సామాన్యముగా మందాక్రాంతమునకు తెలుగులో ఒక్క యతినే ఉంచుట వాడుక. సంస్కృతములా పదచ్ఛేద యతితోబాటు, తెలుగులోవలె అక్షరసామ్యయతిని రెండు చోటులలో ఉంచి వ్రాసిన ఒక మందాక్రాంతమునకు ఉదాహరణము క్రింద ఇవ్వబడినది.
శర్మ గారు బాగా చెప్పారు. కొద్దిగ శ్రమ అనుకోకుండా “రచనల పోటీ” అని గూగుల్ లో వెతికితే, ఇంతకు మునుపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు పెట్టిన కధా, కవిత పోటీల బహుమతుల వివరాలు తెలుస్తాయి. వాటితో పోలిస్తే పైన చెప్పిన బహుమతులు తక్కువేమి కాదులేండి. మొత్తం బహుమతుల విలువ దాదాపు 60,000 రూపాయలు పైచిలుకు ఉన్నట్లుగా తోస్తుంది. మూర్తిగారు చెప్పినట్లు ఒక్క కధకే $1160 అంటే, దాదాపు 81,000 రూపాయలు ఇవ్వడం వారికే సాధ్యమైన పని అని చెప్పక తప్పదు అండి. ఈలెక్కన మొత్తం బహుమతుల విలువ $8000 అంటే దాదాపు ఏడు లక్షల రూపాయలు అవుతుంది. అయినా పది పేజీల కధకి 81,000 రూపాయల బహుమతి ఆశించేవారు రాయకపోతే నష్టం లేదు కానీ, కానీ పాపం వారి వ్యధ తీర్చే వారు ముందుకు రావాలని కోరుకుందాం!!! కానీ కొద్దిగ పెద్దమనసు, ఓపిక చేసుకొని వారు కూడా ఇలాంటి పోటీలో పాల్గొంటే తెలుగు సాహిత్యానికి కాసింత మేలుచేసినవారు అవుతారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది అండి.
వ్యాసం సోదాహరణంగా బాపుగారి గీతల పరిణతికి అద్దం పట్టింది. బాపుగారి బొమ్మలు తెలుగు వారికే స్వంతం. అవి మరి ఏ ఇతర బాషల సాహిత్యాన్ని గాని, ఇతర ప్రాంతాల జీవనాన్ని గాని ప్రతిబింబించలేదు. అందుకే ఆంధ్రేతరులకి వారు అపరిచితులు. బ్రహ్మానందంగారు రాసినట్టు గియ్యని గీతల్లో చిత్రాలకి కొత్త ఆందాల్ని, అనుభూతిని ఇచ్చినవారు బాపుగారు. కొంతవరుకూ లైలాగారు, కటకటాగారు అన్నట్టు, కొన్ని బాపుబొమ్మల్లొ జీవం కనపడకపోవచ్చు. కాని పరిణతి చెందిన బాపుగారి బొమ్మల్లో అన్ని రకాల భావాలు ప్రస్ఫుటం అవుతాయి. ఉదాహరణకి –సత్యం శంకరమంచిగారి “అమరావతి కథలు”లో ప్రతీ బొమ్మ కథ చదివే ముందే మీతో మాట్టాడుతుంది. వంశీగారి కథలకి బాపుగారి బొమ్మలు అన్ని భావాలూ ఒలకబోస్తాయి. లైలాగారన్నట్టు, రంగుల్లో వారి బొమ్మలు పేలవంగా ఉంటాయి. యేమైనా బాపు-రమణల జోడు తెలుగువాళ్ళకి రాత + గీతలతో కూడిన సాహిత్యాన్ని ఇచ్చింది. వారిద్దరికీ జోహార్లు.
అధిక ప్రసంగం అనిపించలేదు. మరింత విపులమైన వివరణ ఆశిస్తాం. కావ్యం పుట్టిన కాలం, కవి నేపథ్యం; సమాంతర కవులూ వారి కావ్యాలూ; పోలికలు, వ్యత్యాసాలు. మీలాంటి వారు అధిక ప్రసంగం అంటూ తప్పించుకుంటే, యెవ్వరు, యెక్కడ చెబుతారు? ఇలాంటి శీర్షికల్లోనే అది సాధ్యం కదా?
మొల్లకూ, పిన వీరభద్రుడికీ 80 యేళ్ళ వ్యత్యాసం వుండొచ్చా? తాళ్లపాక తిమ్మక్క, పిల్లలమర్రి పిన వీరభద్రుడూ సమకాలికులు కావచ్చునేమో? పిల్లలమర్రి నివాసం కూడా తిరుపతి దగ్గరలోని బిట్రగుంటగా చెబుతున్నారు కనుక పరస్పరం తెలిసి వుండొచ్చు. పరస్పరం పద్యాలు చూసుకొని వుండొచ్చు. చేమకూర వెంకటకవి నాయక రాజుల దగ్గర ఉన్నాడు గనుక తరువాతివాడు కావచ్చు. వెంకట కవి పోతన పద్యాన్నీ, పిల్లలమర్రి కావ్యాన్నీ, ఇంకా సుభద్రా కల్యాణాన్నీ చూసి వుండొచ్చు. బుద్ధారెడ్డి రామాయణం సైతం చూసి వుండొచ్చు.
మీనుంచి తులనాత్మక విశ్లేషణ ఆశిస్తున్నాం. ఈ శీర్షిక మరింత ప్రయోజనకరం కాగలదని ఆశ.
మా అమ్మంటే నాకిష్టం! గురించి Sridhar narukurti అభిప్రాయం:
12/01/2018 2:56 am
ఎలా రాస్తారు ఇలాంటి కథలూ… కథకి తగ్గ బొమ్మలూ… బొమ్మ చూసి పోతన గజేంద్ర మోక్షం గుర్తుకొచ్చింది.
పాతికేళ్ళ ప్రేమకథ గురించి Amarendra Dasari అభిప్రాయం:
12/01/2018 12:05 am
ట్వ్
Thank you editors, for the quick and interesting presentatiom
మళ్ళీ మందాక్రాంతము గురించి మోహన అభిప్రాయం:
11/29/2018 10:44 am
సామాన్యముగా మందాక్రాంతమునకు తెలుగులో ఒక్క యతినే ఉంచుట వాడుక. సంస్కృతములా పదచ్ఛేద యతితోబాటు, తెలుగులోవలె అక్షరసామ్యయతిని రెండు చోటులలో ఉంచి వ్రాసిన ఒక మందాక్రాంతమునకు ఉదాహరణము క్రింద ఇవ్వబడినది.
నీలాద్రీశా నిఖిలవరదా నిత్యసత్యావబోధో-
ద్వేలాకారా దితిసుతహరా దీనరక్షావిచారా
నీలాంభోము జ్ఞిభశుభతనూ న్మేషశేషాహితల్పా
చాలన్ గోర్కుల్ సఫలములుగా సల్పి మమ్మేలు మీశా
– శివ-వేంకట కవుల జగన్నాధీ(థీ)యము, 2.50
TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ గురించి ఉమా అభిప్రాయం:
11/29/2018 1:56 am
శర్మ గారు బాగా చెప్పారు. కొద్దిగ శ్రమ అనుకోకుండా “రచనల పోటీ” అని గూగుల్ లో వెతికితే, ఇంతకు మునుపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సంస్థలు పెట్టిన కధా, కవిత పోటీల బహుమతుల వివరాలు తెలుస్తాయి. వాటితో పోలిస్తే పైన చెప్పిన బహుమతులు తక్కువేమి కాదులేండి. మొత్తం బహుమతుల విలువ దాదాపు 60,000 రూపాయలు పైచిలుకు ఉన్నట్లుగా తోస్తుంది. మూర్తిగారు చెప్పినట్లు ఒక్క కధకే $1160 అంటే, దాదాపు 81,000 రూపాయలు ఇవ్వడం వారికే సాధ్యమైన పని అని చెప్పక తప్పదు అండి. ఈలెక్కన మొత్తం బహుమతుల విలువ $8000 అంటే దాదాపు ఏడు లక్షల రూపాయలు అవుతుంది. అయినా పది పేజీల కధకి 81,000 రూపాయల బహుమతి ఆశించేవారు రాయకపోతే నష్టం లేదు కానీ, కానీ పాపం వారి వ్యధ తీర్చే వారు ముందుకు రావాలని కోరుకుందాం!!! కానీ కొద్దిగ పెద్దమనసు, ఓపిక చేసుకొని వారు కూడా ఇలాంటి పోటీలో పాల్గొంటే తెలుగు సాహిత్యానికి కాసింత మేలుచేసినవారు అవుతారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది అండి.
నేనొక చిత్రమైన చిక్కుముడి: 1. ఆఖరి కథతో ఆరంభం! గురించి రాం కిదాంబి అభిప్రాయం:
11/28/2018 5:13 am
“చిన్న వాక్యాన్ని”
ఇది (వాక్యం), తన గురించి తాను చెప్పుకుంటున్నది.
ఏమంటారు?
రజని పాటలు మరికొన్ని గురించి సూర్య వెంకట సుబ్రహ్మణ్యం నూకిరెడ్డి అభిప్రాయం:
11/27/2018 12:37 am
తందనాన భళా తందనాన సంగీత రూపకం ప్రసారం చేయవలెను
చిత్రం – ‘బాపు’రే విచిత్రం! గురించి Venkata Ramam అభిప్రాయం:
11/26/2018 5:14 am
వ్యాసం సోదాహరణంగా బాపుగారి గీతల పరిణతికి అద్దం పట్టింది. బాపుగారి బొమ్మలు తెలుగు వారికే స్వంతం. అవి మరి ఏ ఇతర బాషల సాహిత్యాన్ని గాని, ఇతర ప్రాంతాల జీవనాన్ని గాని ప్రతిబింబించలేదు. అందుకే ఆంధ్రేతరులకి వారు అపరిచితులు. బ్రహ్మానందంగారు రాసినట్టు గియ్యని గీతల్లో చిత్రాలకి కొత్త ఆందాల్ని, అనుభూతిని ఇచ్చినవారు బాపుగారు. కొంతవరుకూ లైలాగారు, కటకటాగారు అన్నట్టు, కొన్ని బాపుబొమ్మల్లొ జీవం కనపడకపోవచ్చు. కాని పరిణతి చెందిన బాపుగారి బొమ్మల్లో అన్ని రకాల భావాలు ప్రస్ఫుటం అవుతాయి. ఉదాహరణకి –సత్యం శంకరమంచిగారి “అమరావతి కథలు”లో ప్రతీ బొమ్మ కథ చదివే ముందే మీతో మాట్టాడుతుంది. వంశీగారి కథలకి బాపుగారి బొమ్మలు అన్ని భావాలూ ఒలకబోస్తాయి. లైలాగారన్నట్టు, రంగుల్లో వారి బొమ్మలు పేలవంగా ఉంటాయి. యేమైనా బాపు-రమణల జోడు తెలుగువాళ్ళకి రాత + గీతలతో కూడిన సాహిత్యాన్ని ఇచ్చింది. వారిద్దరికీ జోహార్లు.
నాకు నచ్చిన పద్యం: హృదయాన్ని తాకే మొల్ల కవిత్వం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
11/24/2018 7:02 am
చీమలమర్రి బృందావనరావుగారూ,
అధిక ప్రసంగం అనిపించలేదు. మరింత విపులమైన వివరణ ఆశిస్తాం. కావ్యం పుట్టిన కాలం, కవి నేపథ్యం; సమాంతర కవులూ వారి కావ్యాలూ; పోలికలు, వ్యత్యాసాలు. మీలాంటి వారు అధిక ప్రసంగం అంటూ తప్పించుకుంటే, యెవ్వరు, యెక్కడ చెబుతారు? ఇలాంటి శీర్షికల్లోనే అది సాధ్యం కదా?
మొల్లకూ, పిన వీరభద్రుడికీ 80 యేళ్ళ వ్యత్యాసం వుండొచ్చా? తాళ్లపాక తిమ్మక్క, పిల్లలమర్రి పిన వీరభద్రుడూ సమకాలికులు కావచ్చునేమో? పిల్లలమర్రి నివాసం కూడా తిరుపతి దగ్గరలోని బిట్రగుంటగా చెబుతున్నారు కనుక పరస్పరం తెలిసి వుండొచ్చు. పరస్పరం పద్యాలు చూసుకొని వుండొచ్చు. చేమకూర వెంకటకవి నాయక రాజుల దగ్గర ఉన్నాడు గనుక తరువాతివాడు కావచ్చు. వెంకట కవి పోతన పద్యాన్నీ, పిల్లలమర్రి కావ్యాన్నీ, ఇంకా సుభద్రా కల్యాణాన్నీ చూసి వుండొచ్చు. బుద్ధారెడ్డి రామాయణం సైతం చూసి వుండొచ్చు.
మీనుంచి తులనాత్మక విశ్లేషణ ఆశిస్తున్నాం. ఈ శీర్షిక మరింత ప్రయోజనకరం కాగలదని ఆశ.
విధేయుడు
సిద్దినేని భావనారాయణ.
గడి నుడి – 8 గురించి Rama Rao Alla అభిప్రాయం:
11/24/2018 4:38 am
ఆర్యా
గడి-నుడి 8 కి ఇంకా నా సమాధానము పంపించు బొత్తాము సచేతనమెనా!!
రామారావు ఆళ్ళ
[సమాధానాలు పంపే బొత్తామును తొలగించాము. ధన్యవాదాలు — సం. ]
తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు గురించి డాక్టర్ తవ్వా వెంకటయ్య అభిప్రాయం:
11/21/2018 11:32 pm
ఇంతమంది గురించి తెలిసిన మీకు ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి గురించి తెలిమదా?