పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గల్ఫ్ గీతం: 1. దుబాయ్ గురించి Srinivas Banda అభిప్రాయం:

    07/01/2020 5:56 am

    సాధారణంగా, యాత్రా కథనాల్లో చోటు చేసుకునేవి యాత్రల్లో జరిగిన విశేషాలూ, తారసపడిన వింతలూ, అనుభూతిచెందిన సుఖాలూ అవస్థలూ! కానీ అమరేంద్రగారి యాత్రాకథనాలు చదువుతుంటే, పక్కనే కూర్చొని ఆ వివరాలన్నీ పూస గుచ్చినట్లు చెప్తున్నట్లనిపిస్తుంది. యాత్రలోని అనేక భాగాలు – సన్నాహాలు, ప్రయాణాలు, సందర్శనాలు, విశేషాలు – వీటన్నిటినీ చెప్తూనే, సందర్శిస్తున్న ప్రదేశానికి సంబంధించిన చరిత్రనీ, నేటి స్థితిగతులనీ కూడా seamlessగా కథనంలోకి అల్లడం అమరేంద్రగారి ప్రత్యేకత. ‘దుబాయ్ చరిత్ర’ అని పుస్తకం ఉంటే చదవడానికి ఆసక్తి కలుగుతుందోలేదో చెప్పలేనుగానీ, ఈ కథనం చదువుతుంటే మాత్రం ఆసక్తి పెరుగుతూనే ఉంటోంది. ‘ఇవన్నీ మాకు అందిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని చెప్తే సరిపోదనిపిస్తోంది!

  2. మరికొన్ని లలితగీతాలు గురించి venkatmoksha అభిప్రాయం:

    06/28/2020 8:00 am

    How can we download the songs sir?

    [డౌన్‌లోడ్ చేసుకొనే సదుపాయం లేదు. వినాలంటే ఈమాటలోనే ఎన్నిసార్లైనా వినవచ్చు. — సం. ]

  3. మహా నిశ్శబ్దం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    06/27/2020 8:11 pm

    వ్యాసం బావుంది. అనువాదం సరితూగింది!

  4. బెనిఫిట్ ఆఫ్ డౌట్ గురించి Victor Vijay Kumar అభిప్రాయం:

    06/25/2020 10:26 am

    నీవు కత్తి సోదరా …

  5. ప్రేమ ఉన్నచోటే భగవంతుడు గురించి srinivasa rao vuppala అభిప్రాయం:

    06/23/2020 4:43 pm

    చాలా చాలా బాగుంది, భావానికి సహాజంగా వుంది, అనువాదంలా లేదు.

  6. గడినుడి – 44 గురించి sahasra అభిప్రాయం:

    06/23/2020 1:53 pm

    కొన్ని సరిచూపు ఆధారంతో నింపగలిగినా, అవి ఎమిటో, ఎందుకో అర్థం అవ్వటం లేదు.

  7. మధ్య వ్యవధిలో నీడలు గురించి Challa jayapal Reddy అభిప్రాయం:

    06/22/2020 1:10 am

    ఈ కథను యథాతథంగా థప్పడ్ సినిమాగా తీసినట్లున్నారు… great vision…. కథ బాగుంది …ముగింపు లొనే ఈ కథ గొప్పతనం ఉంది.

  8. ఐదు కాళ్ళ మనిషి గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    06/21/2020 10:09 am

    అప్పాదురై ముత్తులింగం అన్నకి… వారి మరో ఆణిముత్యం కధని అద్భుతంగా అనుసృజన చేసి ఇచ్చిన అవినేని భాస్కర్ కు …. హృదయపూర్వక కృతజ్నతలు.

    పిన్ని, భర్త, కొడుకు లచే జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… అలుపెరగని పోరాటం చేసి… ముఖాన అందమైన నవ్వు చెక్కుచెదరనీయకుండా నిలబడ్డ గ్రీకు మహిళ హెలెన్ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.

    13 ఏళ్ళప్పుడు చీపురుకర్ర చేతబట్టి పాచిపనులు చెయ్యడం మొదలుపెట్టిన హెలెన్ అని చక్కని పేరున్న గ్రీకు మహిళ … 55 ఏళ్ళొచ్చినా ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు….
    చనిపోయేంతవరకు కాయకష్టం చెయ్యడాన్ని మానుకోని తండ్రి …. ఐదు కాళ్ళ మనిషి అని ఊళ్ళోవాళ్ళు గేలిచేసినా పట్టించుకోని తండ్రి స్పూర్తితో జీవితంతో అలుపెరగని పోరాటం చేసిన ఈమె దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి.

    1) పేదరికంలో ఉన్న తనను పదమూడేళ్ళ వయసప్పుడు చదువుకోవచ్చు అని ఆశ పెట్టి కెనడాకు ( మాంట్రియాల్ ) పిలిపించుకుని తన ఇంట్లో పనిమనిషిగా వాడుకుని మోసంచేసిన పిన్ని… ప్రేమ, ఆప్యాయత చూపకుండా చిన్నపిల్లనయిన తనని ఎంతో కర్కశంగా చూసి, గొడ్డుచాకిరీ చేయించుకున్న పిన్ని…

    2) మాంట్రియాల్ లోని పిన్ని వాళ్ల ఇంటి నుండి టొరాంటో కి పారిపోయి అక్కడ ఓ ఫ్యాక్టరీలో బట్టలకు గుండీలు కుట్టే పనికి కుదురుకుని… అక్కడ పనిచేస్తున్న ఒకతన్ని పెళ్ళి చేసుకుని.. భర్త ప్రొద్భలంతో దాచుకున్న మొత్తాన్ని పెట్టి గ్రీకు రెస్టరెంట్ ఒకటి తెరిచి…. ఉన్నట్టుండి ఒక రోజు ఆయన మాయం అయ్యి… ఇక ఆ రెస్టరెంట్ నడపలేక, వేరే దారిలేక దాన్ని నష్టానికి అమ్మేసిన హెలెన్

    3) స్కూల్ చదువు కూడా కూడా పూర్తి చెయ్యకుండా, పట్టుమని పది రోజులు కూడా పరిచయం లేని ఓ అమ్మాయిని తల్లికి చెప్పకుండా పెళ్ళి చేసుకుని… అక్కడ మాత్రమే బాతుల్ని వేటాడచ్చుని భార్యతో కలిసి అమెరికాలోని ఐడహో స్టేటుకు వెళ్ళిపోయిన కొడుకు. తనను వదిలి అమెరికా వెళ్ళిపోయిన కొడుకు దగ్గర నుంచి ఒక్కసారైనా ఫోన్ కానీ ఉత్తరం కానీ లేకున్నా …

    “ జీవితంలో అనేకసార్లు మోసం చేయబడ్డా… చేదు జ్ఞాపకాల గాయం ఇంకా అలానే ఉన్నా వాళ్లందరిని క్షమించేశాను. ఇక ఇప్పుడు నాకు జీవితంలో ఎవరూ లేరు. నా జీవితాన్ని ఒంటరిగా, హాయిగా గడిపేస్తున్నాను. అప్పుడప్పుడూ మా నాన్నను గుర్తు చేసుకుంటాను “ అన్న హెలెన్

    తిరిగొచ్చి ఐదేళ్ళుగా మంచం పట్టి ఉన్న భర్త ని చూసుకుంటూ.. వెన్నునొప్పితో బాధ పడుతున్నా ఎప్పుడైనా ఊడిపోగల జానిటర్ ఉద్యోగం లోనే ఉంటూ కూడా… 55 ఏళ్ళొచ్చిన ఆమె ముఖంలో ఆ అందమైన నవ్వు మాత్రం చెక్కుచెదరలేదు.

  9. జూన్ 2020 గురించి Vasu అభిప్రాయం:

    06/18/2020 6:57 pm

    చాలా బాగా చెప్పారు

  10. ఉదయానే ఓ రంగుల పిట్ట గురించి Srinivas Banda అభిప్రాయం:

    06/17/2020 11:26 am

    చాలా బాగుందండి! మనం చూసే ప్రతి క్షణం వెనుకా ఎన్నో వేల చేతులుంటాయి.. మనుషులవీ, ప్రకృతివీ! చక్కటి కవిత అందించినందుకు ధన్యవాదాలు!