>> … ఆ పరుగుల జీవితం లోంచి ఒక్క అడుగు అవతలకి వేసి ఇలాంటి యాత్రలకు ఉపక్రమిస్తే
ఇలాంటి యాత్రలు చేసి, రాతలూ, అక్షర సత్యాలూ, అనువాదాలూ బొమ్మలతో సహా రాసి, అంత సులభంగా ఎక్కడకీ వెళ్ళలేని మా అందరి అశక్తత నెల నెలా గుర్తు చేసి ఏడిపించే అమ్రేంద్ర గారి మీదా, శేషగిరి గారిమీదా కేసు వేసి కోర్టుకు లాగబోతున్నాను. కాసుకోండి. 🙂 నా “మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు.”
“వేలాకోలము” అనేది వేళాకోళము అని ఉండాలేమో. ఒకచోట ఒకలా రెండో చోట మరొకలా రాసారు. నిఘంటువు మాత్రం రెండూ ఒకటే అంటోంది. భాష మార్పు కాల ప్రభావం కావొచ్చు (కొత్త నిఘంటువులు మాత్రమే చూపిస్తున్నాయా? నేను సరిగ్గా చూళ్ళేదు). “శుద్ధ దన్యాసి” అనేది మాత్రం తప్పు అనుకుంటా.
మొదటి పది పేరాలూ కథకి అనవసరం అనిపించింది. మాటి మాటికీ మీసాలు సవరించుకోవడం, రొమ్ము విరుచుకోవడం అహంకారాన్నో ఆత్మ విశ్వాసాన్నో తలపింప చేస్తాయి అనుకుంటే ‘ఆ ఈ ఆశ్రమంలో ఏడవడానికేం ఉందిలే?’ అనే భావాలూ, అక్కడ ఏడుపు వచ్చేవాళ్ళని చూసి నవ్వుకోవడం అటువంటి చాలామందికి మామూలే. ఏడిచేవారి మనోభావాలు వేరుగా ఉంటాయనీ, అవి కూడా నిజమేననీ వప్పుకోలేకపోవడం మరో తప్పు. సైకాలజిస్ట్‌లకి అర్థం అవుతుంది కాబోలు. నాకు ఏడుపు రాదు కనక నేను నీకన్నా గొప్పోణ్ణి, నీకు కపటం, నాకు అది లేదు సుమా అని చెప్పుకోవడానికేమో. అసలు నిజం ఏమిటంటే ఏడిచినవాడికి ఏడిచాక ఉపశమనం కలుగుతుంది (ఎందుకు ఏడుపు అనేది చర్చించడం లేదు, గమనించగలరు). ఏడవనివాడికి ఆ ఉపశమనం ఎప్పటికీ లేదు. అలా ఏడవకపోవడం డిగ్నిటీ అనుకుంటే అది వేరే విషయం.
ఇది నిజజీవితంలో అతి సాధారణంగా కనిపించేదే. ఏదైనా సభలో అందరినీ కల్సి పాట పాడమంటే కొంతమంది నోరు కట్టేసుకుంటారు, ఆ నేనెందుకు పాడాలి అనుకుంటూ. ఇది మానవ సంబంధాలు అనే శిక్షణలో ఒక భాగం. యండమూరి ఈ విషయం ‘విజయానికి ఐదు మెట్లు’ పుస్తకంలో ప్రస్తావించారు (ఆయన శిక్షణకి వెళ్ళినప్పుడు లేచి వచ్చి డాన్స్ చేయమంటే ఎవరూ రాలేదు. తర్వాత ఎందుకో చెప్తే ఒక్కొక్కరూ లేచారు అని).
జయమోహన్‍గారి మిగతా కథలతో పోలిస్తే ఇదేం గొప్పగా లేదు. అనువాదంలో అక్షర దోషాలు సవరించాలి.
“ఎవరో ఒకరు పుస్తకాలు రాయడం, వాటిని పబ్లిషర్లు చకచకా అమ్మేసి, ‘ఇన్ని కాపీలు అమ్మాము, సూపర్ హిట్ అయింది’ అని అమ్ముడుపోయిన కాపీల ఆధారంగా పుస్తకంలోని సాహిత్యం నాణ్యతను జస్టిఫై చేసి ప్రచారం చేయడం కరెక్టా?”
రచయితలు డబ్బులు ఇవ్వక్కరలేకుండా కూడా పబ్లిషర్ల డబ్బుతో పుస్తకం వేసి, అమ్మి, వాటి మీద రాయల్టీ ఇచ్చే రోజులు తెలుగు పుస్తకాలకు మళ్ళీ వస్తాయని నేను అనుకోలేదు. అది ఇప్పుడు జరుగుతోంది. ఇది కరెక్టా అంటే ఇంతకుముందున్నట్టు ఎవరి పుస్తకాలు వాళ్ళు వేసి ఊరికే పంచిపెట్టుకునే రోజులు మెరుగా? ఆఫ్‌కోర్స్, మీరు చెప్పిన అవలక్షణాలు దాటాల్సిందే. అయితే, గతంలో కూడా ఎవ్వరూ తమ పుస్తకం గురించి పన్నెత్తి మాట అంటే ఊరుకునేవారు కాదు. మీద పడిపోయేవారు. ఇంతకుముందు కూడా ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టి నాలుగు మంచిమాటలు రాయమని అడిగేవారు. ఇప్పుడున్న అవలక్షణాలేమీ కొత్తవి కాదు. కాకపోతే, ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి, ఇంతకుముందు కేవలం పోయేవి.
ఇక పాఠకుల విషయానికి వస్తే – కొత్త పాఠకులు మెల్లిగా మంచి చెడులు తెలుసుకుంటారు. నెమ్మదిగా నమ్మదగ్గ స్వరాలు తయారవుతాయి. పరిస్థితి మెరగవుతుంది.
ఇన్నేళ్ళుగా పుస్తకాలు అమ్ముడుపోలేదు. అచ్చేసుకోవడం పంచుకోవడం పరమార్థంగా ఉండేది. ఆ పంచాకా అయినా అవతలివారు చదువుతారో లేదో కూడా తెలిసేది కాదు. కొత్త పాఠకులు వచ్చేవారు కాదు. పాత పాఠకులు పాత పుస్తకాలే చదువుకునేవాళ్ళం. సమకాలీన రచయిత కన్నా తెలివితక్కువ పెద్దమనుషి ఎవరూ లేరనేదాకా వచ్చింది వ్యవహారం. కాబట్టి, ఒకరినొకరు మెచ్చుకోవడమే వ్యవహారం. వేరే పరామితులు పాడూ ఉండేవి కాదు. సేల్స్ అవ్వకపోవడం అటుంచి అది ఆలోచించినా తప్పు, నువ్వు అమ్ముకోవడానికి పుస్తకం రాస్తున్నావా అనేదాకా ఉండేది సంగతి.
మొత్తానికి, ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసంలో కనీసం ఐదువందల కాపీల దాకా ఇప్పుడు పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఉన్నట్టే దీనికీ మార్కెటింగ్ కావాలి. చేసుకుంటున్నారు. ఎంతో కొంత అంటే ఎంత అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి, నిర్ణయించుకుంటున్నారు. ప్రధానంగా అమెజాన్‌లో అమ్ముకుంటున్నారు కాబట్టి రేటింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి, కనీసం ఏదో ఒక పరామితి వచ్చింది. మంచిచెడులు క్రమేపీ తెలుస్తాయి. లక్షల్లో ఉన్నారిప్పుడు కొత్త పాఠకులు, వాళ్ళు ఒక దారి వెతుక్కుంటారు. అందరూ ఏదోక దారికి వస్తారు.
ఇదంతా మంచికేనా అన్న ప్రశ్న వేసుకోవడానికి ఇంకాస్త సమయం ఉంది. ఇది శుభం పలకాల్సిన సమయం.
గీతా రామస్వామి గారి గారి ‘అడగడుగున తిరుగుబాటు’ పుస్తకం ఒక వెలుగు దారి దీపం. మీ పరిచయ వ్యాస విశ్లేషణ చాలా బాగుంది. సమగ్రంగా ఉండి పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తిని కలుగజేస్తున్నది. అభినందనలు.
వ్యాసం నాకు చాలా కాలం క్రితం నెర్చుకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాలను గుర్తు చేసింది. ఆ సమయంలో మేము కేరాలిటీని ఒక లక్షణంగా మాత్రమే నేర్చుకున్నాము మరియు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు, నేను పాఠాన్ని కొత్త అర్థంతో చూడగలుగుతున్నాను.
వివిధ శాస్త్రాల ద్వారా ఒక అంశాన్ని నేయడం అనే రచయిత శైలి (నైపుణ్యం) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సైన్స్ కాన్సెప్ట్‌ల గురించి పిల్లలకు చెప్పడానికి నేను ఉపయోగించే పద్ధతి ఇదే. ఒక వ్యక్తి ఒక భావన యొక్క వివరణ మరియు వాస్తవ ప్రపంచ వినియోగాన్ని అర్థం చేసుకుంటే, అతను బాగా అర్థం చేసుకుంటాడు. ఉదాహరణలను ఇవ్వడం, ముఖ్యమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేయడం వంటి రచయిత యొక్క మార్గం చాలా ఉపయోగకరంగా మరియు సముచితంగా ఉంటుంది.
సైన్స్‌ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇది మంచి మార్గం. రచయిత ఈ కళారూపంలో నిపుణుడు.
నాకు తెలీని పదం ఎదురైనప్పుడు, అది నన్ను ఆపి ఆలోచించేలా చేస్తుంది (అర్థం చేసుకోవడానికి).
ప్రతి సాంకేతిక పదానికి సరైన తెలుగు పదాలు అవసరం. జనాదరణ పొందిన ఆంగ్ల పదాలను ఉపయోగించడం మంచిదని నేను భావిస్తున్నాను. మనము దీన్ని ఇప్పటికే చేస్తాము (బస్సు, కార్ మొదలైనవి). అవును మనం శాస్త్రాలకు మద్దతు భాషగా ఆంగ్లానికి సమానమైన తెలుగును తయారు చేయాలి. ఈ ప్రయత్నంలో, మనము రెండు పదాలతో పిల్లల/విద్యార్థి జీవితాన్ని క్లిష్టతరం చేస్తున్నామా (ముందు ఒకటి నేర్చుకోండి మరియు సమానమైన ఆంగ్ల పదాలను నేర్చుకోండి).
జీవితానికి అక్షర రూపం, ఎవరి కథని వారే దృశ్యమానంగా సినిమాలా మన కథనే తీసారా అన్నట్టు ఉంది, టైటిల్ కూడా కథకి చాలా ఆప్ట్ గా పెట్టారు. ఆమె భావాలు ఆది భౌతికం, ఆధ్యాత్మికాల మధ్య పరుగులు తీస్తూ ఆ మనసు నలిగిన తీరును వర్ణించిన తీరు అద్భుతం. పిల్లలు మనుషులుగా మారడం, విప్లవాత్మక పదాలు, కవి యొక్క భావుకత, తాత్వికత, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ తన లాంటి సాహిత్య స్ఫూర్తితో బాటు సామాజిక బాధ్యతను తెలియచేసాయి. అత్యంత ఆవశ్యకత ఇలాంటి సాహిత్యం, మారాలంటే ఈ నాటి యువతరం.
ఎవరెస్ట్ బేస్ కాంప్ 4 గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
02/02/2025 2:42 pm
>> … ఆ పరుగుల జీవితం లోంచి ఒక్క అడుగు అవతలకి వేసి ఇలాంటి యాత్రలకు ఉపక్రమిస్తే
ఇలాంటి యాత్రలు చేసి, రాతలూ, అక్షర సత్యాలూ, అనువాదాలూ బొమ్మలతో సహా రాసి, అంత సులభంగా ఎక్కడకీ వెళ్ళలేని మా అందరి అశక్తత నెల నెలా గుర్తు చేసి ఏడిపించే అమ్రేంద్ర గారి మీదా, శేషగిరి గారిమీదా కేసు వేసి కోర్టుకు లాగబోతున్నాను. కాసుకోండి. 🙂 నా “మనోభావాలు దెబ్బతీసేస్తున్నారు.”
ఇద్దరు కళాకారులు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
02/02/2025 2:18 pm
నా సోది.
“వేలాకోలము” అనేది వేళాకోళము అని ఉండాలేమో. ఒకచోట ఒకలా రెండో చోట మరొకలా రాసారు. నిఘంటువు మాత్రం రెండూ ఒకటే అంటోంది. భాష మార్పు కాల ప్రభావం కావొచ్చు (కొత్త నిఘంటువులు మాత్రమే చూపిస్తున్నాయా? నేను సరిగ్గా చూళ్ళేదు). “శుద్ధ దన్యాసి” అనేది మాత్రం తప్పు అనుకుంటా.
మొదటి పది పేరాలూ కథకి అనవసరం అనిపించింది. మాటి మాటికీ మీసాలు సవరించుకోవడం, రొమ్ము విరుచుకోవడం అహంకారాన్నో ఆత్మ విశ్వాసాన్నో తలపింప చేస్తాయి అనుకుంటే ‘ఆ ఈ ఆశ్రమంలో ఏడవడానికేం ఉందిలే?’ అనే భావాలూ, అక్కడ ఏడుపు వచ్చేవాళ్ళని చూసి నవ్వుకోవడం అటువంటి చాలామందికి మామూలే. ఏడిచేవారి మనోభావాలు వేరుగా ఉంటాయనీ, అవి కూడా నిజమేననీ వప్పుకోలేకపోవడం మరో తప్పు. సైకాలజిస్ట్‌లకి అర్థం అవుతుంది కాబోలు. నాకు ఏడుపు రాదు కనక నేను నీకన్నా గొప్పోణ్ణి, నీకు కపటం, నాకు అది లేదు సుమా అని చెప్పుకోవడానికేమో. అసలు నిజం ఏమిటంటే ఏడిచినవాడికి ఏడిచాక ఉపశమనం కలుగుతుంది (ఎందుకు ఏడుపు అనేది చర్చించడం లేదు, గమనించగలరు). ఏడవనివాడికి ఆ ఉపశమనం ఎప్పటికీ లేదు. అలా ఏడవకపోవడం డిగ్నిటీ అనుకుంటే అది వేరే విషయం.
ఇది నిజజీవితంలో అతి సాధారణంగా కనిపించేదే. ఏదైనా సభలో అందరినీ కల్సి పాట పాడమంటే కొంతమంది నోరు కట్టేసుకుంటారు, ఆ నేనెందుకు పాడాలి అనుకుంటూ. ఇది మానవ సంబంధాలు అనే శిక్షణలో ఒక భాగం. యండమూరి ఈ విషయం ‘విజయానికి ఐదు మెట్లు’ పుస్తకంలో ప్రస్తావించారు (ఆయన శిక్షణకి వెళ్ళినప్పుడు లేచి వచ్చి డాన్స్ చేయమంటే ఎవరూ రాలేదు. తర్వాత ఎందుకో చెప్తే ఒక్కొక్కరూ లేచారు అని).
జయమోహన్‍గారి మిగతా కథలతో పోలిస్తే ఇదేం గొప్పగా లేదు. అనువాదంలో అక్షర దోషాలు సవరించాలి.
[సవరించాము. కృతజ్ఞతలు – సం.]
సంపాదకునికి ఉత్తరం గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:
02/02/2025 11:52 am
రచయితలు డబ్బులు ఇవ్వక్కరలేకుండా కూడా పబ్లిషర్ల డబ్బుతో పుస్తకం వేసి, అమ్మి, వాటి మీద రాయల్టీ ఇచ్చే రోజులు తెలుగు పుస్తకాలకు మళ్ళీ వస్తాయని నేను అనుకోలేదు. అది ఇప్పుడు జరుగుతోంది. ఇది కరెక్టా అంటే ఇంతకుముందున్నట్టు ఎవరి పుస్తకాలు వాళ్ళు వేసి ఊరికే పంచిపెట్టుకునే రోజులు మెరుగా? ఆఫ్‌కోర్స్, మీరు చెప్పిన అవలక్షణాలు దాటాల్సిందే. అయితే, గతంలో కూడా ఎవ్వరూ తమ పుస్తకం గురించి పన్నెత్తి మాట అంటే ఊరుకునేవారు కాదు. మీద పడిపోయేవారు. ఇంతకుముందు కూడా ఉచితంగా పుస్తకాలు పంచిపెట్టి నాలుగు మంచిమాటలు రాయమని అడిగేవారు. ఇప్పుడున్న అవలక్షణాలేమీ కొత్తవి కాదు. కాకపోతే, ఇప్పుడు డబ్బులు కూడా వస్తున్నాయి, ఇంతకుముందు కేవలం పోయేవి.
ఇక పాఠకుల విషయానికి వస్తే – కొత్త పాఠకులు మెల్లిగా మంచి చెడులు తెలుసుకుంటారు. నెమ్మదిగా నమ్మదగ్గ స్వరాలు తయారవుతాయి. పరిస్థితి మెరగవుతుంది.
ఫిబ్రవరి 2025 గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:
02/02/2025 11:45 am
ఇన్నేళ్ళుగా పుస్తకాలు అమ్ముడుపోలేదు. అచ్చేసుకోవడం పంచుకోవడం పరమార్థంగా ఉండేది. ఆ పంచాకా అయినా అవతలివారు చదువుతారో లేదో కూడా తెలిసేది కాదు. కొత్త పాఠకులు వచ్చేవారు కాదు. పాత పాఠకులు పాత పుస్తకాలే చదువుకునేవాళ్ళం. సమకాలీన రచయిత కన్నా తెలివితక్కువ పెద్దమనుషి ఎవరూ లేరనేదాకా వచ్చింది వ్యవహారం. కాబట్టి, ఒకరినొకరు మెచ్చుకోవడమే వ్యవహారం. వేరే పరామితులు పాడూ ఉండేవి కాదు. సేల్స్ అవ్వకపోవడం అటుంచి అది ఆలోచించినా తప్పు, నువ్వు అమ్ముకోవడానికి పుస్తకం రాస్తున్నావా అనేదాకా ఉండేది సంగతి.
మొత్తానికి, ఇప్పుడు పరిస్థితి మారింది. కనీసంలో కనీసం ఐదువందల కాపీల దాకా ఇప్పుడు పుస్తకాలు అమ్ముడుపోతున్నాయి. ప్రపంచంలో ఏ వస్తువుకైనా ఉన్నట్టే దీనికీ మార్కెటింగ్ కావాలి. చేసుకుంటున్నారు. ఎంతో కొంత అంటే ఎంత అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి, నిర్ణయించుకుంటున్నారు. ప్రధానంగా అమెజాన్‌లో అమ్ముకుంటున్నారు కాబట్టి రేటింగ్స్ కూడా ఉంటాయి. కాబట్టి, కనీసం ఏదో ఒక పరామితి వచ్చింది. మంచిచెడులు క్రమేపీ తెలుస్తాయి. లక్షల్లో ఉన్నారిప్పుడు కొత్త పాఠకులు, వాళ్ళు ఒక దారి వెతుక్కుంటారు. అందరూ ఏదోక దారికి వస్తారు.
ఇదంతా మంచికేనా అన్న ప్రశ్న వేసుకోవడానికి ఇంకాస్త సమయం ఉంది. ఇది శుభం పలకాల్సిన సమయం.
బంకు బాబు మిత్రుడు… గురించి Sujata అభిప్రాయం:
02/02/2025 3:10 am
చాలామంచి కథ మూర్తి గారు. ఎంత హాయయిన కథ! Thank you so much
ఇద్దరు కళాకారులు గురించి Gorusu అభిప్రాయం:
02/02/2025 1:20 am
గొప్ప కథని పరిచయం చేశారు మేడం.
హృదయపూర్వక అభినందనలు.
అడుగడుగూ తిరుగుబాటైన గీత గురించి రాజారామ్ తూముచర్ల అభిప్రాయం:
02/02/2025 1:10 am
గీతా రామస్వామి గారి గారి ‘అడగడుగున తిరుగుబాటు’ పుస్తకం ఒక వెలుగు దారి దీపం. మీ పరిచయ వ్యాస విశ్లేషణ చాలా బాగుంది. సమగ్రంగా ఉండి పుస్తకాన్ని చదవాలన్న ఆసక్తిని కలుగజేస్తున్నది. అభినందనలు.
కుడి ఎడమైతే పొరపాటు ఉందా? గురించి Srinivasarao Chaavli అభిప్రాయం:
02/01/2025 10:20 pm
చక్కని వ్యాసం.
వ్యాసం నాకు చాలా కాలం క్రితం నెర్చుకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ పాఠాలను గుర్తు చేసింది. ఆ సమయంలో మేము కేరాలిటీని ఒక లక్షణంగా మాత్రమే నేర్చుకున్నాము మరియు దాని ప్రభావాన్ని అర్థం చేసుకోలేదు. ఇప్పుడు, నేను పాఠాన్ని కొత్త అర్థంతో చూడగలుగుతున్నాను.
వివిధ శాస్త్రాల ద్వారా ఒక అంశాన్ని నేయడం అనే రచయిత శైలి (నైపుణ్యం) చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సైన్స్ కాన్సెప్ట్‌ల గురించి పిల్లలకు చెప్పడానికి నేను ఉపయోగించే పద్ధతి ఇదే. ఒక వ్యక్తి ఒక భావన యొక్క వివరణ మరియు వాస్తవ ప్రపంచ వినియోగాన్ని అర్థం చేసుకుంటే, అతను బాగా అర్థం చేసుకుంటాడు. ఉదాహరణలను ఇవ్వడం, ముఖ్యమైన వ్యత్యాసాన్ని హైలైట్ చేయడం వంటి రచయిత యొక్క మార్గం చాలా ఉపయోగకరంగా మరియు సముచితంగా ఉంటుంది.
సైన్స్‌ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇది మంచి మార్గం. రచయిత ఈ కళారూపంలో నిపుణుడు.
నాకు తెలీని పదం ఎదురైనప్పుడు, అది నన్ను ఆపి ఆలోచించేలా చేస్తుంది (అర్థం చేసుకోవడానికి).
ప్రతి సాంకేతిక పదానికి సరైన తెలుగు పదాలు అవసరం. జనాదరణ పొందిన ఆంగ్ల పదాలను ఉపయోగించడం మంచిదని నేను భావిస్తున్నాను. మనము దీన్ని ఇప్పటికే చేస్తాము (బస్సు, కార్ మొదలైనవి). అవును మనం శాస్త్రాలకు మద్దతు భాషగా ఆంగ్లానికి సమానమైన తెలుగును తయారు చేయాలి. ఈ ప్రయత్నంలో, మనము రెండు పదాలతో పిల్లల/విద్యార్థి జీవితాన్ని క్లిష్టతరం చేస్తున్నామా (ముందు ఒకటి నేర్చుకోండి మరియు సమానమైన ఆంగ్ల పదాలను నేర్చుకోండి).
ఆసక్తికరమైన కథనానికి ధన్యవాదాలు.
ఇక్కడే ఉన్నందుకు గురించి శైలజ అభిప్రాయం:
02/01/2025 9:41 pm
జీవితానికి అక్షర రూపం, ఎవరి కథని వారే దృశ్యమానంగా సినిమాలా మన కథనే తీసారా అన్నట్టు ఉంది, టైటిల్ కూడా కథకి చాలా ఆప్ట్ గా పెట్టారు. ఆమె భావాలు ఆది భౌతికం, ఆధ్యాత్మికాల మధ్య పరుగులు తీస్తూ ఆ మనసు నలిగిన తీరును వర్ణించిన తీరు అద్భుతం. పిల్లలు మనుషులుగా మారడం, విప్లవాత్మక పదాలు, కవి యొక్క భావుకత, తాత్వికత, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆవిష్కరిస్తూ తన లాంటి సాహిత్య స్ఫూర్తితో బాటు సామాజిక బాధ్యతను తెలియచేసాయి. అత్యంత ఆవశ్యకత ఇలాంటి సాహిత్యం, మారాలంటే ఈ నాటి యువతరం.
English and Telugu Lexicons: Parallel Trajectories గురించి శిరీష్ ఆదిత్య అభిప్రాయం:
02/01/2025 5:17 pm
Fascinating article, thank you sir.