పూర్వం ఇప్పటి వలె patents లేవు కదండీ. బహుశా ఆ రామాయణ పద్య ప్రభావం తోనే రాసి ఉండొచ్చు. అయినా మొల్ల అభివ్యక్తి ఆహ్లాదకరం గా లేదూ?? ఇలా అనేక మంది కవులపై ఇతరుల ప్రభావాలు ఎన్నో కదా. ఆ మాట కొస్తే నన్నయ పద్యాలలో కన్నడ ప్రభావం ఉందంటారు కదా. ఈ ప్రభావాలు మన కవుల రచనా పటిమను తక్కువ చెయ్యలేవు అనే అనుకుంటా.
ఎప్పుడో 40-45ఏళ్ళ కిందట చదివిన ఈ కావ్యం తిరిగి ఇన్నాళ్ళకు మీ ద్వారా నెమరుకు వచ్చింది. ధన్యుడిని. ధారణలో ఉన్న పద్యాలలో మూడు ఉదహరించారు. మరోసారి శ్రమపడి పాత పుస్తకాల పెట్టె తెరవాలి. కూకటి ముడికినై కురులు గూడని నాడె, బెదరక తాటక పీచమడచె … రాజ మాత్రుండె మేదినీ రక్షకుండు, రామ భూపాలు డాది నారాయణుండు, ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజోనిథి వంటి పద్యాలు మరోసారి చదవాలి.
‘వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది.’
అనిపించకుండా ఉంటే చాలా? హత్య అయినా ఫరవాలేదా?
వార్తా పత్రికల్లో వ్యాఖ్యలూ ప్రచారాలే తప్ప వార్తలనేవే లేకుండా పోతుంటే, మీరు చంద్రుడి సంగతెందుకు లెద్దూ, వ్రేలికి వంకర్లు లేకుంటే చాలు అంటున్నారు సారూ. వార్తల్లో భాషా ప్రామాణికత తప్పక అవసరం, ఒకే వార్త ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలా అర్థం కాకుండా ఉంటానికి. జర్నలిజం లిటరేచర్ ఇన్ హర్రీ. కథకులూ, కవుల భాషే ఎట్టాగో ఉంటోంది. హర్రీలో తయారైన వార్త భాష మీద ఇంత విమర్శ అనవసరమే. దాని కన్న వార్తల ఆబ్జెక్టివిటీ చాల ఎక్కువ ముఖ్యం.
చాలా చక్కగా వివరించారు. ఒక సందేహం. గుహుడు రాముని పాదధూళి పోవటానికై కాళ్ళు కడిగి పడవలోకెక్కించుకుంటాననే సందర్భంలో మొల్లగారి సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యేర్పడ నొక కాంత యయ్యె నఁట…. పద్యానికి మాతృక ఆధ్యాత్మిక రామాయణంలో అహల్యాశాపవిమోచనం చేసిన తర్వాత విశ్వామిత్రుల వారు మిథిల చేరటానికై వ గంగ దాటడం కోసం పడవ కోసం చూస్తున్నప్పుడు ఒక పడవవాడు రామునితో అన్న
దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచిన శిశువు అనే అర్ధంలో తనకి పిప్పలాదుడు అని నామకరణము జరిగినది. పిప్పలాదుడు దయాళువు. త్యాగశీలి. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తుకి శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు.
పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు.
పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు.
’92 లో నేషనల్ gallery of modern art ఢిల్లీ వాళ్ల మూడు నెలల art appriciatiin (evening) course చేసినపుడు కాపు రాజయ్య దామెర్లరామారావుల గురించి రెండు రెండు గంటల పాఠాలు వినదం గుర్తుంది..
’95 లో అనుకొంటాను, ఒక బెంగాలీ మహిళ పూనిక వల్ల ఢిల్లీలో రామారావు చిత్రాల ప్రదర్శన జరిగింది..ఆమెతో పరవశంగా మాట్లాడాను..
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి ఉషా దేవి అయినవోలు అభిప్రాయం:
04/14/2022 4:23 am
అందరికీ మీ మీ స్పందనలకు ధన్యవాదాలు.
పూర్వం ఇప్పటి వలె patents లేవు కదండీ. బహుశా ఆ రామాయణ పద్య ప్రభావం తోనే రాసి ఉండొచ్చు. అయినా మొల్ల అభివ్యక్తి ఆహ్లాదకరం గా లేదూ?? ఇలా అనేక మంది కవులపై ఇతరుల ప్రభావాలు ఎన్నో కదా. ఆ మాట కొస్తే నన్నయ పద్యాలలో కన్నడ ప్రభావం ఉందంటారు కదా. ఈ ప్రభావాలు మన కవుల రచనా పటిమను తక్కువ చెయ్యలేవు అనే అనుకుంటా.
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి మరింగంటి సురేంద్ర ప్రసాద్ అభిప్రాయం:
04/13/2022 11:24 pm
ఎప్పుడో 40-45ఏళ్ళ కిందట చదివిన ఈ కావ్యం తిరిగి ఇన్నాళ్ళకు మీ ద్వారా నెమరుకు వచ్చింది. ధన్యుడిని. ధారణలో ఉన్న పద్యాలలో మూడు ఉదహరించారు. మరోసారి శ్రమపడి పాత పుస్తకాల పెట్టె తెరవాలి. కూకటి ముడికినై కురులు గూడని నాడె, బెదరక తాటక పీచమడచె … రాజ మాత్రుండె మేదినీ రక్షకుండు, రామ భూపాలు డాది నారాయణుండు, ఆరూఢ ప్రతిమాన విక్రమ కళాహంకార తేజోనిథి వంటి పద్యాలు మరోసారి చదవాలి.
ఏప్రిల్ 2022 గురించి హెచ్చార్కె అభిప్రాయం:
04/13/2022 2:32 am
‘వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది.’
అనిపించకుండా ఉంటే చాలా? హత్య అయినా ఫరవాలేదా?
వార్తా పత్రికల్లో వ్యాఖ్యలూ ప్రచారాలే తప్ప వార్తలనేవే లేకుండా పోతుంటే, మీరు చంద్రుడి సంగతెందుకు లెద్దూ, వ్రేలికి వంకర్లు లేకుంటే చాలు అంటున్నారు సారూ. వార్తల్లో భాషా ప్రామాణికత తప్పక అవసరం, ఒకే వార్త ఒకరికి ఒకలా ఇంకొకరికి ఇంకొకలా అర్థం కాకుండా ఉంటానికి. జర్నలిజం లిటరేచర్ ఇన్ హర్రీ. కథకులూ, కవుల భాషే ఎట్టాగో ఉంటోంది. హర్రీలో తయారైన వార్త భాష మీద ఇంత విమర్శ అనవసరమే. దాని కన్న వార్తల ఆబ్జెక్టివిటీ చాల ఎక్కువ ముఖ్యం.
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి మంథా వీరభద్రం అభిప్రాయం:
04/12/2022 1:04 pm
చాలా చక్కగా వివరించారు. ఒక సందేహం. గుహుడు రాముని పాదధూళి పోవటానికై కాళ్ళు కడిగి పడవలోకెక్కించుకుంటాననే సందర్భంలో మొల్లగారి సుడిగొని రాము పాదములు సోఁకిన ధూళి వహించి రాయి యేర్పడ నొక కాంత యయ్యె నఁట…. పద్యానికి మాతృక ఆధ్యాత్మిక రామాయణంలో అహల్యాశాపవిమోచనం చేసిన తర్వాత విశ్వామిత్రుల వారు మిథిల చేరటానికై వ గంగ దాటడం కోసం పడవ కోసం చూస్తున్నప్పుడు ఒక పడవవాడు రామునితో అన్న
క్షాలయామి తవ పాద పంకజం
నాథ దారుదృషదయో:కిమన్తరం|
మానుషీకరణచూర్ణమస్తి తే
పాదయోరితి కథా ప్రథీయసి||
శ్లోకం ఉంది కదా! ఇదే ప్రేరణ కావచ్చునంటారా? నావికుడన్న మాటలనే మొల్ల గారు గుహునితో అనిపించినట్టున్నారు కదా.
మేఘసందేశం (తెలుగులో) గురించి gln sarma అభిప్రాయం:
04/12/2022 12:33 am
యండమూరి సత్యనారాయణగారి ఫోటో ఎక్కడా లేదు. మీరు సేకరించారా? ఆయన గురించి మరింత విపులంగా తెలియచేస్తారని.
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
04/11/2022 8:35 pm
అద్భుతం!! ఎక్కడ దొరుకుతుంది కొనుక్కోవడానికి?
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి Dr Vennelakanti Prakasam అభిప్రాయం:
04/10/2022 4:10 am
బహు చక్కని రచన. సమగ్రంగా వివరంగా జరిగిన రచన. అటు రామాయణ కర్తకు ఇటు వ్యాసకర్త కు వన్నె చేకూర్చే వ్యాసం. శ్లాఘనీయం.
విశ్వనాథ సమాధానం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
04/09/2022 7:05 am
దేవతల కోసము తన ప్రాణాన్ని త్యాగము చేసిన దధీచి, సువర్చలల కుమారుడు పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతించబడ్డాడు. రావి చెట్టు (పిప్పల వృక్షము) వద్ద ఉంచిన శిశువు అనే అర్ధంలో తనకి పిప్పలాదుడు అని నామకరణము జరిగినది. పిప్పలాదుడు దయాళువు. త్యాగశీలి. అతను అతని శిష్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రశ్నోపనిషత్తు ఆవిష్కరించబడింది. ప్రశ్నోపనిషత్తుకి శంకరాచార్యుడు బాష్యరచన చేసాడు.
పిప్పలాదునికి వివాహము చేసుకోవాలని అనిపించి అనవన్య రాజు దగ్గరకు వెళ్లి అయన కూతురు పద్మను ఇచ్చి వివాహము చేయమని అడుగుతాడు. మొదట్లో రాజుకు తన కూతురును మునికి ఇవ్వటం ఇష్టము లేదు. కానీ అయన మంత్రి చెప్పినాక తన అభిప్రాయము మార్చుకొని తన కూతురు పద్మను పిప్పలాదునికి ఇచ్చి వివాహము చేస్తాడు.
పిప్పలాదుడు తపస్సు చేసుకుంటూ తన దగ్గరకు వచ్చిన వారి ధర్మ సందేహాలను తీరుస్తూ కాలము గడుపుతుంటాడు. ఒకనాడు కబంధుడు, వైదర్భి, కౌశల్యుడు, సూర్యాయనుడు, శైభ్యుడు, సుకేశుడు, వంటి మునులు ఈయన దర్సనార్ధము వచ్చి వారి సందేహాలను అంటే సృష్టి ఎలా జరుగుతుంది, ప్రాణము ఎలా పుడుతుంది నిద్రించేది ఏది మేల్కొనేది ఏది సుఖము ఎలా కలుగుతుంది వంటి క్లిష్టమైన ప్రశ్నలు, ఆఖరుగా ఓంకారాన్ని ఉపాసించిన వాడు ఏ లోకానికి వెళతాడు అని వేదాంత పరమైన చర్చ చేస్తారు. వారి ప్రశ్నలకు పిప్పలాదుడు ఇచ్చిన వివరణే ప్రశ్నోపనిషద్ గా వచ్చింది. అంతేకాకుండా ఆ వివరణలను బట్టి గర్భోపనిషత్తు, పరబ్రహ్మోపనిషత్తు వంటి గ్రంధాలు వచ్చినాయి. ఈ విధముగా పిప్పలాదుడు బ్రహ్మవేత్తగా స్తుతింపబడ్డాడు.
మనం మరిచిన మాణిక్యం గురించి Amarendra Dasari అభిప్రాయం:
04/08/2022 6:00 am
ఈ వ్యాసం మొదటిసారి వచ్చినపుడు చదివిన గుర్తుంది.
’92 లో నేషనల్ gallery of modern art ఢిల్లీ వాళ్ల మూడు నెలల art appriciatiin (evening) course చేసినపుడు కాపు రాజయ్య దామెర్లరామారావుల గురించి రెండు రెండు గంటల పాఠాలు వినదం గుర్తుంది..
’95 లో అనుకొంటాను, ఒక బెంగాలీ మహిళ పూనిక వల్ల ఢిల్లీలో రామారావు చిత్రాల ప్రదర్శన జరిగింది..ఆమెతో పరవశంగా మాట్లాడాను..
ఊహల ఊట 11 గురించి శ్రీనివాస్ తెప్పల అభిప్రాయం:
04/07/2022 7:09 pm
తంగం అనేది పూర్తిగా తమిళ పేరు అండీ.. మలయాళం అయితే కాదు. మలయాళంలో సువర్ణం అనే అయితే అంటారు అనుకుంటా…