పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. తెలుగువారి ఊళ్ళ పేర్లు – ఇంటి పేర్లు గురించి శ్రీమన్నారాయణ అభిప్రాయం:

    03/15/2020 11:55 pm

    రెండు విషయాలు… ఒకటి ఉర్ల పేర్లు, రెండవది ఇంటిపేర్లు. ఊర్ల పేర్లు బుద్దుడి కాలంలో ఏర్పడ్డవి. తరువాత కొత్తగా వచ్చిన పరిణామాల్లో కొన్ని కొత్తవి వచ్చి చేరాయి. ఇంటి పేర్లు లేటెస్ట్ డెవలప్మెంట్. ఇంటి పేరుకు తండ్రి పేరుకు చాలా సంబంధం ఉంది. ప్రపంచవ్యాప్తంగా తండ్రి పేర్లు ఇంటిపేరుగా చలామణీలో ఉంటుంది. ఎక్కడైతే కుల ప్రస్తావన నిలబడిందో అక్కడ తండ్రి పేరు కాకుండా కొత్త ఇంటి పేర్లు వచ్చి చేరాయి.

  2. చెట్టు కింది మనుషులు గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    03/14/2020 6:12 pm

    Happy to see someone wrote a write up on this poem. As a child I used to read Suraksha magazine regularly. Surprised to see the above poem there.

    Sharing the link for eemaata readers:

    https://www.suraksha.media/news/the-tree-is-the-men-576

    Thanks&Regards
    Indrani.

  3. గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-5 గురించి Ramu అభిప్రాయం:

    03/14/2020 1:11 am

    సురేశ్ గారు, మీ వ్యాసాలు చాలా బాగున్నాయ్. చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి. ఒక ఆర్టికల్ కోసం వస్తే మీ అన్ని ఆర్టికల్స్ చదివేలా చేశారు. చాలా కృతజ్ఞతలు.

    తెలుగు పదాలకు వ్యుత్పత్తి తెలిపే పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే తెలుపండి, ప్లీజ్. I have many curious questions to know about Telugu literature but clueless about sources and path. If you have any links, please suggest me.

  4. కావ్యదహనోత్సవం గురించి Ravikumar అభిప్రాయం:

    03/11/2020 8:20 am

    రామారావు గారు, Please email me. I guess I know you! From Eluru.

  5. కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ గురించి K.Sivaramaprasad అభిప్రాయం:

    03/10/2020 9:29 am

    శ్రీనివాస్ గారూ,మంచి ఇంటర్వ్యూ అందించారు, ధన్యవాదాలు. జగ్గయ్య గారితో ఇంటర్వ్యూ ఇదే వినటం.

    సినిమా సంభాషణలు గ్రామఫోన్ రికార్దుగా రావటం ముత్యాలముగ్గుతో ప్రారంభం అయింది అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని జగ్గయ్యగారు శివాజీ గణేశన్ కు డబ్బింగ్ చెప్పిన మనోహర చిత్రం తో ఆరంభం అయ్యిందని ఈ ఇంటర్వ్యూ వల్లే తెలిసింది

  6. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    03/10/2020 7:01 am

    రవికుమార్ గారు, మీరడిగిన బంగరు పూవులు పూచే తల్లికి … అన్న పాట ఈమాట, సెప్టెంబర్, 2014 సంచికలో వుంది. https://eemaata.com/em/issues/201409/4928.html

  7. కొన్ని లలితగీతాలు గురించి అగరు ధూప లతిక అభిప్రాయం:

    03/10/2020 12:06 am

    “కలలో నీలిమ గని” ఈ లలిత గీతాన్నే రుక్మిణీ కల్యాణం కూచిపూడి నృత్యరూపకంలో రుక్మిణి మనోవ్యధని వివరించే సన్నివేశంలో ఉపయోగించారు. నాట్య, సంగీత, సాహిత్యాల త్రివేణీసంగమం ఆ నృత్యరూపకం! పట్రాయని సంగీతరావుగారు (?) కూర్చిన ఆ బాణీ నాకింకా నచ్చింది. “అగరు ధూప లతికవోలె” అన్న చరణమే పల్లవికి బాగా నప్పిందనిపిస్తుంది.

    https://www.youtube.com/watch?v=vmVfRkcvBf8

  8. మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Ravikumar అభిప్రాయం:

    03/09/2020 9:59 am

    Pls add – పువ్వులు బంగరు పువ్వులు పూచే తల్లి కి భారత ధాత్రి కి వందనం.. by Mallik Gaaru.

  9. ఉయ్ టూ గురించి సుభాష్ యామినిగంటి అభిప్రాయం:

    03/08/2020 5:24 pm

    ఈమాట లో ఈ కధ చదవగానే నా మీద గొప్ప మందులాగా పని చేసి నాలో ఇప్పటి వరకూ ఉన్న ఆసూయా, మద మోహ మాత్సర్యాలన్నీ చిటికెలో మాయం అయిపోయేయి. గుండెల్లో భారం అమాంతం పాదాల్లోకి దిగిపోయింది. ఇటువంటి కధలు ప్రతీ నెలా ప్రచురించి పుణ్యం కట్టుకోండి. గే కల్చరు కూడా ఏదో అర్ధం అయినట్టే ఉంది. శతకోటి నమస్కారాలు.

  10. కొన్ని లలితగీతాలు గురించి Radhika Prasad అభిప్రాయం:

    03/06/2020 11:51 am

    ఎన్నో ఏళ్ళ క్రితం విన్నాను.. ఒక ప్రియమైన స్నేహితురాలి వలన మళ్ళీ ఇన్నాళ్ళకి విన్నాను.. మహామహులు రచించిన, స్వరపరిచిన, గానం చేసిన లలిత గీతాలు.. సేకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏..