పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. అట్రిబ్యూట్ గురించి ప్రగతి అభిప్రాయం:

    04/01/2021 10:59 pm

    చివరి వరకూ కథ ఎవరు చెబుతున్నారా అనే సస్పెన్స్. మీదైన శైలి, చాలా బాగుంది కథ.

  2. స్వప్నసంచారం గురించి పార్థసారధి పోడూరు అభిప్రాయం:

    04/01/2021 10:46 pm

    చాలా బాగుంది. రెప్పల ఊడలు, పెదవికొమ్మ, ఇంకినభయాలు మొదలైన గమ్మత్తు పదప్రయోగాలతో అసాధారణ భావవ్యక్తీకరణ చేశారు. రచయితకి అభినందనలు. మంచి కవితను చదివిన తృప్తినిచ్చినందుకు ధన్యవాదాలు.

  3. స్వప్నసంచారం గురించి Divakar అభిప్రాయం:

    04/01/2021 10:27 pm

    ఆరిపోయిన నెగళ్ళలాంటి
    తీరని కోరికలను భ్రమలవల
    నిజంలా చూపెడుతుంది

    ఇలా ఈమె మాత్రమే వర్ణించగలరు!!!

  4. పద్య పదార్థ విజ్ఞానం గురించి Venkateswara Rao Veluri అభిప్రాయం:

    04/01/2021 7:14 pm

    Wow! You made my day.
    A poem by a working physicist
    Or even a retired physicist
    Is always a pleasure to read.

    Thanks and regards.

    Venkateswara Rao Veluri
    ( Failed as a physicist and as a poet)

  5. అట్రిబ్యూట్ గురించి చరణ్ పరిమి అభిప్రాయం:

    04/01/2021 1:06 pm

    నాకో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సన్నివేశాలు పూర్తి స్థాయిలో లేవన్న అసంతృప్తి ఉంది. కానీ కథ చాలా బాగుంది. బతకడమూ… బతకనేర్వడం.

  6. అట్రిబ్యూట్ గురించి పొత్తూరి సునీత అభిప్రాయం:

    04/01/2021 11:13 am

    నేను అద్దం వేపు నుండి కథ చెబుతున్నారు అనుకున్నా. కథ చెప్పిన విథం నచ్చింది. గోడలకీ కుర్చీలకి మాటలొస్తే… ఎన్నెన్ని కథలో… ఎన్ని రకాల మనస్తత్వ విశ్లేషణలో.

  7. పద్య పదార్థ విజ్ఞానం గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    04/01/2021 9:11 am

    “పప్పులు నమలుటలు గాదు పద్యరచనముల్!”

    ఒక్కసారి సంజీవ దేవ్ గారిని కలవడానికి వెళితే -ఆయన ఇదే వాక్యం చెప్పి -ఆత్రేయను ఎంతో ప్రశంసించారు. (ఆత్రేయ పద్యాల్లో రాస్తుకున్న ఆత్మకథ అప్పుడే వచ్చింది.)

    కవి , శాస్త్రవేత్త ఒక ఫాయా లోని వాళ్లే .- అంతర్జగత్తు -బాహ్య జగత్తులను నిరంతర పరిశీలనకు గురిచేయడం, వారి దినచర్య. లోపల వెలుపల , వెలుపల లోపల కాగల ప్రజ్ఞ (నాచన సోముని మాటలు, నావి కావు) వారి సొంతం.

    “footnote to a poem” అన్న 70 పుటల బ్రాడ్ స్కి వ్యాసం గుర్తుకొచ్చింది – 14 అధస్సూచికలను చూసి.

    ‘ప్రతిపదార్థ విజ్ఞానం’ అంటే మరింత సార్థకమయ్యేది కవిత.

  8. పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ గురించి తః తః అభిప్రాయం:

    04/01/2021 7:19 am

    ఫుల్లెల వారి సంపాదకత్వంలో డా॥ పి. శశిరేఖ రచన “అశ్వఘోషుని అద్భుత కావ్య ద్వయి”ని (సంస్కృత భాషా ప్రచార సమితి ,హైదరాబాదు వారి రజతోత్సవ ప్రచురణ – 2004-వెల 25 రూపాయలు) చదువుతున్నాను ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్న రచన.

    తః తః

  9. ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    04/01/2021 6:31 am

    కవిత్వం ఒక్కోసారి అందమైన పూల అమరిక; ఒక్కోసారి అణు విస్ఫోటనం. కవిత్వం వెనుక గణితం, గణితంలో కనిపించే కవిత్వం -బుద్ధిజీవి,సహృదయుడైన పాఠకుడు ఒడిసి పట్టుకోగలగాలి. అప్పుడే, జీవితం సంపూర్ణం.

    మోహనరావు గారు పరిచయం చేసిన – ఛందస్సులో నూతనాంశాలు , వసంతకాలపు ఎండలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఆధునిక కవిత్వంలో కూడా ఎన్నో రకాలుగా ప్రయోగాలు చేయవచ్చు- భావం బలంగా ఉన్నంత వరకు కవిత్వానికి వచ్చిన ప్రమాదం లేదు. పాతికేళ్ల క్రిందట, నేను మొట్ట మొదటి సారి ఒక మహానగరాన్ని చూసిన అనుభవం – అది కవితగా మారిన క్రమం, దాని వెనుక గణితం ఒక్కసారి గుర్తుకొచ్చాయి.

    https://eemaata.com/em/library/nnn/350.html

    వ్యాసకర్తకు అభినందనలు!!

    తమ్మినేని యదుకుల భూషణ్

  10. కష్టార్జితం గురించి C.Sasi అభిప్రాయం:

    03/31/2021 4:34 am

    I am usually interested in reading stories so I read this story. It’s really an emotional and touching story. In my opinion every person has to develop their behavior like that boy. Finally, thank you for giving us a valuable story.