పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఆంధ్రభాష – గ్రాంథిక వ్యావహారికములు గురించి karra srinadh అభిప్రాయం:

    08/05/2019 5:27 am

    చాలాబాగా చెప్పారు సర్. కాని గ్రాంధికం అంటే ఏమిటొ కూడా ఒక వ్యాస రూపంలో చెప్పగలరు అని ఆశిస్తున్నాను సర్.

  2. మూడు ఆత్మకథలు: 1. మంచీ మర్యాదా గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/05/2019 2:10 am

    పిక్కడిల్లి కాఫీ బార్, లండన్ లో.

    కౌంటర్ వెనక్కి రాగానే, “హూ ఈజ్ ఫస్ట్?” అని అడిగిందామె.

    అప్పటికే కౌంటర్కి ఇవతల గుమ్మం దగ్గిరగా దాదాఫు ఒక పదిమంది నిలబడి ఉన్నారు అక్కడ. నా వెనుక నాతో పాటు లోపలికి వచ్చిన స్త్రీ కూడా ఉంది. చుట్టూ చూస్తే, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. ఎవరు ముందుకి రాలేదు. అప్పుడు ఒక వృద్దుడు ముందుకు వచ్చి తన పక్క్కనున్న మహిళని, “ప్లీజ్” అంటూ ముందుకు వెళ్ళమ్మని చెయ్యి చూపించాడు. ఆవిడ అందరి వైపు చూసింది. ఎవరు అభ్యంతరం పెట్టలేదు. ఆవిడ వెళ్ళి తన ఆర్డరు తీసుకుంది. నావంతు వచ్చినప్పుడు నా వెనుక వచ్చిన స్త్రీ, నా పక్కనే నిలబడినావిడను “ప్లీజ్,” అంటూ ముందుకు వెళ్ళమన్నాను. “నో థాంక్స్” అంటూ నన్ను వెళ్ళమంది.

    ఇక నీ ప్రశ్నకి జవాబు మన దేశంలో కూడా సివిక్ సెన్స్ ఉన్నవాళ్ళుంటారు. ఉన్న చోట అందరూ అలా ఉంటారు. లేని చోట లేదు. ఆ పెద్దాయనికి ‘చెప్పడమే,’ నిరభ్యంతరంగా! ఇంకొకసారి అలా చెయ్యడని ఆశించడమే! ఎప్పుడు, ఎలా చెప్పడం అన్నది నీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది.

  3. నిండైన జీవితం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/04/2019 9:19 pm

    చైనాలో ఛాయాచిత్రాలు – వీలయితే ఈ రచన వివరాలు ఇవ్వగలరా సత్యవతిగారూ. ఎప్పుడు రాశారు, పుస్తకంగా వచ్చిందా…

  4. మంటో కథలు: సియా హాషియే 1 గురించి Vijaya Karra అభిప్రాయం:

    08/04/2019 6:26 pm

    మీ ముందు మాట కథని మించి కదిలించింది పూర్ణిమ! “మన చుట్టూ పుట్టుకొస్తున్న కంచెల గురించి ఆలోచించుకోమంటూ”… నిన్న, ఈ రోజు… అదే చరిత్ర కొనసాగుతోంది.

  5. ఇంద్రగీతమ్ గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    08/04/2019 8:26 am

    గణపతి ముని గారు రమణులని కలిసినపుడు ఆయన సిథ్థులని తెలిసాక అడిగిన మొదటి ప్రశ్న, దాని సమాధానం ఎక్కడో రాసి ఉంచారు. అది చాలా ప్రసిథ్థం.

    ప్రశ్న: తపస్సు అంటే ఏమిటి? అది ఎలా చేయాలి?

    దీనికి రమణుల సమాధానం: ధ్యానం చేసేటపుడు అది ఎవరు చేస్తున్నారో చూడు. జపం చేసేటపుడు అది ఎక్కడ్నుంచి వస్తోందో చూడు. అదే తపస్సు.

    ఇదే “నేను ఎవరిని?/నాన్ యార్?” అనేది తెలుసుకోవడం. ఈ వ్యాక్యం అర్ధం కావడానికి జీవితాలు సరిపోవు. దీనితో పొంగిపోయి గణపతి ముని ఆయనకి రమణ మహర్షి అని పేరు ఇచ్చారు అంటారు.

    ఆ రోజుల్లో రాసిన సంస్కృతానికి తెలుగులో చేసిన ఈ అనువాదనే చాలా గొప్ప. అయితే ఈ అనువాదం మూలానికి ఎంత దగ్గిరగా ఉందో చెప్పాలంటే మరో సంస్కృత పండితుడు ముందుకి రావాలి.

  6. ముందుమాటే ఇది…! గురించి Suresh Krishna అభిప్రాయం:

    08/03/2019 11:51 am

    చప్పట్లు 💐💐💐

  7. థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి kalyani అభిప్రాయం:

    08/03/2019 12:18 am

    చాలా బాగుంది అమరేంద్రగారు. మా కళ్ల ముందే తిరిగారు మీరు – అయినా మీ కళ్లతో మీరు చూసినవి – చెప్తూంటే ఆ విశేషాలు మళ్లీ కొత్తగా ఉన్నాయి. ఇంకా వింతైన విషయం ఏమిటంటే – మళ్లీ సంచికలో మరేం చెప్తారో వినాలని కుతూహలం కలుగుతోంది.

    ఇది పూర్తయే సరికి మరో భూభాగాన్ని దర్శించి వచ్చేయండి – ఆ విశేషాలు మాకందిద్దురు గాని.

  8. థాయ్‌లాండ్ యాత్రాగాథ-1 గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    08/02/2019 8:17 pm

    సముద్రానికి అంతమెక్కడ?
    తిరిగే కాలుకి విశ్రాంతెక్కడ?

  9. ఆగస్ట్ 2019 గురించి హిమసాయి అభిప్రాయం:

    08/02/2019 1:18 am

    కె. సదాశివరావుగారు రాసిన ‘చలిమంటలు’ కథ లింక్ ఉంటే షేర్ చేయండి.

    [ముందుమాటలో లింక్ చేర్చాం. గమనించగలరు – సం]

  10. దేవుడి కొడుకు గురించి Sujata అభిప్రాయం:

    08/02/2019 12:30 am

    Apt to the editorial. Tagore is timeless. Thank you for this story.