సూరపురాజు గారి అస్తిత్వవాద పరిచయం ఎంతో చక్కగా ఉంది.ఎన్నో సంక్లిష్టమైన విషయాలను సరళమైనరూపంలో మనస్సుకు హత్తుకొనేలా వివరించారు.వెంటనే పుస్తకాన్ని చదివెయ్యాలనే కుతూహలం కలిగింది. ధన్యవాదాలు.
నేనింతకు ముందు Gerald Manley Hopkins కవిత్వం చదవలేదు. సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, ప్రత్యేకించి పరిచయం చేసిన హాప్కిన్స్ పద్యాలు చక్కగా బోధపడి ఆయన ఇచ్చిన తెలుగు తర్జుమాలు అందంగా ఉండి ఆనందింపచేసాయి. ఇక్కడి పరిచయం రసవత్తరంగా ఉండినందున నెట్ లో హాప్కిన్స్ వి వీలైనన్ని కవితలు చదివాను. పొయెట్రీ లోని భావం, ప్రాసొడీ చిత్ర విచిత్రాలు, మళ్లీ మళ్లీ చదవగా కొంత మెరుగ్గా తెలుస్తున్నవి.
తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ పొయట్రీ -ఇంగ్లిష్ లోనే, తెలుగుసేత కన్నా బాగా అర్థం అవుతుందేమో. తెలుగు రాని తెలుగు వాళ్లున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వాళ్లిప్పుడున్నారా? సంస్కృతం, అరవం, కన్నడం ఇలా ఇతర భాషలు రాని తెలుగు వారున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వారున్నారా? మరొకటి. రచయిత ఇంగ్లిష్ పొయట్రీని విప్పి చెపుతారు, కాని సంస్కృత వాక్యాలను అర్థం చెప్పకుండా వదిలేస్తారు. అదేం పని! ఎందుకని! సంస్కృతం కన్నా, ఇంగ్లిష్ తెలిసిన వారే పాఠకులలో ఎక్కువమంది కాదా? ఇంత నేర్పరి రచయిత, విప్పి చెప్పటమే తన రచన ముఖ్యోద్దేశమైనప్పుడు సగం సగం చెప్పి వదిలెయ్యటం సరికాదు. ఐనా ఏక కాలంలో కొంత తెలుగు భాషను, కొంత ఇంగ్లిష్, వెనకటి కవుల, ఫిలాసఫర్ల పరిచయాలు ఏ రకంగా తెలుసుకున్నా ఆనంద దాయకమే. ఈ పత్రికలో ఇచ్చిన, సూరపరాజు గారి రచనలన్నీ చదువుతున్నాను. Thanks.
ఈ Hopkins కవి కవితలు, ఇక ముందైనా ట్యూటరింగ్ లేకుండా నాకు అర్థంకావనుకుంటాను. నాకు క్రిస్టియానిటీతో కొంత పరిచయం ఉన్నా, కవి కాలం నాటి ఇతరుల కవిత్వంతో కొంత పరిచయం ఉన్నా, ఈ జెస్యూట్ కవిని గ్రహించుకోటానికి ఇంకా చాలాసార్లు చదివితే తప్పించి నాకది సాధ్యపడదు.
ఉదాహరణకు The Wreck of Deutschland పద్యం. ఆ పొడుగు కవితలో ఉన్న 35 సానెట్స్ బిబ్లికల్ భావాలు, లిరికల్ బ్యూటీ అర్థం కాటానికి ప్రత్యేకించి poetry class తీసుకోవలసిందే. ఈ కవితపై సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారి ప్రచురించబడిన పుస్తకంలో గాని పూర్తి వివరణ ఉంటే వారి పుస్తకం, మరో ఇతరులు ఇంగ్లిష్ లో రాసిన మరో పుస్తకం తెప్పించుకుని చదవాలి.
ఈ ‘wreck’ పద్యం పైకి stanza After stanza చదువుతుంటే అందులోని మ్యూజిక్ ఆనందపరుస్తున్నది. హాప్కిన్స్, ఒక పద్యపాదంలో మెలడీ, మరో పాదంలో కౌంటర్ పాయింట్ రాసాడంటే, నాకు మురిపెం. ఈ పొడుగు పద్యం ఒక అందమైన తయారీ. ఒక శిల్పకారితనం. ఒక విషాద సంఘటనను, ఒక ప్రీస్ట్ లిఖించటంలో ఇంత పనితనమా? అని నాకు అచ్చెరపాటు.
(మాటలో మాట! కొద్ది రోజుల క్రితం ఈ పత్రికలో వేటూరి సినిమా పాటల గురించిన ప్రసక్తి, పాఠకులు తెచ్చినందున ఆ వ్యాసం మళ్లీ చదివాను. నేనిప్పుడు హాప్కిన్స్ సానెట్స్, వేటూరి పాటలు కొన్ని పక్కపక్కనే చదవొచ్చు. ఇద్దరి శబ్ద ప్రయోగాలు, కొత్త మాటల తయారీ విధానాలు గమనించవచ్చును. That excites me.)
The Wreck of Deutschland చదువుతుంటే, నాకు పూర్వపు కొందరి ఆర్టిస్ట్ ల, (J.W. Turner లాటి) shipwreck పెయింటింగ్స్ చూడాలనిపించింది. చూసాను. క్రితంలో నేను రాసిన ఈ కిందున్న ఒక పొయెమ్ నా మనసులో మెదిలింది. ఒక స్త్రీ నలుగురి దగ్గరి బంధువుల ఆకస్మికమరణానికి sea drowning తో, ship కు she తో, death కు sea తో, ఇందులో అన్వయం.
All of a Sudden
Three brethren have fallen
And wriggled helplessly in Sea.
The death wave is so massive
It swept them all away
The first mate didn’t even
Know he is dying.
She sees her ship keel
She is not made of steel.
She will wail and reel,
She has no hope to heal.
There is no mainland in sight
There is no island to maroon
A life spent in to and fro freight
She now awaits her own swoon.
The Sea waves rise and fall
Every seaman knows its roar
Every creature knows its fury
Every day begging for small mercies
With fear in hearts, they live and die.
సూరపరాజు రాధాకృష్ణ మూర్తి గారి వ్యాసం అస్తిత్వవాద సాహిత్య మూలాల్లోకి వెళ్లి ఇటు భారతీయ ఉపనిషత్, భగవద్గీత తాత్వికతను అటు పాశ్చాత్య దేశాల తాత్వికతను ఎంతో లోతుగా అరిస్టాటిల్ దగ్గరనుంచి నీచ (Nietzsche) వరకు తత్వవేత్తలను పరిచయం చేయడము ఇంట్రెస్ట్‌గా ఉంది.
తల్లి కూతురు అయినా, తండ్రీ కూతురు, కొడుకైనా డబ్బు ఆస్తి తరువాతే మనిషి యోనాంద్యమని తేల్చారు రచయితగారు. అందరూ కాకపోయినా కొందరు అంతే. తండ్రిని ద్వేషించింది కానీ ఆయన ద్వారా వచ్చిన ఆస్తిని తేలిగ్గా స్వీకరించింది అనూ. మనిషి ఎంత స్వార్థపరుడో చూపించారు రచయిత.
అజెండా గురించి sudha అభిప్రాయం:
07/28/2021 8:53 pm
Thank you Suddhique ji ,Bhaskar garu, Srinivas garu, Uma garu , Srikanth garu, Padma garu for your valuable inputs …
భారతీయ పరిచయక్రమం – అస్తిత్వవాద సాహిత్యం గురించి పెచ్చెట్టి హేమాచల శ్రీరమణ ప్రసాద్ అభిప్రాయం:
07/28/2021 9:14 am
సూరపురాజు గారి అస్తిత్వవాద పరిచయం ఎంతో చక్కగా ఉంది.ఎన్నో సంక్లిష్టమైన విషయాలను సరళమైనరూపంలో మనస్సుకు హత్తుకొనేలా వివరించారు.వెంటనే పుస్తకాన్ని చదివెయ్యాలనే కుతూహలం కలిగింది. ధన్యవాదాలు.
ఊహల ఊట 1 గురించి రత్నమాల అభిప్రాయం:
07/28/2021 4:53 am
తులసి గారి *ఊహల ఊట….*
ఉయ్యాల ఊగుతూ పాడే పాట…లా శ్రావ్యంగా ఉంది. *బాల్యం* ….
పసితనపు గడుసుతనం చెప్పిన *భాష్యం.* …
ఆడపిల్లల ఆరిందాతనం..
అంతలోనే అమాయకత్వం..
ఎంత చక్కని కథనం!
పసివయసులో దోబూచులాడే పెద్దరికాన్ని వయసు పెరిగినా వదిలిపోని పసితనాన్ని వర్ణించాలంటే మీకు మీరే సాటి.
అక్షరాల దారాలతో కుట్టిన అంతరంగపు గౌనులో అందంగా చూపారు ఆడపిల్లని.
అప్పుడెప్పుడో ఆడపిల్లలమైన అందరం.. మరోసారి…గుర్తుచేసుకొన్న
మా
పువ్వుల గౌన్లు
రంగు రిబ్బన్లు
పౌడర్ డబ్బా
తిలకం సీసా
నాయనమ్మల ముద్దుల విసుర్లు
అమ్మ మురిపాల కసుర్లు
నాన్న గాంభీర్యంలోని గుంభనమైన ప్రేమ
అన్నదమ్ములతో ప్రియమైన పంతం…
జ్ఞాపకాల పందిట్లో బొమ్మల పెళ్లిలా కళ కళలాడిన రచన… ధన్యవాదాలు తులసి గారు
ఎంచక్కా ఉంది కథ.😊
రత్నమాల 🙏
జెరర్డ్ మేన్లీ హాప్కిన్స్ గురించి Lyla yerneni అభిప్రాయం:
07/26/2021 1:54 pm
నేనింతకు ముందు Gerald Manley Hopkins కవిత్వం చదవలేదు. సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారు, ప్రత్యేకించి పరిచయం చేసిన హాప్కిన్స్ పద్యాలు చక్కగా బోధపడి ఆయన ఇచ్చిన తెలుగు తర్జుమాలు అందంగా ఉండి ఆనందింపచేసాయి. ఇక్కడి పరిచయం రసవత్తరంగా ఉండినందున నెట్ లో హాప్కిన్స్ వి వీలైనన్ని కవితలు చదివాను. పొయెట్రీ లోని భావం, ప్రాసొడీ చిత్ర విచిత్రాలు, మళ్లీ మళ్లీ చదవగా కొంత మెరుగ్గా తెలుస్తున్నవి.
తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ పొయట్రీ -ఇంగ్లిష్ లోనే, తెలుగుసేత కన్నా బాగా అర్థం అవుతుందేమో. తెలుగు రాని తెలుగు వాళ్లున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వాళ్లిప్పుడున్నారా? సంస్కృతం, అరవం, కన్నడం ఇలా ఇతర భాషలు రాని తెలుగు వారున్నారు కాని, ఇంగ్లిష్ రాని తెలుగు వారున్నారా? మరొకటి. రచయిత ఇంగ్లిష్ పొయట్రీని విప్పి చెపుతారు, కాని సంస్కృత వాక్యాలను అర్థం చెప్పకుండా వదిలేస్తారు. అదేం పని! ఎందుకని! సంస్కృతం కన్నా, ఇంగ్లిష్ తెలిసిన వారే పాఠకులలో ఎక్కువమంది కాదా? ఇంత నేర్పరి రచయిత, విప్పి చెప్పటమే తన రచన ముఖ్యోద్దేశమైనప్పుడు సగం సగం చెప్పి వదిలెయ్యటం సరికాదు. ఐనా ఏక కాలంలో కొంత తెలుగు భాషను, కొంత ఇంగ్లిష్, వెనకటి కవుల, ఫిలాసఫర్ల పరిచయాలు ఏ రకంగా తెలుసుకున్నా ఆనంద దాయకమే. ఈ పత్రికలో ఇచ్చిన, సూరపరాజు గారి రచనలన్నీ చదువుతున్నాను. Thanks.
ఈ Hopkins కవి కవితలు, ఇక ముందైనా ట్యూటరింగ్ లేకుండా నాకు అర్థంకావనుకుంటాను. నాకు క్రిస్టియానిటీతో కొంత పరిచయం ఉన్నా, కవి కాలం నాటి ఇతరుల కవిత్వంతో కొంత పరిచయం ఉన్నా, ఈ జెస్యూట్ కవిని గ్రహించుకోటానికి ఇంకా చాలాసార్లు చదివితే తప్పించి నాకది సాధ్యపడదు.
ఉదాహరణకు The Wreck of Deutschland పద్యం. ఆ పొడుగు కవితలో ఉన్న 35 సానెట్స్ బిబ్లికల్ భావాలు, లిరికల్ బ్యూటీ అర్థం కాటానికి ప్రత్యేకించి poetry class తీసుకోవలసిందే. ఈ కవితపై సూరపరాజు రాధాకృష్ణమూర్తి గారి ప్రచురించబడిన పుస్తకంలో గాని పూర్తి వివరణ ఉంటే వారి పుస్తకం, మరో ఇతరులు ఇంగ్లిష్ లో రాసిన మరో పుస్తకం తెప్పించుకుని చదవాలి.
ఈ ‘wreck’ పద్యం పైకి stanza After stanza చదువుతుంటే అందులోని మ్యూజిక్ ఆనందపరుస్తున్నది. హాప్కిన్స్, ఒక పద్యపాదంలో మెలడీ, మరో పాదంలో కౌంటర్ పాయింట్ రాసాడంటే, నాకు మురిపెం. ఈ పొడుగు పద్యం ఒక అందమైన తయారీ. ఒక శిల్పకారితనం. ఒక విషాద సంఘటనను, ఒక ప్రీస్ట్ లిఖించటంలో ఇంత పనితనమా? అని నాకు అచ్చెరపాటు.
(మాటలో మాట! కొద్ది రోజుల క్రితం ఈ పత్రికలో వేటూరి సినిమా పాటల గురించిన ప్రసక్తి, పాఠకులు తెచ్చినందున ఆ వ్యాసం మళ్లీ చదివాను. నేనిప్పుడు హాప్కిన్స్ సానెట్స్, వేటూరి పాటలు కొన్ని పక్కపక్కనే చదవొచ్చు. ఇద్దరి శబ్ద ప్రయోగాలు, కొత్త మాటల తయారీ విధానాలు గమనించవచ్చును. That excites me.)
The Wreck of Deutschland చదువుతుంటే, నాకు పూర్వపు కొందరి ఆర్టిస్ట్ ల, (J.W. Turner లాటి) shipwreck పెయింటింగ్స్ చూడాలనిపించింది. చూసాను. క్రితంలో నేను రాసిన ఈ కిందున్న ఒక పొయెమ్ నా మనసులో మెదిలింది. ఒక స్త్రీ నలుగురి దగ్గరి బంధువుల ఆకస్మికమరణానికి sea drowning తో, ship కు she తో, death కు sea తో, ఇందులో అన్వయం.
All of a Sudden
Three brethren have fallen
And wriggled helplessly in Sea.
The death wave is so massive
It swept them all away
The first mate didn’t even
Know he is dying.
She sees her ship keel
She is not made of steel.
She will wail and reel,
She has no hope to heal.
There is no mainland in sight
There is no island to maroon
A life spent in to and fro freight
She now awaits her own swoon.
The Sea waves rise and fall
Every seaman knows its roar
Every creature knows its fury
Every day begging for small mercies
With fear in hearts, they live and die.
-లైలా
నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన గురించి BV Rama Rao అభిప్రాయం:
07/23/2021 6:36 pm
పూజ్యులు బృందావన రావుగారు ప్రస్తావించిన పద్యము, దాని పూర్వపరాల వివరణ, పద్య భావ విశ్లేషణ అద్భుతంగా ఉంది. ప్రసాద్ గారి వివరణ చాలా చాలా బాగుంది.
ఊహల ఊట 2 గురించి చాగంటి తులసి. అభిప్రాయం:
07/23/2021 7:26 am
జి.బి.శాస్త్రి గారికి, వేమూరి వారికి, సౌమ్య గారికి, అక్షర గారికి, కే.కే. రామయ్య గారికి ,స్వాతి గారికి, అనిల్ గారికి, శ్రీనాధ్ గారికి, చలం గారికి, సుమనస్పతి గారికి, శ్యామల గారికి , బాలకృష్ణ గారికి, కొoకేపూడి అనూరాధ గారికి తమ తమ అభిప్రాయాలు తెలియచేసినందుకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆగస్ట్ లో రాబోతున్న ఊహల ఊట చదవవలసినదిగా కోరుతూ.
మీ చాగంటి తులసి.
ఊహల ఊట 2 గురించి G.B.శాస్త్రీ అభిప్రాయం:
07/20/2021 11:19 am
చాసో గారికి తన తీరు వారసురాలు చాగంటి తులసమ్మ🙏
భారతీయ పరిచయక్రమం – అస్తిత్వవాద సాహిత్యం గురించి మాంచాల అచ్యుత సత్యనారాయణ రావు అభిప్రాయం:
07/20/2021 8:31 am
👍
సూరపరాజు రాధాకృష్ణ మూర్తి గారి వ్యాసం అస్తిత్వవాద సాహిత్య మూలాల్లోకి వెళ్లి ఇటు భారతీయ ఉపనిషత్, భగవద్గీత తాత్వికతను అటు పాశ్చాత్య దేశాల తాత్వికతను ఎంతో లోతుగా అరిస్టాటిల్ దగ్గరనుంచి నీచ (Nietzsche) వరకు తత్వవేత్తలను పరిచయం చేయడము ఇంట్రెస్ట్‌గా ఉంది.
అభినందనలు.
ఆఖరి చూపు గురించి Akhara అభిప్రాయం:
07/20/2021 12:38 am
తల్లి కూతురు అయినా, తండ్రీ కూతురు, కొడుకైనా డబ్బు ఆస్తి తరువాతే మనిషి యోనాంద్యమని తేల్చారు రచయితగారు. అందరూ కాకపోయినా కొందరు అంతే. తండ్రిని ద్వేషించింది కానీ ఆయన ద్వారా వచ్చిన ఆస్తిని తేలిగ్గా స్వీకరించింది అనూ. మనిషి ఎంత స్వార్థపరుడో చూపించారు రచయిత.
ఊహల ఊట 2 గురించి Akhara అభిప్రాయం:
07/20/2021 12:09 am
ఊహాల ఊట కథ చాలా బావుంది. నన్ను కూడా అనాయాసంగా నా చిన్నతనం లోకి లాక్కొనివెళ్ళిపోయింది. రచయిత్రికి మనస్ఫూర్తిగా అభినందనలు.