పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. కేతన ఆంధ్ర భాషాభూషణము-8 గురించి Lyla yerneni అభిప్రాయం:

    02/05/2022 10:39 am

    Greetings! Enjoyed the poetry posted.

    In my poem,
    1. I wanted the word యోజనగంధి (which is rather monopolized by an epic iconic woman,) to be more in territory of everyday flowers. As in, రజనిగంధ = స్వనామఖ్యాత శ్వేతవర్ణ పుష్ప విశేష:
    2. My idea is to use శృఙ్గారీప్రియా as one word, (not two,) where in శృఙ్గారీప్రియ = కాముకుల ప్రియురాలు, శృంగారపురుషులకు, శృంగారవతులకు, ఇష్టమైనది, I.e., Jasmine is loved by lovers.

    I wanted to use nice sounding, good looking words, which go well with the spirit of the poem. Without messing up chandassu and grammar. To find/make up such words, I referred to Andhrabharati dictionaries, where I checked the meaning and usage of several words, including the following.

    శృఙ్గారీ =(సం॥) -1. సువేషః -2. కాముకః -3. గజః -4. జయంతః -5. పూగః -6. మాణిక్యమ్‌
    శృంగారి = విటుడు, Beau, handsome man, elegantly dressed woman, సింగారి
    కలహప్రియా = సారికాపక్షీ
    కలహప్రియుడు=నారదుడు
    అంగనాప్రియ = స్త్రీలకు ప్రియమైనది. అశోకవృక్షము.
    ప్రియ =ప్రియురాలు.

    శృఙ్గారీప్రియా! is kind of along the lines of అంగనాప్రియా. I am thinking -just as Ashoka is loved by ladies, Jasmine is loved by lovers.

    నాకు సంస్కృతం రాదు. “అనంతరంబ సంస్కృతపదంబులు తెనుంగు గావించు తెఱం గెఱింగించెద.” అన్న కేతన సూత్రాలు; సంధులు, సమాసాలు గురించిన సూత్రాలు; మొత్తం వ్యాసం చదివాకే నేనీ పద్యం రాసింది.
    ఉషాదేవి ఈ పత్రిక గాని చదువుతుంటే వారు కూడా సమాధానమిస్తారేమో.

    Thanks & have a nice day! -Lyla

  2. తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    02/04/2022 2:12 pm

    బాగా చెప్పారు.

  3. బుజిబుజి బొమ్మల బుజ్జాయి గురించి దేశిరాజు సబ్రహ్మణ్యం అభిప్రాయం:

    02/04/2022 10:33 am

    బుజ్జాయి గారిని మళ్ళీ గుర్తుచేసినందుకు ధన్యవాదములు.

  4. గడినుడి – 64 గురించి RAMA RAO ALLA అభిప్రాయం:

    02/04/2022 7:41 am

    గడిలో ప్రశ్నలు రావడం లేదు గమనించగలరు.

    [ కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కితే దిశ మారుతుంది. క్రింద ఆధారాల మీద నొక్కి కూడా గడి నింపవచ్చు. — సం.]

  5. తెలుగు వాళ్ళకిది వర్తించదు! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    02/04/2022 7:31 am

    1 – ఆంగ్ల సాహిత్య ప్రచురణకర్తలు కూడా ఏమంత సంతోషంగా లేరు. Brick and Mortar stores మూత పడుతున్నవన్న వార్తలు మనం చదువుతూనే వున్నాం.

    2 – హైదరాబాదులో పదిమందికి తెల్సిన, కారుకి, స్కూటర్ కి, బస్సుకి, నడకకి ఇప్పుడు మెట్రోకి అందుబాటులో వున్న వేదికలలో పుస్తక ఆవిష్కరణ నిర్వహించాలనుకుంటే కనీసం 4 – 5 వేల రూపాయలు లేనిదే కుదరదు. పత్రికలలో పుస్తకాల ప్రకటనలకు తగ్గింపు ధరలిస్తే కొంతలో కొంత ఖర్చు తగ్గించుకోవచ్చు.

    3 – విశాలాంధ్ర (అబిడ్స్)లో ఒకప్పుడు పుస్తక ఆవిష్కరణలు జరిగేవి.

    4 – ఉదాహరణకు ఆంధ్రజ్యోతి దినపత్రిక ‘వివిధ’ లో ప్రతి సోమవారం సాహిత్యానికి కేటాయించి ప్రచురిస్తున్నది. రచయిత తన పుస్తక ఆవిష్కరణని కనీసం క్రితం శుక్రవారం అందిస్తే అది సోమవారం పాఠకులకి తెలిసే అవకాశం వుంది. ఇతర పత్రికలలో అలాంటి అవకాశం వుందో లేదో ఇక్కడి పాఠకులు తెలియజేయగలరు.

    ఇక 80 లలో చలన చిత్ర ప్రకటనల లాగానే నవలలకి కూడా ప్రకటనలు ఇచ్చేవారు. ఫలానా వారి సీరియల్ వచ్చే వారం ప్రారంభం. ఫలానా నవల రేపు ఫలానా తేదీన వెలువడుతుంది.. వెలువడింది… ఐపోయినవి… రెండవ ముద్రణ అని కూడా ప్రచురణకర్తలు ప్రకటనలు గుప్పించిన సందర్భాలున్నవి.

    5 – స్థలాభావం చేత ‘స్వీకారం’లోకి వెళ్లడమొక్కటే కాదు, పుస్తకంలో దమ్ము వుండాలి, అటువంటి పుస్తకాన్ని పదిమందికి అందించాలన్న తపన సమీక్షకులకి కూడా వుండాలి. ఇటీవల నేను ప్రచురించిన అట్లూరి పిచ్చేశ్వరరావు కథలు పుస్తకాన్ని సమీక్షిస్తూ, “ప్రతులకు ****” అని ఒకానొక పుస్తక ‘వర్తక’ విక్రయశాల అని పేరిచ్చారు. ఆ దుకాణం ఏ అంగారక గ్రహం మీద వుందో, ఆఫ్రికాలో వుందో, అమేజాన్ అడవులలో వుందో, అలహాబాదులో వుందో, ఆక్లాండ్ లోవుందో, ఆముదాలవాలసలో వుందో, అదిలాబాదులో వుందో తెలీదు. (ఇలా కూడా పుస్తకం అమ్మకాలనీ ఖూనీ చేయవచ్చు అని మాత్రం నాకు అర్ధం అయ్యింది.) సమీక్షకుడో, సంపాదకుడో పేజ్ ఫార్మాట్ చేసేవారితో చెప్పి చేయించుకోవాలి. ఈ రోజుల్లో అంతర్జాలంతో పరిచయం లేని వారు తక్కువ. కానీ జాలంతో పరిచయం వున్నవారందరికి జాలంలో ఎలా వెతుక్కోవాలి, ఎలా కొనుక్కోవాలి అని తెలిసి వుండటం తక్కువే. కాబట్టి పాఠకులకి తెలిసే విధంగా కూడా ఆ పుస్తకం ఎక్కడ ఎలా కొనవచ్చో అన్న వివరాలు వుండాలి.
    ఉదా: పుస్తకం పేరు, రచయిత పేరు, ప్రచురణకర్త పేరు, పూర్తి చిరునామా (పిన్ కోడ్ తో సహా), పుస్తకం ధర, ఫోన్ నెంబరు, ఈమైల్ చిరునామా).

    నవంబరు 2019 లో ఈమాట సంపాదకులు ‘కొత్త పుస్తకాలకు స్వాగతం!’ అంటూ రచయితలు ‘తమ పుస్తకాన్ని ఎలక్ట్రానిక్ మీడియాగా’ వారికి పంపితే ‘కొత్త పుస్తకాల పరిచయాలు’ కింద పాఠకులకి తెలియజేస్తాం అన్నారు. మరి వారికి ఎన్ని పుస్తకాలు అందినవో, వాటిలో వారు ఎన్నింటిని పరిచయం చేశారో! నేను ఈమాటలోనే పైపైన వెదికినంతలో కొన్ని పరిచయాలలో రచయిత, ప్రచురణకర్త, విక్రేత వివరాలు.. బహుశా వారికి అంటే సంపాదకులకి తెలిసినంత మేరలో ఇచ్చినట్టున్నారు. ”ఎలక్ట్రానిక్ మీడియాగా” గా పుస్తకం వారికి పంపితే ఎలా పరిచయం చేస్తామన్నారో అలాగే ‘పుస్తకం ఎక్కడ తప్పకుండా దొరుకుతుందో కూడా తెలియజేయమని’ పంపేవారిని అడిగి ఆ వివరం కూడా అందజేయాలి. ఇంత రాయడానికి కారణం మనం అందరం ఆ పుస్తకం పాఠకుడి చేతిలో చూడడం కోసమే కదా ఇంత తాపత్రయం పడుతున్నది.

    సూక్ష్మంగా చెప్పదలుచుకున్నది ఇది; ప్రతి పుస్తకం సమీక్ష / విమర్శ / పొగడ్త /తెగడ్త దగ్గిర ఆ పుస్తకం ధర, ఎక్కడ దొరుకుతుందో ఆ వివరాలు పూర్తిగా ఇవ్వాలి. చదవాలకున్న పాఠకుడికి ఆ వివారాలు తెలియజేయడం వల్ల ఆ వెతుక్కునే శ్రమ తగ్గించిన వారమవుతాము.

    తా క: ప్రకటనల గురించి… ‘స్వాతి’ వారపత్రిక వారి పత్రికలో ఒక కాలం పూర్తిగా వారికి అందిన పుస్తకాన్ని గురించి ఒక ‘రంగుల ప్రకటన’ (color advt) లాగా పరిచయం చేస్తున్నారు. ఆ ఒక్క కాలం ప్రకటన ఖరీదు కనీస పక్షం 70 – 75 వేల రూపాయలు. (Perceived value) ఇది చాలా గొప్ప విషయం. స్వాతి సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారిని ఈ విషయంలో ప్రత్యేకంగా అక్షరాభిలాషులందరూ అభినందించాలి.

  6. ఊహల ఊట 9 గురించి స్వాతి అభిప్రాయం:

    02/03/2022 6:51 pm

    బామ్మ మాటలు అలా వింటూ ఉంటే లెక్క చెప్పేవరకు తెలీలేదు ఎన్నిసార్లు అన్నాదో. చెప్పొచ్చీదేవిటంటే ఈ ఊహల ఊటలో అలా ములిగిపోతాం.

  7. ఊహల ఊట 3 గురించి స్వాతి అభిప్రాయం:

    02/03/2022 6:30 pm

    ఎన్ని కష్టాలో పిల్లలికి.చిన్నప్పటి సంగతులు జ్ఞాపకం వస్తున్నాయి.ఒకసారి రుద్దేసాక బురుగు రాలేదని మళ్లీ ఇంకోసారి రుద్దేది అమ్మ.

  8. ఊహల ఊట 1 గురించి స్వాతి అభిప్రాయం:

    02/03/2022 6:14 pm

    చిన్నపిల్లలలో ఆలోచనా స్రవంతి. ఎంత గొప్పగా ఉందో!

  9. ఆమె ఇల్లు గురించి Kiran Vibhavari అభిప్రాయం:

    02/03/2022 7:48 am

    కథ చాలా బాగుంది 👌👌

  10. ఆమె ఇల్లు గురించి ఆర్.ఎస్. వెంకటేశ్వరన్ అభిప్రాయం:

    02/03/2022 4:42 am

    ఆమె ఇంటి కథ మాత్రమే కాదు. చాలా మంది మహిళల కాలంలో కథ.