పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి Avinash Vellampally అభిప్రాయం:

    03/18/2019 12:40 pm

    వెల్చేరు నారాయణరావు గారు భారతీయ చరిత్ర పట్లా, సాహిత్యం పట్ల ప్రభుత్వాలు చూపిస్తూ వస్తున్న ఉదాసీన వైఖరి పట్లా సూటిగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు చాలా విలువైనవి. భారతీయుల గురించి భారతీయులకే ఉన్న కొన్ని అపోహలను ఆయన సరిచేసే ప్రయత్నం చెయ్యడం మన అదృష్టం.

  2. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి పత్తూరి శ్రీనివాసులు అభిప్రాయం:

    03/18/2019 4:58 am

    ఇంటర్వ్యూ చాలా బాగుంది. మొత్తం తెలుగు సాహిత్యాన్ని విహంగవీక్షణం చేయించారు. వెల్చేరు వారి ప్రతిపాదనలన్నీ బాగున్నాయి. ఈ నూతన ప్రతిపాదనల ఆధారంగా మన సాహిత్యచరిత్రను మళ్ళీ తిరగరాయాల్సి ఉంటుంది.అయితే నారాయణరావుగారి పుస్తకాలన్నీ తెలుగులోకి అనువాదమైతే తెలుగు మాత్రమే తెలిసిన తెలుగువారికి కూడా ఉపయోగం.

  3. వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి బాచిన శ్రీధర్ అభిప్రాయం:

    03/18/2019 3:48 am

    చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది. నారాయణ రావు గారి విశ్లేషణా పద్ధతి నిజాయితీగా ఉంది. ఆయన శైలి మన తెలుగు సాహిత్యానికి మేలు చేసేదే. కానీ ఆయన రచించిన పుస్తకం ఖరీదు చాలా ఎక్కువగా ఉంది (Amazon.in). చదవాలనిపించినా కొనలేకున్నాను. ఆంధ్రాలో ఎవరన్నా ప్రచురిస్తే బాగుంటుంది.

  4. పెరటి తలుపు గురించి M.k.kumar అభిప్రాయం:

    03/17/2019 2:11 pm

    బాగుంది.

  5. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి lyla yerneni అభిప్రాయం:

    03/16/2019 7:34 pm

    I don’t remember how long ago I listened first to this Literary/ musical work in Telugu. I listened to it again recently.

    The overall feeling this work leaves me with is one of repulsion, revolt, disgust and sadness.

    Is this what the writer intended for his reader/audience? I don’t have a clue.

    Because the author’s introductory words do not deal with the subject matter of the play at all. He only talks about how he went looking for a job in Vijayawada Radio station, how he is asked to submit a work of his, and eventually it all comes together and it gets produced. There is mention of some editing, adjustments of duration of broadcast. Some such peripheral technical tidbits.

    And there is an expression of great deal of thanks to family members, some other Literary figures etc. Over all the writer is pretty pleased with the whole business.

    And even a chance comment or two, from readers – only to reflect about the death of the author of this piece (because as customary to some literary magazines this piece is published here in this magazine at the time of death of this author, as a tribute to him.)

    There is always this incessant gripe – that how unfortunate it is Telugu have no respect for their poets and writers. That there should be great deal of outpouring of writings about this author. To pay respects to the author.

    As much as I hear, it looks like this writer had written lot of Telugu film songs and contemporary residents of India have heard his songs, loved them. And I think Telugu movie people are paid very well these days, they live well and die in glory. Apparently some young people/admirers of “poetic words” leave even their own personal affairs behind, to give one final send off to the writer and take one last look at his body and put garlands on him.

    The thing is – This writer has already shown his mettle that he knows the language plenty, he knows grammar, he can compose good verse, really has good rhyming skills. No question about that.

    And the musicians, from this Bezwada radio station are fantastic. And who would not want to hear those songs sung by Srirangam Gopala ratnam! She sings like an angel. They are gorgeous. I am particularly fond of కృష్ణ సంగీతం and the lyrics in here are so sweet, man o man! How can you, not admire!

    Yet, “why don’t I feel good?” Like the little girl asks in the movie “Sound of Music” even after dancing and singing?

    Why do I feel so bad! Instead! Have such bad taste in my mouth?

    Is it because I am a woman? And I cannot help noticing the shabby treatment the woman in this story got, for that young woman who is harassed by the mother, confused by the societal norms and religion, cheated by a louse, diagnosed mad by a physician, dragged to a court to be discussed by a king and his court poet, for them to wonder where the system went wrong in their kind and compassionate rule and immediate verdicts are given by the king mainly for the benefit of future Telugu God and Telugu Men –“ఇక దేవుడికి దాసీ లేదు, జీవుడికి సానీ లేదు, ఈ సంప్రదాయం నిర్మూలిస్తున్నాను” – and the whole gang go right on to sing a benediction once again rhythmically not missing rhyme or a beat in the music. Right to the end.

    After the musical is truncated to an hour and a half respecting the time concerns of radio station, (totally ignoring the emotional turmoil they leave audience like me in,) they proceed to announce all the jolly participants of this production one after the other in meticulously lined up perfection.

    I would have rather seen the actors, actresses, and the audience all in an uproar, torn down the curtains, thrown the musical instruments against walls, destroy all the furniture in acknowledgement of the real pathos, cruelty, persisting double talk about ‘learnedness’ of men, who are to control the upbringing and fate of unborn child ‘based on its sex’ -in the story.

    Than applauding and asking for rewards for the artists/writers.

    Such is Art! Such is Literature! It all appears so pretentious and heartless. The confusion they create is endless.

    Lyla

  6. సేవికయే నాయిక గురించి Dr. Kasinadhuni M. Prasad అభిప్రాయం:

    03/16/2019 10:11 am

    Dr. Tirumala Desikachary’s talent in providing telugu literary basis (Saahityam) and his creativity is superb for the musical rendition of Smt. Charla Ratna Sastry garu. I am impressed with the literary craftsmanship of Dr. Desikachary garu in tailoring the theme of 1733 of Naples to fit the societal norms of south east asians today in terms of Sringara rasam and Haasa, Bhava and Rasa, grace in bending it to accommodate the vocal rendering with the neo-modern poetic style of telugu operetta style in maatra chandas ! My salutations and my great admiration go out to both the artists of Greater Toronto who are worthy of our admiration.

    Dr. Kasinadhuni. M. Prasad
    Adjunct Professor of Computer Science,
    Pace University, NY, USA
    March 16, 2019

  7. ఈ కథ గురించి పరమేశ్వర్ అభిప్రాయం:

    03/16/2019 5:03 am

    పదాల పొందిక చాల బాగుంది.

  8. ఆ రేయి నీరెండ! గురించి ‘సాక్షి’భరత్ అభిప్రాయం:

    03/14/2019 12:31 am

    తప్పక చదవండి పతంజలి సాహిత్యం(భాష్యం)

  9. ఆ రేయి నీరెండ! గురించి Lalitha TS అభిప్రాయం:

    03/10/2019 5:13 pm

    ఇంతకీ అంత గొప్ప “రేయి నీరెండ”కి మీరేసిన ఎంచక్కని బొమ్మేదండీ, హార్టిస్టు గారు?

  10. బేతాళ కథలు: కథన కుతూహలం-9 గురించి Apple Macintosh అభిప్రాయం:

    03/10/2019 1:23 am

    ఇప్పటిదాకా ఈ శీర్షికలో వచ్చిన తొమ్మిది కథలూ చదివాను. వీటిని కథలు, (అందులోనూ “బేతాళ కథలు”) అని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదు. కథకి ఎత్తుగడ, ముగింపు, ఒకటో రెండో మలుపులన్నా ఉండాలి కదా! చందమామలో వచ్చిన బేతాల కథలే వీటికి నమూనా అనుకుంటున్నాను. బేతాళ కథల్లో జరిగేది: విక్రమార్కుడు శవాన్ని మోసుకురావడం, కథ వినడం, ప్రశ్నలకి సమాధానం చెప్పడం, తిరిగి బేతాళుడు ఎగిరిపోవడం. ఆ కథల ముఖ్యలక్షణం: బేతాళుడు చెప్పే కథలు స్వయం ప్రతిపత్తి గలిగి ఉండడం. ఆ కథల్లో ఎత్తుగడ, ముగింపు లాంటి దినుసులన్నీ ఉండేవి. ఆ కథలు విడిగా కూడా మనగలిగేవి. వాటిలో బేతాళుడు అడిగే ప్రశ్న తర్కబద్ధంగానే ఉంటుంది, పాఠకులకి ఆ ప్రశ్నకి జవాబు తెలియకపోయినా, జవాబు అర్థం కాకపోయినా, ఆ కథ కలిగించే అనుభూతి తక్కువవదు. (చందమామ కథల్లాంటి కథల్ని సులువుగా బేతాళ కథల్లో “wrap” చెయ్యచ్చని నాకో నమ్మకం..)

    “కథన కుతూహలం” శీర్షికలో వచ్చిన మూస కథలన్నిటిలోనూ విషయం ఒకటే, పాఠకరావు కథలు చదువుతూ ఉంటాడు, అంతే! ఏ కథ ఎందుకు, లేదా మొదట ఎందుకు చదివాడన్నదే ప్రతీసారీ బేతాళుడి ప్రశ్న! పోనీ, ఆ ప్రశ్నకి జవాబు విక్రమార్కుడికి ఎలా తెలుస్తుందో మనకర్థం కాదు. మొదటి విడత కథలో, పాఠకరావు మొదట చదివిన కథకి శీర్షిక (టైటిల్) వైవిధ్యంగా ఉందని ఆ కథ మొదట ఎంచుకున్నాడట. ఆ కథ పేరు “అరణ్యంలో అల్పపీడనం”. ఇది బేతాళుడు చెప్పకుండా విక్రమార్కుడికి ఎలా తెలిసింది? ఇలాగే రెండో విడత కథలో, పాఠకరావు మొదట ఎంచుకున్న కథలో ఎత్తుగడ బావుందని ఎంచుకున్నాడట! ఈ విషయం విక్రమార్కుడికి ఎలా తెలిసింది? ఈ “అవుటాఫ్ సిలబస్” ప్రశ్నలకి విక్రమార్కుడు ఎలా జవాబు చెబుతున్నాడు? ప్రియమైన పాఠకుల్లారా! ఈ ప్రశ్నలకి జవాబు తెలిసీ చెప్పకపోయారో! ఐదో విడత కథలో పాఠకరావు “కాలక్షేపానికి కథలు చదవడం లేదు” కాబట్టే విశిష్టమైన కథలకోసం చూస్తున్నాడన్నారు. మరి రచయిత ఈ మూస కథలు ఎందుకు రాస్తున్నారు?

    ప్రతి విడత కథలోనూ కథానికల ధర్మసూక్ష్మాల గురించి చెప్పే రచయిత ఆ ధర్మసూక్ష్మాలని తనే పాటించకపోవడం గమనార్హం. మొదటి విడత కథలో “శీర్షికాశిల్పం” గురించి ప్రస్తావించి కూడా, ఈ “కథన కుతూహలం” లో ఏ కథకీ ప్రత్యేకమైన పేరు పెట్టలేదు. రెండో విడత కథలో కథకి కావలసిన ఎత్తుగడ గురించి మనకి బోధించి, మరో విడత కథలో కథకి ముగింపు పాఠకుల ఊహకందేలా ఉండాలని వక్కాణించి, రచయిత తన కథలకి ఎత్తుగడ లేకుండా, ఉహాతీతమైన ముగింపు ఇస్తే మనమేమనాలి?

    పైగా, ప్రతి కథలోనూ పంటికింద రాయిలా తగిలే విపరీతమైన, అనవసరమైన శబ్దాడంబరం: (ఇవి హాస్యానికని మనం ఊహించుకోవాలి కాబోలు) మచ్చుకి కొన్ని: “కారుకేసి కవితాపూర్వకంగా చూశాడు”, “పట్టుదలకి సినానిముడు”, “దృష్టిచక్రాలు”, “అతడి మొహం తీగపై ఒక నవ్వుపువ్వు”, “రింగు, కలరింగు చేసుకుని రింగులురింగులుగా తిరిగింది”. (ఇవి ఏ అలంకారాలు??) ఇలాంటి వింత ప్రయోగాలు కోకొల్లలు. రచయితలు పాఠకులకి మానసిక వ్యాయామం కలిగించడకూడదని చెబుతూనే, రచయిత చీకటిని ప్రతి విడతలోనూ కనీసం రెండు మూడు పేరాగ్రాఫుల్లో ప్రీతిగా వర్ణించారు!

    ఇంకొన్ని వాక్యాలు చూడండి: “కారు శిరోదీపాల (హెడ్‌లైట్లకు వచ్చిన తిప్పలు) వెలుతుర్లో కొంచెం దూరం వేగిరంగా నడిచి”, “విక్రమార్కుడు చెట్టు దగ్గరకి తన కారువెలుతురు (కారుచీకటికి వ్యతిరేక పదం కాదు) “. ఇవి చదివితే, కథ ఎవరి దృకోణం నించి చెబుతున్నారో అర్థం కాక బుర్ర గోక్కావాల్సి వస్తుంది. ఫిక్షన్ రాస్తూ మధ్యలో ఈ “ఫోర్త్ వాల్ బ్రేక్” చేయడం ఏమిటి? ఇది ఫిక్షనా? మెటాఫిక్షనా?

    చంద్రశేఖర రెడ్డి గారు కథలమీద చేస్తున్న “మెటాడేటా” అనాలసిస్సు నిజానికి నాకు చాలా ఆసక్తికరంగా ఉన్నా, ఆ అనాలసిస్సుని బలవంతంగా ఇంత పేలవంగా కథల పేరుతో అందించడం అన్యాయం. దయచేసి మీ విశ్లేషణని వ్యాసాల రూపంలో వెలువరించండి, పుస్తకంగా కూడా వేయండి, తప్పకుండా కొనుక్కుంటాను, స్నేహితులతో కూడా కొనిపిస్తాను.

    నమస్కారం.