పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఏనుగు డాక్టర్ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    12/19/2021 1:30 am

    ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఏనుగు గురించికంటే మనుషులు చేసే పాపాలను తెలుసుకున్నారు.

  2. ఏనుగు డాక్టర్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/11/2021 11:21 am

    “ఏనుగు డాక్టర్” కధ తమిళ కధారచయిత ( వామపక్ష, సామ్యవాద భావజాలాల ) జయమోహన్ గారిని, అద్బుతంగా తెలుగులోకి అనుసృజన చేసిన అవినేని భాస్కర్ గారిని అభినందించిన పెద్దలు నౌడూరి మూర్తి గారికి … ప్రకృతి ఆలపించే స్వేఛ్ఛాగానం గురించి ( అమెరికన్ కవయిత్రి మాయా ఏంజెలో మరణించిన సందర్భం లో రాసిన వ్యాసం లో వివరించిన ) యీ “ఏనుగు డాక్టర్” సందర్భం లోనూ స్పందిందించిన పెద్దలు నౌడూరి మూర్తి గారికి నెనర్లు.

    ” పంజరం లోని పిట్ట భయద నిస్వనంతో ఆలపిస్తుంది…
    తనకి తెలియనివీ, అయినా ఆకాంక్షించే కలలగురించి.
    ఆ గీతం దూరతీరాలనున్న కొండలలో ప్రతిధ్వనిస్తుంది,
    ఎందుకంటే, ఆ పంజరపు పిట్ట ఆలపించేది స్వేఛ్ఛాగానం”.

    ~ సమకాలీన అమెరికను కవయిత్రి మాయా ఏంజెలో కవిత I know Why the Bird in the Cage Sings కి నౌడూరి మూర్తి గారి అనువాదం

  3. ఏనుగు డాక్టర్ గురించి ns urty అభిప్రాయం:

    12/10/2021 7:06 am

    భాస్కర్ గారూ,

    అద్భుతమైన అనువాదం అన్నా కూడా ఇంకా వెలితిగానే ఉంటుంది. మొదలుపెట్టిన దగ్గరుండి చివరిదాకా కుతూహలాన్ని బిగబట్టి చదివించిన కథ.

    మీకూ, జయమోహన్ గారికీ హృదయపూర్వక అభినందనలు.

  4. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 2 గురించి srinivasa rao vuppala అభిప్రాయం:

    12/08/2021 7:02 am

    అబ్బ! ఎంత బావుందో ఆ శైలీ, నడిపిన తీరూ. మేము కూడా లచ్చూ తో పాటే ఆ భవనంలోకి, ఆ బాల్యంలోకి వెళ్ళిపోయాం. మమ్మల్ని ఆ పరిసరాలకూ తీసుకెళ్ళీ ఆ సంఘటనల ముందు నుంచో పెట్టినట్లుగా వుంది. చాలా హాయిగా, సంతోషంగా, సంబడంగా ఉంది చదువుతుంటే. అన్వర్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు.

  5. అడవిలో లేడిపిల్ల గురించి చిట్టత్తూరు మునిగోపాల్ అభిప్రాయం:

    12/07/2021 9:30 am

    అద్భుతం… ఒకే మాట. తంగం అత్తయ్య నా కట్టెదుటే తిరుగాడినట్టూ… ఆమెలోని మార్మికత ఏదో నన్నల్లుకుంటున్నట్టూ…
    ఓహ్… నాకు వచ్చిన మాటలు చాలవు. మూలంలో ఉందో లేదో కానీ… తేలికైన పదాల్లో, ఓపలేని సౌందర్యాత్మికత.

  6. ఏనుగు డాక్టర్ గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/06/2021 10:47 am

    అవినేని భాస్కర్ అద్భుతంగా అనుసృజన చేసిన “ఏనుగు డాక్టర్” కధ, డాక్టర్ వి. కృష్ణమూర్తి పాత్ర పాఠకులకు కలకాలం గుర్తుండిపోతాయి.

    పోలిక సరైనదో కాదో తెలియదు కానీ నాటితరం ప్రముఖ కధా రచయిత సి. రామచంద్ర రావు గారి ‘వేలుపిళ్లై’ కథా సంపుటం లోని “ఏనుగుల రాయి” కధలో పసివాడు కడకరై, ఏనుగుల మధ్య ఏర్పడిన అనుబంధం కూడా యీ సందర్భంలో తలపుకొస్తున్నాది.

    [ కడకరై కొంచెం పెద్దవాడయి ఏడెనిమిది సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి గుడిసె చుట్టుపక్కల చిట్టడవిలో ఏనుగుల గుంపులకోసం వెతకడం ప్రారంభించాడు. ఏనుగులు. అరమైలు దూరంలో వుండగానే ఘీంకారం, వెదురుబొంగులు విరిగిన ఫెళ ఫెళలూ వినిపించేవి.

    తనను చూస్తే అవి పారిపోతాయని అతనికి తెలుసు.

    జాగ్రత్తగా చెట్టు చాటునో, రాయిచాటునో నక్కి గంటల తరబడి తనివితీరా చూసేవాడు. చూసినకొద్దీ వాటి గాంభీర్యం. అమాయకత్వం అతణ్ణి పరవశం చేసేవి. దగ్గరకి వెళ్ళి తొండంమీద అప్యాయంగా నిమరాలనీ, మంచి పళ్ళూ కందమూలాలూ తినిపించాలనీ అశగా వుండేది.
    ….. ……. ……..

    రాతి లోపల కూర్చుని కడకరై ఏనుగులకి పళ్ళు అందించాడు. ఏనుగులు సంతోషంతో మిన్నుముట్టేలా ఘీంకరించాయి.

    అంత సంతోషం ఎంతో సేపు నిలబడలేదు. ఏనుగులు ఆడి ఆడి రాతికి శరీరాన్ని రుద్దుకోడం ప్రారంభించాయి. పూర్వం రాయి బలంగా వుండి వాటి తాకిడికి ఆగేది, ఇప్పుడు బీట వారి పడిపోవడానికి సిద్ధంగా వుండి నిలబడలేక పోయింది.

    విడి పడిపోయి కూలి పోయి లోపలవున్న కడకరైని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. ఏనుగులు కూలి పోయిన రాతిని దొర్లించి మరణించిన కడకరైని బయటికి లాగి… కడకరైని, మోసుకుపోతున్న ఏనుగులమంద…

    మళ్ళీ నర్సరీ వెయ్యడానికి కంపెనీ పదిసార్లయినా ప్రయత్నించింది. ప్రతిసారీ ఏనుగులు మందలు మందలుగా వచ్చి రూపులేకుండా చేసిపోయాయి. రాత్రిళ్ళు మంటలు వేసుకుని కూలీలు కాపలా వుండేవారు. మంటలారిపోయేవరకూ వుండి నర్సరీని దొమ్మీ చేసేవి ఏనుగులు. ఒక్కొక్కప్పుడు పట్టపగలే దాడిచే సేవి.

    పగబట్టిన ఏనుగులతో పోట్లాడటం వృధా ప్రయాస అని స్టీవెన్సు దొర నర్సరీని ఇంకొకచోటికి మార్చేశాడు ]

  7. ఏనుగు డాక్టర్ గురించి rishi srinivas అభిప్రాయం:

    12/05/2021 5:45 pm

    నిస్సందేహంగా గొప్ప కథ. అద్భుతమైన అనువాదం. కానీ బీర్ బాటిల్స్ ఎం. ఎన్. సి. లో పనిచేసే వాళ్లో ఐ.టి వాళ్ళో మాత్రమే ఎందుకు వేస్తారని డాక్టర్ గారు అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు. మిగతా అన్ని వృత్తుల వారికీ బాధ్యతలు, ఆశయాలూ ఉన్నాయి కానీ అమెరికా వెళ్ళే వారు మాత్రమే బాధ్యతారాహిత్యంతో ఉన్నారా?

  8. ఊహల ఊట 7 గురించి MVR Sarma అభిప్రాయం:

    12/05/2021 1:26 am

    Very well written. Brought back nostalgic memories of my childhood.

  9. విశ్వమహిళానవల 13: జార్జ్‌ సాండ్ గురించి Vijaya Karra అభిప్రాయం:

    12/04/2021 9:16 pm

    యూరోపియన్ రచయిత్రులు, వారి స్వేచ్ఛాపూరిత వ్యక్తీకరణ, జీవన శైలి గురించి చదివినప్పుడు – ప్రపంచ వ్యాప్తంగా అదే సమయంలో ఇతర దేశాలలో స్త్రీల జీవితాలను పోల్చుకుంటే – ఆ తేడా విస్మయంగా అనిపిస్తుంది. ఎంత వివరణ సేకరిస్తే మీరు ఈ ఆర్టికల్స్ వ్రాయగలుగుతున్నారో! – థాంక్ యూ!!!

  10. రత్తి పాటలు గురించి మంచెం విజయలక్శ్మి – రచయిత కుమార్తె అభిప్రాయం:

    12/04/2021 3:01 pm

    రచయిత : కీ.శే. మంచెం బి జనార్దన రావు(1955-2021)
    రచనా కాలం: 1974
    స్వస్థలం: కాకినాడ
    ఇతర రచనలు: ప్రత్యూష, హిమసుమాలు, సిరిమువ్వల చిరుసవ్వడి