పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. బేతాళ కథలు: కథన కుతూహలం-9 గురించి Pullen pandari అభిప్రాయం:

    03/08/2019 11:07 am

    బాగుంది సర్
    కథ గురించి కథ

  2. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి మోహన అభిప్రాయం:

    03/06/2019 12:44 pm

    శంకరాచార్యుల నక్షత్రమాలనుగుఱించి ఈ వ్యాసములో తెలిపియున్నాను. దాని ఛందస్సు చంచల లేక చిత్రశోభ. సుగంధివృత్తమునకు చివర ఒక లఘువును అదనముగా నుంచితే మనకు చంచల లేక చిత్రశోభ అను వృత్తము లభించును. ఇందులో పాదమునకు ఎనిమిది గ-లములు. ఈ వృత్తము స్వయంభూ ఛందస్సు, ప్రాకృతపైంగలములో పేర్కొనబడినవి. పురాతన సంస్కృత కవులెవ్వరు ఈ వృత్తములో వ్రాయలేదు. స్వయంభూ ఛందస్సు పదవ శతాబ్దపు నాటిది, పైంగలము దానికి తఱువాత. శంకరాచార్యుల కాలము ఎనిమిదవ శతాబ్దము. ఈ విషయములను పరిగణనలో తీసికొన్నప్పుడు ఈ స్తోత్రమును నిజముగా శంకరులు వ్రాసినారా లేక ప్రక్షిప్తమా అనే ప్రశ్న ఉదయిస్తుంది.

    విధేయుడు – మోహన

  3. ఆ రేయి నీరెండ! గురించి G K S Raja అభిప్రాయం:

    03/05/2019 3:59 am

    అన్వర్ గారూ! అద్భుతమయిన పరిచయ వాక్యాలతో పతంజలి గారి వేసవి వ్యాసం అందించారు. ధన్యవాదాలు. ఎంత వద్దనుకున్నా, మీమీద అసూయ వేసవి ఎండలా రగిలిపోతోంది. ఇది రాస్తుండగానే ఆయన భుజాల మించి వొంగి ఆకళించేసుకుని ఆనందపడి పోయారంటే, ఎంత అదృష్టవంతులండీ మీరు. పతంజలి గారి బొమ్మలు (రెండు) మీ ప్రియమైన బాపు గారితో వేయించుకోగలిగారే! ఎంత చెయ్యి తిరిగిన గడుగ్గాయి మీరు!! ఆ బొమ్మలను కూడా మాతో పంచుకోరాదా!

    నా కధకు సాక్షిలో బొమ్మ వేసిన మిమ్మల్ని కలిశాను.. మొహమాటపడ్డాను.. నాకూ ఓ బొమ్మ గీసి ఇవ్వండి … అని అడగడానికి.

    ఈసారి కలిసినప్పుడు ఇక మొహమాటపడను. నమస్తే.

    జి కె యస్ రాజా

  4. వీరశైవులు: ఒక పరామర్శ గురించి Praveen Suguru అభిప్రాయం:

    03/04/2019 5:09 pm

    చాల క్లుప్తతతో మీరు వీరశైవుల గురించి వారి పద్ధతుల గురించి వివరించారు. అనేకమైన విషయాలను మీ రచన ద్వారా తెలుసుకున్నాను. మరి కొన్ని వీరశైవ అంశాలను వ్రాయాలని నా చిరు కోరిక.

    ధన్యవాదాలు
    ప్రవీన్ సుగూరు

  5. మా అమ్మంటే నాకిష్టం! గురించి M.k.kumar అభిప్రాయం:

    03/04/2019 2:51 pm

    అద్భుతం.

  6. ఈ కథ గురించి M.k.kumar అభిప్రాయం:

    03/04/2019 2:07 pm

    కథ కాని కథ.

  7. సి. ఎస్. ఆర్. ఆంజనేయులు: కొన్ని పాటలు, పద్యాలు గురించి suryanarayana pudipeddi అభిప్రాయం:

    03/04/2019 10:21 am

    చాలా చక్కటి ప్రయత్నం…. గ్రేట్

  8. మార్చ్ 2019 గురించి Venkatesh Prasad అభిప్రాయం:

    03/03/2019 11:51 pm

    ఈమాట లో క్రమంతప్పకుండా మేం చదివే ‘ నాకు నచ్చిన పద్యం’ శీర్షిక ఆగిపోవటం చాలా బాధాకరం. పద్యాన్ని ఎలా చదవాలి? అందున్న అంతర్లీనతను ఎలా ఒడిసిపట్టాలి? అనే అంశాలను మాబోటి millennials కు నేర్పించి, మా తెలుగు అయ్యవారు తరువాత అంత గొప్పగా ఛందోయుక్త పద్య పఠన పై అనురక్తి ని కలిగించిన ఘనత మాత్రం శ్రీ భైరవభట్ల-చీమలమర్రి ద్వయానిదేనని చెప్పగలను. గరికిపాటి వారి అవధానాలను YouTube లో చూసి పద్యవిద్యలో ఉన్న గమ్మత్తుకు అచ్చెరువొంది పద్యసాహిత్యం కోసం browse చేస్తున్న క్రమంలో ఈ శీర్షిక దొరికింది. వెంటనే అన్ని పాత టపాలనూ పూర్తిగా చదివి (కొన్నింటికి నోట్సు వ్రాసుకుని, కొన్నింటికి నా స్వంత వ్యాఖ్యానం వ్రాసుకొని) ముందుకెళుతున్న క్రమంలో ఈ వార్త అశనిపాతమే. ఒక స్థాయి దాటాక కవి/రచయుత సామాజిక ఆస్తి అవుతారు. అలాంటి ‘స్థాయి’ కి ఎదిగిన వీరి వద్దనుండి ఈమాట యాజమాన్యం కొన్ని (పదుల!) సంవత్సరాలకు సరిపడా టపాలను ముందుగానే వ్రాయించి ఉంటే అది ఒక knowledge database తయారయి ఉండేది. సరే, గతం గతః. తెలుగు నాట పండితులకు కొదవలేదు కాబట్టి (ఉందా?!) దివిటీ వేసి వెదికి మంచి పండితులను దొరకపుచ్చుకుని ఈ శీర్షికను మునుపటి ‘స్థాయి’ కి తగ్గకుండా ముందుకు తీసుకువెళతారని ఆశిస్తూ… ఒక పద్యాభిమాని.

  9. ఆ రేయి నీరెండ! గురించి VarmA అభిప్రాయం:

    03/03/2019 1:48 am

    జ్ఞాపకాలని జాడీలో పెట్టి వాసెనకట్టుంచారా!

  10. ఈ కథ గురించి VarmA అభిప్రాయం:

    03/03/2019 1:30 am

    కథ భలేగుంది.