పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తిక్కన సోమయాజి భారత యుద్ధకథ గురించి మురళీకృష్ణ అభిప్రాయం:

    05/01/2019 1:29 am

    నమస్కారం..
    తిక్కన సోమయాజి భారత యుద్ధకథలు పుస్తక రూపేణా అందుబాటులో ఉందా? ఉంటే సమాచారము అందించగలరని అనుకుంటున్నాను.
    9000 120 114
    muralikodimela@gmail.com.

  2. మాదీ, రాజుగారిదీ! గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    04/29/2019 12:36 am

    ఆయ్ మాదీ రాజుగారిదీ ఒకటే మాటండి. తమరు తరచు రాస్తూ ఉండాలండి. ….. మహా

  3. వసంతం గురించి Lalitha TS అభిప్రాయం:

    04/28/2019 12:46 pm

    వసంతాగమనం గురించి – తేలిక మాటల్లో – చాలా బావుంది మీ కవిత.

  4. మాదీ, రాజుగారిదీ! గురించి Lalitha TS అభిప్రాయం:

    04/28/2019 12:41 pm

    సూరపరాజుగారి “కలుపు”గోలుతనం గురించి భలేగా చెప్పారండి, ఆయ్!
    ఐతే ముందుముందు మీ కాలక్షేపం కబుర్లు ఈమాటలో చదూకోచ్చన్నమాట…భలే!

  5. శ్రీనాథుని చాటుపద్యములు గురించి Bhadrachalam Jagadeeswara Rao అభిప్రాయం:

    04/28/2019 8:16 am

    మీ సాహిత్య సేవ ఎంతో అభినందదాయకం. నా లాంటి సాహిత్యాభిమానులకు దాహార్తి తీర్చిన మీకు శతకోటి ధన్యవాదాలు. ఈ పద్యాలకు భావాలు కూడా చేర్చగలిగితే ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది.
    మీకు వీలైతే క్షేత్రయ్య పదాలు, వాటి భావాలు కూడా అందిస్తే చాలా సంతోషం.
    మీ సేవ గురించి ఎంతో వ్రాయాలని వుంది, కాని అధిక ప్రసంగం అవుతుందేమో…
    మీ చిరునామా వివరాలేమైనా తెలియపరిస్తే సంతోషం.

  6. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుడు చూపిన తల్లిప్రేమ గురించి తః తః అభిప్రాయం:

    04/28/2019 5:10 am

    ‘ప్రాణము ప్రాణము’. ఈ ప్రయోగం పింగళి లక్ష్మీకాంతం గారి ఒక పద్యం లో వినబడుతుంది: ఇద్దరు వేంకటేశులు తనకు బాగా దగ్గరివారని చెబుతూ, “… వాణికి వాణి యైన కవి వర్యుడు చెళ్పిళ వేంకటేశుడున్, ప్రాణము ప్రాణమైన గుణరమ్యుడు కాటురి వేంకటేశుడున్” అన్నరాయన.

    తః తః

  7. శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/27/2019 3:15 am

    సౌమ్య గారు: మీరు ఆరేళ్ళ క్రితం రాసిన కామెంటు ఇప్పుడే చూస్తున్నాను. మీరడిగిన ప్రశ్నకు సమాధానం: అవును, శర్మిష్ట రెండు సార్లు ప్రసారం అయ్యింది. పైన నా చిన్న పరిచయంలో చెప్పినట్లు “హైదరాబాదు కేంద్రంలో 1960 ప్రాంతంలో మరల రికార్డు కాబడినది. 1942 ప్రాంతంలో ప్రసారితమైన శ్రవ్య రూపకం మనకి ఈనాడు లభ్యం కాదు”. రజని “భావతరంగాలు” పుస్తకం నుండి “శర్మిష్ఠ” ప్రసారమయిన తేదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు. (సొంతడబ్బా: ఆ పుస్తకం అచ్చులోకి రావడంలో నా పాత్ర వుంది. రజని గారిని కొంచం గట్టిగానే సాధించి మొదట రాసిన వ్యాసాలు పోతే మరల రాయించడం జరిగింది.)

  8. నాకు నచ్చిన పద్యం: పెనుగొండ స్మృతికావ్యం గురించి Maruthi Kurakula అభిప్రాయం:

    04/23/2019 5:04 am

    చాలా బాగా రాశారు.

  9. కాల్వీనో కథల నుంచి – 7 గురించి Tejah అభిప్రాయం:

    04/23/2019 12:35 am

    A haunting story, arrestingly re-told in Telugu. Once past the (tiny) incongruity of reading a “bar/pub scene” in Telugu (a result of my limited reading no doubt), I was really taken in by the “revolution devouring its children” theme. Thank you.

  10. పహాడీ రాగం అందాలు గురించి Lyla yerneni అభిప్రాయం:

    04/21/2019 1:15 pm

    నేను పాఠకుల అభిప్రాయాలు చదువుకునేందుకు కూడా ఈమాట పత్రిక కు వస్తాను. చదవదగిన అభిప్రాయం రాయకపోవటం అటుంచి, ఈ నిరర్థకమైన వాఖ్య ఇప్పుడు కొన్నాళ్లుగా కంటిముందు కనిపిస్తున్నది. రోహిణీప్రసాద్ రాసిన సంగీతం గురించిన వ్యాసాలు ఎప్పటికీ చదువుతూనే ఉంటాము. పైగా, అతడు మనకందరికీ మిత్రుడు. మనకు ఇష్టమైన వాళ్లను, దగ్గరి బంధువులను ఎప్పుడూ బతికున్నట్టు భావించుకుంటాము. అన్యధా వారి గురించి భావించము. ప్రపంచంలో ఇప్పటికీ ఎవరైనా చదివేది, వినేది ఎక్కువ శాతం, గతించిపోయిన రచయితల, సంగీతకారుల రచనలే. అటువంటప్పుడు, అతని రచనలగురించిగాని, సంగీతం గురించిగాని చర్చ చెయ్యకుండా, రోహిణీప్రసాద్ ని గురించి చేసిన అర్ధంపర్ధంలేని వ్యాఖ్య, నాకు కళ్లనీళ్లు తెప్పించింది. నేను ఈ విషయం తెలుపుతున్నందుకు క్షమించండి.

    Lyla