పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. తెలుగు నిఘంటువు గురించి… గురించి M.A.Khadeer అభిప్రాయం:

    12/14/2022 9:00 pm

    ఆంధ్రనామసర్వస్వం by ముసునూరి మహాదేవశాస్త్రి- Writing under the feature నాకు నచ్చిన పుస్తకము a reader wrote he chanced to go through this నిఘంటువు. He wrote that it was very exhaustive and a minimum of five to six meanings were given for each word. He found it in Regional Library, Vizag. I enquired about it in Hyderabad and told that is out of print (Navayuga Book Shop,Hyderabad). If it can be reprinted it would be a boon.

  2. వంద కుర్చీలు 2 గురించి ఎ. కె. ప్రభాకర్ అభిప్రాయం:

    12/13/2022 1:07 pm

    ఇంత భయంకరమైన వివక్ష వున్న సమాజంలో జీవిస్తున్నందుకు సిగ్గుపడదాం. మనుషుల్ని జంతువుల కంటే హీనంగా చూస్తూ ‘విశ్వగురు’వులం ఎలా అయ్యామో ఎవరైనా చెప్పగలరా? మన సామాజిక రుగ్మతలపైకి దృష్టి పోనీయకుండా జయమోహన్ రచనని తప్పు పట్టడానికి తహతహ లాడేవాళ్ళని చూస్తే జాలి కలుగుతుంది.

  3. శంభో తవారాధనం గురించి Chandrasekhar cheerla అభిప్రాయం:

    12/13/2022 7:33 am

    ఉక్తి వైచిత్రికి ప్రమాణము: ‘నెత్తిన బెట్టుకొంటి విధునెన్న సగంబె…!

  4. వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/12/2022 10:37 pm

    జయమోహన్ గారి తమిళ మాతృక కధ పేరు “నూఱు నాఱ్కాలికళ్”ను అవినేని భాస్కర్ గారు తెలుగు అనువాదంలో “వంద కుర్చీలు” అని కాక “నూరు ధర్మపీఠాలు” అని కానీ “న్యాయపోరాటానికి నూరు ధర్మపీఠాలు” అని కానీ లేక “సంఘ సంస్కరణకు నూరు ధర్మపీఠాలు కావాలి” అని పెట్టి ఉంటే ఎలా ఉండేదో? సంఘం నుండి వెలివెయ్యబడిన, అణగారిన వర్గం నాయాడులకి ప్రతినిధులు కాప్పన్, డాక్టర్ మాణిక్యం పాత్రల నిర్వేదనతో కూడిన ధిక్కార ప్రశ్నని (వెలివేతల నుండి, వివక్షతల నుండి విముక్తత ఎప్పుడన్న ప్రశ్నని), కధ అంతర్ సూత్రాన్ని “వంద కుర్చీలు” అనేమాట పాఠకుడికి వెంటనే స్పురింప చెయ్యటం లేదేమో అని చిన్న సందేహం.

  5. అంటు, అత్తగారు గురించి Venkateswararao VEMURI అభిప్రాయం:

    12/12/2022 4:23 pm

    ఈ “కథ” కనిపించినప్పుడల్లా చదువుతూనే ఉంటాను.

  6. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి దేవేంద్రనాధ రెడ్డి మల్లం అభిప్రాయం:

    12/11/2022 12:44 pm

    చాలా బాగుంది పద్యపఠనం. కడు ముచ్చటైన ఆంధ్ర భాషా యోష సేవ. ఎవరన్నారు తెలుగుభాష మీద ఆదరణ తరుగుతోందని?

  7. ఊహల ఊట 19 గురించి యర్రమిల్లి నళిని అభిప్రాయం:

    12/11/2022 7:42 am

    ఊహలకు రెక్కలు వచ్చి కలలు కలిసివస్తే పేదరికం ధనిక అనే అసమానతలు ఉండవు. కుంతల వంటి పాత్రల ద్వారా ఆవిష్కరణ చేసిన తీరు ఈతరం వారికి కూడా బాగానే ఉంటుంది…

  8. వంద కుర్చీలు 2 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/09/2022 10:29 am

    “ఈ కథలో వివక్షత డైరక్ట్‌గా చూపబడలే‍దు” అన్న ప్రియమైన శ్రీ తఃతః గారూ! మీకు చెప్పగలిగినంత వాడిని కాను, అయినా విన్నవించుకుంటున్నాను.

    మనదేశం లోని ఆదివాసులు, గిరిజనులు, సమాజం లోని అట్టడువర్గానికి చెందిన బడుగు వర్గం వారూ… వివక్షతకు గురైనారనో లేదా చారిత్రక తప్పిదమైన సమాజ వికృతస్వరూపమనో ఏదన్నా అనండి… అది జయమోహన్ గారి యీ “వంద కుర్చీలు” కధలో ఎలా చూపబడిందో యీ క్రింది వాక్యాలు మరోసారి చదివిచూడరా…

    ” ప్రభుత్వపు లెక్కల్లో పేరు, ఊరు వంటి వివరాలున్న పన్ను కట్టేవారే చనిపోయి అనాథ శవాల్లా కుళ్ళిపోతుంటే తిరువిదాంగూర్ స్టేట్‌లోని నాయాడులు ఎందరు చచ్చారన్నది ఎవరు పట్టించుకుంటారు. సగానికి పైగా వలసవచ్చిన వాళ్ళతో నిండిపోయిన పెద్ద పట్టణాల్లో నాయాడుల గురించిన వివరాలు ఎవరికీ పెద్దగా తెలిసుండదు.

    “పగటి పూట వెలుతురులో భిక్ష అడుక్కోవడం అన్నదే పెద్ద అభివృద్ధిగా, సామూహిక గౌరవంగా మా పూర్వీకులు భావించి ఉండవచ్చు. నగరం అన్నది నిర్విరామంగా చెత్తను బయటపడేస్తూనే ఉంటుంది. ఆ చెత్తకుప్పల్లో పురుగుల్లా మావాళ్ళు పిల్లల్ను కని వంశాన్ని ఉద్ధరించారు.

    “హాస్టల్లో కూడా నేను ఒంటరిగానే ఉండేవాడిని. ట్రైబల్స్ కోసం ఉన్న ఆ హాస్టల్లో ఉన్న ఏకైక నాయాడిని నేనే. నాతో గది పంచుకోడానికి ఎవరూ లేరు. నాకొక్కడికి మాత్రం అక్కడి మరుగుదొడ్డి వాడుకోవడానికి నిషేధం.”

    “వీడున్న ఇదే వయసులో నేను ప్రతిరోజూ ఆ పాచిపోయిన ఎంగిలి కూడే తిని బతికాను. ఎలా బతికానో మరి. నా వయసున్న పిల్లలు ఎందరో వర్షాకాలాల్లో చనిపోయేవారు. చచ్చిపోయిన పిల్లల్ని కాళ్ళతో పట్టి ఎత్తుకుని బిరబిరమని సాగే కరమన ఏటిలో పడేసేవాళ్ళు.”

    “నేను నాలాంటి వాళ్ళ గొంతుకగానూ, చెయ్యిగానూ ఈ వ్యవస్థలో ఉండాలి. నాలాంటివాళ్ళు అంటే పాకీవాళ్ళు ఊడ్చి తీసుకొచ్చి, గాడిదసంత హాస్పిటల్‌లో మనుషుల చెత్తగా రాశి పోయబడినవాళ్ళు. ప్రజారోగ్యం కోసం కోట్లను ఖర్చుబెట్టే ఈ ప్రభుత్వం అక్కడ చావుబతుకుల్లో మగ్గిపోతున్న వారి ప్రాణాలకోసం ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఆ డాక్టర్లనెందుకు వాళ్ళనూ మనుషులుగా భావించేలా చెయ్యకూడదు? వీలు కాదు అనేవాళ్ళని దండించండి. మీలో ఒకడికి ఆ హాస్పిటల్లో సరిగ్గా చూసుకోలేదంటే మీ గొంతులు వినిపిస్తారే, మీ ధర్మగుణం పైకి ఉబుకుతుందే!” కాప్పన్ నుంచి ధర్మపాలన్ గా ఎదిగిన కలెక్టర్ ఆవేదన.

    నిబద్దతతో పేదలకు వైద్యం చేస్తున్నా సస్పెండ్ కాబడిన డాక్టర్ మాణిక్యం పాత్ర రోదనను మరోసారి ఆలకించండి.

  9. Janaki’s Zen గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ అభిప్రాయం:

    12/09/2022 5:13 am

    ఇలా జరిగివుంటే ఎంత బావుండుననిపించేలా వుంది. రాముడి అవతార లక్ష్యం ఎలా నెరవేరటం మరి?

  10. కుండీలో మర్రిచెట్టు గురించి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ అభిప్రాయం:

    12/09/2022 4:43 am

    హృదయం ద్రవించిపోయిందండీ నిజంగా… మహా అన్న శబ్దానికి దృశ్యరూపం మహావృక్షం!