పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ గురించి Vittal అభిప్రాయం:

    08/25/2022 6:54 am

    పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో ‘శేషశాస్త్రిగారూ’ అంటూ సంభాషణ మొదలుపెట్టిన ఈ ‘మేషారు’ ఎవరు?
    -విఠల్

  2. Trash గురించి థింసా అభిప్రాయం:

    08/17/2022 2:14 pm

    తెలుగు కవిత్వంలో ఇంతవరకూ నేను చదవని అత్భుతమైన వాక్యం “రాత్రి అశ్రువు నుండి రాలిపడిన ఉదయం” it speaks volumes. కవి చాలా అలవోకగా రాసినట్లనిపిస్తుంది కానీ ఈవెన్ Keats కూడా రాయని, రాయలేని కవితా వాక్యం. కవిత మొత్తం గురించి వివరించాలంటే చాలానే ఉంది. ఇప్పటికీ ఒక్క వాక్యం చాలును. పొయెం మంచి selection. ఈ మాటకీ కవి అనురాధకీ మనసాభినందనలు.

    — థింసా, హైదరాబాద్.

  3. వొహ మొహం గురించి Madhulatha అభిప్రాయం:

    08/17/2022 10:14 am

    ఒక్క క్షణం చలనం లేకుండా ఉన్నాను… భారంగా.

  4. యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో గురించి N s v subrahmanyam అభిప్రాయం:

    08/10/2022 10:01 am

    తందనానా బళా సంగీతరూపకం ప్రసారం చెయ్యగలరు.

  5. దొంగ గురించి Badarinarayan అభిప్రాయం:

    08/09/2022 9:28 am

    Wonderful translation. అద్భుతమైన వివరాలు, కథాగమనం. Full marks to the translation.

  6. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి వారం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    08/08/2022 1:13 am

    అమరేంద్రగారూ, శుభగారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

  7. అన్‍జానా జాస్మిన్ గురించి సంపత్ కుమార్ అభిప్రాయం:

    08/07/2022 7:26 pm

    మెడికో శ్యామ్ రచనలు నాకు ఇష్టం. కధలు కానివ్వండి. ఏదేని టాపిక్ పైన రివ్యూ కానివ్వండి. ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వాటిని చదివినప్పుడు, అతడి విషయ పరిజ్ణానానికి. రిజిష్ట్రేషన్, రిటైన్, రీకాల్ అమోఘం, ఎవ్వరికైనా అనితర సాధ్యం. ఆ రీకాలింగ్ సామర్థ్యాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో శ్యామ్‍కి తెలిసినట్టు వేరెవరికి సాధ్యం కాదని నా అభిప్రాయం. కధలు రాయడం మానేశాడని బాధ పడుతున్న పాఠకులకు ఈ రివ్యూలు పరిమళ జాస్మిన్లు.

  8. దొంగ గురించి R.S.venkateswaran అభిప్రాయం:

    08/05/2022 9:51 am

    బహుచక్కని కథ, అంతే మంచి అనువాదం.

  9. సహారా సైకత సీమలో గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/04/2022 2:19 pm

    ధన్యవాదాలు శుభగారూ. ఆ ట్రెక్ చేసిందీ ఆంగ్లంలో రాసిందీ నిమ్మగడ్డ శేషగిరిగారు. నేను తెలుగులోకి అనువదించాను.

  10. అన్‍జానా జాస్మిన్ గురించి విన్నకోట రవిశంకర్ అభిప్రాయం:

    08/03/2022 9:15 pm

    శ్యామ్ గారు – చాలా బాగా రాశారు. వ్యాసంలో మీ నిజాయితీ, శాస్త్రిగారి మీద అభిమానంతో బాటు, మీ విషయం పరిజ్ఞానం, పరిశోధనాసక్తి , జ్ఞాపకశక్తి – అన్నీ బాగా వ్యక్తమయ్యాయి. శాస్త్రి గారి గురించి కొత్త విషయాలు తెలిసాయి. నేను మిడిల్ స్కూలులో ఉన్నప్పుడు ఆరు సారా కథలు, మరో ఆరు కథలు పుస్తకం చదివిన దగ్గర్నుంచి రావిశాస్త్రి గారి కథలంటే విపరీతమైన అభిమానం. కుండీలో మర్రిచెట్టు వేసిన కొత్తలో వైజాగ్ వెళ్ళినప్పుడు, శాస్త్రిగారి అడ్రస్ కనుక్కుని వెళ్ళి కలిసాను. అప్పటికి పెద్దవారైనట్టుగా కనిపించారు. ఎక్కువ మాట్లాడ లేదు. అట్ట మీద పుస్తకం పేరుని చేతితో మూసి, “ఇది లేకపోతే బొమ్మ అర్థం కాద”ని అన్నారు. స్వాతి మాస పత్రిక వారు కొంత కాలం “నాకు నచ్చిన కథ” అన్న శీర్షిక కింద ప్రముఖుల ఎంపికలు వేసినప్పుడు శాస్త్రిగారు “ఆ గదిలోనే” కథ గురించి చెప్పటం నాకు బాగా గుర్తు. అలాగే, రత్తాలు రాంబాబు సీరియల్ గా వస్తున్న సమయంలో శశిధర్ అనే కార్టూనిస్టు కేవలం అందులో ఉన్న డైలాగులతోనే వేసిన కొన్ని కార్టూన్లు చూడటం ఒక జ్ఞాపకం. ఇటువంటి ప్రయోగం మరే తెలుగు రచయిత విషయంలోనూ జరిగి ఉండదనుకుంటాను. అందులో నాకు గుర్తున్నది – “వాలిని చంపటం తప్పు కాదా” అని లక్షణుడడిగితే, దానికి రాముడు “ఒవుళ్ళు ఒవుళ్ళని చంపకుండా ఒవుళ్ళు పెద్దోళ్ళయ్యారు?” అంటాడు. ఆయన డైలాగులు, సిమిలీలు అజరామరమైనవి. తెలుగు కథా వస్త్రానికి జరీ అంచు ఆయన కథలు. వందేళ్ళ శాస్త్రిగారికి నూటొక్క సలాములు!