇంకా ఏమన్నారు మీరు

    పొద్దుటి పూట
    పొగలు కక్కే చౌకరకం తేనీరు
    ఆరారగా తాగుతుంది ఊరు

    మీరు షుగర్-ఫ్రీ బూస్టు తాగుతూ రాసుంటారు ఈ లైను

    మొత్తానికి మీ ఈ కయిత కెవ్వు కేక కేకస్యః

  3. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి nagamurali అభిప్రాయం:

    05/02/2012 5:39 am

    సురేశ్ గారూ, ఏమిటో ఈ పదాల మూలాలు తెలుసుకోడానికి మీరెంత కష్టపడుతున్నారో కదా అనిపిస్తుంది ఒక్కోసారి. ‘కంఠాభరణం’ నాటకంలో ఒక సులభమైన సూత్రం చెప్పారండీ. మీకు ఉపయోగపడొచ్చని ఆశిస్తున్నా.

    “ఈ ‘సర్కసు’ శబ్దమేభాష అని మీ మతము?”
    “ఒక సూత్రము చెప్పెదను వినుము. కఠినమైన శబ్దమేదియైననూ సంస్కృతమే.”

  4. నాకు నచ్చిన పద్యం: అర్జునుని వర్ణన గురించి మోహన అభిప్రాయం:

    05/01/2012 6:58 pm

    చాల బావుంది బృందావనరావు గారు! నాకు కూడ విజయవిలాసము అంటే పక్షపాతమే 🙂 తెలుగు సంధితో ఆడుకొనడములో ఇతనికి సాటి మరెవ్వరూ లేదనడములో అతిశయోక్తి లేదు. విధేయుడు – మోహన

  5. దీక్షా లాక్షా రాగ రేఖ గురించి adviatam అభిప్రాయం:

    05/01/2012 4:40 pm

    ” క్షితిజ నిశాంత నీలిమల మీద
    చెలీ!
    అవిశ్రాంతంగా మనం
    నవ నవాలైన
    ఉషః ఉదయాలు పరవాలి”

    అద్భుతంగా ఉంది అండి

  6. బ్రహ్మ సృష్టి గురించి మోహన అభిప్రాయం:

    05/01/2012 3:37 pm

    వేలూరి గారు, కథ బాగుంది, కడుపుబ్బ నవ్వించారు. ఇంతకు బ్రహ్మ భారతదేశపు వాసియా లేక అమెరికాలోని దక్షిణ ప్రాంత వాసియా? ఇంతకూ నాలుగు తలల బ్రహ్మకు నాలుగు టిక్కెట్లా లేక బ్రహ్మ కూడ కామరూపుడా? లేకపోతే బ్రహ్మ నాలుగు తలలను ఒక బ్రహ్మాణీ మాత్రమే చూడగలుగుతుందా? అసలు బ్రహ్మకు సరిగా గూగుల్ చేయడము చేతనవుతుందా? నేను గూగుల్ చేసినప్పుడు, ఆఫ్రికాలో రెండు చోటులలో, అమెరికాలో ఒక చోట, ఇండియాలో ఒక చోట ఈ శంబళ ఉన్నది, కాని బ్రహ్మకు కావలసిన శంబళ లేదు కాబోలు. బ్రహ్మ ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇంటిలో కుంపటి ఎలా వెలుగుతుందో? వ్రాయండి, వ్రాయండి, ఇలాగే వ్రాయండి. లాఫ్టర్ ఈస్ ది బెస్ట్ మెడిసిన్ కాబట్టి ఇక మీద మందులు వాడడము తక్కువ చేసికోవచ్చు 🙂 విధేయుడు – మోహన

  7. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Purnima అభిప్రాయం:

    05/01/2012 2:53 pm

    నాలుగేళ్ళ కిందట తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేసుకునే రోజుల్లో తిలక్ కథలు చదివాను. అందులో నాకు ఈ ’అద్దంలో జిన్నా’ కథ బాగా నచ్చింది. మీరు రాసినదాంట్లో ఓ రెండు విషయాలు ’నా అభిప్రాయాలే’ అని అనిపించాయి.

    >> కథలని కొన్ని లక్షణాల చట్రాలతో బిగించి కట్టుదిట్టంగా చూసే అలవాటున్న వారికి, ఇది ఒక స్కెచ్‌. సైకలాజికల్‌ స్కెచ్‌గా కనిపించవచ్చు.

    ఈ కథ నాకు చాలా నచ్చటానికి ఇదే ముఖ్యకారణం. ఈ కథను చదివిన కొందరు ఇది చాలా అసంబద్ధమైన కథనీ, ఒక పట్టాన అర్థంకాదనీ అంటారు. కానీ నన్ను అడిగితే, కథాకాలంనాటి దేశరాజకీయ పరిస్థితులు అంతగా తెలియకున్నా కూడా ఈ కథ బలంగా తాకింది నన్ను.
    తిలక్ ఏమంత గొప్ప కథకుడు కాదన్న వాదననూ విన్నాను. కానీ నేను చదివిన అతికొద్ది మంది తెలుగు కథకుల్లో తిలక్ కథలు ఒకట్రెండు నాకు చాలా నచ్చేవి ఉన్నాయి. నాకాయన కవిత్వంకన్నా కథలమీదే ధ్యాస ఎక్కువ.

    >> లబ్ధప్రతిష్టులైన కవులు కథ రాసినా, కవిత్వం రాసినా కవిత్వం లాగానే కనపడుతుంది. చదివితే కవిత్వంలా వినిపిస్తుంది.

    మీ మటుకు మీకే కాదు, నేను కూడా మీ జట్టే ఈ విషయంలో. జనరలైజ్ చేసే ఉద్దేశ్యం నాకూ లేదుగానీ, దాదాపుగా నేను చదివిన కవుల prose కూడా కవిత్వంలానే చదివిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. తెలుగులో శ్రీశ్రీ, బైరాగి కథలు అలా అనిపించాయి నాకు.

  8. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/01/2012 9:58 am

    @Siddineni గారు: ’యాట’ అన్న పదానికి ram, she-goat అని ఇచ్చిన అర్థాలు పునరుక్తి కాదు. ’యాట’ అన్న ధాతువు, దాని తద్భవ రూపాలను కొన్ని ద్రావిడ భాషలలో గొఱ్ఱె (మగ గొఱ్ఱె) అన్న అర్థంలోనూ, మరి కొన్ని భాషలలో ఆడుమేక గాను ఉపయోగిస్తారు.

    వివిధ భాషలలో ఈ ధాతువుకు సంబంధించిన సజాతి పదాలు వాటి అర్థాలు:

    తమిళం: యాటు, ఆటు goat, sheep; ఆట్ట్-ఆళ్ shepherd.
    మలయాళం: ఆటు goat, sheep; ఆట్టుకారన్ shepherd.
    కోత:. అర్ goat.
    తొద: ఒడ్ goat.
    కన్నడ: ఆడు goat
    కొడగు: అడి
    తుళు: ఏడు
    తెలుగు: ఏడిక, ఏట
    గొండి: యేటీ, ఏటి she-goat (Voc. 376).
    పెంగొ: ఓడ goat.
    మండ: ఊడె
    కుయి: ఓడ
    కువి: ఓడా, ఓడ
    కూరుఖ్: ఏరా she-goat.
    మాల్తో: ఏరె
    బ్రాహుయి: హేట్
    సంస్కృతం: ఏడ, ఏడక, ఏడీ a kind of sheep;
    (Turner, CDIAL, no. 2512., DEDR 5152)

    చావల్ అన్న పదం ఏ భాష జన్యం అన్న విషయం గురించి ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. అది కచ్చితంగా సంస్కృత జన్యము కాదు (సంస్కృత పదమైన శ్యామల జన్యమని వాదించేవారు లేకపోలేదు). అది ద్రావిడ భాషా జన్యమైనా అయ్యిండాలి. లేదా లుప్తమైన ఉత్తరాది దేశభాషల నుండి హిందీలోకీ ద్రావిడ భాషలలోకి ప్రవేశించైనా ఉండాలి.

  9. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    05/01/2012 8:45 am

    ”యాట ‘ram, she-goat’ > ఆటు (త.) – – ఏట (తె.)”
    ram ఆంటే male goat/sheep [uncastrated] గదా? అచ్చు తప్పనుకుంటాను.
    ‘చవియల్/చావల్ > అవియల్ = దంచిన బియ్యం’
    హిందీ లో కనిపించె చావల్ ద్రవిడ జన్యమా?

  10. వేటూరి పాట గురించి pradeep అభిప్రాయం:

    05/01/2012 5:47 am

    “తెర చాటు చందమామ” బ్లాగ్ చర్చలొ చెప్పినట్టు అనువాద చిత్రాల గీతాలు రాయడంలొ వేటూరి గారు విఫలమయ్యారేమో కాని అనువాద చిత్రాలకి పాటలు రాసేపుడు చాల limitations ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి, చిత్రీకరణ కావచ్చు, లేదా సంగీత దర్షకుడి pressure కావచ్చు, పెద్దల అనుకరణ కావచ్చు. వీటిని కూడా మనము దృష్టిలొ పెట్టుకొవాలి కదా? చాల మంచి పాటలు రాసిన వాళ్ళు ఇందులొ విఫలం కావడానికి ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది.

    ఇక్కడ ఇంకొ విషయం గమనించాలి, అనువాద చిత్రాలకి (Dubbing songs) విఫలమయిన వాళ్ళే remake movies songs బాగానే రాశారు కదా? ఉదాహరణకి “సీతాకొక చిలక” సినిమాలొ పాటలు బాగుంటాయి.