పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. గడినుడి – 67 గురించి manjari lakshmi అభిప్రాయం:

    05/28/2022 3:17 am

    ఆళ్ళ రామారావుగారు వ్యక్తపరచిన అభిప్రాయమే నేను కూడా ఇంతకు ముందు రాశాను. కానీ ఇంతవరకు ఈ సమస్యను మీరు సరి చెయ్యలేదు. దయచేసి సహకరించగలరు.

  2. పెద్రో గురించి మథు చిత్తర్వు అభిప్రాయం:

    05/27/2022 10:22 pm

    బావుంది. ముగింపు లో డిఫయన్స్ వుంది. మీ కథనం బావుంటుంది. నవల గాని పెద్ద కథ గాని ప్రయత్నం చేయండి.

  3. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:

    05/27/2022 9:48 pm

    సార్, వచ్చాడు అని అన్నంత మాత్రాన అగౌరవం అని ఏ శాస్త్రం చెప్పలేదు. మాకు రాయలసీమలో మీరు, రు అనే పిలుపులు ఇటీవలి కాలంలో మొదలయ్యాయి. మాకు నువ్వు , వచ్చాడు లాంటి మాటలు అగౌరవ వాచకాలు కావు. ఒకవేళ అలా అయినా సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఏడుకొండల వాడా — వేయినామాల వాడా….. లాంటి సంబోధనల్లో భగవంతుణ్ణి కూడా భక్తితో వాడా అని అంటాము అంతమాత్రాన స్వామి వారిని అగౌరవపరిచినట్లు కాదు సార్. ఇంకా చాలా ప్రాంతాల్లో మీరు, అండి అనేవి గౌరవవాచకాలని చదువుకున్న వాళ్ళకే తెలియదు సార్. కారణం వీటి వ్యవహారం కోస్తా జిల్లాల్లో ఉంది కాబట్టి. సామాజిక మాధ్యమాల ద్వారా , మిత్రుల ద్వారా మాలాంటోల్లం మీరు చెప్పిన గౌరవవాచకాలను పాటిస్తున్నాము. పాటించనంత మాత్రాన అగౌరవం అనుకోకండి. అది వారి వైయుక్తిక లేదా స్థల మాండలికం అయి ఉంటుంది. ఏదీ కాకపోతే ఆలోచించాలి.
    తప్పులుంటే మన్నించండి. నమస్కారం సార్..

  4. ఎమ్. ఎస్. రామారావు లలితగీతాలు గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/27/2022 10:50 am

    పరుచూరి – ‘చంద్రలోకం’ పక్కన (?) పెట్టారు. గేయరచయిత ఎవరనా?

    పాటలో, అడివి బాపిరాజు signature words – అందాలమూర్తి, కళాతపసి, దేవి, పూజాపీఠిక, above all సొన్నసాని – విన్నాక, ఆ పాట బాపిరాజు రాశాడని నేననుకున్నాను.
    You can hear the confirmation from the singer, M.S. Ramarao before he sings the next song -లేపాక్షి బసవయ్య.

    M.S. Ramarao comes across as someone who can sing any Telugu sentences given to him and make them sound good. He can jolly well sing my floral poem given below.

    I rejoiced when Daniel Barenboim played and said in his lesson, in the second movement of concerto no.23, at one place how Mozart’s music comes across as soft, intimate sentences with commas and points. So, I wrote this Telugu metrical verse so. At some point, I may do miniature botanicals to go with these poems, if I can find and sharpen my pencils.

    పూచినదా కనకాంబరమే క్షితిలో, అతి లేతల లాలిమగా!
    చూచితి దగ్గరగా చని.
    హా! సుమకోమలులుంటిరి వాటిక నిర్మించిన ఠీవుల పచ్చలమేడలలో. సురకాంతలె అచ్చగ!
    కానీ, చలచంచులఱేడు సువాసన లేని లలామల మెచ్చడుగా.

    -Lyla

  5. గంధర్వులెవరు? గురించి డా. బోలుగద్దె అనిల్ కుమార్ అభిప్రాయం:

    05/27/2022 4:59 am

    చాలా బాగా చెప్పారు సార్. అలాగే కిన్నెరులు, కింపురుషుల గురించి కూడా చెప్పగలరని ప్రార్థన. ఇంకో సందేహం ఏమిటంటే సార్, కుబేరుడు యక్షరాజు కదా మరి కిన్నెరరాజుగా పోతనగారు తన భాగవతంలోని గజేంద్రమోక్షంలో చెప్పారు. Reference: “అయ్యవసరంబున…… బొడగని ” అనే వచనములో మీకు కిన్నెరేంద్రుని అని కనబడుతుంది. ఒకసారి దయచేసి యక్షుడైన కుబేరునికి, కిన్నెరులకు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపగలరు.

  6. పెద్రో గురించి జయశ్రీ అట్లూరి అభిప్రాయం:

    05/26/2022 6:08 am

    రచయిత గలీనా పాత్రలోకి పరకాయప్రవేశం చేశారు. లేకపోతే ఇంత ప్రత్యక్షానుభూతి చూపించటం కష్టం. దూరదేశాలలో సంస్కృతి, మనోభావాలు, ఈ నాటి యుద్ధరీతుల గురించి ఎంతో అవగాహన ఏర్పరచుకుని వాటిని కావలసినంత వరకు కుదించి, సామాన్యీకరించి, రచయిత వినయంగా అంతర్లీనంగా కనిపించారు. సింప్లీ సూపర్బ్.

  7. పెద్రో గురించి మధు బాబు అభిప్రాయం:

    05/25/2022 12:47 pm

    బాగుంది.. ముగింపు కూడా.

  8. ఆత్మగోపాలుడి అనుభూతి తరంగం గురించి Srinivas Chimata అభిప్రాయం:

    05/25/2022 11:30 am

    Wonderful review on one of the best poetic books!!

  9. పెద్రో గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    05/25/2022 9:36 am

    తెలుగులో Concierge పదానికి అర్ధం ఆంధ్రభారతి నిఘంటువులో : ఇక్కడ చూడండి

  10. పెద్రో గురించి హరిప్రసాద్ అభిప్రాయం:

    05/25/2022 7:03 am

    గలీనా, నాన్న, పెద్రో, కొద్దిమాటల్లో యుద్ధం. బాగుంది.కాన్సియార్జ్ అంటే?