పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. బుజిబుజి బొమ్మల బుజ్జాయి గురించి శరత్ జ్యోత్స్న అభిప్రాయం:

    02/01/2022 9:50 am

    బుజ్జాయి గారి గీత లోని లోతుల్ని మరో కళాకారుడే కదా అంత బాగా అర్థం చేసుకోగలరు! బుజ్జాయి గారి చిత్రాల్లో చిలిపిదనం, అందం, అమాయకత్వం తొణికిసలాడుతూ, అద్భుతమైన రంగుల మేళవింపుతో అన్ని వయసుల వారినీ చిన్నపిల్లలుగా చేసి ఆకట్టుకుంటూ ఉంటాయి! వారి “ఆపదలో అనూరాధ” కామిక్ బుక్ చదవడం మొన్నే పూర్తయ్యింది. కేవలం చిన్నపిల్లల కోసం రాసే టాపిక్స్ కాకుండా, అపరాధ పరిశోధన పంథాలో సాగిన ఆ రచన ఎంత బాగుందో…బుజ్జాయి గారు చేయి తిరిగిన చిత్రకారులు మాత్రమే అనుకునే నా లాంటి వారి అమాయకత్వాన్ని పటాపంచలు చేసింది, వారి రచనా శైలి! 1976 లో తొలిసారిగా ప్రభలో అచ్చయింది అని అట్ట వెనుక చూసి అబ్బురపడ్డాను – Graphic novels ఇటీవలి కాలపు ట్రెండ్ అనుకునే నేను!
    అన్వర్ గారి ప్రత్యేకత- ఆత్మీయంగా, మనసుకి హత్తుకునేలా,ఆలోచన రేకెత్తించే పదాలతో బొమ్మ వేయడం. షుక్రియా అన్వర్ జీ!

  2. కేతన ఆంధ్ర భాషాభూషణము-8 గురించి మోహన అభిప్రాయం:

    02/01/2022 9:34 am

    ఈ పద్యము శార్దూలవిక్రీడితములో మొదటి గురువు తొలగించగా లభ్యమైనది. దీనికి పేరు మజ్నూను అడగాలి! శృంగారప్రియా లేక శృంగారీ, ప్రియా అని చెప్పవచ్చును. ఈ వృత్తములో నేను ఒకప్పుడు వ్రాసిన పద్యము-

    లీలాశుక మిందు పాడె విన – లీలాకేళి నాకెందుకే
    లోలుండను బ్రేమ కావ్యమున – డోలాందోళన మ్మందుకే
    లైలా కొను నా సలాములను – లైలా యెక్క డున్నావొ నా
    లైలా నిను దల్చి ఖైసు మది – రాలెన్గా వసంతమ్ములో

    విధేయుడు – మోహన

  3. ఊహల ఊట 9 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:

    02/01/2022 9:33 am

    ఈ నెల ఊహాల ఊటలో అరిటాకులో పాకం చలిమిడి తినిపించారు. కొబ్బరి ముక్కలతో సహా. చాలా చాలా రుచిగా ఉంది. ఊత పదాలతో సంభాషణలు బాగున్నాయి. మీ కలంలో ఊరే మరెన్నో ఊటల కోసం ప్రతినెల ఎదురుచూస్తున్నాము.
    తులసి గారికి ధన్యవాదములు.

  4. రెండు అక్షరసామ్య యతులు గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:

    02/01/2022 9:33 am

    ఎంతో చక్కని ప్రతిపాదనలు. పద్యకవిత్వం రాస్తున్న వారు అంది పుచ్చుకుంటే – ప్రయోగ ప్రమాణమేర్పడుతుంది. ముందు ముందు ప్రామాణిక ఛందః గ్రంథాల పునర్ముద్రణలో – ఈ వ్యాసాన్ని చేర్చితే ఉపయోగంగా ఉంటుంది. కందప్ప చెట్టి అకాలమరణం తెలుగు శాసన పరిశోధనకు తీరని లోటు. ” తెలుగు భాషా చరిత్ర ” అన్న ప్రామాణిక గ్రంథాన్ని – సంపాదకులు భద్రిరాజు కృష్ణమూర్తి , ఆయనకే అంకితమిచ్చారు. ‘లక్షణ శిరోమణి ‘(పొత్తపి వెంకటరమణ కవి ప్రణీతము) గ్రంథాన్ని పరిష్కరించిన రావూరి దొరసాని శర్మ గారి పాండిత్యము అందరికీ తెలిసినదే. “Historical Grammar of Telugu ” హరప్పా ముద్రలను అర్థం చేసుకోవడానికి ఉపకరించిన ఉద్గ్రంథం. శాస్త్రీయ ధోరణిలో శాసనాధారములు చూపి , చక్కని ఉదాహరణలు ఇచ్చి – విషయాన్ని తేటతెల్లం చేసి
    చక్కని చర్చకు తెరతీసినందుకు మోహనరావు గారికి నమోవాకములు.

  5. ఊహల ఊట 9 గురించి ముకుంద రామారావు అభిప్రాయం:

    02/01/2022 9:01 am

    ఉహలు ఊరుతూనే ఉన్నాయి అద్భుతంగా… ఇంకా ఊరుతూనే ఉందాలి… చాలా సంతోషం. అభినందనలు

    – ముకుంద రామారావు
    హైదరాబాద్

  6. బుజిబుజి బొమ్మల బుజ్జాయి గురించి Rama Sandilya అభిప్రాయం:

    02/01/2022 7:29 am

    చాలా బావుంది మీ ఆర్టికల్

  7. బ్రహ్మం గురించి Udaya bhaskara rao Vadlamani అభిప్రాయం:

    02/01/2022 7:17 am

    Really loved the twist. Friends feel like talking to each other and recollect sweet memories. Idea of helping friend with some reason and honesty of friend not taking free money. Best ethical values of yester years.

    Best wishes dear I V S S Prasad.

  8. కేతన ఆంధ్ర భాషాభూషణము-8 గురించి Lyla yerneni అభిప్రాయం:

    01/30/2022 5:38 pm

    ప్రొఫెసర్ అయినవోలు ఉషాదేవి రచించిన “కేతన ఆంధ్ర భాషాభూషణము” వ్యాస పరంపరలో చివరిదైన ఈ భాగంలో ఒకచోట – ‘మల్లె పూవు’ ను, కావ్యం లో ఐతే ఎలా వాడాలో, ఏక వచన బహువచనాలలో, సమాసరూపంలో ఎలా వాడాలో ఉంది. ఇప్పుడు నే రాసిన ఈ కింది పద్యాన్ని కేతనదండి, చిన్నయసూరి వ్యాకరణ సూత్రాలు ఒప్పుకుంటాయో లేదో!

    రాయా! నెలరాయ యంచు దరహాసాలై, మరందాల జా
    లై, యామిని లోన పిల్చెదవు; ఆ రేరాజు రాజాలునా?
    ఓ యోజనగంధి! కాముని శిఖీ! మా కోసమై పూయవే
    మాయావిని! పూయి పున్నమిగ, శృఙ్గారీప్రియా! మల్లియా!

    ఈ పద్యంలో యతి లేదు. ఎందుకు లేదంటే అంత sophistication నాకు లేక, చేతగాక. నేను పదేళ్లకొక పద్యం రాసేసరికి, ఈ లోపల చేతయిన వారెన్నో అందమైనవి రాస్తారు. నేను వాటిని చదివి ఆనందిస్తాను.

    పద్యంలోని – ‘యోజనగంధి’ ‘శృఙ్గారీప్రియా’ అన్న ప్రయోగాల గురించి ఛందస్సు, భాషాపరిశోధకుల అభిప్రాయం ఏమిటి? మీకెవరికైనా చెప్పాలనుంటే చెప్పండి.

    నేనొక సుందరనగరంలో ఉన్నందున, ఇక్కడ మస్తుగా పూదోటలున్నందున, అక్కడ సుస్తు లేకుండా తిరుగుతున్నందున, నేనీ పద్యం రాస్తం. పాడుకోటం. ఈ పత్రికలో ప్రచురితమవుతున్న చాలా కవితలు నాకు కవిత్వమే కావు. Barnes & Noble లో erotic poems by E.E. Cummings తెచ్చుకుని చదువుకుంటున్నాను. ప్రాణం హాయిగా ఉంది.

    Have fun folks. -Lyla

  9. ప్రపంచమే ఒక కథనరంగం గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/29/2022 7:28 am

    సుధ గారికి, పతంజలి గారికి, వంశీకృష్ణకు ధన్యవాదాలు..

  10. ఉత్తర మొరాకో శోధనలు 2 గురించి Amarendra Dasari అభిప్రాయం:

    01/29/2022 7:25 am

    ధన్యవాదాలు సుజాత గారూ..