ఘోష

తప్పు తల తెగిపడేలా
ఒక్క ముక్కతో
దూసుకొచ్చిన తీర్పు
ఒక్కటే అడ్డుపుల్లకు
మరోచోట బోనెక్కితే?

కట్టలు తెంచుకోలేని గొంతుకు
గంతలు కన్నీరు పెడుతుంటే
విలువ బరువు తూచలేక
త్రాసు తూలిపడుతుంటే

మళ్ళీ నల్ల కోట్ల
తెల్లని నటన
ఎర్రని వాదన

పుట్టిన బిడ్డని
కడుపులోకి నెట్టి
మళ్ళీ కనమన్నట్లు


చందలూరి నారాయణరావు

రచయిత చందలూరి నారాయణరావు గురించి:

1992 నుంచీ కవిత్వం వ్రాస్తున్న చందలూరి నారాయణరావు ‘మనం కాసేపు మాట్లాడుకుందాం’, ‘మనిషి గుర్తులను బ్రతికించుకుందాం’ అనే కవితా సంపుటాలను వెలువరించారు.

 ...