పసిమనసు భావాలకు అద్భుతమైన అక్షర రూపం ఇచ్చారంటే
పసితనంలోకి పరకాయ ప్రవేశం చేసారేమో అనే ఊహ కలుగుతుంది.
“చెవికి బాగుంటే మాటలు ఎందుకు కలపకూడదు!”
ఎంత చక్కని భాష్యం!
ఎన్నిసార్లు చదివితే అన్ని రకాల కొత్త అనుభూతులు కలుగుతున్నాయి. ఏ భాగానికి ఆ భాగం ఆకట్టుకునేలా….
ఎన్ని ఊహలు!
మరెన్ని ఆలోచనలు!
చక్కని చమత్కారాలు!
అప్పటి మనుషులు!
అందరి మనసులు!
తెలుగు సాహిత్య సౌందర్యాన్ని ఇనుమడించేలా చేసిన సాంప్రదయపు ఆభరణాలు!
ఈ రచనలు!
one (4) more stone on me… more desperate now
నా పైన మరో నాలుగు దెబ్బలు వేశారు…
గట్టిగా ధైర్యం తెచ్చుకోవాలి…
ఇంటి సౌఖ్యం వదిలి
రహదారి స్వర్గం వైపు కదలాలి.
మీరు విడవకుండా మంచివీ, తమిళ కథా పరిణామాన్ని పట్టించేవీ అయిన కథలని ఎంపిక చేసుకుని అనువదిస్తూ వెళ్లడం చాలా బాగుంది. ఆపవద్దని మనవి.
ఈ రెండు తొలినాటి తమిళ కథలు – విశాలాక్షి అమ్మాళ్, అమ్మణి అమ్మాళ్ గారలు రాసినవి – నాకు మూలం దొరకలేదు. వా.వె.సు అయ్యర్,
ఆ.మాధవయ్య, సెల్వకేశవరాయర్ – వీరివి కూడా. అంటే పుదుమైపిత్తన్ కు ముందరి తమిళ కథలు. మీరు తమిళం నుంచే నేరుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి, ఈ కథలు కూడా మీరు సంపాదించి ఉంటారని అనుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాను. తొలినాటి తమిళ వచనం ఎలా ఉండేదో పరిశీలంచాలనే ఆసక్తితో మిమ్మల్ని ఈ సహాయం కోరుతున్నాను.
చాలా బాగుంది. నాలోనూ ఓ యాత్రికుడున్నాడు. సంవత్సరానికి ఓ వారం పదిరోజులు పర్యటనలు చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం. వదలలేని పరిస్థితి. ఏం చేస్తాం. చదివి సంతృప్తి పడాలి.
ఒక పెళ్ళీడుకొచ్చిన సగటు మధ్య తరగతి (ఆర్ధిక,వర్చస్సు) ఆడపిల్ల ఆలోచనలు, నిర్ణయాలు, రెండో పెళ్ళికి సమాజం చేసే సూటి, పోటు మాటలు సుధగారు చిన్న కథలో ఆడపిల్లల అంతర్మదనాన్ని చాలా లోతుగా, సున్నితంగా తెలియజేసారు.
“పెద్దగా ఇష్టం లేకపోయినా ఇంతకంటే బెటర్ ఛాయిస్ లేక ఆ చాలీచాలని అసౌకర్యాల బ్రతుకునుంచి బయటపడటానికే ఈ పెళ్లి చేసుకున్నానని వాళ్లకి తెలియదు కదా” అని చెప్పుకుంటుంది విజ్జి. పరిస్థితులు, రెండో పెళ్ళి వాడు అనే సర్ధుబాటుతనం అమ్మలక్కల నిష్టూరపు మాటల వల్లనేమొ విజ్జికి మొదటి రాత్రి తంతు అయిష్టత కలిగిస్తుంది. పెళ్ళి నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని అధికారికంగా ఇచ్చే లైసెన్సే. కాని పరిణితి కల్గిన వ్యక్తులు ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి, ఒకరిపై మరొకరిని ఇష్టం కలిగే వాతవరణాన్ని సృష్టించుకోవాలి. లైసెన్సు దొరికేసింది కదా అని అమాంతంగా దూకేస్తే ఇలాగే ఉంటుంది.
పెళ్ళైయ్యాక విజ్జికి రామారావు కూతురు డాలి ప్రవర్తన ఒక సవాలుగా మారుతుంది. అది డాలికి వాళ్ళమ్మ నుండి వచ్చిందే .. “ఆఁ! అయినా ఆ కరుణా అంతే, మూగ మొద్దులా ఉండేది” అంటుంది ఒకామే. కొంత మంది తొందరగా ఎవరితోను కలవరు. వారి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త వాళ్ళని తొందరగా ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా వాళ్ళ ప్రపంచం ఒకటి వేరే ఉంటుంది. బహుశా డాలిది అలాంటి మనస్థత్వమేమో!
నిజంగా మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే జివితాల్లో నటించడం మానేయ్యలి. మనం మనలా ఉండాలి. పైకి ఎవరూ చెప్పకపోయినా నటనకు,నిజానికి తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విషయాల్ని సుధగారు పాత్రల్లో చాల చక్కగా చెప్పారు.
ఒకటి: ‘సుకుమారి మేనిపై …’ ఈ విషయలో నేను సదాశివుని వైపు (సదాశివ సమారంభాం) – ఈ పద్యాన్ని ‘ఒకసారి చూడండని’ అభ్యర్థిస్థూ ఏల్చూరి వారికి పంపాను, రెండు/మూడు సంవత్సరాల క్రితం. వారు చూసిన వెనుక మా మధ్య ‘సుకుమారి మేనిపై చప్పున దెబ్బ వేయటం’ మీద కొంత సంభాషణ సాగింది. వారు నా వాదం విని “చాలా భావగర్భితమైన పద్యం” అన ఈమెయిల్ రాశారు. వారికి మరొక్కసారి మనసారా కృతజ్ఞతలు.
రెండు: ఫ్రొఫెసర్ కలివె విశ్వనాథంగారి -నా మామ గారు, వారిని నేను ఎప్పుడూ మామగారని పిలవలేదు ‘మాస్టారూ’ అనే పిలిచే వాణ్ణి- వ్యాసం, ‘The Nightingale and the Naughty Gal’ in Essays in Criticism and Comparative Poetics’ Andhra Univ Press Page 306, చూడండి. archives లో దొరుకుతున్నట్లుగా శ్రీ శేషతల్పశాయి చెప్పారు కొన్నాళ్ళక్రితం ‘ఈమాట’ ఆభిప్రాయాలలో.
పిడకల వేట సాగుతోంది కనక నాది వేటలో మరో సబ్-పిడకలవేట.
>> She needs a spanking! Like this greatest dancing teacher gives his student.
Teachers often find their profession as a great avenue for spanking. I was spanked (nay I would say it was hard beating) with పేక బెత్తం, ruling scale, rulers and everything that was on hand – despite my good grades. So speaking of spanking, may be Lord Siva spanked on Goddess Parvati’s cheek as the story goes but most teachers have very good understanding on the sensitive parts, on where to spank – for example the buttocks, knee joints and the skin side of all fingers. During my elementary school a teacher used to drop by “EXACTLY” at a time we returned from school and were preparing to play games like, గోటీ బిళ్ళ, జోరు బాలు, ఏడు పెంకుల ఆట వగైరా. He would demand his homework which we did not care to do of course and then the punishment was to ask us to stand on our knees on the floor (మోకాళ్ళు వేయరా!). The floor was rough and hurt badly but he, who used to bring some food with him, used to eat that food slowly and enjoyed our struggle immensely. At that very time of our suffering he even said “So when you grow up you will say, that day you punished me, so why do I even have to talk to you, wouldn’t you?’
God bless where he is now (probably in another life), but right till my end of my bachelors degree every single one of those “so called teachers,” had every possible way to put me in a corner and embarrass me in the class (of 40+ students). In my first of year of engineering we even used to have a subject of English where the madam (Anglo-Indian) challenged me – “If you ever pass this course I will resign my job!” She was probably not at fault because my scores in her class tests never went above 40 (out of hundred that is!).
Anyway the physical spanking left me a long time ago but the mental spanking still hurts – and I guess I will carry those scars to my grave.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Amarendra అభిప్రాయం:
09/01/2021 6:27 pm
ఈ వ్యాసం ప్రచురించిన ఈమాట కు ధన్యవాదాలు
వ్యాసo చివరకి ఈ రూపంలోకి రావడానికి ఈమాట ప్రమేయం ఎంతో ఉంది. పత్రిక నడపడం అంటేను, సంపాదకత్వం అంటేను స్పష్టత ఉన్న పత్రిక ఈమాట.
ఇది ఈ ఒక్క వ్యాసం విషయం లోనే కాదు; గత నాలుగేళ్లుగా చూస్తున్నాను. నా సంతోషం వ్యక్తపరచడం భావ్యమని నా భావన
ఊహల ఊట 4 గురించి రత్నమాల చాగంటి అభిప్రాయం:
09/01/2021 12:39 pm
పదాల పల్లకిలో ఊరేగుతున్న ఊహలు.
అవే….నానా ఊహలు..
ఒక క్షణం తెలివి….
మరు క్షణం అమాయకత్వం….
పసిమనసు భావాలకు అద్భుతమైన అక్షర రూపం ఇచ్చారంటే
పసితనంలోకి పరకాయ ప్రవేశం చేసారేమో అనే ఊహ కలుగుతుంది.
“చెవికి బాగుంటే మాటలు ఎందుకు కలపకూడదు!”
ఎంత చక్కని భాష్యం!
ఎన్నిసార్లు చదివితే అన్ని రకాల కొత్త అనుభూతులు కలుగుతున్నాయి. ఏ భాగానికి ఆ భాగం ఆకట్టుకునేలా….
ఎన్ని ఊహలు!
మరెన్ని ఆలోచనలు!
చక్కని చమత్కారాలు!
అప్పటి మనుషులు!
అందరి మనసులు!
తెలుగు సాహిత్య సౌందర్యాన్ని ఇనుమడించేలా చేసిన సాంప్రదయపు ఆభరణాలు!
ఈ రచనలు!
ధన్యవాదాలు
రత్నమాల
🙏💐
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి Raju అభిప్రాయం:
09/01/2021 11:54 am
one (4) more stone on me… more desperate now
నా పైన మరో నాలుగు దెబ్బలు వేశారు…
గట్టిగా ధైర్యం తెచ్చుకోవాలి…
ఇంటి సౌఖ్యం వదిలి
రహదారి స్వర్గం వైపు కదలాలి.
సంకల్పం-సంభవం గురించి Aditya Korrapati అభిప్రాయం:
09/01/2021 10:50 am
దాము గారు,
మీరు విడవకుండా మంచివీ, తమిళ కథా పరిణామాన్ని పట్టించేవీ అయిన కథలని ఎంపిక చేసుకుని అనువదిస్తూ వెళ్లడం చాలా బాగుంది. ఆపవద్దని మనవి.
ఈ రెండు తొలినాటి తమిళ కథలు – విశాలాక్షి అమ్మాళ్, అమ్మణి అమ్మాళ్ గారలు రాసినవి – నాకు మూలం దొరకలేదు. వా.వె.సు అయ్యర్,
ఆ.మాధవయ్య, సెల్వకేశవరాయర్ – వీరివి కూడా. అంటే పుదుమైపిత్తన్ కు ముందరి తమిళ కథలు. మీరు తమిళం నుంచే నేరుగా చేస్తూ వస్తున్నారు కాబట్టి, ఈ కథలు కూడా మీరు సంపాదించి ఉంటారని అనుకుంటూ మిమ్మల్ని అడుగుతున్నాను. తొలినాటి తమిళ వచనం ఎలా ఉండేదో పరిశీలంచాలనే ఆసక్తితో మిమ్మల్ని ఈ సహాయం కోరుతున్నాను.
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి మోదుగుల రవికృష్ణ అభిప్రాయం:
09/01/2021 10:46 am
సుబోధకమైన సరళ శైలి లోని మీ వ్యాసం ఒక్కఊపులో చివరకంటా చదివించేసింది. పుస్తక పరిచయాలు అన్నీ బాగున్నాయి; అనికేత్ పరిచయం మరీ బాగుంది అమరేంద్రగారూ!
నలుగురు యాత్రికులు: ఒకే పిపాస గురించి శ్రీధర్ చౌడారపు అభిప్రాయం:
09/01/2021 10:02 am
చాలా బాగుంది. నాలోనూ ఓ యాత్రికుడున్నాడు. సంవత్సరానికి ఓ వారం పదిరోజులు పర్యటనలు చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగం. వదలలేని పరిస్థితి. ఏం చేస్తాం. చదివి సంతృప్తి పడాలి.
D/o విజ్జి గురించి Siddhiq అభిప్రాయం:
09/01/2021 4:34 am
ఒక పెళ్ళీడుకొచ్చిన సగటు మధ్య తరగతి (ఆర్ధిక,వర్చస్సు) ఆడపిల్ల ఆలోచనలు, నిర్ణయాలు, రెండో పెళ్ళికి సమాజం చేసే సూటి, పోటు మాటలు సుధగారు చిన్న కథలో ఆడపిల్లల అంతర్మదనాన్ని చాలా లోతుగా, సున్నితంగా తెలియజేసారు.
“పెద్దగా ఇష్టం లేకపోయినా ఇంతకంటే బెటర్ ఛాయిస్ లేక ఆ చాలీచాలని అసౌకర్యాల బ్రతుకునుంచి బయటపడటానికే ఈ పెళ్లి చేసుకున్నానని వాళ్లకి తెలియదు కదా” అని చెప్పుకుంటుంది విజ్జి. పరిస్థితులు, రెండో పెళ్ళి వాడు అనే సర్ధుబాటుతనం అమ్మలక్కల నిష్టూరపు మాటల వల్లనేమొ విజ్జికి మొదటి రాత్రి తంతు అయిష్టత కలిగిస్తుంది. పెళ్ళి నిజానికి ఇద్దరి వ్యక్తుల మధ్య సాన్నిహిత్యాన్ని అధికారికంగా ఇచ్చే లైసెన్సే. కాని పరిణితి కల్గిన వ్యక్తులు ముందు ఒకరినొకరు అర్ధం చేసుకోడానికి, ఒకరిపై మరొకరిని ఇష్టం కలిగే వాతవరణాన్ని సృష్టించుకోవాలి. లైసెన్సు దొరికేసింది కదా అని అమాంతంగా దూకేస్తే ఇలాగే ఉంటుంది.
పెళ్ళైయ్యాక విజ్జికి రామారావు కూతురు డాలి ప్రవర్తన ఒక సవాలుగా మారుతుంది. అది డాలికి వాళ్ళమ్మ నుండి వచ్చిందే .. “ఆఁ! అయినా ఆ కరుణా అంతే, మూగ మొద్దులా ఉండేది” అంటుంది ఒకామే. కొంత మంది తొందరగా ఎవరితోను కలవరు. వారి ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. కొత్త వాళ్ళని తొందరగా ఇష్టపడరు. వాళ్ళు ఎక్కడ ఉన్నా, ఎందరిలో ఉన్నా వాళ్ళ ప్రపంచం ఒకటి వేరే ఉంటుంది. బహుశా డాలిది అలాంటి మనస్థత్వమేమో!
నిజంగా మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే జివితాల్లో నటించడం మానేయ్యలి. మనం మనలా ఉండాలి. పైకి ఎవరూ చెప్పకపోయినా నటనకు,నిజానికి తేడా స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ విషయాల్ని సుధగారు పాత్రల్లో చాల చక్కగా చెప్పారు.
మంచి కథ అందించిన సుధగారికి దన్యవాదాలు.
హరీన్ చటో గురించి తః తః అభిప్రాయం:
08/31/2021 5:46 pm
డా. యెర్నేని:
ఒకటి: ‘సుకుమారి మేనిపై …’ ఈ విషయలో నేను సదాశివుని వైపు (సదాశివ సమారంభాం) – ఈ పద్యాన్ని ‘ఒకసారి చూడండని’ అభ్యర్థిస్థూ ఏల్చూరి వారికి పంపాను, రెండు/మూడు సంవత్సరాల క్రితం. వారు చూసిన వెనుక మా మధ్య ‘సుకుమారి మేనిపై చప్పున దెబ్బ వేయటం’ మీద కొంత సంభాషణ సాగింది. వారు నా వాదం విని “చాలా భావగర్భితమైన పద్యం” అన ఈమెయిల్ రాశారు. వారికి మరొక్కసారి మనసారా కృతజ్ఞతలు.
రెండు: ఫ్రొఫెసర్ కలివె విశ్వనాథంగారి -నా మామ గారు, వారిని నేను ఎప్పుడూ మామగారని పిలవలేదు ‘మాస్టారూ’ అనే పిలిచే వాణ్ణి- వ్యాసం, ‘The Nightingale and the Naughty Gal’ in Essays in Criticism and Comparative Poetics’ Andhra Univ Press Page 306, చూడండి. archives లో దొరుకుతున్నట్లుగా శ్రీ శేషతల్పశాయి చెప్పారు కొన్నాళ్ళక్రితం ‘ఈమాట’ ఆభిప్రాయాలలో.
తఃతః
హరీన్ చటో గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
08/31/2021 9:38 am
పిడకల వేట సాగుతోంది కనక నాది వేటలో మరో సబ్-పిడకలవేట.
>> She needs a spanking! Like this greatest dancing teacher gives his student.
Teachers often find their profession as a great avenue for spanking. I was spanked (nay I would say it was hard beating) with పేక బెత్తం, ruling scale, rulers and everything that was on hand – despite my good grades. So speaking of spanking, may be Lord Siva spanked on Goddess Parvati’s cheek as the story goes but most teachers have very good understanding on the sensitive parts, on where to spank – for example the buttocks, knee joints and the skin side of all fingers. During my elementary school a teacher used to drop by “EXACTLY” at a time we returned from school and were preparing to play games like, గోటీ బిళ్ళ, జోరు బాలు, ఏడు పెంకుల ఆట వగైరా. He would demand his homework which we did not care to do of course and then the punishment was to ask us to stand on our knees on the floor (మోకాళ్ళు వేయరా!). The floor was rough and hurt badly but he, who used to bring some food with him, used to eat that food slowly and enjoyed our struggle immensely. At that very time of our suffering he even said “So when you grow up you will say, that day you punished me, so why do I even have to talk to you, wouldn’t you?’
God bless where he is now (probably in another life), but right till my end of my bachelors degree every single one of those “so called teachers,” had every possible way to put me in a corner and embarrass me in the class (of 40+ students). In my first of year of engineering we even used to have a subject of English where the madam (Anglo-Indian) challenged me – “If you ever pass this course I will resign my job!” She was probably not at fault because my scores in her class tests never went above 40 (out of hundred that is!).
Anyway the physical spanking left me a long time ago but the mental spanking still hurts – and I guess I will carry those scars to my grave.
D/o విజ్జి గురించి Sudha అభిప్రాయం:
08/31/2021 7:23 am
ధన్యవాదాలు శ్యామల గారు, నాగరాణి, శ్రీనివాస్ గారు