పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఉత్సాహానికి దూరంగా… గురించి Amarendra Dasari అభిప్రాయం:

    03/01/2021 6:44 pm

    అచ్చమైన కవిత్వం – అలవోక పదాలు

  2. నేనెలా రాస్తాను? గురించి Amarendra Dasari అభిప్రాయం:

    03/01/2021 6:38 pm

    బావుంది. అక్కడక్కడ నాకు నేను కనిపించాను !

  3. ఉత్సాహానికి దూరంగా… గురించి MALLAVELLI S N V PRASAD అభిప్రాయం:

    03/01/2021 10:54 am

    పూలలోని రంగులు జారిపోవడం చాలా బాగుంది సార్ ప్రయోగం 🙏

  4. గల్ఫ్ గీతం: 9. చివరి చరణం గురించి Srinivas Banda అభిప్రాయం:

    03/01/2021 7:00 am

    మేమందరమూ చూసేది ఇసుకని ఇసుకగానే, ఉప్పు గాలిని గాలిగానే, మనుషుల్ని మనుషులుగానే! అమరేంద్రగారికి మాత్రం ప్రతి ఇసుక రేణువులోనూ ప్రతి గాలి తెమ్మెరలోనూ ప్రతి మనిషిలోనూ ఒక విశ్వజనీనమైన ఆత్మీయత కనిపిస్తుంది. మీరు మరోసారి గల్ఫ్ దేశాలకి వెళ్లాలండి. గల్ఫ్‌కేగాదు ఆమాటకొస్తే ప్రతి ప్రపంచానికీ వెళ్లాలి. ఆ వివరాలన్నీ మాబోంట్ల కళ్లకి కట్టాలి. మనసుకి పుయ్యాలి. మమ్మల్ని లోపల్నించి వెలిగించాలి. Thank you for everything!

  5. స్వేచ్ఛ గురించి నాదెళ్ల అనూరాధ అభిప్రాయం:

    02/27/2021 5:12 am

    కథ నచ్చినందుకు సంతోషమండీ. థాంక్యూ.
    Boss గారూ, మీ చైల్డ్ ని మీరు అర్థం చేసుకుని, దగ్గరకు తీసుకోవటంతో సమస్య చాలావరకు పరిష్కారం అయింది. ప్రపంచం ఎలా చూస్తుందన్నది మీరు ఆలోచించద్దు. తప్పక అర్థం చేసుకుంటుంది. మీరిచ్చే సపోర్ట్ బాబు జీవితంలో పెద్ద గెలుపు.

  6. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి నారాయణ శర్మ అభిప్రాయం:

    02/26/2021 8:55 pm

    చాలా చక్కగా వ్రాసారు. 👍
    మనసు కదలికల్లోంచి నేరుగా జారి వచ్చే రచనలకు చదువరుల మనసుల్ని తమతోపాటు కదిలించే గుణం ఎక్కువ అనిపిస్తుంది. బహుశా అలాంటి రచనలే మనుషుల్ని (వాళ్లకు తెలిసినా, తెలియకున్నా) లోతుగా ప్రభావితం చేసి మారుస్తాయేమో, మిగతా మాటలన్నీ నిజానికి వట్టి డొల్లలేనేమో.
    మీరు వ్రాసిన ఈ వ్యాసం మనసుల్ని స్పృశించేట్లుగా ఉంది. సోషల్ మీడియాలో చిక్కుకుపోయి కలవరపడుతున్న చాలామందికి ఇది దారి చూపుతుంది.
    ఇంక చెప్పేకి ఏమీ లేదు. పైన బ్రహ్మానందంగారు అన్నీ చెప్పేసారు. 🙏

  7. తరవాణి కేంద్రం గురించి ఉమా జీజీ అభిప్రాయం:

    02/24/2021 7:54 pm

    ఇంతకీ తరవాణీకేంద్రం, సాకేత పురం అంటారు…

  8. బహుముఖాలు గురించి Harry అభిప్రాయం:

    02/23/2021 9:27 pm

    Few conversations are really touching. It looks like a real story or inspired by true events. Good Parimi. Excellently written.

  9. మూఢనమ్మకాలు గురించి తాడిగడప శ్యామల రావు అభిప్రాయం:

    02/23/2021 1:09 pm

    పొరపాటు వ్యాసం. బహుశః ఏదో పరాయి వ్యాసానికి అనువాదం కాబట్టి ఆటోమేటిగ్గా మంచివ్యాసం అని సంపాదకుల భావన కావచ్చును.

    ప్రస్తుత విజ్ఞానశాస్త్రాలు కేవలం మానవులకు బుధ్ధికీ అనుభవానికీ అందగల విషయాలను గురించి మాత్రం సాధికారంగా మాటలాడగలదు. మతవిశ్వాసాల వంటివి ఈ శాస్త్రాలకు వెలుపలి విషయాలను గురించినవి కాబట్టి కేవలం హేతువాదం చేసి తప్పెంచటం తొందరపాటు అవుతుంది తరచుగా.

    రేడియో టెలివిజన్ అందుబాటులో లేనికాలంలో ఎవరన్నా దూరంగా ఉన్న ధ్వని దృశ్యాలను దూరంగా ఉన్న వారు గ్రహించటం అన్నది అశాస్త్రీయభావన అనే అనేవారు కదా.

    ఈసైన్సు మొన్నటిదాకా ప్లూటోని తొమ్మిదో గ్రహం అన్నారు ఈమధ్యనే కాదన్నారు.మళ్ళీ మరేదో భూమికంటే పెద్దదే ఉందేమో అంటున్నారు. ఇంకా మనం తెలుసుకోవటంలోనే ఉన్నాం కదా.

    క్వాంటమ్ మెకానిక్స్ పుణ్యమా అని చాలా మౌలికభావనల పునాదులే కదలుతున్నాయి.

    అన్ని నమ్మకాలూ మూఢనమ్మకాలు కానక్కరలేదు. కొన్ని కావచ్చు కొన్ని కాకపోవచ్చు. అన్నీ సైన్సుతక్కిట్లో వేయవద్దు. నమ్మకాల మూలాలపై శోధన మంచిదే కాని ముందే మూఢం అని ముద్రవేసి చేసేది హేళనో నిందో అవుతుంది కాని పరిశోధనా కాదు పరిశీలనా కాదు. అలాంటి వ్యాసాలు కాలక్షేపానికే తప్ప నిరుపయోగం.

  10. కృష్ణగీతాంజలి గురించి రాధ మండువ అభిప్రాయం:

    02/23/2021 3:48 am

    ఏలా ఈ మధుమాసము రాసినది డాక్టర్ సి నారాయణరెడ్డిగారు అని చిత్తరంజన్ గారి పుస్తకం లో చదివాను