పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. హెచ్చరిక గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    01/09/2020 10:32 am

    నేరం చేసాడో లేదో తెలియదు అనే ముక్క పట్టుకుని కధ రాసారులా ఉంది. కానీ నిర్భయ కేసునుంచి ఈ రోజు వరకూ జరిగినవి చూస్తే తెలిసేదేమంటే, ఎంత వెధవైనా సరే వాడికి ప్రాణం మీద “అతి” తీపి. నేను అమాయకుణ్ణీ అని చెప్పుకోవాలనే తాపత్రయం; ఏదో ఒక లొసుగు ఉండకపోదా తప్పించుకోవడానికి అనే ఆశ. ఇవన్నీ కూడా రేప్ చేసినప్పుడూ, ఆ తర్వాతా గుర్తుకురాకపోవడం, ఇంతటి నీచమైన పనిచేసినా దానికి ఒప్పుకుని పశ్చాత్తాపం పడకపోవడం దారుణం. ఇదంతా ఒక ఎత్తైతే మన అద్భుతమైన న్యాయ వ్యవస్థా, దాదాపు పదివేల పేజీల – దాదాపు ఎవరికీ అర్ధంకాని, గుర్తు ఉండని – రాజ్యాంగం ఎంతకీ తేలని కోర్టు కేసులూ మరో ఎత్తు. నిర్భయ అమ్మగారు ఏమన్నారో ఎవరైనా విన్నారా? “నా కూతురు పోయి ఏడేళ్ళు దాటుతోంది. ఏడవడానికి కన్నీళ్ళు కూడా ఎండిపోయాయి” అంటున్నారు. మరి ఆవిడ క్షోభో? ఈ ఏడేళ్లలో పాపం ఆవిడ ఎన్ని రోజులు నిద్ర లేకుండా గడిపిందో, ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగిందో, ఎంత దారుణంగా ఆ బాధ గుండెల్లో నొక్కుకుందో ఎవరైనా ఆలోచించారా?

    ఈ రోజు వచ్చిన వార్త ప్రకారం ఈ నిర్భయ కేసులో ఒకడు క్యూరేటివ్ పిటిషన్ అనే కేసు ఏదో వేశాట్ట ఆఖరు అస్త్రంగా. వాడిని పోలీసులు తీసుకెళ్తున్నట్టూ ఒక బొమ్మ – కలర్ దే – వేసారు. కండలు పెంచి వస్తాదులాగా ఉన్నాడు. జైల్లో ఉచితంగా పెట్టే కోడికూరా బిర్యానీలు బాగా వంటబట్టినట్టున్నాయ్. రేప్ చేసినప్పుడు, ఆవిడ రక్తం కారుతూ చేతులెత్తి మొరపెట్టినప్పుడూ, ఆవిడని బస్సులోంచి తోసేసినప్పుడూ వీళ్లకి లేశమాత్రమైనా లేని కనికరం వీడికి ఎందుకు చూపించాలిట? ఇవి చాలవన్నట్టూ ఈ ముష్టి వెధవల తరపు వాదించడానికో లాయరు తయారు. ఓ సారి గుండెలమీద చేయి వేసుకుని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు లాయర్ అయితే ఇటువంటి కేస్ వాదిస్తారా ఎన్ని డబ్బులిచ్చినా? అలా వచ్చే డబ్బులూ, పేరూనా మీరు లాయర్ గా కోరుకునేది?

    https://www.sakshi.com/news/national/nirbhaya-convict-files-plea-against-death-sentence-1254498

    ఆ చచ్చిపోయిన అమ్మాయి మీవాళ్లైతే/ఏ మంత్రి గారి కూతురో అయితే ఎలా స్పందిస్తారు? అప్పుడు ఈ న్యాయం అనేది అటవికమా, అన్యాయమా అనేది ఎవరు నిర్ణయం చేస్తారు? అసలీ నిర్భయ కేసు ఇంతకాలం ఇలా బుధ్ధి లేకుండా లాగబట్టే ఇటువంటి రోజు రోజుకీ ఎక్కువౌతున్నాయి. ఇటువంటివే రాగింగ్, చిన్న పిల్లల్ని స్కూల్లో కొట్టడం అనేవి. రాగింగ్ జాడ్యం మనకి ఎక్కువగా ఉండేది కొంతకాలం క్రితం. బాగా రూల్స్ పెట్టి స్ట్రిక్ట్ చేసాం అని చెప్పుకుంటున్నా ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నై. కాలేజీలు తెరవగానే ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. అయ్యో పాపం అనుకోవడం ఆవిడ పోయిన రోజున. మర్నాటినుంచి మళ్ళీ అంతా మామూలే.

    అసలీ దరిద్రాలు ఎప్పటికి వదుల్తాయి? ఇటివంటివి జరుగుతున్నందుకు మనం సిగ్గుపడితే పడతాం గాక కానీ ఈ కేసు ఇప్పటికీ తేల్చనందుకు ఏ ఒక్క రాజకీయనాయకుడూ కూడా సిగ్గుతో తలదించుకోలేదు. [భగవంతుడా, ఇది 2020 సంవత్సరం, 1745 కాదు] ఇది చాలక ‘మేరా భారత్ మహాన్ రండ్రండి వచ్చి పెట్టుబడులు పెట్టండి’ అని ఆగని సాగర ఘోష.

    అన్నింటికన్నా దరిద్రం ఏమిటంటే ఇవన్నీ జరిగినవి ప్రథానమైన నగరాల్లో కనక అవి బయటకొచ్చాయి. రోజువారీ పల్లెల్లో జరిగేవి ఎన్నిఉన్నై? పూర్వకాలంలో కొరత అనేది ఉండేదంటారు. నేరస్తుణ్ణి శూలం మీద గుచ్చి శ్మశానంలో వదిలేస్తారు. వీళ్లని ఎందుకలా చేయకూడదు? “అమానుషం” అయిపోతుందిట. అయ్యో పాపం అమానుషం “మనుషులకి కాదుటండీ?” ఒకప్పుడు రేప్ చేసినా వీడూ “ఒక మనిషే!” నిజమేనా? ని-జ-మే——-నా?” ని….ని…..ని…..నిజంగానేనా?

  2. నవోదయతో నా రుణానుబంధం గురించి మద్దిపాటి కృష్ణారావు అభిప్రాయం:

    01/04/2020 4:34 pm

    2003 నుండి రామ్మోహనరావు గారితో నా అనుబంధమూ ఇలాంటిదే! డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి కి కావలసిన పుస్తకాలన్నీ ఆయన చేతిమీదుగానే వచ్చేవి (రెండేళ్ళ క్రితం వరకు). ప్రచురించిన పుస్తకం దేశంలో ఎక్కడ ఉన్నా సాధించి పెట్టేవారు. లేకపోతే ఫోటోకాపీ పంపించేవారు. ‘ఫోటోకాపీ చేస్తే రచయితకు నష్టం కదా’ అంటే ‘రచయిత మరిన్ని కాపీలు ప్రింట్ చేశాక మీరు డబ్బులిద్దురుగాని’ అని చమత్కరించేవారు. 2007 లో తానా సభలకు వచ్చినప్పుడు వారం రోజులపాటు ఝాన్సీ గారితోనూ, రామమోహనరావు గారితోనూ మా సాహితీ సమితి మిత్రులందరం డిట్రాయిట్ లో గడపడం కళ్ళ ముందు మెదిలే తీపి జ్నాపకాలు.

  3. భారం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    01/03/2020 8:21 am

    ‘ఓ ప్రభూ, నేను ఈ భారం మోయలేకున్నాను!’

    ‘ஓ… இந்தப் பாரம்… என்னால் தாங்க முடியவில்லை!’ ఓహ్ ఇంతతాప భారం … ఎన్నాళ్ తాంగ ముడియవిల్లై

    అన్నా అప్పాదురై! తంబీ అవినేని భాస్కర్!! ‘నేను ఈ భారం మోయలేకున్నాను!!!’

    మిమ్మల్ని…. మీరిచ్చిన సాహిత్య సౌరభాలని, సానిత్యాన్ని నా జీవిత కాలం మరిచిపోలేను

  4. అవధారు గురించి Indra Prasad అభిప్రాయం:

    01/03/2020 5:07 am

    ఆరున్నరేళ్ల తర్వాత కూడా ఈ నివాళి ఏమాత్రం వన్నె తగ్గకుండా వెలుగుతూ ఉంది. నా వంటివాడు ఇంత అలస్యంగా కూడా కళ్లు చెమర్చుకొంటూ త్రిపురని చూడగలగడం ఆయనతో పాటు కనక ప్రసాద్ ని నాకిష్టమైన సోమసుందర్ని ఆయనతో గడిపిన సమయాన్ని నెమరేసుకోవడం చాల మెలంఖొలిక్ గా ఉంది.

  5. గ్రీకు పురాణ గాథలు 1 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    01/02/2020 12:06 pm

    ఈ శీర్షిక పేరు, ఇందులోని విషయాలు చూడగానే మామూలుగా ఈమాటలో ప్రచురించబడే రచనలకి భిన్నంగా ఉండటం నచ్చింది.

    మొదట నుంచి “ఈమాట” తో ఉన్న అనుబంధంవల్ల ఈ మాటలు రాస్తున్నా!

    పశ్చిమ దేశాల్లో జీవిస్తున్న తెలుగువారి అనుభవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి అందరితో పంచుకోవాలని ప్రారంభించిన “ఈమాట” వేదిక ప్రయోజనం ఇటువంటి రచనలవల్ల కొంతైనా నెరవేరుతుందని అనుకుంటున్నా.

    దాదాపు 2500 సంవాత్సరాల క్రితం ప్రభావితం చేసిన మహపురుషులు గౌతమ బుద్ధుడు (భారతదేశం), సోక్రటీస్ (గ్రీకు దేశం), కన్‌ఫ్యూసస్ (చైనా దేశం), వారి తాత్విక చింతనలకి మూలాలు అప్పటి కాలాల నాటి పురాణ గాధల్లో ఉన్నాయి అంటారు విజ్ఞులు. ఈ మహనీయుల ఆలోచనలు ఈనాటికీ మానవ మనుగడకి మూలాలే అని చెప్పవచ్చు.

    1988 సంవత్సరంలో ప్రధమ ముద్రణ పొందిన ” విశ్వదర్శనం (పాశ్చాత్య చింతన) ” అన్న పుస్తకంలో శ్రీ నండూరి రామమోహన రావు గ్రీకు మేధావుల ఆలోచనా ధోరణి పాశ్చాత్య తత్వ చింతనకు ఎట్లా దారితీసిన విషయం విపులంగా ప్రస్తావవించారు. కానీ, గ్రీకు పురాణ గాధల మీద ఎక్కువ దృష్టి ఈ రచనలో ఎక్కువ చోటు చేసుకోలేదు. ఆ పని ఇప్పుడు వేమూరి గారు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది!

    ప్రపంచంలో అన్నిటికన్నా భారతీయ సంస్కృతి చాల గొప్పదని మనందరం అనుకొటం సహజం. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, రామాయణ-భారతం వంటి ఇతిహాసాలు – ఇలా మన సంస్కృతిని ఎన్నో ఏళ్ళకి పైగా ప్రభావితం చేసి పరిఢవిల్లించాయి. ఇతర సంస్కృతుల్లో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆవి కూడా మనం తెలుసుకోవాలి.

    అందుకు వేమూరి గారి ఈ రచన ఉపయోగ పడుతుందని నేను అనుకుంటూన్నా.

    ఈ నాడు సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ దేశాల ఆలోచనా ధోరణుల మూలాలు గ్రీసు దేశంలో ఉన్నాయని మనం గుర్తిస్తే ప్రస్తుత రచన ఆవశ్యకత అర్ధం అవుతుంది.

    ఈమాటలో మంచి రచనకి శ్రీకారం చుట్టిన వేమూరిగారిని అభినందిస్తూ,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  6. పుస్తక పరిచయాలు గురించి Kallakuri Sailaja అభిప్రాయం:

    01/02/2020 6:46 am

    నాట్యం గురించి సాహిత్య ఎకాడమీ వారి పుస్తకం నా 17 వ ఏట చదివాను…భారతీయ నాట్యరీతులను చెప్తూ…దేహం ఆత్మ రూపంలో ఉన్న పరమాత్మ తో ఐక్యం చేసే ఒక ప్రత్యేక స్థితి అనీ, పరమాణువుల లోని నిరంతర చలనం గురించి చెప్పారు…ఈ కధనం దానికి ఎమోషన్ ను కలిపినట్టు తోచింది…చాల బాగుంది అండీ…ధన్యవాదాలు…

  7. నవోదయతో నా రుణానుబంధం గురించి Rama Krishna Cherukuri అభిప్రాయం:

    01/02/2020 6:36 am

    🙏🙏🙏🙏🙏 బుడుగు 1, 2 సంపుటాలు నేను కావాలన్నానని తెలిసి శ్రీనుతో పంపించారండి, షాప్ షిఫ్ట్ చేసే ముందు.

  8. పుస్తకాల గుళ్ళో ధ్వజస్థంభం ‘నవోదయ’ గురించి వీరభద్రం అభిప్రాయం:

    01/02/2020 4:42 am

    <>

    వరహాలు చెట్టి గారంటే, Book Centre వరహాలు చెట్టి గారేనా?. ఈయన గొప్పతనం విశాఖపట్టణం వారందరికీ తెలుసు.

  9. మహా నిశ్శబ్దం గురించి manjula అభిప్రాయం:

    01/02/2020 12:34 am

    అనువాదం చాలా బావుంది!!

  10. మహా నిశ్శబ్దం గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    01/01/2020 11:04 pm

    అనువాదం అనిపించలేదు.
    బాగుంది.