పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. D/o విజ్జి గురించి Nagarani Ponakala అభిప్రాయం:

    08/06/2021 9:05 pm

    Sudha, nice story. Dolly characterization made me to think a lot, why Dolly is like this. What made her so comfortable with Vijji slowly.

  2. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 గురించి పవన్ సంతోష్ అభిప్రాయం:

    08/06/2021 12:21 pm

    మన్య ప్రాంతంలో పాఠాలు చెప్పారు, తిరిగారు, జీవించారు. దానితో మలేరియా వచ్చేది గిడుగు రామ్మూర్తి గారికి. ఒకసారి నలభై రోజుల పాటు క్వినైన్ వాడి ప్రాణం దక్కించుకుంటే చెవులు దెబ్బతిని వినికిడి పోయిందన్నది వాస్తవం. మన పండితులకు తెలసిన వ్యవహారికోద్యమ కాలపు గిడుగు రామ్మూర్తి గారికి చెవుడు ఉండేది. కానీ, అందుచేత ఆయన ఎదుటివాదం వినిపించుకోకుండా చెప్పుకుపోయేవారనీ పూర్వులు రాసినా, తిరిగి ఇప్పుడు ఇలా వెల్చేరు నారాయణరావు, పరుచూరి శ్రీనివాస్‌ గార్ల వ్యాసంలో చూసినా – నాకు న్యాయమైన మాట అనిపించనూ లేదు, నచ్చనూలేదు.

    ఎందుకంటే, అంగవైకల్యం పట్ల నిర్దయతో వ్యవహరించడం, విపరీతమైన బయాస్ ఉండడం మనకు తెలిసిన సంగతులే, అవి వందేళ్ళ క్రితం ఇంకెంతగా ఉండివుంటాయో ఊహించవచ్చు. అదీ కాక, అంతటి ఉద్యమాల వేడిలో ప్రతిపక్షుల మీద నిందలూ, వ్యక్తిగత దాడులూ ఈ బయాస్‌లతో కలిస్తే పుట్టిన మాట కాదని ఎలా నిరూపిస్తారు? కనుక ఈ తరహా వ్యాఖ్యలకు ప్రామాణ్యం కట్టబెట్టి పరిశోధకులు ఎవరు స్వీకరించినా ఒప్పలేం.

  3. చల్ మోహనరంగా గురించి పి.విజయలక్ష్మిపండిట్( విశ్వపుత్రిక) అభిప్రాయం:

    08/06/2021 12:09 pm

    చాలపాత (మొదటి play back )సినిమా పాట వినే అరుదైన
    అనుభవం పంచారు పరుచూరి శ్రీనివాసు గారు. ధన్యవాదాలు.

  4. వీరశైవులు: ఒక పరామర్శ గురించి Shivappa pathi అభిప్రాయం:

    08/05/2021 2:51 am

    చాలా బాగా చెప్పారు. వీరశైవానికి మూలం హిందూ ధర్మమేనని, లింగధారణ ఎప్పటినుండో ఉందని బసవడు దాన్ని వృద్ధి చేసినవారిలో ప్రముఖుడని బాగా చెప్పారు. ఇది వీర శైవుల అందరికి చేరాలని నా అభిప్రాయం.

  5. సాధన ఫలితం గురించి Ravada shyamala అభిప్రాయం:

    08/04/2021 11:14 am

    పూర్ణిమ గారు ఈ కధ బాగుందండి. బాబాల ముసుగులో ఎన్ని ఘోరాలు జరుగుతున్న జనాలకు పట్టడడం లేదు. ఇలాంటి బీహరీలాల్ లు ఉన్నంత వరకు, దొంగ బాబాలు పుట్టుకొస్తునే ఉంటారు. మంచి కథని పాఠకులకు పరిచయం చేశారు. మీకు అభినందనలు.

  6. D/o విజ్జి గురించి Ravada shyamala అభిప్రాయం:

    08/04/2021 8:18 am

    సుధగారు కథ చాలా బాగుందండి. గుండె లోపల ఉండే భావాలు, కళ్ళలోని బాధని, భయాన్ని కళ్ళ ముందు ఉంచారు. హేట్సాఫ్ టూ యూ.

  7. ఆగస్ట్ 2021 గురించి Lalitha అభిప్రాయం:

    08/03/2021 10:38 pm

    ఈ సంపాదకీయానికి నూటికి రెండొందల మార్కులు… ఇంకొన్ని వందల చప్పట్లు …ఇలాంటి మాటలు మొహమాటం లేకుండా రాయగలిగినది ఈమాట వారేనని నేనెంత సంబరపడ్డానో, ఈ సంపాదకీయం చదవడానికే ఎన్నిసార్లు మళ్లీమళ్లీ ఇటొచ్చానో మీకు తప్పకుండా చెప్పాలనిపించే ఈ వ్యాఖ్య రాస్తున్నాను.

    తెలుగు రాష్ట్ర సాహిత్య అకాడెమీ ఇన్నాళ్లకి కార్పొరేషన్ పరమై, తెలుగుకి రాజకీయాదేశ సంధి కాలమాసన్నమైన ఈ తరుణంలో ఖర్వాటులకి ఈర్పెనెందుకు అన్న మాట మాత్రం అనకూడదంటాను.

    అది తప్పితే మిగతాదంతా చదివి సదరు కుర్చీ-మనిshe గారు మీర్రాసిందంతా పొగడ్తనేసుకునేరు జాగ్రత్తండోయ్!

  8. ఊపిరి బొట్ల కానుక గురించి Mohibullah Khan. అభిప్రాయం:

    08/02/2021 11:17 pm

    బుట్టలుగా పోగుపడే జ్ఞాపకాలు… అద్భుతః.

  9. ఘోష గురించి Mohibullah Khan. అభిప్రాయం:

    08/02/2021 11:13 pm

    బాగుంది. a freeze shot.

  10. గాయకులుగా సంగీత దర్శకులు గురించి Salipalli Srinivasarao అభిప్రాయం:

    08/02/2021 8:54 pm

    ఈ చల్లని రేయి తిరిగి రానేరాదు
    అనే ఆరుద్ర గారి గీతం ఘంటసాల వారు పాడినది ఉంటే పోస్ట్ చేయగలరు. పంపగలరు