పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. తెలుగు భాష వయస్సెంత? గురించి ramesh kolluri అభిప్రాయం:

    05/02/2012 9:04 pm

    చరిత్ర, భాషా చరిత్రల గురించి ఆసక్తి ఉన్నవారందరికీ ఎంతో పనికొచ్చే మంచి వ్యాసం తెలియని విషయాలెన్నో ఆసక్తికరంగా చెప్పారు.ధన్యవాదములు.

  2. లక్ష్మణదేవర నవ్వు గురించి Veluri Venkateswara Rao అభిప్రాయం:

    05/02/2012 6:44 pm

    1983-1985 లలో చికాగో తెలుగు సంఘం తరఫున నెలనెలా ఒక వ్రాత పత్రిక నా సంపాదకత్వంలో (హత విధీ!) వెలువడేది. 1983 సెప్టెంబర్‌ తెలుగు వెలుగు సంచికలో వెల్చేరు నారాయణ రావు గారు ‘ నవ్వకపోతే గవ్వకి కొర గావు ‘ , అనే మకుటంతో ఒక చిన్న వ్యాసం రాశారు. అందులో ‘ నవ్వు నాలుగు విధాల చేటు ‘, అనే తెలుగు సామెతకి సంబంధించిన కథ తెలిసిన వారు తెలుగు వెలుగుకి రాయండి అని కోరారు.

    వెంటనే వడ్లమాని పద్మావతి గారు ఈ కింది రామాయణ కథ పంపించారు. శ్రీమతి పద్మావతి గారు వడ్లమాని కార్తీక్ అన్న పేరుతో చాలా కథలు రాశారు. ఆమె రాసిన ” పడమటి గాలులు” అనే నవలని వంగూరీ ఫౌండేషన్‌ వారు 2005 లో ప్రచురించారు.
    శ్రీమతి పద్మావతి గారు పంపిన రామాయణ కథ 1983 డిసెంబర్‌ తెలుగు వెలుగులో ప్రచురించబడింది. ఇదీ ఆమె పంపిన కథ!

    రాముడు రావణసంహారం తరువాత అయోధ్యకు సతీసమేతుడై వచ్చి పట్టాభిషేకం చేసుకుంటున్న సమయం అది. ఆ సమయంలో లక్ష్మణుడు పకపకమని వెకిలిగా పెద్ద నవ్వు నవ్వాడట! ఆ నవ్వు ఈ కింది నలుగురూ నాలుగు విధాలుగా భావించారుట!
    ‘స్వంత అన్నగారి గుట్టు (“ఇంటిగుట్టు లంకకి చేటు”) చెప్పి, రామునిచే రావణసంహారంచేయించి , రాజ్యానికి వారసుడనై, రాముని భక్తిపూర్వకంగా కొలుస్తున్నానే! ఎంతటి కపట భక్తుడవు!’ అని తలచి లక్ష్మణుడు నవ్వాడా అని విభీషణుడు అనుమానించాడు.
    ‘సంవత్సరమంతా పరపురుషుని ఇంటనున్న భార్యని ఏలుకుంటున్నాను ‘, అందుకని లక్ష్మణుడు పకపకనవ్వాడేమోనని శ్రీరాముడు భావించాడట!
    ‘స్త్రీలోలుడు, దుర్మార్గుడూ అయిన పురుషుని గూటలో ఉండి అగ్నిప్రవేశం చేసినణ్త మాత్రాన పతివ్రతవు కాగలవా? ఎంతటి అపనింద వస్తుందో ఇకముందు? ‘ అందుకని నవ్వుతున్నాడా లక్ష్మణుడు? అని జానకి అనుమానించిందట!
    ‘అన్నని చంపి, అన్నగారి భార్యని కట్టుకొని చేతులుజోడించి రామునికి మొక్కినంత మాత్రాన ముక్తి వస్తుందా?’ అందుకని లక్ష్మణుడు వెకిలి నవ్వు నవ్వాడేమోనని సుగ్రీవుడు సంశయాత్మకుడయ్యాడట!
    అప్పుడు రాముడు ‘తమ్ముడా ! లక్ష్మణా ! ఈ శుభసమయంలో నీవు ఎందుకు వెకిలిగా నవ్వావు? కారణం చెప్పకపోతే నేను ఈ రాజ్యానికి పట్టాభిభిషిక్తుణ్ణి కాదలచుకో లేదు ‘ అని గట్టిగా ప్రశ్నించాడు.
    అప్పుడు లక్ష్మణుడు, ‘అన్నా! పధ్నాలుగేళ్ళు కంటికి నిద్రరాని నన్ను కామించని ప్రేమించని ఆ నిద్రాదేవత, ఇవాళ, ఈ శుభసమయంలో నీ పట్టాభిషేకం చూడనీయకండా చేస్తున్నది. నా కళ్ళెదురుగా నిలబడ్డ ఆనిద్రాదేవతని చూసి వెకిలిగా నవ్వాను,’ అంటూ రాముని పాదాలపై మోకరిల్లాడట!

  3. చందవరం, ప్రకాశం జిల్లా గురించి Aparna krishnavajhala అభిప్రాయం:

    05/02/2012 3:57 pm

    పర్వత శేఖర్ గారు, చందవరంలో పెరగనవసరం లేదు కవి అవడానికి, కాని కవి చందవరం వెళ్ళాడంటే, కవి హృదయం దాగదు.

  4. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి Madhava Murthy అభిప్రాయం:

    05/02/2012 2:11 pm

    ఏ కవిత కానీ, కథానిక కానీ కొన్ని సంవత్సరముల తరువాత మరల చదివినప్పదు, మనకు ఇంకా బాగా రచయిత భావాలు అర్థమవుతాయి. మాయాబజార్ సినిమా చూచిన ప్రతిసారి మనం కొంత కొత్తది తెలుసుకుంతాము. ఇక్కడ జిన్నా గురించి రాసిన కథలొ మార్పులేదు, మార్పు మన ఆలోచనలలొ.

  5. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/02/2012 1:00 pm

    “ఆశ్చర్యార్థకాలను, హర్షాతిరేకాలను, బాధను దుఃఖాన్ని తెలిపేటప్పుడు బంధుత్వ పదాలను వాడడం ద్రావిడ భాషల ప్రత్యేకత అని మీకు తెలుసా?”

    నిజంగా తెలియదు మీరు చెప్పేదాకా. తమిళులు “అబ్బాడీ, అమ్మాడీ” అని ఆశ్చర్యపోవడం చూసాను. హిందీలో సైతం బాప్‌రే బాప్‌ అని గుండెలు బాదుకుంటారు కదా? 🙂

    సురేశ్‌ గారూ, మరో మాట – సంఖ్యాపదాల మీద రాసిన వ్యాసంలో మీరు – “ఏడుకొండల గురించి అన్నమయ్య” ప్రస్తావించాడా ఏ పదంలోనైనా?” అని అడిగారు. కొండలరాయడు, కొండలయ్య అనే మాటలను చూసిన జ్ఞాపకం. కానీ ఏడుకొండలు అనే మాట ఆయన వాడినట్లు అనిపించలేదు. అది ఇటీవలి పదబంధమా?

  6. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/02/2012 11:19 am

    @nagamurali “అలాగా? మరి ఈ ‘సర్కసు’ శబ్దమునకు అర్థముమాట?” అని అడిగితే, పానుగంటి వారు సరైన సమాధానం ఇవ్వలేదు కానీ నా సమాధానం ఇలా ఉండేది:

    నాయనా, ఈ శర్కస్- శబ్దము అతి ప్రాచీనమైనది. ఈ రకమైన కసరత్తులను నెరపడంలో శర్కరాక్షుడనే మహర్షి మహాప్రసిద్ధిని చెందినవాడు. కావుననే, ఆతని పేరిట వీటిని శర్కరాక్ష ప్రక్రియలు అని పిలిచేవారు. ఆయుర్వేదాన్ని నిర్వచించిన పెక్కు మహర్షులలో ఆయన ఒకరని చరకసంహిత మనకు చెబుతుంది::

    కాంకాయనః కైకశేయో ధౌమ్యో మారీచకాశ్యపౌ
    శర్కరాక్షో హిరణ్యాక్షో లోకాక్షః పైంగిరేవ చ
    (చరకసంహిత సూత్ర స్థానః 1.12)

    ఈ మ్లేచ్ఛులకు శర్కరాక్ష ప్రక్రియలు అనుటకు నోరు తిరగక వాటిని శర్కస్ అనియు సర్కస్ అనియు మార్చుకున్నారు. చూసావా నాయనా, తల్లి సంస్కృతంబు ఎల్ల భాషలకు అని ఇప్పుడైనా ఒప్పుకుంటావా?

    :-).

  7. చందవరం, ప్రకాశం జిల్లా గురించి Parvatha Sekhar అభిప్రాయం:

    05/02/2012 10:52 am

    చాల బాగుంది ఇంద్రాణి గారూ! అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు, వాహ్. వాహ్! నాకు బాగా నచ్చింది! మీరూ చందవరం లోనే పెరిగారా?

  8. తేనీటి సమయం గురించి Giri అభిప్రాయం:

    05/02/2012 9:49 am

    వైదేహి గారు,
    చాలా బాగుంది మీ తేనీటి కవి సమయం. ఒక సాధారణ సన్నివేశాన్ని మరల మరల చూడాలనిపించే చిత్తరువుగా తీర్చిదిద్దడం బాగుంది.
    అభినందనలు.
    – గిరిధరరావు.

  9. చందవరం, ప్రకాశం జిల్లా గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/02/2012 9:36 am

    > రాయెత్తి కొట్టకుండా.. దీనికి అర్ధం ఏంటో వివరిస్తారా?

    ఆవు సినిమా పోస్టర్‌ను తిని నెమరేస్తుందని అర్థం కాదా?

  10. చందవరం, ప్రకాశం జిల్లా గురించి nadeem ansari అభిప్రాయం:

    05/02/2012 9:23 am

    చక్కని కవిత్వం చాలా రోజులకు. కోస్తావాండ్లకు తెలుగు వచ్చుననే అనిపించుచున్నది. పలుకుబడిలో కాకున్నా కవుల మనసులలొ తెలుగు ఉన్నది. కవికి ధన్యవాదాలు.